Aa Voori Pakkane Oka eru - 13 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 13

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 13

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"అంత తను నమ్మలేకుండా మనమేం ఎంజాయ్ చేసాం ఇక్కడ?" ఎరువులు వున్న రూమ్ లోకి వెళ్ళబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి తనూజ మొహంలోకి చూసాడు వంశీ భృకుటి ముడేసి.

"అంటే అప్పుడు మనం ఆడిన ఆ అట నీకు గుర్తు లేదన్న మాట." దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది తనూజ. "ఒకరోజు మదన్ చెప్పాడని మనమంతా మన బట్టలు విప్పేసుకున్నాం. మేము అడిగామని మమ్మల్ని మీరు...."

"చాల్లే ఆపు." చిరాగ్గా అరిచాడు వంశీ. "అప్పుడు మీ బావ వచ్చి మనల్నందరినీ ఉతికి పారేసి మళ్ళీ అలాంటి ఆటలు ఆడితే చంపేస్తానన్నాడు. అది కూడా నీకు గుర్తుండి వుండాలే."

"అఫ్ కోర్స్  వుంది. నేను అదికూడా తనకి చెప్పాను." నవ్వుతూ అంది తనూజ. " చెప్తూ నేను, వింటూ తనూ చాలా ఎంజాయ్ చేసాం."

"ఎదో తెలిసీ తెలియని వయసులో అలా చేసాం. అదంతా తనకలా చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించలేదూ?" కోపంగా అడిగాడు వంశీ.

"అనిపించింది. కానీ మాటలన్నీ అయిపోయాక, ఏం మాట్లాడాలో తెలియక, అదికూడా చెప్పేసాను." విచారంగా మొహంపెట్టి అంది తనూజ.

"సరేలే ఎదో ఒకటి చేసావు. నువ్వు కాస్త నిశబ్దంగా వుండి నన్ను పనిచూసుకోనివ్వు." అలా అన్నాక ఎరువుల గదిలోకి వెళ్లి అక్కడ షెల్ఫ్ లో వున్న నోట్ బుక్, పెన్ తీసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి బెడ్ మీద కూచుని నోట్ బుక్ లో పాతవి రిఫర్ చేస్తూ రాయడం మొదలు పెట్టాడు.

"నిన్న నేనొక విషయం చెప్పడం మరిచిపోయాను. ముఖ్యంగా అది చెప్పడానికే ఈ రోజు ఇక్కడికి వచ్చాను." వంశీ పక్కనే బెడ్ మీద కూచున్నాక సడన్ గా అంది తనూజ.

"ముందు నా పని పూర్తికానివ్వు. తరువాత వింటాను." చేస్తూన్నపని  ఆపకుండానే అన్నాడు వంశీ.

"అలా కాదు. ముందు నేను చెప్పేదే వినాలి. లేకపోతే ఎదో ఒకటి మాట్లాడి నిన్ను డిస్టర్బ్ చేస్తూనే వుంటాను." మొండిగా అంది తనూజ.

పెన్ బుక్ లోనే ఉంచి బుక్ మూసి పక్కన పెట్టి తనూజ మొహంలోకి చూస్తూ అడిగాడు. "సరే అయితే చెప్పు."

"అలాకాదు, కొంచెం చిరునవ్వుతో అడుగు."

"నేనిప్పుడు చిరునవ్వులు నవ్వలేను. ఏం చెప్పదలుచుకున్నావో త్వరగా చెప్పు. లేపోతే ఇక్కడినుండి వెళ్ళిపోతాను. ఈ పని రేపైనా చూసుకోవచ్చు నేను." సీరియస్ గా అన్నాడు.

"ఐ లవ్ యు." ఎలా చెప్పగలిగిందో తనకే తెలియదు.

"అంతేనా." ఏ మార్పు లేకుండా అదే ఎక్స్ప్రెషన్ తో బుక్ తీసుకుని మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు వంశీ.

తనూజ బెడ్ దిగి, వంశీకి ఎదురుగుండా వచ్చి, తన చేతిలో వున్న బుక్ పెన్ తీసుకుని దూరంగా విసిరేసింది. "నేనేదో పనిలేక చెప్పాననుకున్నావా? ఐ యాం సీరియస్." కోపంగా అరిచింది.

