Aa Voori Pakkane Oka eru - 22 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 22

Featured Books
Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 22

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

తనూజ అక్కడికి వచ్చి ఇరవై రోజులు గడిచిపోయాయి. సుస్మితతో మదన్ పడుతూన్న బాధ చూడలేకపోతూ వుంది. రక రకాలుగా బిహేవ్ చేస్తూ వుంది సుస్మిత. కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేకలు పెడుతుంది. మదన్ ని గట్టిగా కొరకడం, గిల్లడం, కొట్టడం లాంటివి చేస్తుంది. ఏ కారణం లేకుండానే పెద్దగా నవ్వుత్తూ అలాగే సడన్ గా ఏడుస్తూ ఉంటుంది. సుస్మితని అలా చూస్తూ, తన చేతుల్లో టార్చర్ భరిస్తూ, కాలం చాలా కష్టంగా గడుస్తూంది మదన్ కి.

 "చెప్పానుగా బావా, ఒక్క హిప్నోటిక్ సెషన్ తో ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ కాదు. మూడు నాలుగు  హిప్నోటిక్ సెషన్లన్నాకావాలి పూర్తి రిజల్ట్ కావాలంటే." సుస్మిత చేతుల్లో అలా మదన్ టార్చర్ అనుభవిస్తూంటే, మదన్ మొహంలోకి సూటిగా చూడలేక తలతిప్పుకుని అంది తనూజ.

"కానీ ఆ రోజు చెప్పావు తనలో స్ప్లిట్ పెర్సనాలిటీ డిస్ట్రాయ్ అయిపోయిందని, ఇంక ఏ ప్రాబ్లెమ్ ఉండదని." మదన్ కోపంగా అన్నాడు.

"నేను పొరపాటుగా అలా అనుకున్నాను బావా. నువ్వేం కంగారు పడకు. తనలో ఆ స్ప్లిట్ పెర్సనాలిటీని పూర్తిగా డిస్ట్రాయ్ చేసే పూచీ నాది." కష్టం మీద మదన్ మొహంలోకి చూస్తూ అంది.

"ఇంక నిన్ను నమ్ముకుంటే నాకన్నా మూర్ఖుడు మరొకడు ఉండదు. వంశీ చెప్తూన్నదే నిజం అనిపిస్తూంది." అలా అన్నాక కోపంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు మదన్. మదన్ తనూజని ఎందుకు మళ్ళీ సుస్మితకి హిప్నోథెరపీ చెయ్యలేదు అని అడగలేదు. ఎందుకంటే సుస్మిత చాలా రెబెలియస్ గా ఉంటూంది. తనని మునపట్లా హిప్నోసిస్ లోకి పంపి సజెషన్స్ ఇవ్వడం సాధ్యం కాదని మదన్ కి అర్ధం అయిపొయింది.

చేసేది లేక విచారంగా బాత్రూం లోకి వెళ్ళింది తనూజ స్నానం చెయ్యడానికి. స్నానం చేస్తూన్నాకూడా చాలా అన్యమనస్కంగానే వుంది. వంశీతో తన పెళ్లి జరిపించడానికి తన ఆస్తిలో సగం వంశీ పేరుమీద రాసేసాడు మదన్. అలాంటి మదన్ గురించి తనేమీ చెయ్యలేకపోతూవుంది.

నగ్నంగా వున్నతన దేహాన్ని సబ్బుతో రుద్దుకుంటూ, రకరకాలుగా ఆలోచిస్తూ స్నానం చేస్తూంది తనూజ. మనసేం బాగోలేక, అలా పబ్లిక్ అయి తల్లికూడా తన పెళ్ళికి అంగీకరించినా కూడా వంశీని కలిసి ఎంజాయ్ చెయ్యడం లేదు తనూజ. వంశీ పరిస్థితి కూడా అలాగే వుంది. తన బెస్ట్ ఫ్రెండ్ అలా బాధపడుతూ ఉంటే తను మాత్రం ఎలా ఆనందంగా వుండగలడు? ఈ మదన్ సుస్మితల సమస్య పూర్తిగా సాల్వ్ అయ్యేవరకూ తామిద్దరూ వాళ్ళగురించి తప్ప ఇంకే విషయంగురించి ఆలోచించలేరు.

