Aa Voori Pakkane Oka eru - 7 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 7

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 7

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"నువ్వు నాకు థాంక్స్ చెప్పక్కరలేదు. ఇది నా అవసరం కూడా కదా." కుర్చీలోనుంచి లేచింది మాధురి. "వుండు నేను నీకు కాస్త కాఫీ తీసుకొస్తాను."

"కాఫీ కన్నా కూడా నీ దగ్గరనుంచి నాకు కావల్సినది వేరే వుంది." తను కూడా సోఫా లోనుంచి లేచి అన్నాడు శేషేంద్ర. "బెడ్ రూమ్ లోకి వెళదామా?"

పశువు కన్నా హీనంగా తన కామ వాంఛ మాధురితో తీర్చుకున్నాక కాఫీ తాగకుండానే అక్కడనుండి వెళ్ళిపోయాడు శేషేంద్ర. లేచి వంటిమీద బట్టలు సర్దుకునే ఓపిక కూడా లేకుండా అలాగే బెడ్ మీద పడుకుని ఉండిపోయింది మాధురి.

తన చిన్నతనంలో ఒకరు, ఇద్దరు ఒక్కోసారి ముగ్గురు మగవాళ్ళు తన తల్లి గదిలోకి వెళ్ళాక, తన తల్లి ఏడుపు, అరుపులు వినిపిస్తూంటే ఏం జరుగుతూందో తనకి అర్ధం అయ్యేది కాదు. కానీ ఆరోజు ఆ రాస్కేల్ తననలా రేప్ చేసిన తరువాత ఆ మగవాళ్ళు తనతల్లినేం చేసేవారో అర్ధంఅయి మ్రాన్పడిపోయింది. తన గురించి కూడా ఆలోచించకుండా తన తల్లి ఆత్మహత్య చేసుకోవడంలో కూడా ఆశ్చర్యం ఏమీ కనిపించలేదు.

తన తల్లి పడ్డ హింస అర్ధం అయ్యాక, తనుకూడా పెద్ద మనిషి కాకుండానే అలా రేప్ కి గురయ్యాక, సెక్స్ అంటేనే తనకి వెగటు అసహ్యం పుట్టాయి. 'నీ జీవితం నా జీవితంలా కాకూడదు. ఒక డబ్బున్న వ్యక్తితో నీ పెళ్లయి నువ్వు జీవితంలో సుఖపడాలి.' అది తన తల్లి తరచూ తనతో అన్నమాట. తనకెంత వెగటుగా వున్నా సెక్స్ కి ఒప్పుకోకుండా ఏ మగాడికీ తను భార్యని కాలేనని బోధపడిపోయింది మాధురికి.

శేషేంద్ర వ్యవహారం చూసి తను బాగా ఆస్థిపరుడు అనుకుంది. తనని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుండి తన తల్లి కోరిక తీరుతుంది అనుకుంది. కానీ అతనితో పూర్తిగా కమిట్ అయి, కాలేజ్ అంతా తమ ఇద్దరిగురించి తెలిసాక కానీ వాడి వ్యవహారం అంతా ఉత్తిదేనని వాడికేమీ లేవని తెలిసి రాలేదు. కానీ అప్పుడు ఇంకా చెయ్యగలిగింది ఏమీ లేకుండా పోయింది ఒక్క శేషేంద్ర చెప్పింది చెయ్యడం తప్ప.

శేషేంద్ర చెప్పేడనే సుస్మితతో స్నేహం చేసినా, ఆమెతో స్నేహం తనకెంతో ఆనందాన్ని ఇచ్చింది. తను మాత్రమే కాదు తన మనసు కూడా చాలా అందమైనది. తనకెన్నో రకాలుగా సహాయం కూడా చేసింది. అలంటి సుస్మితని డ్రగ్ అడిక్ట్ ని చెయ్యమని శేషేంద్ర అంటే తను అస్సలు ఒప్పుకోలేదు.

"తనని అలా డ్రగ్ అడిక్ట్ గా ఉండిపోనివ్వం. మాకు కావాల్సిన ఎదో కొంత ఆస్థి మా పేరు మీద రాయించుకున్నాక తనని మళ్ళీ మామూలుగా మార్చేస్తాం. అలా రాయించుకోకపోతే నేను బికారిగానే ఉండిపోతాను. ఒక బికారిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా? మీ అమ్మగారి కోరిక ఏమి కావాలి?" అలా చెప్పి చెప్పి తనని ఒప్పించాడు.