"ఆల్రైట్. నువ్వు సీరియస్. అయితే నేనేం చెయ్యాలి?" చిరాకుని మోహంలో అభినయిస్తూ అన్నాడు.

"నువ్వు నా లవ్వుని యాక్సెప్ట్ చేస్తున్నావా, లేదా?" అదే కోపంతో అడిగింది.

"నేను చెయ్యట్లేదు."

"ఏం, ఎందుకని?" వంశీ షర్ట్ ఫ్రంట్ పార్ట్ ని రెండు చేతులతో పట్టుకుని మోహంలో మొహంపెట్టి సీరియస్ గా అడిగింది. "నేనే వచ్చి నీకు చెప్పాననా? నాకుగా నేను చెప్పానని నీకు అలుసైపోయాను కదా?"

"ఎప్పటికీ కాదు." తనూజ రెండు చేతులని విడిపించుకోవడానికి ట్రై చేసాడు కానీ తను అలాగే పట్టుకుంది వుంది. "నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావు. దీనిని ఇంగ్లీషులో ఎదో అంటారు నాకు తెలియదు, అదే ఎదో తాత్కాలికపు ఆకర్షణలో వున్నావు. నాకు నీకూ వున్న తేడా గురించి ఒక్కసారి అలోచించి చూడు. నువ్వెంత తప్పుచేస్తున్నావో నీకే బోధపడుతుంది."

"ఎదో ఇన్ఫాట్యుయేషన్ లో వుండి నీకిలా చెప్పడానికి నేనేం టీనేజర్ని కాదు. ఒక మెచూరిటీ వున్న ఆడపిల్లని. అందులోనూ సైకాలజిస్ట్ ని. ఆలోచించకుండా నేనేది చెయ్యను." వంశీ షర్ట్ విడిచిపెట్టి దూరంగా జరుగుతూ అంది తనూజ. "ఇది ఈ రోజే సడన్ గా నాలో ప్రారంభమవ్వలేదు. చాలా రోజులుగా నా మనసు నీ గురించి ఆలోచిస్తూ వుంది. నేను వద్దనే అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. నిజమైన ప్రేమని ఆపడం నా వల్ల కాదని నాకు అర్ధం అయిపోయింది."

"కానీ ఇందువల్ల చాలా సమస్యలు వస్తాయి. మొట్టమొదట మీ అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళికి అంగీకరించరు."

"మామ్ ని బాధపెట్టడం నాకూ ఇష్టం ఉండదు. కానీ తప్పకపోతే తనని బాధపెడతానేమోకానీ నిన్ను వదులుకోను."

"నన్ను వదిన చాలా అభిమానిస్తోంది. కానీ తన చెల్లెలినిచ్చి పెళ్లి చేసేంతగా అభిమానిస్తుందని నేననుకోను."

"అక్క విషయం నాకొదిలేయ్. నేను చూసుకుంటాను." సడన్ గా చిరునవ్వుతో అంది తనూజ. "అంటే నువ్వూ నన్ను లవ్ చేస్తున్నావన్న మాట. మా మామ్, ఇంకా అక్క ఒప్పుకోరేమోనని మాత్రమే నీ భయం."

"నువ్వు చాలా అందమైన ఆడపిల్లవి. నీ అంత నువ్వుగా వచ్చి ఇలా చెప్తూ ఉంటే టెంప్ట్ అవుతోన్న మాట నిజం. అంతేకాకుండా నీవైపు నేను మొదటినుండి ఆకర్షింపబడుతూన్న మాట కూడా నిజమే. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని మాత్రం అనుకోవడం లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బందుల్ని గమనించలేనంత స్టుపిడ్ ని కాదు." బెడ్ మీద నుంచి లేచి నిలబడి అన్నాడు వంశీ.

"వన్ సెకండ్." వంశీకి ఇంకొంచం దగ్గరగా వచ్చి మరోసారి అతని మొహంలోకి సూటిగా చూస్తూ అంది. "నాకున్న ఓ క్వాలిటీ నీకు తెలిసి ఉండదు. అది మొండితనం. నాకు కావాల్సింది నాకు దక్కితే కానీ ఊరుకోను. నిన్ను కావాలనుకున్నాను. నిన్ను పొందకుండా ఊరుకోను. నువ్వు నన్ను కావాలనుకున్నా, అక్కర్లేదనుకున్నా కూడా."