అలా ఆలోచిస్తూన్న తనూజకి కరంట్ షాక్ కొట్టినట్టుగా ఒక్క విషయం గుర్తుకు వచ్చింది. ఈ రోజుకి పదిహేను రోజుల కిందటే తన  పీరియడ్స్ డ్యూ. తను ఆ విషయంలో ఎప్పుడూ  చాలా రెగ్యులర్. ఎదో అప్పుడప్పుడూ ఒకటి రెండు రోజులు అటూ ఇటూ తప్ప, తన  పీరియడ్స్ ఇంతకాలం ఎప్పుడూ మిస్సవ్వలేదు. దీనికర్ధం ఒక్కటే. తను ప్రెగ్నన్ట్! కాసేపు మెదడు మొద్దుబారినట్టుగా అయి ఏమీ ఆలోచించలేకపోయింది. 

తను చదువుకుంది, తెలివైనది, అలా విచ్చలవిడిగా వంశీతో శృంగారం చేస్తూన్నప్పుడూ కడుపువచ్చే అవకాశం ఉందని ఎందుకు ఆలోచించ లేకపోయింది? తమ పెళ్ళికి అందరి ఆమోదం వున్నా, మదన్ సుస్మితల విషయంలో అంతా ఇంత కలతగా వున్నప్పడు తమ పెళ్లి చేసేమని ఎలా అడగగలదు? అంతే కాకుండా పెళ్లి కాకుండా కడుపు అంటే, ముఖ్యంగా ఆ పల్లెటూళ్ళో చాలా పరువు తక్కువ విషయం. 

మరి అబార్షన్. నో, తన పొట్టమీద మురిపంగా కుడిచేతిని పెట్టి అనుకుంది. 'ఆ సమస్యే లేదు.' జస్ట్ సెకండ్స్ అయింది విషయం తెలిసి. ఈ కాస్త సమయంలోనే తన  బిడ్డమీద పుట్టకుండానే ఎంతో మమకారం కలుగుతూ వుంది. తను ఎంతగానో ప్రేమించే వంశీకి ప్రతిరూపం. తను ఎన్నిఅవమానాలనన్న భరిస్తుంది కానీ తన బిడ్డకి మాత్రం ఏ అపకారం జరగనివ్వదు.

"మదన్ సమస్య పూర్తిగా తీరేవరకూ నాకీ విషయం మీద మూడ్ రాదు."

తనూజ వచ్చి పిలవగానే ఫామ్ హౌస్ లోకి వచ్చాడు వంశీ. వచ్చి రాగానే తన రెండు బుగ్గల మీద ముద్దు పెట్టి అన్నాడు.

"రాస్కల్, నేనిప్పుడు వచ్చింది నా తమకం తీర్చుకోవడానికి కాదు. నీకొక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని వచ్చాను." వంశీ కౌగిలి విడిపించుకుని కోపంగా అంది తనూజ.

"సరే అదేమిటో చెప్పు." తనూజ మొహంలోకి ఆసక్తిగా చూస్తూ అన్నాడు వంశీ.

దీర్ఘంగా నిట్టూర్చి అంది తనూజ. "నువ్వు నాన్నవి కాబోతున్నావు. నేనిప్పుడు ప్రెగ్నన్ట్ ని."

"ఏమిటి?" కరంట్ షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడ్డాడు వంశీ.