"కానీ నువ్వు చెప్పిన ప్రకారంగా ఇంకో సంవత్సరం దాటితే కానీ తనకి ఇరవై రెండేళ్లు రావు, ఆస్థి మీద హక్కు రాదు. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడం వాళ్ళ ప్రయోజనం ఏమిటి?"

"అప్పటికప్పుడు చేయగలమా? ఇప్పటినుంచి కొంచెం కొంచెం డ్రగ్ అడిక్ట్ ని చేసి అప్పటికి మన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాక, నా పేరుమీద కొంత ఆస్తిని రాయించుకున్నాక, తనని రీహాబిలేషన్ సెంటర్లో చేర్పించి మామూలుగా మార్చేస్తాను."

శేషేంద్ర చెప్పింది నమ్మశక్యంగా అనిపించకపోయినా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా బయటకి వెళ్లి బ్రతికే ధైర్యంలేక, ఇంకా వాడు ఆస్తి వచ్చాక తనని పెళ్లి చేసుకుంటాడన్న ఆశతో అందుకు ఒప్పుకుంది. కానీ తను భయపడ్డంత పని జరిగింది. తను అడిగిన వెంటనే టేస్ట్ చేయకపోగా అదేమిటని అడిగింది సుస్మిత. తను అదొక మత్తెకించే డ్రగ్ అని, తీసుకుంటే ఎంతో బాగుంటుందని చెప్పగానే తనని సుస్మిత చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేదు. తనని సుస్మిత అలా అసహ్యంగా చూస్తూ ఉంటే తన గుండెలు పిండేసినట్టుగా అనిపించింది. ఆ రోజు తరువాత ఎప్పుడైనా తనే ఫోన్ చేసి మాట్లాడింది తప్ప సుస్మిత ఫోన్ చెయ్యలేదు. ఏది ఏమైనా సుస్మిత డ్రగ్ తీసుకోకపోవడం, డ్రగ్ అడిక్ట్ కాకపోవడం తనకి ఆనందాన్నే ఇచ్చింది.

తను సుస్మితని డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడంలో అలా ఫెయిల్ అయిపోవడం శేషేంద్రకి పట్టలేనంత కోపం తెప్పించినా, వాడు ఎందుకు వూరుకున్నాడో మాధురి కి బాగా తెలుసు. వాడికి వాడి వేడి తీర్చుకోవడానికి కావలసినప్పుడల్లా ఒక శరీరం కావలి. పైన కక్కుర్తిపడితే ఏం జబ్బులొస్తాయో తెలీదు. అయిన వాళ్ళు తనంత అందంగానూ వుండరు.

ప్రస్తుతం శేషేంద్ర క్యారక్టర్ పూర్తిగా తెలిసివచ్చినా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో వుంది మాధురి. ఇప్పుడు తను వేరే ఎక్కడికీ వెళ్ళలేదు. తామిద్దరిగురించీ అంతా ఇలా తెలిసిన తరువాత తనని వేరే ఎవరూ పెళ్లి చేసుకునే అవకాశమూ లేదు. నెమ్మదిగా శేషేంద్రనే మంచిగా మలుచుకోవాలని ఆలోచిస్తూవుంది. 

&&&

"మీరు ఈ ఆస్థి అంతటికీ కేవలం గార్డియన్ మాత్రమే అన్న విషయం మర్చిపోతున్నట్టు వున్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులమ్మి వాడేస్తే తరువాత దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది." లాయర్ శతకోటి అన్నాడు.

"ఎంత వాడేస్తే మాత్రం తరిగిపోయే ఆస్తా మా బావగారిది? ఇన్నిరోజులుగా మా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాఅందులో పదో వంతు కూడా ఖర్చు అవ్వలేదు." వసంతరావు అన్నాడు.