ఆమె మోహంలో సీరియస్ నెస్ అది ఆమె ఎంత ఫీలై చెప్తూన్దో అర్ధమయ్యేలా చేస్తూంది వంశీకి. ఏం మాట్లాడాలో అర్ధం కాక అలాగే చూస్తూ నిలబడ్డాడు.

అంతలోనే వంశీ ఊహించని విధంగా, అతన్ని బలంగా కౌగలించుకుని, అంతకన్నా బలంగా ముందు రెండు బుగ్గలమీద, తరువాత పెదాల మీద ముద్దు పెట్టి, దూరంగా జరిగింది. "నిన్ను లవ్ చేసే విషయంలో నేనెంత సీరియస్ గా ఉన్నానో నీకు అర్ధంకావడానికే ఇది. నా లవ్ యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లిచేసుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు. ఇంక నిన్ను నేను కలుస్తూనే వుంటాను. బై." అలాని చెప్పిన తరువాత అక్కడనుండి వెళ్ళిపోయింది తనూజ.

&&&

రాత్రి పదవుతూండగా, కళ్ళు మూసుకుని పడుకునే ప్రయత్నం చేస్తున్నాడు మదన్. సుస్మిత తమ ఇంటికి రావడం, తనని ప్రేమిస్తున్నానడం, తమ ఇంట్లోవుండడం ఇంకా తనకి నమ్మబుద్ధి కావడం లేదు. ఎంతోమంది తన వెంటపడ్డా, ఏ రోజూ తను పట్టించుకోలేదు. కానీ సుస్మిత దగ్గరికి మాత్రం ప్రత్యేకంగా వెళ్లి మాట్లాడాడు. తనలా తనని ఆరోజు ఇన్సల్ట్ చేసినా, తనమీద ఆకర్షణ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ రోజు మొదట తనని ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని అంటున్నప్పుడు కూడా లోలోపల తను ఉండాలనే అనుకున్నాడు.

ఆ తరువాత మొదటిసారిగా తను మామిడితోటలో సుస్మితని కౌగిలించుకున్న విషయం గుర్తుకువచ్చింది. అప్పటివరకూ చిట్టిరాణిని తప్ప ఏ ఆడపిల్లని కనీసం ముట్టుకున్నా పాపాన పోలేదు, అలాంటిది సడన్గా తనని అలా ఎలా కౌగలించుకోగలిగాడో, ముద్దుపెట్టుకోగలిగాడో ఇప్పటికీ అర్ధంకావడంలేదు. తన యవ్వనం తన గట్టిపట్టులో అలా ఒదిగిపోతూ ఉంటే, అప్పుడే కాదు గుర్తుకొస్తూవుంటే ఇప్పుడుకూడా చెప్పలేనంత సుఖంగా వుంది. ఆమె బట్టల కింద మృదువైన ఆమె పిరుదుల స్పర్శ తన కుడిచేతికి ఇంకా గుర్తుకొస్తూంది. తను ఆమె పిరుదుల మధ్య చేతిని ఆంచగానే తను తన తొడలని జాపింది రెస్పాండ్ అవుతూ. మై గాడ్! తనని అప్పుడు ఏం డిస్టర్బ్ చేసిందో తెలియదు, లేకపోతే ఇంకా ఎంతదూరం వెళ్ళేవారో.

అలా ఆలోచనల్లో మైమరిచిపోతూ వున్న మదన్ ని పక్క గదిలోనుండి సుస్మిత కేక ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చేలా చేసింది. చటుక్కున బెడ్ మీదనుండి దిగి వేగంగా సుస్మిత గదిలోకి వెళ్ళాడు మదన్.

మదన్ తన గదిలోకి వెళ్లేసరికి సుస్మిత అక్కడ నేలమీద నిలబడి ఎదురుగుండా వణికిపోతూ చూస్తూ వుంది. వెంటనే మదన్ తన దగ్గరికివెళ్ళి భుజాల చుట్టూ తన కుడిచెయ్యి వేసి ఆదుర్దాగా అడిగాడు. "ఏం జరిగింది? ఏమైంది?"