"ఎందుకంత ఆశ్చర్యం! కడుపు రావడానికి ఒక్కసారి కలిస్తే చాలు. అలాంటిది మూడు సార్లు ఎలా కావాలో అలా ఎంజాయ్ చేసాం." నిజానికి మొదటి సారి కలవగానే తనకి కడుపు వచ్చేసి ఉంటుంది. సమయాన్ని సరిగ్గా అంచనా వేసి చూస్తే అలాగే అనిపిస్తూంది.

"కానీ మనకింకా పెళ్ళికాలేదు. పెళ్లికాకుండానే కడుపైతే ఎలా?"

"మనిద్దరం ఒకళ్ళతోఒకళ్ళం తమకం తీర్చుకునేప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇప్పుడాలోచిస్తే ఎలా? సెక్స్ చేసాక కడుపు వచ్చే అవకాశం అయితే వుంది కదా."

"నేను ఆలోచించాల్సింది. చాలా పెద్ద పొరపాటు చేసాను." విచారంగా అన్నాడు వంశీ.

"నేను నిన్ను బాధపెట్టాలని వచ్చి ఇలా చెప్పలేదు. నువ్వు నాన్నవి కాబోతున్నావని చెప్పి సంతోషపెడదామని వచ్చాను."

"ఇది మంచివార్తే. కానీ....."

"మనం భార్యాభర్తలం కాబోతున్నాం. కాబట్టి ఇది మరీ అంత గాభరా పడాల్సిన విషయమేమీ కాదు. ఇక అంతానేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా వుండు." వంశీని కౌగలించుకుని రెండు బుగ్గల మీద ముద్దుపెట్టక విడిచిపెట్టి అంది. "ఇక నేను వెళ్తున్నాను. నేను సుస్మిత తోనే ఉండాలి."

"నేనూ నీకూడా వస్తాను. నువ్వొక్కర్తివే వెళ్లడం నాకిష్టంలేదు." సడన్ గా తనూజ అంటే ప్రేమ ఇంకా ఎక్కువ అయిపోయింది వంశీలో.

"డోంట్ బి సిల్లీ. ఈ కాస్త దూరానికి నాకు ఏమీ అయిపోదు. బై." అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది తనూజ.

తను తండ్రి కోబోతున్నాడన్న విషయం ఎంతో ఆనందం కలిగిస్తూవున్నా, పెళ్లి కాకుండానే వచ్చిన ఆ కడుపుకి ఆందోళనగానే వుంది వంశీకి. అన్యమనస్కంగానే ఫామ్ హౌస్ లాక్ చేసి పొలంలోకి వెళ్ళాడు.

&&&

"ఇంకా పదిరోజుల్లో సుస్మితకి ఇరవై రెండేళ్లు నిండిపోతాయి. విల్లు లో కండిషన్ ప్రకారంగా కూడా తను ఇరవై రెండేళ్లు దాటాక పెళ్లి చేసుకోవచ్చు. అందుకని మీ ఇద్దరికీ ఈ పదిరోజులు పూర్తి అవగానే పెళ్లి చేసేద్దామనుకుంటున్నాం." మదన్ ని సుస్మితని హాల్ లోకి రప్పించి ఇంకా అందరు కుటుంబ సభ్యులు అసెంబుల్ అవ్వగానే చెప్పాడు ముకుందం.

"తన సమస్య పూర్తిగా తీరేవరకూ ఆగుదాం. ఇప్పుడే పెళ్ళికి ఏమి తొందర వచ్చింది?" మదన్ అన్నాడు.

"ఈ పెళ్లి అయిపోవడం అన్నివిధాలుగానూ మంచిది కూడా కదా బావ. అప్పుడు తనకి ఆస్తి మీద పూర్తి హక్కులు వచ్చేస్తాయి. ఇంకా తన మామయ్య నుంచి సమస్య కూడా ఏమీ ఉండదు." తనూజ అంది.

"తను మన దగ్గర ఉండగా ఎవరూ ఏమీ చెయ్యలేరు. కాబట్టి ఆలా భయపడాల్సిన అవసరం లేదు." మదన్ అన్నాడు.

