Orei Bawa - Osei Maradala - 5 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 5

సీత బుంగమూతి పెట్టి అత్తయ్య అనగానే రాధ గారు సుధ గారితో “ నువ్వు ఆగు వదిన ఎందుకు ప్రతిసారి నా కోడల్ని అంటావు???? నా కోడలు అన్నిట్లో ది బెస్ట్ తెలుసా!!!! నేను చెప్పకుండానే పూజ మొత్తం చేసింది ఇప్పుడు స్వీట్ కూడా చేస్తుంది చూడు..... ‘ అని చిటికి వేసి మరి చాలెంజ్ చేసి సీతవైపు చూసేసరికి సీత గుడ్లూరుమి రాధ గారి వైపు చూస్తుంది

@@@@@@

సుధ గారు నవ్వుతూ “ ఏంటి ఇదే!!! వంట చేయడమే!!! మనం తినడానికేనా లేకపోతే కుక్కలకి పడేయటానికా??? నాకు తెలిసి ఆ కుక్కలు కూడా దీని వంట తినవు!!!! “ అని వెటకారంగా అన్నారు

“ అదేం కాదు నా కోడలు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది..... కచ్చితంగా అందరికీ నచ్చేలా వంట చేస్తుంది..... చేసేలా నేను చేస్తాను ఇదే మా ఛాలెంజ్ చూసుకో..... “ అంటూ సీత వైపు చూస్తే సరికి

ఇప్పుడు సీత ఏడుపు మొహం పెట్టి “ ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా అత్త నీకు??? నేను ఇంతవరకు వంటగది వైపు కూడా వెళ్లలేదు నీకు ఆ విషయం తెలుసు కదా మరి ఎందుకు ప్రతాపాలకు పోయి ప్రగల్బాలు పలుకుతూ నన్ను ఇరికిస్తున్నావు??? వద్దత్తా నేను చేసిన వంట తింటే మీరు హాస్పిటల్ పాలు అవుతారు......

నావల్ల మీరు హాస్పిటల్ లో జాయిన్ అవ్వటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు..... అందుకే కిచెన్లోకి వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి బెడ్ రూమ్ లోకి వెళ్లే ప్రోగ్రాం ఆన్ చేస్తున్నాను..... పైగా నాకు నైట్ అంతా నిద్రలేదు అందులోను విపరీతమైన ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి..... బాగా నిద్ర వస్తుంది చూడు ఒక్క నైట్ కే కళ్ళకింద క్యారీ బ్యాగ్స్ ఎలా వచ్చాయో!!!! “ అని తన కళ్ళని కోడిగుడ్లంత చేసి వాళ్ళకి చూపిస్తూ తెలియక వాగింది

సుధ గారు రాధ గారు నోటి మీద చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కానీ సీత ఆవలిస్తూనే “ ఏమైంది ఇద్దరు అలా చూస్తున్నారు??? “ అని అడిగింది

సుధ గారు కోపంగా సీత నెత్తి మీద మొట్టి “ ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా??? అంతగా ఒళ్ళు నొప్పి వచ్చేలా కింద మీద పడమని ఎవడు చెప్పాడు మిమ్మల్ని??? “ అని ఈసారి ముసి ముసిగా నవ్వుతూ “ అదంతా మాకు అనవసరం నీ అత్త చాలెంజ్ చేసింది ఈరోజు నువ్వు వంట చేస్తావా లేదో మీ అత్తని ఓడిస్తావో నీ ఇష్టం!!!! “ అని సీత వీక్నెస్ మీద కొడతారు ఎందుకంటే సీతకి తన అమ్మ నాన్న కంటే అత్తయ్య మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం

రాధ గారు సిగ్గు పడిపోతూ “ సీత నువ్వు మాత్రం మీ అమ్మమ్మ వచ్చాక ఇలా మాత్రం మాట్లాడకే ప్లీజ్..... “ అంటారు

“ ఏమైంది అత్త నేనేమైనా తప్పుగా మాట్లాడానా??? అమ్మ కూడా నన్ను కొడుతుంది ఎందుకు??? నాకు తెలిసి నేనేం తప్పుగా మాట్లాడలేదే!!! నిద్ర వస్తుంది అనటం తప్పా ఏంటి??? “ అని అమాయకపు రాజ్యానికి యువరాణిలా అంది

రాధ గారు తల కొట్టుకొని “ ఆపవే బాబు ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదా???? రాత్రి మీ ఫస్ట్ నైట్ అయిపోయింది మరి ఒళ్ళు నొప్పులు కాక సమ్మగా ఉంటుందా ఏంటి?? “ అనగానే సీతకి అప్పుడు బల్బు వెలిగి ఇబ్బందిగా తలదించుకొని “ అలాంటిదేమీ లేదు అత్త మీరు ఏదేదో ఊహించుకోవద్దు..... “ అని అంది

రాధ గారు సుధా గారు అయోమయంగా “ అంటే నువ్వు చెప్పేది ఏంటే వివరంగా చెప్పు!!!! నైట్ మీ ఇద్దరి మధ్య ఏమీ కాలేదా??? “ అని కళ్ళు పెద్దవి చేసి అడిగారు