"చిట్టిరాణి....., చిట్టిరాణి....." వణికిపోతూ ఎదో చెప్పడానికి ప్రయత్నిస్తూ వుంది సుస్మిత.

మదన్ ఏదో అనేలోగానే ఆ రూమ్ లోకి వచ్చేసారు ముకుందం, వనజ, తనూజ ఇంకా వంశీ కూడా. వాళ్ళందిరికీ కూడా వినిపించేంత గట్టిగా అరిచింది సుస్మిత.

"చిట్టిరాణి ఏమిటి? చిట్టిరాణి ఎక్కడో మన తోటలో మామిడి చెట్టు మీద కదా వున్నది." అంత ఆందోళనలోనూ కూడా చిరాకు పడుతూ అడిగాడు మదన్.

"చిట్టిరాణి ఈ రూమ్ లోకి వచ్చింది." నెమ్మదిగా నిభాయించుకుంటూ అంది సుస్మిత. "నాలోకి ప్రవేశించ బోయింది. నేనలా గట్టిగా అరిచేసరికి వెళ్ళిపోయింది."

"నీలో ప్రవేశించపోయిందా? పిచ్చి ముదురుతున్నట్టుగా వుంది నీకు." చిరాకు ఇంకా ఎక్కువైపోయింది మదన్ లో.

"మదన్ నువ్వేం మాట్లాడకు." సుస్మిత దగ్గరిగా వచ్చి, తనని మదన్ దగ్గరనుండి తన దగ్గరికి తీసుకుంటూ అంది తనూజ. "నేను తనతో మాట్లాడతాను. ఇదేం కంగారు పడాల్సిన విషయమేమీ కాదు. మీరంతా వెళ్లి పడుకోండి."

తనూజ కుడిభుజం మీద తన తల పెట్టుకుని సడన్ గా భోరుమంది సుస్మిత. "ఆ చిట్టిరాణి నిజంగానే వచ్చింది. నేనలా అరవకపోతే నా శరీరంలోకి వచ్చేసుండేది. నేను మిమ్మల్నందరినీ ఎలా నమ్మించను?" వెక్కిళ్ల మధ్య అడిగింది.

"రిలాక్స్ యువర్ సెల్ఫ్. నేను ఇంకెప్పుడూ నీతోనే వుంటాను. ఏ చిట్టిరాణి నీ దగ్గరికి రాలేదు, నీలో ప్రవేశించలేదు." సుస్మితని దగ్గరికి అదుముకుంటూ అంది తనూజ.

"అది నిజంగా మంచి ఐడియా తనూ. నువ్వలా చెయ్యి. తనింతగా డిస్టర్బ్ అయ్యాక, తనని వంటరిగా వదలడం మంచిదని నాకు అనిపించడం లేదు." వనజ అంది.

"డోంట్ వర్రీ అక్కా. నేను చూసుకుంటాను. మీరంతా వెళ్లి పడుకోండి. నేను తనూ కూడా పడుకుంటాం." తనూజ అంది.

ఆ మాట వినగానే వనజ, ముకుందం ఇంకా వంశీ అక్కడనుండి వెళ్లి పోయారు.

"నాకేమీ అర్ధం కావడం లేదు. ఈ కొత్త డెవలప్మెంట్ ఏమిటి?" ఆందోళన, ఇంకా చిరాకుతో అన్నాడు మదన్.

"ఏ విషయం రేపు మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి వెళ్లి పడుకో బావా."

"ఇప్పుడు ఇక్కడే మాట్లాడుకుంటే నష్టం ఏమిటీ? నాకు చాలా చిరాగ్గా వుంది." ఆ చిరాకు ఇంకా ఎక్కువైపోయింది మదన్ లో.

"బావా నా మీద నమ్మకముంటే వెళ్లి పడుకో. ఇప్పుడు ఏ విషయం మాట్లాడే ఉద్దేశం నాకు లేదు." హెచ్చెరికగా మదన్ మొహంలోకి చూస్తూ అంది తనూజ. అది అర్ధం చేసుకుని మరేం మాట్లాడకుండా అక్కడనుండి వెళ్ళిపోయాడు మదన్.

సుస్మిత అదేమీ విననట్టుగా వేరే ఇంకేదో లోకంలో వున్నట్టుగా వుంది. తనని తీసుకుని నెమ్మది గా బెడ్ వైపు నడిచింది తనూజ.        