"కేవలం అందుగురించి అనే కాదు మదన్. తను పెళ్లి కాకుండా ఇలా మన ఇంట్లో ఉండడం మంచిదికాదు. లోకానికి కూడా మనం సమాధానం చెప్పాలికదా. అందుకని ఈ పదిరోజులు దాటగానే మీ పెళ్లి సాధ్యమైనంత తొందరగా జరిగిపోవాలి." వనజ అంది.

"అయితే మీ ఇష్టం. నేను చెప్పేదేమీ లేదు." మదన్ అన్నాడు. సడన్ గా మదన్ హృదయం ఆనందం తో నిండి పోయింది సుస్మితతో పెళ్లి అంటే.

"ఇంకా నీ అభిప్రాయం ఏమిటి?" సుస్మిత మొహంలోకి చూస్తూ అడిగింది వనజ.

"మీ అందరి ఇష్టమే నా ఇష్టం." సుస్మిత బుగ్గలు ఎరుపెక్కి పోయాయి సిగ్గుతో. కానీ ఆ మోహంలో ఎదో అనీజీనెస్ కనిపిస్తూనే వుంది.

"ఇక్కడ ఒక విషయం చెప్పాలి." సడన్ గా అంది తనూజ. "సుస్మిత, మదన్ ల పెళ్ళితోపాటే నాకు, వంశీకి కూడా పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి."

"నీ పెళ్ళికి తొందరేమిటి?" చిరాగ్గా అన్నాడు ముకుందం. "సుస్మిత, మదన్ ల పెళ్లి అయిపోయాక నీ పెళ్లిగురించి ఆలోచించొచ్చు. రెండు పెళ్లిళ్లు ఒకేసారి అంటే కష్టం."

"కానీ లేట్ చేస్తే చిన్న బాబునో, పాపనో ఒళ్ళో పెట్టుకుని పెళ్ళిపీటల మీద కూచోవడం నాకు కష్టంగా ఉంటుంది."

"అంటే దానర్ధం ఏమిటి?" అర్ధం అయినా షాక్ తో అడిగాడు ముకుందం.

"నేనిప్పుడు ప్రేగ్నన్ట్ ని. ఇంకొద్ది రోజుల్లో......"

"సిగ్గులేదూ ఈ మాట చెప్పడానికి? పెళ్ళికాకుండా కడుపు తెచ్చుకోవడం తప్పని నీకు తెలీదు?" అరిచాడు ముకుందం.

"ఆ విషయం నాకు తెలుసు. కానీ నాలో వున్నా బేబీ మేకింగ్ మెకానిజం కి తెలియదు కదా." అన్నాక అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది తనూజ.

"ఎదో చిన్నపిల్లలు. మనం ఒప్పుకుంటామన్న ధీమాతో తొందర పడ్డారు. దీనికి పెద్ద రాద్ధాంతం చెయ్యడం కన్నా రెండు పెళ్లిళ్లు ఒకేసారి  జరిపించేయడం మంచిది." వనజ అంది. వనజకి తనూజ చెప్పింది షాకింగ్గానే వుంది. తనకి కడుపొచ్చిన విషయం ఇప్పటివరకూ తనకీ తెలియదు. ఏదో తొందర పడ్డా జాగ్రత్తలు తీసుకున్నారేమో అనుకుంటూంది

"అంతకన్నా చెయ్యగలిగింది ఏముంది? నేను పొలంలోకి వెళుతున్నాను." ముకుందం లేచి వెళ్ళిపోయాడు అక్కడనుండి. తరువాత వంశీ, మదన్ ముకుందం వెనకాతలే పొలంలోకి వెళ్తే వనజ, మంగవేణి వంటింట్లోకి వెళ్లారు.