"అయన ఆస్తి ఎంతైనా వుండి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయికి ఆ ఆస్తిమీద హక్కు వచ్చాక ఇన్ని రోజులు మీరు అమ్మిన వాటికీ వివరాలు అడిగితె మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు. మీరు ఆ ఆస్తులు అమ్మడానికి సరైన కారణాలు చెప్పలేకపోతే మిమ్మల్ని ఆ అమ్మాయి జైలు కి కూడా పంపించొచ్చు." శతకోటి అన్నాడు.

"మమ్మల్నలా భయపెట్టకండీ." కంగారుగా అంది పంకజం.

"అమ్మా నేను మీకు ఎప్పటినుండో లాయర్ని. మీ ఉప్పు తింటూన్నవాడిని. మిమ్మల్ని అనవసరంగా భయపెట్టాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి?" పంకజం ముఖంలోకి చూస్తూ అన్నాడు శతకోటి. "కానీ నిజాలు మాట్లాడకుండా ఎలా వుండమంటారు?"

"కేవలం నిజాలు మాట్లాడడం మాత్రమే కాకుండా, దీనికి ఏదైనా ఉపాయం ఉంటే కూడా చెప్పొచ్చు కదా." శేషేంద్ర అడిగాడు.

"నా నోటితో ఎందుకు చెప్పిస్తారు? మీకు తెలీదా ఏం చెయ్యాలో?" చిరాగ్గా అన్నాడు శతకోటి. "తనకి ఆస్తిమీద హక్కు వచ్చే లోపుగా తనని లేకుండా చేసేయడమే అందుకు ఉపాయం."

"మేం సీరియస్ గా ఆ ప్రయత్నంలో ఉండగానే తను ఇల్లు విడిచి వెళ్ళిపోయింది లాయరుగారూ." విచారంగా అంది పంకజం.

"దానర్ధం ఒకటే. తనకి మీ ప్రయత్నాల గురించి తెలిసిపోయే అలా వెళ్ళిపోయింది. మీకెంత మాత్రం ఏ అనుమానం రాకుండా ఎలా వెళ్లిపోయిందో చూసారా? ఆ అమ్మాయి స్థానంలో ఇంకెవరైనా అయివుంటే నేను చెప్పలేను. కానీ ఈ సుస్మిత మాత్రం చాలా తెలివైన పిల్ల. ఇంత తెలివిగా మీ దగ్గరినుండి తప్పించుకుని వెళ్లిపోయిందంటే, మీ ఉద్దేశాలన్నీ తనకి తెలిసిపోయే ఉంటాయి. ఆస్తంతా తన చేతిలోకి రావడానికి, ఇరవై రెండేళ్లు రాగానే ఎవర్నో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేసుకునే వుండి ఉంటుంది. ఇంకా ఆస్తంతా తన చేతిలోకి రాగానే ఏం చెయ్యాలో కూడా మంచి ఆలోచనతోనే వుండివుంటుంది. మీరు జాగ్రత్త పడకపోతే మిమ్మల్ని జైలుకి పంపించకుండా కేవలం రోడ్ మీదకి నెట్టేసి ఊరుకుంటే మీరు అదృష్టవంతులనే చెప్పాలి." శతకోటి అన్నాడు.

"మీరు చెప్పింది వినడానికి చాలా చేదుగా వున్నా, అక్షర సత్యాలని మాత్రం చెప్పక తప్పదు." వసంతరావు అన్నాడు.

"నేనెప్పుడూ మీ శ్రేయోభిలాషిని. మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా సిద్ధంగా వుంటాను. ప్రస్తుతానికి సెలవు ఇప్పించండి." అనిచెప్పి శతకోటి అక్కడనుండి వెళ్ళిపోయాడు.

"విన్నారుగా ఆ లాయర్ చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దామంటారో మీరే చెప్పండి." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ చిరాగ్గా అడిగింది పంకజం.

"నీ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చేయిరా? తన జాడ ఎమన్నా తెలిసిందా?" కొడుకు మొహంలోకి చూస్తూ అడిగాడు వసంతరావు.

"కొంచెం గా కూడా తెలియలేదు. ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేస్తూనే వున్నాను." నిట్టూరుస్తూ అన్నాడు శేషేంద్ర. "అదెంత తెలివైనది అంటే ఫోన్, సిమ్ కూడా డిస్ట్రాయ్ చేసేసి ఎక్కడో పారేసి ఉంటుంది మనం ట్రాక్ చెయ్యడానికి వీలులేకుండా. అందుకనే ఎన్నిసార్లు ఫోన్ చేసిన నాట్ రీచబుల్ అనే వస్తూంది ఆమె ఫోన్."

