Aa Voori Pakkane Oka eru - 12 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 12

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 12

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"నన్ను మాత్రం అటువైపుగా వెళ్లనివ్వడం లేదు. నువ్వు మాత్రం అక్కడ బాగానే ఎంజాయ్ చేసి వచ్చావా?" సుస్మిత తో కోపంగా అన్నాడు మదన్.

ఇంటికి వస్తూనే సుస్మిత, తనూజ ఇద్దరూ మదన్ గదిలోకి వెళ్లారు. తనూజ బెడ్ మీద మదన్ పక్కనే కూలబడితే, సుస్మిత ఎదురుగుండా వున్న కుర్చీలో కూచుంది.

"ఐ యాం సారీ. నేనక్కడ ఎంజాయ్ చెయ్యలేదని చెప్పను. నిజంగా మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది." సుస్మిత అంది విచార వదనంతో. "కానీ నువ్వూ మళ్ళీ అక్కడికి వెళ్లే అవకాశం వచ్చేవరకూ నేనూ అటువైపు వెళ్ళను."

"అంటే ఆ తోటలో చిట్టిరాణి దెయ్యం ఉందన్న భ్రమ నీలో ఇంకా అలాగే ఉందన్నమాట." చిరాగ్గా అన్నాడు మదన్.

"నీకెన్ని సార్లు చెప్పాలి నాది భ్రమ కాదు నిజం అని." కోపంగా అరిచినట్టుగా అంది సుస్మిత. "ఆ చిట్టిరాణి వల్ల నీకెంత ప్రమాదం వుందో నిన్నెలా నమ్మించను?"

కంగారుగా తనూజ మొహంలోకి చూసాడు మదన్. ఆ విషయం తరువాత మాట్లాడతాను అన్నట్టుగా కళ్ళతోటి సైగ చేసింది తనూజ.

"బావా కాస్సేపు మీరిద్దరూ ఆ విషయం విడిచిపెట్టేయండి. ఇంక మాట్లాడుకోవడానికి విషయాలే లేవా?" తనూజ అంది.

"నాకు నిద్ర వస్తూంది. కాస్సేపు వెళ్లి పడుకుంటాను." కుర్చీలోనుంచి లేస్తూ అంది సుస్మిత.

"కాస్సేపట్లో మనమంతా లంచ్ చేస్తాం. ఈ సమయంలో నిద్ర ఏమిటి?" చిరాగ్గా సుస్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్.

"ఏమో నాకు తెలీదు. నిద్ర మాత్రం బాగా వస్తూంది." ఆవలిస్తూ అంది సుస్మిత.

"తనకంత నిద్ర వస్తూవుంటే వెళ్లి నిద్రపోనీ బావ. ఇప్పుడొచ్చిన నష్టం ఏముంది? తను పడుకోవడం కూడా నీ ఇష్టప్రకారమే చెయ్యాలా ఏమిటి?" భృకుటి మూడేసి అంది తనూజ.

"సరే అయితే" చిరునవ్వుతో సుస్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్.

సుస్మిత తలూపి అక్కడనుండి వెళ్ళిపోయింది. సుస్మిత అక్కడనుండి వెళ్ళగానే తనూజ బెడ్ మీద నుండి అంతకుముందు సుస్మిత కూచున్న కుర్చీలోకి ట్రాన్స్ఫర్ అయింది.

"ఇప్పుడు చెప్పు. పరిస్థితి ఎలా వుంది? నువ్వా చోటుకి తీసుకుని వెళ్ళగానే ఎలా రియాక్ట్ అయింది?" తనూజ మొహంలోకి చూస్తూ అడిగాడు మదన్.

"ఆ చోట్లో కొంచెంసేపు ఉండడానికి కూడా తను ఇష్టపడలేదు. దానితో నేను తనని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్ళాను. అక్కడ మాత్రం చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆ ఫామ్ హౌస్ లో తను చాలా నార్మల్ ఇంకా యూజువల్ గానే వుంది." తనూజ అంది.

"దీనిని మనం ఎలా అర్ధం చేసుకోవాలి? సమస్య తీవ్రమైనదా, కాదా?" నుదురు చిట్లించి అడిగాడు మదన్.

దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి వాలింది తనూజ. "సమస్య చాలా తేలికైనది అని నీకు అబద్ధం చెప్పదలుచుకోలేదు బావా. చిట్టిరాణి దెయ్యంగా ఉందని తను చాలా బలంగా నమ్ముతూంది. అందుకు వ్యతిరేకంగా ఏమీ వినదలుచుకోవడం లేదు."

"మరిప్పుడు ఏం చెయ్యాలి తనని ఆ భ్రమలోంచి బయటకి తీసుకురావడానికి? ముఖ్యగా నేను పొలంలోకి వెళ్ళడానికి కూడా లేకుండా ఇలా ఇంట్లోనే ఉండలేకపోతున్నాను." ఇంకా చిరాకు పడిపోయాడు.

"తనకి హిప్నోథెరపీ అవసరం. తన సబ్కాంషస్ లోకి రీచ్ అయి ఆ భ్రమలోనుంచి బయటకి తేవాలి."

"అయితే అదేదో త్వరగా చెయ్యొచ్చు కదా? దేనికి ఆలోచన?" అదే మోతాదు చిరాకుతో అన్నాడు మదన్.

"తనకి హిప్నోథెరపీ చెయ్యాలి అంటే అందుకు తన అంగీకారం అవసరం. సబ్జెక్ట్ ఒప్పుకోకుండా హిప్నోసిస్ లోకి పంపించి ఏదీ సెట్ చెయ్యడం అవ్వదు." తనూజ కూడా కోపంగా అంది. "ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ని రిమూవ్ చెయ్యాలంటే లేబర్ ని పెట్టి ఓ పది రోజుల్లో చెయ్యొచ్చు. కానీ ఒక భ్రమని తొలగించాలంటే ఆలా కాదు. ఫిజికల్ థింగ్స్ కన్నా ఇల్యూషన్స్ చాలా బలమైనవి బావా వాటిని తొలగించడానికి చాలా సహనం కావలి."

"నువ్వే ఇలా మాట్లాడితే నా సమస్య తీరినట్టే." కోపంగా అన్నాడు మదన్.

"ఓహ్, బావ. ప్లీజ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్." మరోసారి బెడ్ మీద మదన్ పక్కన కూచుని, మదన్ కుడి భుజం మీద చెయ్యివేసి అంది తనూజ. "సుస్మిత ని నార్మల్ గా చెయ్యడానికి నా ప్లాన్ నాకుంది. కచ్చితంగా నేను తనని నార్మల్ గా చేస్తాను. కాకపోతే ముందు తనది కేవలం భ్రమేనని, నిజం కాదని తనని కన్విన్స్ చెయ్యాలి. అది నెమ్మదిగా జరగాలి. నేనదంతా చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా వుండు."

"డు ఐ హావ్ ఎనీ చాయిస్?" చిరాగ్గా తలూపుతూ అన్నాడు మదన్. "నువ్వు చూసుకుంటావని ఊరుకోవడం తప్ప."

"చాలా ముఖ్యమైన విషయం." మదన్ భుజం మీదనుంచి చెయ్యి తీసేసి అడ్జస్ట్ అయి కూచుంటూ అంది తనూజ. "నువ్వు తనమీద చికాకు పడడం, కోప్పడడం లాంటివి చెయ్యకు. అది తననింకా అప్సెట్ చేసి మనకి ఏ రకంగానూ కో-ఆపరేట్ చెయ్యడం మానేస్తుంది. నువ్వు చిట్టిరాణి దెయ్యం ఉందని ప్రత్యేకంగా నమ్మినట్టుగా కానీ, నమ్మనట్టుగా కానీ ఉండకు. ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకు."

"సరే. అలాగే అయితే." తలూపాడు మదన్.

"నీకు ఇంట్లో కాలక్షేపం కాకపోతే ఫ్రెండ్స్ ఉన్నారుగా వూళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళు కాలక్షేపానికి. నిన్ను తోటలోకి, పొలంలోకే కదా సుస్మిత వెళ్లొద్దు అన్నది."

"ఆ పని ఎలాగూ చేస్తానులే." చిరునవ్వుతో అన్నాడు మదన్.

"మీరిద్దరూ కిందకి భోజనానికి రావడం బావుంటుంది." అంతలోనే వనజ ఆ గదిలోకి వచ్చి అంది. "కావాలంటే ఈ కబుర్లు భోజనం అయ్యాక చెప్పుకోవచ్చు."