"నీ రెండో కూతురికి కడుపు. విన్నావా?" వంటింట్లోకి వచ్చాక పని మొదలుపెట్టి, తల్లి మొహంలోకి చిరాగ్గా చూస్తూ అడిగింది వనజ

"కొద్దీ రోజుల్లో ఎలాగు పెళ్లి చేసుకోబోతున్నారుకదా. కంగారు దేనికి?" అంత నిబ్బరంగా అన్న తన మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూన్న వనజ తో అంది మంగవేణి "నాకిది అర్ధం కావడం లేదు. విల్లు ఏమిటి, ఇరవై రెండేళ్లు దాటాక పెళ్లేమిటి, మామయ్యనుండి సమస్య ఏమిటి? ఈ సుస్మిత విషయం నాకంతా అయోమయంగా వుంది." వంటిట్లో పనిలో వనజకి హెల్ప్ చేస్తూ అంది మంగవేణి.

"నీకు ఆ అమ్మాయి విషయం పూర్తిగా చెప్పేస్తే ఈ అయోమయం ఉండదు." తల్లి తేలిక ధోరణికి దీర్ఘంగా నిట్టూర్చి, అలాగా రకరకాలుగా పనిచేస్తూనే సుస్మిత విషయం అంతా విడమరిచి చెప్పింది మంగవేణి కి వనజ.

"ఏమో అనుకున్నాను. మదన్ మంచి తెలివైన వాడు. అందగత్తె మాత్రమే కాదు మంచి డబ్బున్న అమ్మాయిని పట్టెడన్న మాట." ఆశ్చర్య పడుతూ అంది మంగవేణి అంతా విన్నాక.

"మదన్ డబ్బు మనిషి కాదు. అలాగ డబ్బు మనిషే అయితే తన సగం ఆస్తిని వంశీ పేరుమీద ఎందుకు రాస్తాడు చెప్పు?" వనజ అడిగింది.

"నువ్వన్నది నిజమే." తలూపి అంగీకరించింది మంగవేణి. "మదన్ వల్ల నా కూతురిని ఒక బికారికి ఇచ్చి చేయడంలేదు. నాకు సంతోషంగానే వుంది."

"డబ్బు ఉండడం కన్నా కూడా మంచితనం ఉండడం ఎక్కువ అవసరం. ఆ మంచితనం వంశీ దగ్గర పుష్కలంగా వుంది. అందుకు నువ్వు ఎక్కువ ఆనందించాలి."

"సరే అయితే." మంగవేణి తలూపింది. "త్వరలోనే మనమీద పెద్ద భారం పడబోతూవుంది. రెండు పెళ్లిళ్లు ఒక్కసారి చెయ్యాలి కదా."

"అందులో సందేహమేమిటి?" నవ్వింది వనజ.

&&&

తన గదిలో  బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటూన్నతనూజ, సుస్మిత తన గదిలోకి రావడం చూసి లేచి కూచుంది.

"కాబోయే పెళ్లి కూతురివి. నువ్వు చాలా ఆనందంగా ఉండాలి, నాలా. ఇలా విచారంగా వున్నావేమిటి?" చిరునవ్వుతో అడిగింది సుస్మితని చెయ్యి పట్టుకుని తన పక్కన కూచో పెట్టుకుంటూ.

"నీకు తెలీదా నేనెందుకు విచారంగా ఉన్నానో?" తనూజ మొహంలోకి ఆందోళనతో చూస్తూ అంది సుస్మిత. "ఆ చిట్టిరాణి మదన్ మీద అలా పగబట్టి వుంది. తనని నానా రకాలుగా బాధపెడితేనే కానీ తనకి తృప్తి ఉండదు."

"అందుకని నువ్విప్పుడు ఆనందంగా ఉండడం మానేస్తావా? ఆ సమస్య ఎలాగోలాగ సాల్వ్ అవుతుంది కానీ నువ్వు విచారపడడం ఆపు." సుస్మిత భుజాలచుట్టూ కుడిచెయ్యివేసి దగ్గరికి తీసుకుంటూ అంది తనూజ.