ఎప్పటినుంచో వాళ్ల కాన్వర్జేషన్ డోర్ తెరిచే ఉండటం వల్ల నిద్ర పట్టక వింటున్న రామ్ తల కొట్టుకుంటూ “ దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు!!! “ అనుకుంటూ సీత అని గట్టిగా కేకేసాడు

“ అయ్యో బావ పిలుస్తున్నాడు ఉండండి అత్త ఇప్పుడే వస్తాను..... “ అని అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరుగున రూమ్ లోకి వెళ్లి హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని డోర్ క్లోజ్ చేసి “ ఎందుకు బావ పిలిచావు??? “ అని కోల్గేట్ యాడ్ ఇస్తూ అడిగింది

ఇటు రా అని గుడ్లురుమి చూస్తూ పిలిచాడు......

సీత అయోమయంగానే రామ్ దగ్గరికి వెళ్ళగానే “ బయట ఏం వాగుతున్నావే??? మన ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు నాలో మేటర్ లేదు బావ తుస్సు అని చెప్పాలనుకున్నావు కదా!!! నాకు తెలుసే నీ వెర్రి ఆలోచనలు..... అందుకే పిలిచాను “ అని సీత తల కిందకు దించి నెత్తిమీద ఆపకుండా నాలుగువేసి అన్నాడు

సీతా ఉక్రోషంగా పైకి లేచాక తలరుద్దుకొని “ సచ్చినోడా ఎంత గట్టిగా కొట్టావురా??? “ అంటూ రామ్ ని వంగదీసి గుద్దుతూ “ ఇంకొకసారి నన్ను కొడతావా??? “ అని అరుస్తుంది

“ రాక్షసి వదలవే “ అంటూ రామ్ గింజుకుంటూ ఉంటే సీత రామ్ జుట్టు పీకుతూ “ నన్నే కొడతావా?? అయిన బయట నేను చెప్పేది పూర్తిగా విన్నావా??? ఎర్రి బావ ఊరికే నన్ను కొడుతూ ఉంటావు!!! అందుకే నువ్వంటే నాకు నచ్చవు!!!! “ అని అరుస్తూ ఉంటే రామ్ ఒక్కసారిగా సీత చేతులు పట్టుకొని తన మీదకి లాక్కొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ “ నిజంగానే నేను నీకు నచ్చనా సీత???? “ అని మనసు కలుక్కుమన్న ఫీలింగ్ తో అడిగాడు

సీత రామ్ ఫీలింగ్ అర్థం చేసుకోలేక “ అవును నచ్చవు ఊరుకే నన్ను ఎప్పుడు కొడుతూనే ఉంటావు.... నేనంటే నీకు చులకన ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు..... ఇప్పుడు కూడా చూడు బయట ఏమంటున్నానో తెలుసుకోకుండానే లోపలికి పిలిచి కొట్టావు!!!! అయినా నీలో మ్యాటర్ ఉందో లేదు నాకెలా తెలుస్తుంది??? “ అని ఏడుపు మొహం పెట్టి అంది

సీతకి తన కన్వే అర్థం కాక మాట్లాడిందని అర్థం చేసుకున్న రామ్ ఒక్కసారిగా సీతని తన మీదకి లాక్కొని బెడ్ మీద వాలిపోయి మొహం మీద పడుతున్న జుట్టుని చెవి వెనక పెడుతూ “ నాలో మేటర్ ఉందో లేదో ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే కదా నీకు తెలిసేది??? అయినా వాళ్ళు అడగగానే మన మధ్య ఏమి జరగలేదని చెప్తే అమ్మ అత్త ఎంత బాధ పడతారు చెప్పు???? వాళ్ల కోసమే కదా మనం ఈ పెళ్లి చేసుకుంది ఆ విషయం మర్చిపోతే ఎలా సీత???? “ అని అనునయంగా అడుగుతాడు

సీతా రామ్ గుండెల మీద మోచేయి ఆన్చి బుగ్గ కింద చేయి పెట్టుకుని “ అవును కదా నేను ఎలా మర్చిపోయాను ఆ సంగతి??? “ అంటూ తల కొట్టుకుంటూ “ థాంక్యూ బావ చెప్పకుండా ఆపినందుకు!!!! లేకపోయి ఉంటే మొత్తం చెప్పేసే దాన్ని!!!! “ అని పళ్ళన్ని బయటపెట్టి అంది

“ అందుకే నేను నిన్ను వెర్రి మాలోకం అనేది!!! ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలో కూడా తెలియదు...... “ అంటూ మళ్ళీ సీత నెత్తి మీద మొట్టగానే “ ఇదిగో చూడు మళ్ళీ కొడుతున్నావు!!!! “ అని ఏడుపు మొహం పెట్టి దెబ్బకి దెబ్బ అన్నట్టు రామ్ గుండెల మీద కోరిక పైకి లేస్తుంది