"భోజనం అయ్యాక పడుకుంటాను. నాకు నిద్ర వస్తూంది." బెడ్ మీద నుండి కిందకి దిగి ఆవలిస్తూ అంది తనూజ.

"నీ ఇష్టం కానీ, సుస్మిత ఏమిటి ఈ సమయంలో ఆలా నిద్రపోతూంది? రాత్రి తనకి సరిగ్గా నిద్ర పట్టలేదా ఏమిటి?" వనజ అంది.

"ఏమో బాగా నిద్ర వస్తూంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. లేపి తీసుకుని రానా?" తను కూడా బెడ్ మీదనుండి కిందకి దిగుతూ అన్నాడు మదన్.

"వద్దు. తనకంత నిద్రవస్తూంటే లేపడం ఎందుకు? తనంతట తానుగా లేచాకే భోజనం చేస్తుందిలే. మీరిద్దరూ మాత్రం రండి." అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది వనజ.

&&&

"మాడ్ రమ్మన్నాడు. వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను." తల్లి మంగవేణితో అంది తనూజ.

"సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఆలోచిస్తున్నాను. వెంటనే బయలుదేరి వెళ్ళు." వెంటనే అంది మంగవేణి.

"మామ్ నువ్వేనా ఇలా అంటున్నది?" ఆశ్చర్యంగా చూసింది తల్లి మొహంలోకి తనూజ. "ఆ రోజు ఆలా తగవు పెట్టుకుని వచ్చిన తరువాత ఈ రోజు వరకూ పొరపాటున కూడా నువ్వక్కడికి వెళదామని కానీ నన్ను వెళ్ళమని కానీ అనలేదు."

"ఎదో అయిందేదో అయిపొయింది. ఏవో తగువులు గుర్తుంచుకుని బంధుత్వాలు వదిలేసుకుంటామా? మళ్ళీ ఎప్పుడు నా పెద్ద కూతురి దగ్గరికి వెళదామా, ఎప్పుడు తనని ఆ కుటుంబాన్ని చూద్దామా అని ఎంతో కాలంగా చూస్తున్నాను." మంగవేణి అంది. "ముందు నువ్వు వెళ్ళు వీలు చూసుకుని నేనూ వస్తాను."

"అయితే నేనక్కడికి వెళ్లడంలో నీకేమి అభ్యంతరం లేదన్నమాట. మై గుడ్ మామ్!" తల్లిని కౌగలించుకుని తన కుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అంది తనూజ.

"నువ్వేదో ఊరికినే వెళ్లి రావడం కాదు. ఒక ముఖ్యమైన కార్యం సాధించుకు రావాలి." తనూజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది మంగవేణి.

"ఏమిటది మామ్?" భృకుటి ముడేసింది తనూజ.

"ఏం చదివి చచ్చారో కానీ నీకు నీ అక్కకి తెలివితేటలూ ఈ జన్మకి రావు. నువ్వు తనలాగే ఆ ఇంటితో సంబంధం కలుపుకుంటే ఆ ఆస్థంతా మన కుటుంబానికే వుంటుందన్న ఆలోచన నీ అక్కకి రాదు. అలాగే జామపండులా వున్న వాడిని చేసుకుంటే వాడి అందంతో పాటుగా, ఆస్థి కూడా దక్కుతుందన్న ఆలోచన నీకు రాదు." కోపంగా అంది మంగవేణి.

"నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు బోధపడడం లేదు మామ్." తల్ల్లి ఏమి చెప్పదలుచుకుందో బోధపడుతూనే వున్నా, బోధపడనట్టుగా అంది తనూజ.

" చెప్పాగా నీ అంతటా నీకుగా ఆ ఆలోచన ఎప్పటికీ రాదు. నువ్వు ఆ మదన్ గాడికి పెళ్లానివై ఆ ఇంట్లోనే సెటిల్ అయితే ఎంత బావుంటుందో ఆలోచించు. మనకెంత లాభం?" ఆశగా అంది మంగవేణి.

"బావ మీద నాకలాంటి ఆలోచన లేదు మామ్. నేను ఆలా ఆలోచించలేను." చిరాగ్గా అంది తనూజ.