"ఎలాగా ఆనందంగా ఉండగలను? నీకంతా చెప్పాను కదా, నువ్వప్పుడు చిట్టిరాణి ని చూసివుంటే తనెంత కసితో రగిలిపోతూందో నీకర్ధం అయివుండేది. తనిప్పుడు మదన్ ని ఎలాగు పెళ్లి చేసుకోలేదు. అందువల్ల తనని బాగా బాధ పెడితే తప్ప తనకిప్పుడు కసితీరదు." కంగారుగా అంది సుస్మిత. "ఒక సమస్య నుండి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను అనుకున్నాను. కానీ ఇంకో సమస్యలో ఇరుక్కుంటున్నాను అనుకోలేదు. నేను బాధపడుతున్నాను అన్నదానికన్నా కూడా మదన్ అలా సఫర్ అవడం నేను చూడలేకపోతున్నాను."

"దేముడి మీద భారం వేసి నువ్వు ధైర్యంగా వుండు. అన్ని సమస్యలు తీరిపోతాయి." తనూజ అంది. "అదిసరే. నీకు ఇరవై రెండేళ్లు నిండి పెళ్లికాగానే నీ తండ్రి ఆస్తి మీద సర్వ హక్కులు వచ్చేస్తాయి కదా."

"మా డాడ్ రాసిన విల్లులో అలాగే వుంది. అంతేకాదు మా వంశంలో అందరు తండ్రులు అలాగే విల్లులు రాశారు." చిన్న చిరునవ్వు నవ్వింది సుస్మిత.

"నీ ఆస్థి అంతా నీ చేతికి రాగానే నువ్వేం చేద్దామనుకుంటున్నావు?"

"అది మదన్ పేరుమీద రాసేస్తాను." నవ్వింది సుస్మిత. "నేనలాగా మాత్రమే పూర్తి సేఫ్ గా ఉండగలను. అంతేకాదు నేనలా మదన్ పేరుమీద ఆస్తి రాసేసానని అందరికి చాటి చెప్తాను. అప్పుడు మా మామయ్య వాళ్లకి స్పష్టంగా అర్ధం అవుతుంది, నన్నేమైనా చేసిన వాళ్ళకి వచ్చేదేమీ ఉండదని."

"చాలా తెలివైన దానివి నువ్వు." తనూజ నవ్వింది. "నువ్వు చెప్పినట్టుగా అలా చేస్తే నీ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండదు."

"సరే అయితే. నేను వెళ్లి కాస్సేపు విశ్రాంతి తీసుకుంటాను." అని వెనక్కి తిరిగి అక్కడనుండి వెళ్ళబోతూ ఎదో గుర్తుకువచ్చినట్టుగా సడన్ గా ఆగి తనూజ మొహంలోకి చూసింది. "మరిచే పోయాను. కంగ్రాట్యులేషన్స్! అమ్మవు కాబోతున్నందుకు."

"ఇంకా నువ్వు నన్ను తిడతావేమోనని భయపడుతున్నాను, పెళ్లికాకుండానే కడుపు తెచ్చుకున్నందుకు." బుగ్గలు రెండూ సిగ్గుతో ఎర్రబడిపోతూ ఉంటే అంది తనూజ.

తనూజ దగ్గరిగా వచ్చి, తన భుజాల చుట్టూ రెండు చేతులు వేసి తన కుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది సుస్మిత. "పెళ్ళికాకుండా అయినా, పెళ్లయ్యాక అయినా అమ్మ అమ్మే కదా. అందులోనూ మీరిద్దరూ త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు కాబట్టి అసలు విచారించాల్సిన అవసరం ఏమీ లేదు."

"సరే  అయితే" చిరునవ్వుతో అంది తనూజ.

"నేను వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. మనిద్దరం మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం." అనిచెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది సుస్మిత.