&&&

ఎర్లీ మార్నింగ్ ఎనిమిది అవుతూ ఉంటే మదన్ రూంలోకి వెళ్ళింది తనూజ. చాలా సేపు రాత్రి నిద్ర పోకపోవడం వల్ల సుస్మిత అప్పటికి ఇంకా నిద్రపోతూనే వుంది.

"నేను ఊహించిన దాని కన్నా, అనుకున్నదానికన్నా పెద్ద సమస్యే కనిపిస్తూంది బావా. సుస్మితలో స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అవుతూన్నట్టుగా వుంది." మదన్ రూంలో మదన్ బెడ్ మధ్యలో, తను బెడ్ కి ఎదురుగుండా వున్న కుర్చీలో సెటిల్ అయ్యాక, తనూజ అంది.

"నీకు చేతకాకపోతే చెప్పు. వేరే ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను." కోపంగా అన్నాడు మదన్. "మొదట తన సమస్య పెద్దది కాదు చిన్నదే అన్నావు. తరువాత హిప్నోథెరపీ అన్నావు. ఇప్పుడేమో ఎదో స్ప్లిట్ పెర్సనాలిటీ అంటున్నావు. అసలు తన ప్రాబ్లెమ్ నువ్వు సాల్వ్ చేయగలవా, లేదా?"

"నీ ఫ్రస్ట్రేషన్ నేను అర్ధం చేసుకోగలను బావా. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైకాలాజికల్ డీసీజెస్ క్యూర్ చేయడం ఫిజికల్ డీసీజెస్ క్యూర్ చేయడం కన్నా కూడా కష్టంగా ఉంటుంది. నేను హిప్నోథెరపీ ఇంకా ప్రారంభించక పోవడానికి కారణం, మనం తనని ఒక సైకాలాజికల్ పేషెంట్ చూస్తున్నామని తను అనుకోకూడదని. తనకి సాధ్యమైనంత చేరువలో ఉంటూ, మాటలతో చేంజ్ తీసుకురావడానికి చూస్తున్నాను." దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది తనూజ.

"నీకన్నా ఎక్కువగా నా మంచి కోరుకునేవారు ఎవరూ వుండరు. నువ్వు సుస్మితని బాగు చెయ్యడానికి నీ ప్రయత్నం అంతా చేస్తావని, చేస్తున్నావని నాకు తెలుసు. ఎదో ఆందోళనలో అలా అన్నాడు, ఐ యాం సారీ." ఒక రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్.

"నువ్వు నాకెప్పుడూ సారీ కానీ థాంక్స్ కానీ చెప్పక్కర్లేదు బావా. అవి రెండూ మనమధ్య వుండకూడనంత క్లోజ్ మనం." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది తనూజ.

"కానీ తనలా ఇమాజిన్ చేసుకోవడం నాకు ఆశ్చర్యంగా వుంది. ఎక్కడో తోటలో మామిడి చెట్టు మీద వున్న చిట్టిరాణి ఇంట్లోకి కూడా ఎలా వచ్చింది?" ఆశ్చర్యంగా అన్నాడు మదన్.

"తోటలో మామిడి చెట్టుమీద చిట్టిరాణి దెయ్యంగా ఉందనుకోవడం తన భ్రమ. అలాగే ఆ చిట్టిరాణి ఈ ఇంట్లోకి వచ్చి తన శరీరంలోకి ప్రవేశించడానికి ట్రై చేసిందనుకోవడం కూడా తన భ్రమే." కాస్త ఆగి మళ్ళీ అంది తనూజ. "కానీ ఆ చిట్టిరాణి తన శరీరంలోకి ప్రవేశించేసిందన్న భ్రమ మాత్రం కలుగకూడదు. అదే జరిగితే తనలో స్ప్లిట్ పర్సనాలిటీ ప్రాబ్లెమ్ మొదలవుతుంది."

"అదే జరిగితే ఏమవుతుంది?" భృకుటి ముడేసాడు మదన్.

"తను చిట్టిరాణి లా బిహేవ్ చెయ్యడం మొదలు పెడుతుంది."

"మై గాడ్!" ఆందోళనతో నిండిపోయింది మదన్ మొహం. "అలా జరక్కూడదంటే ఏమి చెయ్యాలి?"