"ఆస్తన్తా తన చేతికి వచ్చి తనేదోఒకటి చేసేలోపే మనం ఏదోఒకటి చెయ్యకపోతే మనం ముగ్గురం ఏ గుడి ముందో మూడు చిప్పలు పట్టుకుని కూర్చోవాలన్న విషయం గుర్తుంచుకుంటే మీ ప్రయత్నాల్లో వేడి వస్తుంది." వెటకారంగా అంది పంకజం.

"మేము మా ప్రయత్నాలు చేస్తూనే వున్నాం. నువ్వు అనవసరంగా మా మెదళ్ళు తినేకు." కోపంగా అన్నాడు వసంతరావు.

ఆ తరువాత అది ఇది ఆ ముగ్గురూ మాట్లాడుకుంటూ వున్నా ప్రశాంతం గా మాత్రం ఉండలేకపోయారు.  

&&&

 "తనూజని రమ్మన్నావంట. అది ఫోన్ చేసి చెప్పింది." వంటిట్లో మదన్ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూచుని కాఫీ సిప్ చేస్తూంటే, అతనికి ఎదురుగుండా తానూ ఒక కాఫీ కప్పుతో కూచుంటూ అంది వనజ.

"అవును వదినా. ఎంత చెప్పినా చిట్టిరాణి దెయ్యం గా మారి ఆ మామిడిచెట్టు మీద ఉందన్న పాట మానడం లేదు సుస్మిత. తను సైకాలజిస్ట్ కదా. తను వస్తే కొంత ఉపయోగంగా ఉంటుందని." కాఫీ కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టి అన్నాడు మదన్.

"అది ఎమ్మె సైకాలజీ తో చేసింది. సైకాలాజిస్టు గా ప్రాక్టీస్ పెట్టలేదు. దానికి అంతమటుకు తెలిసి ఉంటుందని నేను అనుకోవడం లేదు." కాఫీ సిప్ చేస్తూ మధ్యలో అంది వనజ.

"సుస్మిత చిన్నప్రాబ్లెమ్ కి తనూజ సరిపోతుందిలే వదినా." నవ్వాడు మదన్. "అంతే కాకుండా సుస్మితకి కొంతకాలం పాటు మంచి తోడుగా కూడా ఉంటుందని రమ్మన్నాను."

"నువ్వు చెప్పింది నిజమే అయినా దాని పొగరు నీకు తెలుసు కదా. ఎందుకు మా అమ్మ నాతో పెద్ద గొడవ పెట్టుకుని తనని తీసుకుని వెళ్లిపోయిందో నువ్వు మర్చిపోయావా? ఆ తరువాత మన మధ్య రాకపోకలు అంతంత మాత్రంగానే వున్నాయి."

"వదినా అదెప్పుడో ఇంచుమించులో పది పన్నెండు సంవత్సరాల కిందట జరిగిన వ్యవహారం. అప్పటికి ఇప్పటికి తను చాలా మారిపోయింది." మదన్ అన్నాడు.

"మారితే మంచిదే. కానీ ఇక్కడికొచ్చాక తనకి స్పష్టంగా చెప్పు. వంశీని తను మళ్ళీ ఇన్సల్ట్ చేసినా, లేదా తనతో మిస్బిహేవ్  చేసినా అంత బాగా మాత్రం ఉండదు. తన రెండుకాళ్లు విరిచి చేతిలో పెడతాను." కోపంగా అంది వనజ.

"ఆ విషయం తనకి ఆ రోజునే బాగా అర్ధం అయింది. వంశీ జోలికి పోయే సాహసం పొరపాటున కూడా చెయ్యదు." నవ్వుతూ అన్నాడు మదన్.

వాళ్లిద్దరూ ఆలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సుస్మిత వచ్చి, వనజ పక్కన వున్న కుర్చీలో కూచుంది.

"నీకిక్కడ అంతా బాగానే వుంది కదా. ఏం కావాల్సివచ్చినా మొహమ్మాట పడకుండా అడుగు." అక్కడినుండి లేచి స్టవ్ దగ్గరికి వెళుతూ అంది వనజ.