“ ఇస్ అబ్బా నీతో చాలా కష్టమే బాబు.... అదేదో రాక్షసి పేరు హిడింబి అనుకుంటా ఆ రాక్షసిలా ఎప్పుడూ నన్ను కొరకుటం కొట్టడం తప్ప మరొకటి రాదు.... చూడు ఎలా గాట్లు పడ్డాయో!!! “ అంటూ గుండెల మీద పడిన పంటి గుర్తులని చూపిస్తూ నొప్పిగా ఉంది.... అని అన్నాడు

సీత కంగారు పడిపోతూ “ అవునా బావా సారీ సారీ నువ్వు నన్ను కొట్టావని టిట్ ఫర్ టాట్ అన్నట్టు గట్టిగా కోరికాను..... అయినా నీ పెళ్ళాం కొరికింది కాబట్టి అంత నొప్పి రాదులే!!! “ అంటూ కొరికిన చోట 2 వేళ్ళతో పట్టి లాగి నవ్వుతూ అంది

అమ్మ అంటు చిన్న అరిచి సీత చేతిని విసిరి కొట్టి “ ఇందుకే నేను నిన్ను కొట్టేది!!! ఈ మార్క్స్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు??? ముందు నువ్వు బయటికి పోవే ఇక్కడే ఉంటే నేను కూడా టిట్ ఫర్ టాట్ లాగా సేమ్ ప్లేస్ లో నిన్ను కోరికిన కొరుకుతాను..... కానీ బయటికి వెళ్లాక మాత్రం మనిద్దరి మధ్య ఏమీ జరగలేదని చెప్పావంటే ఈరోజు నైట్ మొత్తం పని కానిచ్చేస్తాను..... “ అని బెదిరిస్తాడు

సీత వెటకారంగా నవ్వుతూ “ నీకు అంత సీన్ లేదులే!!! “ అని చెప్పి మరి ఎక్కడ రామ్ కొడతాడో అని భయపడి తుర్రున బయటికి పారిపోతుంది

రామ్ నవ్వుతు వెళ్లిన సీత వైపు చూసి “ అది నేను నచ్చలేదంటే నాకెందుకు అంత బాధగా ఉంది??? ఇష్ అబ్బా నిన్నటి నుంచి ఈ ఫీలింగ్స్ ని తట్టుకోలేకపోతున్నాను..... “ అనుకొని తల విధిలించి వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు

సీతరు గురించి బయటికి వచ్చేటప్పటివరకు ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడే నిలబడిన రాధ గారు సుధ గారితో “ ఇదేంటి వదిన సీత అలా అంది??? అంటే ఇద్దరి మధ్య ఏమి జరగలేదా??? “ అని అయోమయం గా అడిగింది

“ అదే కదా అది కూడా అంది!!! అది వస్తే కానీ నేను ఏమీ తెల్చి చెప్పలేను..... “ అని “ అవును ఉదయం నువ్వే కదా దాన్ని లేపింది ఎలా ఉంది అంటే ఉదయం దాని రూపురేఖలు ఎలా ఉన్నాయి??? “ అని క్యూరియస్ గా తెలుసుకోవటానికి అడిగారు

రాధ గారు తను చూసినంతవరకు చెప్పి “ నేను చూసిన దాన్ని బట్టి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారనిపించింది పైగా ఆ సన్నాసి సీతని బయటికి పంపించకుండా బయటికి వెళ్లే ముందు కూడా ముద్దు పెట్టుకున్నాడు..... “ అని ఇబ్బంది గా మొహం పెట్టే అన్నారు

ఇంతలో సీత బయటికి రాగానే సుధ గారు అయోమయంగా “ నిన్ను ఎందుకు పిలిచాడు రామ్??? “ అని అడుగుతారు

సీతకి రామ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ నేలకి బొక్కలు పెట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చీర కొంగుని వేలికి చుట్టి నలిగిపోయేలా చేస్తూ “ అది అది అయినా మొగుడు పెళ్ళాలు మధ్య సవా లక్షా ఉంటాయి అన్ని మీకు చెప్తారా ఏంటి??? ప్రతి ఒక్కటి విడమరిచి అడిగితే ఏం చెప్తాము అన్ని అర్థం చేసుకోవాలి!!!!

నా మొగుడు కం బావకి నన్ను క్షణం కూడా వదిలిపెట్టడం ఇష్టం లేదు అలా లేచాడో లేదో నేను కనిపించలేదని ఎలా గావు కేక పెట్టాడో విన్నారా??? ఇప్పుడు కూడా నన్ను స్నానం చేయించమని పిలిచాడు కానీ కుదరదని చెప్పి బావ నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను..... “ అని వాళ్ళకి నమ్మకం కుదిరేలా అందమైన అబద్ధం అంతకంటే అందంగా అల్లింది

ఈసారి రాధ గారు సుధ గారు వెలిగిపోతున్న మొహంతో ఒకరినొకరు చూసుకుని “ మరి ఇంతకుముందు ఏమీ జరగలేదు అన్నావు??? దాని అర్థం ఏంటి???? “ అని అడిగారు


ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.....