"నువ్వు ఆలా ఆలోచించే తీరాలి. ఎలాగోలా వాడిని రూట్లో పెట్టి నీ మొగుడిని చేసుకోగలను అంటేనే నిన్ను అక్కడికి పంపిస్తాను. లేకపోతే నువ్వక్కడికి వెళ్లడం కుదరదు." ఖండితంగా చెప్పేసింది మంగవేణి.

'నీ అవసరం ఇప్పుడు చాలా వుంది. దయచేసి రా.' ఫోన్ లో ప్రాధేయపూర్వకంగా అడిగిన మదన్ గొంతు తనకి గుర్తుంది. అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ తన ఇంటికి వచ్చిందని, ఏదో మానసిక సమస్య తో బాధపడుతోందని మాత్రమే చెప్పాడు. తనకి చాలా సందర్భాల్లో సాయం చేయడం మాత్రమే కాకుండా, మదన్ తనకి మంచి ఫ్రెండ్ కూడా. తనంతగా అడిగిన తరువాత వెళ్లి సాయం చెయ్యకుండా వుండలేదు. కాకపోతే తల్లి చెప్పినదానికి ఒప్పుకోకపోతే తనని వెళ్లనిచ్చేలా కనిపించడం లేదు.

"ఒకే మామ్. నీ మాట ఎప్పుడు కాదన్నాను? అలాగే చేస్తాలే." తను అంది అయిష్టత మోహంలో కనిపించకుండా.

"నువ్వేదో వెళ్ళేనమ్మా, వచ్చేనమ్మా అన్నట్టుగా ఉంటే కాదు. వాడిని లైన్లో పెట్టి  సమయం రాగానే  ఆ కాస్త పని అవ్వనిచ్చెయ్యాలి. వాడికి ఆ తోట అంటే చచ్చేంత ఇష్టం. నువ్వూ ఆ తోటలోకి వాడితోటె వెళ్లి, నెమ్మదిగా ఆ ఫామ్ హౌస్ లోకి తీసుకు వెళ్ళు. అప్పుడు వాడికి చిన్న ముద్దో, కౌగిలో ఇచ్చావంటే, తరువాత వాడే చూసుకుంటాడు. నీలాంటి అందమైన ఆడపిల్ల కావాలని మీదకొస్తే ఏ మగాడు వద్దంటాడు?"

తల్లి చెప్తూన్న మాటలకి మనసంతా సిగ్గుతో నిండిపోతూంటే అలాగే వింటూ వుంది తనూజ.

"ఇంతకీ ఇప్పుడు నిన్నింత ప్రత్యేకంగా రమ్మనడానికి కారణం ఏమిటి?"

"చెప్పలేదు మామ్, ఎదో నన్ను చూడాలని వుంది రమ్మన్నాడు అంతే." అక్కడకి వచ్చిన మదన్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తే ఎలా ఫీలవుతుందో ఊహించుకుంటూ అంది తనూజ.

"నువ్వెంత అందంగా ఉంటావో వాడికి తెలుసును కదా. అవకాశం చూసుకుని ఒక పట్టు పడదామనే రమ్మని ఉంటాడు." ఆనందంతో నిండిపోయింది మంగవేణి మొహం. "నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. వాడంతటి వాడుగా నువ్వు కావాలని వస్తే పర్లేదు. లేకపోతే నువ్వే ముందడుగు వేసి అది అయిపోయిందనిపించాలి. ఒకసారి రుచి మరిగిస్తే రెండోసారి నువ్వేమీ చెయ్యక్కర్లేదు. రక్తం మరిగిన పులిలా వాడే నీ దగ్గరికి వస్తాడు. అదృష్టం బాగుంటే వేగంగా కడుపు కూడా వచ్చేస్తుంది."

"ఒకే మామ్" అసహ్యం మోహంలో కనిపించకుండా ప్రయత్నం చేస్తూ అంది తనూజ. "కానీ ఆ చిట్టిరాణి వేరే ఎవళ్ళనైనా అసలు చేసుకోనిస్తుందా ఆ మదన్ ని?"

