ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(0)
  • 837
  • 0
  • 261

ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తల్లి తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశం లో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా వుండి ఆస్తులు తగలెయ్యడం వల్ల ఆ వంశంలో మగవాళ్లందరూ అటువంటి వీలునామాలు వ్రాస్తూ వస్తున్నారు. అందువల్ల సుస్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాసాడు.

1

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశం లో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా ...Read More

2

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 2

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర వెంటనే అతని మొహం అంతా హర్ట్ తో నిండిపోయింది. "నా క్లోజ్ ఫ్రెండ్ కి మీరు కూడా ఫ్రెండ్ కాబట్టి మీ గురించి తెలుసుకోవాలనుకున్నా." ఆ వాయిస్ లో కూడా బాధ వుంది. "కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకోవాలని నాకు లేదు." ఆలా అన్నాక ఇంకేం మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయింది. తక్కిన అందరి అబ్బాయిలలాగే తానెలా మాట్లాడిన మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమోనన్నతన అంచనా తప్పయిపోయింది. తను పరీక్షలు రాసి వూరెళ్ళిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. తను ఎంతో డిజప్పోయింట్ అయింది. అయినా కాలం గడిచే కొద్దీ తన గురించి మరిచిపోయింది. కానీ తను ప్రస్తుత ప్రమాదం నుండి ఎలా బయటపడాలి అని పదే పదే ఆలోచిస్తూంటే అంతసేపూ ...Read More