"నాకసలు అడిగే ఛాన్స్ ఇస్తున్నారా? అడక్కుండానే అన్ని అమరుస్తున్నారు కదా." అప్పుడు సుస్మిత నవ్వు మదన్ కే కాదు, వనజకి కూడా మనోహరంగా అనిపించింది. "నా మామ్ డాడ్ లతో నాకు ఆ ఇంట్లో సెక్యూర్డ్ గా, హ్యాపీ గా ఎలా ఉండేదో నాకిప్పుడు ఇక్కడ అలాగే అనిపిస్తూ వుంది. చాల రోజుల తరువాత నాకలాంటి హ్యాపీ ఫీలింగ్ మళ్ళీ కలిగింది." వనజ తనకిచ్చిన కాఫీ కప్పు తీసుకుంటూ అంది సుస్మిత.

"నీ ఆస్తంతా ఇప్పటివరకూ అనుభవించి, నీకు స్వంత మామయ్య అయివుండి కూడా నిన్ను చంపాలని చూస్తున్నాడంటే అతనెంత దుర్మార్గుడు." సుస్మిత పక్కనే మళ్ళీ కూచుంటూ అంది వనజ. అప్పటికే తన కాఫీ తాగేసింది.

"నా మామయ్య మాత్రమే కాదు, నా అత్తయ్య నా బావ కూడా అలాంటివాళ్లే." కాఫీ సిప్ చేస్తూ అంది సుస్మిత. "కేవలం దేవుడి దయవల్ల మాత్రమే ఇప్పటికే వాళ్ళు నన్ను ఎదోఒకటి చేసెయ్యలేదు."

"ఆదిమాత్రం నిజం. కానీ నువ్విక్కడికి వచ్చావు కదా. నీకింక ఎటువంటి ప్రమాదం ఉండదు. నువ్వు మా మదన్ కి ఇంతగా కావాల్సిన దానివి అని తెలిసాక నీ మీద ఈగ కూడా వాలనిచ్చే ప్రసక్తి లేదు." ధృడంగా అంది వనజ.

"థాంక్స్ ఆంటీ." కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అంది సుస్మిత.

"నువ్వు నాకు ఏ విషయానికి థాంక్స్ చెప్పొద్దు. ఇప్పుడు మనమంతా ఒకటే ఫామిలీ." ఆలా అన్నాక మదన్ మొహంలోకి చూసింది వనజ. "నేను తనని ఊళ్లోకి తీసుకెళ్తున్నాను. ఆలా టెంపుల్ కి వెళ్లి, ఇంకా మనకి బాగా కావాల్సిన ఒకటి రెండు కుటుంబాలకి పరిచయం కూడా చేసి తీసుకువస్తాను."

"చాలా మంచి ఆలోచన వదినా." చిరునవ్వుతో తలూపాడు మదన్. "మీరిద్దరూ వచ్చేప్పటికి తనూజ కూడా వచ్చేసి ఉంటుంది."

" తనీరోజే రావడం నాకు చాలా ఆనందంగా వుంది. తనని కలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా వుంది." ఉత్సాహంగా అంది సుస్మిత. అప్పటికే తనూజ ఆ ఇంటికి వస్తూన్న విషయం మదన్ సుస్మితకి చెప్పాడు.

"అప్పుడప్పుడూ కొంచెం తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నిన్నేమన్నా హర్ట్ చేస్తే చెప్పు. రెండు చెంపలూ వాయించేస్తాను దానికి." వనజ అంది.

"వదినా, తనతో కూడా తనూజ ఆలా ఎందుకు ప్రవర్తిస్తుంది చెప్పు? తను ఎమ్మె సైకాలజీ డిస్టింక్షన్ లో పాసయ్యింది. ఎవరితో ఎలా బిహేవ్ చెయ్యాలో ఏమాత్రం తెలియకుండా ఉంటుందా?" మదన్ అన్నాడు.

"అదంతా నాకు తెలియదు. నేను చెప్పాల్సింది చెప్పాను." వనజ అంది.