"ఇన్ని రోజులుగా ఆలా వెంటపడుతూంది, కనీసం ఒక్కసారైనా తనని చేసుకుంటాను అన్నాడా ఆ మదన్? ఏ మగాడికి అయినా కావాల్సింది నీలాంటి అప్సరస. దేవుడి దయవల్ల నన్ను, నీ అక్కని మించిపోయి వున్నావు అందంలో నువ్వు. నువ్వు ఆ చిట్టిరాణి గురించి ఏమీ ఆలోచించకుండా మదన్ నీతో కమిట్ అయ్యేలా చూడు."

"సరే అలాగే అయితే."

ఆ తరువాత కూడా మళ్ళీ మళ్ళీ తను ఇక్కడికి వచ్చేక ఏం చెయ్యాలో చెప్పకుండా ఊరుకోలేదు మంగవేణి. తన తల్లికి ఆస్తులు పాస్తులు అంటే వున్న మమకారం తనూజకి తెలుసు. తన తండ్రి గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు టీచర్ గా చేస్తూ చనిపోయాడు. అందువల్ల పెన్షన్ బాగానే వస్తుంది. అంతే కాకుండా తండ్రివైపునుంచి తమకి కొన్ని ఆస్తులు కూడా వచ్చాయి. వాటితో పాటుగా మంగవేణికి చాలా పొగరు కూడా వచ్చింది కానీ, తృప్తి మాత్రం రాలేదు. తనూజని నెమ్మదిగా మదన్ కి పెళ్ళాంగా చేసేస్తే ఆ ఇంటికి సంభందించిన ఆస్థి అంతా తన కూతుళ్ళ గుప్పెట్లోనే ఉంటుందన్న ఆలోచన మంగవేణికి ఇటీవలే వచ్చింది.

చిన్నతనం లో తను తన తల్లి చేసేదంతా ఇంకా ఆలోచించే విధానం కరక్ట్ అనే అనుకునేది తనూజ. తల్లిలాగే పొగరుగా ప్రవర్తించేది. అందుకనే వంశీని ఆలా అవమానించింది. కానీ చదువుతోపాటుగా తనలో ఆలోచనా శక్తీ పెరిగింది. తనెంత పొరపాటుగా వంశీతో బిహేవ్ చేసిందో బోధపడింది. తన పొరపాటు ప్రవర్తనకి తనకి సారీ చెప్పాలనుకుంది. చెప్పేసింది కూడా. వంశీ మంచివాడు కాబట్టి తనమీద కోపం వుంచుకోలేదు, వెంటనే తన సారీ ని యాక్సెప్ట్ చేసాడు.  

కానీ తన మనసు అంతటితో ఊరుకోవడం లేదు. ఈ అలజడి నిజానికి తనలో మార్పు ప్రారంభమైన దగ్గరనుండి మొదలైంది. ఆ అలజడి తనకి తెలుస్తూన్న దగ్గరనుండి కూడా మనసుకి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూనే వుంది, వంశీ వైపు ఆకర్షించబడ్డం అంత మంచిది కాదని. అది కేవలం ఆకర్షణ మాత్రమే అయితే మనసు వినేదేమో. కానీ అది అంత కన్నా పెద్ద ఫీలింగ్ అని తనకి అర్ధం అవుతూంది.

డబ్బు, చదువు ఇంకా స్టేటస్ ఇవి మూడూ లేక పోయినా వంశీ అందగాడు, చాలా నిష్కల్మషమైన మనిషి. వంశీని పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదు. కానీ చదువు, స్టేటస్ ఇవి రెండూ లేకపోయినా పర్వాలేదు కానీ డబ్బు లేకపోతే మాత్రం తన తల్లి వంశీ తో తన పెళ్లికి ఒప్పుకోదు. ఎంత తన తల్లి తీరు అసంబద్ధం గా వున్నా తల్లిని బాధపెట్టి వంశీని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు. ఎంతగా డబ్బు కావాలనే అనుకున్నా తన తల్లి అది తన కూతుళ్లిద్దరూ సంతోషంగా ఉండడానికే కావాలనుకుంది కానీ తనకోసం కాదు. తమ తండ్రి పోయిన తరువాత తన కూతుళ్ళనిద్దరినీ తన గురించి ఆలోచించుకోకుండా చాలా ప్రేమగా పెంచి పెద్ద చేసింది.