&&&

సాయంత్రం అవుతూండగా తోటలో ఆరోజు చిట్టిరాణిని చూసిన చోటుకి వెళ్ళింది సుస్మిత. అప్పుడు అక్కడ నాగరాజు కూడా వున్నాడు.

"నేను చిట్టిరాణిని కలవాలి" నాగరాజు మొహంలోకి బెరుగ్గా చూస్తూ అంది సుస్మిత.

"తనేం నీ బానిసకాదు నువ్వు కలవాలనుకున్నప్పుడల్లా కలవడానికి." నాగరాజు కోపంగా అన్నాడు.

"తనే నన్నిప్పుడు ఇక్కడకి రమ్మనమని చెప్పింది."

"విషయంలో వేగం లేదు. సమయం దగ్గర పడుతూంది. తను చెప్పినట్టుగా నువ్వు చెయ్యకపోతే, తను చెప్పింది నీకు చేసి చూపిస్తుంది. ఇది చెప్పడానికే నిన్నిక్కడకి రమ్మంది. "

"చేస్తాను, నేను తను చెప్పినట్టుగానే చేస్తాను." వేగంగా అంది సుస్మిత.

"ముందు నువ్వు వెళ్ళు. చెప్పినట్టుగా చెయ్యి. చిట్టిరాణితో ఇంకిప్పుడు నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు నాటో మాట్లాడినిది అంతా చిట్టిరాణి వింటూంది."

అనుకోకుండా ఆ మామిడి చెట్టు పైకి చూసింది సుస్మిత. "నేను నా మదన్ ఆలా బాధ పడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. ఇప్పటివరకూ బాధపెట్టింది చాలదా? నీ మనసు కరగదా?" సుస్మిత అడిగింది.

"చిట్టిరాణి ఆలా నీళ్ళల్లో కొట్టుకుని పోతూవుంటే మదన్ మనసు కరిగిందా? ఛస్తే చచ్చిందని వదిలేలేదా? అలాగే ఇప్పుడు చిట్టిరాణి మనసు కూడా కరగదు. తను ఆరోజు నిన్ను అడిగినట్టుగా నువ్వు చేసి తీరాలి." కసిగా అన్నాడు నాగరాజు.

"మదన్ తననేమీ కావాలని నీళ్ళల్లోకి తోసేలేదు. తను పొరపాటున పెనుగులాటలో పడిపోయింది."

"తనని కాపాడే ప్రయత్నమేమన్నాచేశాడా అసలు?  తను ఆలా నీళ్ళల్లో పడిపోగానే తనకో సమస్య తీరిపోయిందన్నట్టుగా వెళ్ళిపోయాడు వెంటనే."

ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సుస్మిత.

"ఈ విషయంలో తను చెప్పినట్టుగా చెయ్యడం ఒకటే దారి. వాడు భోరుమని ఏడవాలి తను చేసినదానికి. కనీసం ఒక్కసారి. లేకపోతె పర్యవసానాలు గుర్తుంచుకో."

"అలాగే." తలూపింది సుస్మిత.

"ఇంకనువ్వెళ్లొచ్చు. ఇక్కడ సమయం వృధా చెయ్యడం దేనికి?"

"చిట్టిరాణి తనని కలవమని నన్ను అడిగింది."

"విషయంలో వేగం పెంచమని చెప్పడానికే. అది నేను చెప్పాను కదా. ఇంక వెళ్ళు."

వెనక్కి తిరిగి అక్కడనుండి వచ్చేసింది సుస్మిత.

&&&

"మనందరం భోజనాలకి కూచున్నాం. తనింకా రాలేదేమిటి?" డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూచున్నాక సుస్మిత ఒక్కత్తి లేకపోవడం చూసి ముకుందం అడిగాడు.

"తనకి తలనొప్పిగా ఉందని పడుకుంది. తను తరువాత భోజనం చేస్తుందిలే." మదన్ అన్నాడు భోజనానికి ఉపక్రమిస్తూ.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)