"తనని ఎప్పుడూ వంటరిగా వదిలేయకూడదు. ఎవరో ఒకరు కూడా ఉండాలి." కుర్చీలో ముందుకు వంగుతూ అంది తనూజ. "అది నేను చూసుకుంటాను. ఎప్పుడూ కూడా వుండి అలాంటి సమస్య రాకుండా చూస్తాను. అంతే కాదు ఈ సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తాను."

"థాంక్ యూ. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను." కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్.

"మన మధ్య థాంక్స్ లు ఉండకూడదని చెప్పాను కదా."

"ఐ యాం సారీ. మర్చిపోయాను." నవ్వుతూ అన్నాడు మదన్.

"సారీలు కూడా వుండకూడదన్నాను కదా." సీరియస్ గా అంది తనూజ.

"ఆల్రైట్. ఆల్రైట్. ఇంక మర్చిపోను. గుర్తువుంచుకుంటాను. నో సారీస్ నో థాంక్స్."

"దట్స్ గుడ్." చిరునవ్వుతో తలూపుతూ అంది తనూజ. అంతలోనే తన మొహం మళ్ళీ సీరియస్ గా మారింది. "ఈ అమ్మాయి గురించి నీకు ఎంత పూర్తిగా తెలుసు?"

"నీ ప్రశ్న నాకు పూర్తిగా అర్ధం కాలేదు." అయోమయంగా అన్నాడు మదన్.

"ఐ మీన్" కుర్చీలోనుంచి లేచి నిలబడి అంది తనూజ. "తన ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి, తన చిన్నతనం గురించి నీకు ఎంతవరకూ తెలుసు?"

"తను చెప్పినది విన్నదే, నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు. తను నాకు చెప్పిందంతా నేను నీకు చెప్పేసాను కూడా." తనూజ వైపు చూస్తూ అన్నాడు మదన్. "ఎందుకలా అడిగావు?"

"తను చిన్నతనంలో కానీ, లేదా ఆ తరువాత కానీ ఏమైనా సైకలాజికల్ ప్రోబ్లెంస్ తో సఫర్ అయిందేమో తెలుసుకోవాలి. తనిలా హల్యూసీనేషన్ లకి సబ్జెక్ట్ కావడానికి అవేమన్నాకారణమేమో కూడా గమనించాలి. అంతేకాకుండా సైకలాజికల్ ప్రోబ్లెంస్ తో సఫర్ అయినవాళ్లు స్ప్లిట్ పెర్సనాలిటీకి త్వరగా గురవుతారు."

"నేనేమన్నా అడిగి తెలుసుకోనా?"

"వద్దు. నువ్వలా ప్రత్యేకంగా అడిగితే మనం తనని ఒక సైకలాజికల్ పేషెంట్ గా చూస్తున్నామని తనకి తెలిసిపోతుంది. మాటల్లో పెట్టి నేనే తెలుసుకునే ప్రయత్నం చేస్త్తాను." మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూలబడింది తనూజ. 

"తన పదహారో ఏట తన పేరెంట్స్ ఇద్దరూ ఫ్లైట్ ఆక్సిడెంట్ లో పోయారు. తరువాత తనని చంపడానికి కూడా వెనకాడనంత స్వార్ధపరులైన తన మామయ్య కుటుంబంతో కలిసి పెరిగింది. సైకాలజికల్గా చాలా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది." సాలోచనగా అన్నాడు మదన్.

"యు ఆర్ రైట్." తలూపుతూ అంది తనూజ.

తరువాత ఇంకొంచం సేపు మాట్లాడక ఆ రూంలోనుండి బయటకి వచ్చేసింది తనూజ. 

&&&

సరిగ్గా క్రితం రాజు సాయంత్రం సమయానికే ఫామ్ హౌస్ లోకి వచ్చాడు వంశీ. తనూజ ఆలా డిస్టర్బ్ చెయ్యడం వల్ల క్రితం రోజు పూర్తి చెయ్యలేని పనిని పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో వున్నాడు. ఎప్పుడైతే తనూజ అలాగా కౌగలించుకుని ముద్దులు పెట్టుకుందో చాలా డిస్టర్బ్ అయిపోయాడు. రాత్రంతా నిద్రకూడా పోలేకపోయాడు.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)