ఎంతగా ట్రై చేసినా వంశీ వైపు ఆకర్షించబడకుండా ఉండడం, ప్రేమించకుండా ఉండడం తనవల్ల కానీ పనులని తనూజకి అర్ధం అయిపోయింది. సుస్మిత ఇచ్చిన సలహానే చాలా బాగుందనిపిస్తూంది. ఎస్, వంశీకి తన మనసులో మాట చెప్పెయ్యాలి. వాడు తనని వాడంతటా వాడుగా ప్రేమిస్తే పర్లేదు లేకపోతే తనతో వాడు ప్రేమలో పడేలా చెయ్యాలి. ఆలా ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసరికి మనసుకి ప్రశాంతంగా అనిపించింది. తనకి తెలీకుండానే నిద్రలోకి జారిపోయింది. 

&&&

మళ్ళీ తెలివి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. వెంటనే లేచి తెమిలి పొలంలోకి వెళ్లే కార్యక్రమం పెట్టుకుంది. ఈ సారి పెద్దగా వెతక్కుండానే వంశీ కనిపించాడు పొలంలో.

"ఏంటి మళ్ళీ వచ్చావు?" చిరునవ్వుతో మొహంలోకి చూస్తూ అడిగాడు వంశీ.

"మర్చిపోయావా, ఈ రోజు మళ్ళీ రమ్మన్నావు, పొలాలన్నీ ఈ రోజు చూద్దామన్నావు కదా." చిరుకోపంతో అంది తనూజ.

"ఆలా అన్నానా, నాకు గుర్తే లేదు." కొంటెగా చూస్తూ అన్నాడు వంశీ.

"కానీ నాకు గుర్తు వుంది." ఇంకా అదే చిరుకోపంతో అంది.

"సరేకానీ, ఇంత సాయంత్రం అయిపోయాక వస్తే ఎలా? త్వరలో చీకటిపడిపోతుంది. రేపు కొంచెం వెలుగుండగా రా అలాగే చూద్దాం. నేను చెప్పాగా ఒకరోజు పూర్తిగా కేటాయించాలి మీ బావ పొలాలన్నీ చూడాలంటె." తను అలా చెప్పాక కూడా ఇంకా తన మొహంలోకి చూస్తూ వున్న తనూజని చూస్తూ అన్నాడు మళ్ళీ "ఇంక ఈ రోజుకి ఏవీ చూడడం వీలు కాదు. ఈ రోజుకి వెళ్ళిపోయి రేపురా. బాగా చీకటి పడేవరకూ ఇక్కడే వున్నావంటే ఆ సుస్మితకి కనిపించినట్టే ఆ చిట్టిరాణి నీకూ కనిపించగలదు." చిరునవ్వు నవ్వాడు.

ఏమీ మాట్లాడకుండా అలాగే వంశీ మొహంలోకి చూస్తూ నిలబడింది తనూజ.

"నువ్వు అడ్డు తప్పుకుంటే నేను ఫామ్ హౌస్ లోకి వెళ్ళాలి. అక్కడ ఎరువులు అవీ చూసుకుని, కొన్ని లెక్కలు రాసుకోవాలి."

"నేనూ నీతో వస్తాను." అని, ఆ నారో గా వున్న పొలంగట్టు మీద వంశీ నడవడానికి దారి ఇచ్చి, వంశీ వెనకాతలే నడవడం మొదలు పెట్టింది. అక్కడనుండి ఫామ్ హౌస్ లోకి వెళ్ళడానికి ఒక పదినిమిషాల వరకూ పట్టింది. వంశీ తలుపులు తీసి ఇద్దరూ ఫామ్ హౌస్ లోకి ప్రవేశించేవరకూ కూడా తనూజ ఏమీ మాట్లాడలేదు.

"నేనూ సుస్మిత ఈ రోజు ఈ ఫామ్ హౌస్ లోకి వచ్చాం. చాలా సేపు కూచుని మాట్లాడుకున్నాం."

"మంచి కాలక్షేపం మీ ఇద్దరికీ కూడా."

"మనమంతా కలిసి ఈ ఫామ్ హౌస్ లో ఎలా ఎంజాయ్ చేసామో సుస్మిత కి చెప్పాను. మనమలా  ఎంజాయ్ చేసామంటే సుస్మిత నమ్మలేదు." 

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)