"ఆంటీ. తనకే కాదు. నాకూ కొంచెం తిక్క వుంది. తను నాతో తిక్కగా ప్రవర్తిస్తే, నేనూ అలాగే ప్రవర్తించి తనని సెట్ చేస్తాను. మీరు కంగారు పడకండి." చిరునవ్వుతో అంది సుస్మిత. తనకి ఫోన్ చేసి రమ్మన్నానని చెప్పాక తనూజ గురించి కొంచెం చెప్పాడు మదన్ సుస్మిత కి. 'ఒక్కోసారి తను చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. ఎదుటివాళ్ళ ఫీలింగ్స్ గురించి పట్టించుకోదు. నీతోటేమన్నాఆలా ప్రవర్తిస్తే నాకు చెప్పు. నేను సరి చేస్తాను.' అప్పుడు వనజకి చెప్పినట్టుగానే చెప్పింది సుస్మిత మదన్ కి కూడా.

"అయితే నువ్వింకిందులో కనగారు పడాల్సిందేమీ లేదు. మీరిద్దరూ టెంపుల్ కి ఇంకా ఊరంతా చూసి రండి." మదన్ చిరునవ్వుతో అన్నాడు.

"నువ్వు మాత్రం నాకిచ్చిన మాట మర్చిపోకు. నేను పర్లేదని చెప్పేవరకూ ఆ తోటవైపు కూడా వెళ్ళడానికి వీల్లేదు." సీరియస్ ఎక్స్ప్రెషన్ తో చెప్పింది సుస్మిత.

ముందురోజులాగే మాట్లాడకుండా అక్కడనుండి లేచి వెళ్ళిపోయాడు మదన్. కంగారుగా చూసింది వనజ మొహంలోకి సుస్మిత.

"నువ్వు చెప్పేవరకూ తను ఆ తోటలోకి వెళ్ళడు. నువ్వు భయపడకు." సుస్మిత కుడిభుజం మీద చెయ్యివేసి అంది వనజ. తలూపి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సుస్మిత

&&&

"నాకిందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నీలాంటి హ్యాండ్సమ్ గై వెనకాతల గాళ్స్ పడ్డం సామాన్యమైన విషయమే."

వనజ, సుస్మిత బయటకివెళ్ళిన పదినిమిషాల తరువాత ఆ ఇంట్లో అడుగు పెట్టింది తనూజ.

"తను నేనేదో హ్యాండ్సమ్ గా వున్నానని నా వెంటపడడం కాదు. నన్ను మనసారా ప్రేమించి ఇంత దూరం వచ్చింది." కాస్త ఆగి మళ్ళీ అన్నాడు మదన్. "నిజం చెప్పాలంటే నేనూ తనని మనసారా ప్రేమిస్తున్నాను."

"రియల్లీ! నా మొహంలోకి చూసి చెప్పు." కుర్చీలోనుంచి లేచి బెడ్ మీద కూచున్న మదన్ కి ఎదురుగ వెళ్లి అతని మొహంలోకి చూస్తూ అంది తనూజ. "నీలో ఆ క్వాలిటీ కూడా వుందా? పాపం ఆ చిట్టిరాణి అంతగా నీ వెంటపడ్డా ఏ రోజూ పొరపాటున కూడా తన మీద నీకెలాంటి ఫీలింగ్ కలగలేదు."

"నేనూ చిట్టిరాణి కలిసి పెరిగాం. చిన్నప్పటినుండి కలిసే ఉండడం వల్ల కాబోలు తనమీద అలాంటి ఫీలింగ్ రాలేదు నాకెప్పుడూ. ప్రేమ అనేది తనంత తను పుట్టాలి. మనం కావాలని కల్పించుకోలేం." చిరాగ్గా అన్నాడు మదన్.

"అబ్బో గొప్ప విషయం చెప్పావులే." మళ్ళీ వెళ్లి తన కుర్చీలో తను కూర్చుంది తనూజ. "ఈ అమ్మాయి ఎదో అప్సరసలా వుండివుంటుంది. నీకు ప్రేమ పుట్టుకొచ్చింది. మీ మగాళ్ళకి కావాల్సిందేమిటో నాకు తెలీదా?"

"నువ్విలా మాట్లాడడానికే ఇక్కడికి వచ్చివుంటే నేను నీతో మాట్లాడేదేమీ లేదు." గోడవరకూ జరిగి, గోడకి జారబడి, కళ్ళుమూసుకున్నాడు మదన్.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)