Aa Voori Pakkane Oka eru - 8 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 8

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 8

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

తను కూడా కుర్చీలోనుండి లేచి మదన్ పక్కన కూచున్నాక అంది తనూజ. "సారీ బావా. నీకు తెలుసుకదా నా వీక్నెస్. ఒక్కోసారి ఎదుట వాళ్ళ ఫీలింగ్ గురించి ఇంత కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తాను. ఐ యాం రియల్లీ సారీ." తనూజ తన కుడిభుజం మీద చెయ్యి వెయ్యగానే కళ్ళు తెరిచి ఆమె మొహంలోకి చూసాడు మదన్. "నువ్వు ఫోన్ లో తను సైకాలాజికల్ గా డిస్టర్బ్ అయింది నా హెల్ప్ కావాల్సి ఉంటుంది అని మాత్రమే చెప్పావు. నిజంగా నా హెల్ప్ పూర్తిగా కావాల్సి ఉంటే నాకు మొదటినుండి పూర్తి విషయాలు తెలియాలి."

తన భుజం మీద నుండి తనూజ చెయ్యి తొలగించి, బెడ్ మీద అడ్జస్ట్ అయి స్ట్రెయిట్ గా కూచున్నాడు. సుస్మిత తన ఇంటికి వచ్చిన దగ్గరనుండి మొదలు పెట్టాడు. చిట్టిరాణి నదిలో పడిపోయిందన్న విషయానికి రాగానే కరంట్ షాక్ కొట్టినట్టుగా బెడ్ మీదనుండి కిందకి దిగిపోయింది తనూజ.

"ఏమిటి బావా నువ్వంటున్నది? చిట్టిరాణి నదిలో పడిపోయిందా?" తనూజ మొహమంతా కూడా షాక్ తో నిండిపోయింది, గొంతు కొంచెం వణికింది.

"ఆ పెనుగులాటలో పొరపాటున నదిలో పడిపోయింది. అందులో నా తప్పేమీ లేదు." అనీజీ గా అన్నాడు మదన్.

"ఒక నిండు ప్రాణం నదిలో పడిపోతే అంత ఈజీగా ఆలా ఎలా అనగలుగుతున్నావు బావా? మరి తనని కాపాడే ప్రయత్నం నువ్వేమీ చెయ్యలేదా?" తనూజలో షాక్ ఇంకా అలాగే వుంది.

"నాకసలు ఈత రాదు. ఆ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తూవుంటుందో నీకు నేను చెప్పక్కర్లేదు. తనని ఎలా కాపాడే ప్రయత్నం చేయమంటావు?" మదన్ లో చిరాకు ఇంకా ఎక్కువ అయిపోయింది.

"అందుకని తనలా నీళ్ళల్లో కొట్టుకుని పోతూవుంటే చూస్తూ వూరుకున్నావా?" కోపంగా అడిగింది తనూజ.

"లేకపోతే ఆ భయంకరమైన ప్రవాహంలో నేనూ వురికి ప్రాణాలు పోగొట్టుకుని వుండాల్సిందా?" మదన్ కూడా కోప్పడిపోయాడు.

"ఒకేఒక్క విషయానికి సమాధానం చెప్పు బావా." మళ్ళీ సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అడిగింది తనూజ. "ఒకవేళ ఆ చిట్టిరాణి స్థానంలో నువ్వు ప్రాణంగా ప్రేమిస్తూన్న ఈ అమ్మాయే వుండివుంటే నువ్వలా వూరుకునేవాడివా?"

"నన్ను బాధ పెట్టడానికే కదా నువ్విక్కడకి వచ్చావు? నిన్నురమ్మనమని చెప్పి నేను పొరపాటు చేసాను." బెడ్ మీదనుండి కుర్చీలోకి మారి కళ్ళు మూసుకున్నాడు మదన్ విచారంతో.

కొన్ని నిమిషాలపాటు ఇద్దరికీ ఏమి మాట్లాడాలో బోధపడలేదు. "నిన్ను బాధపెట్టాలని కాదు. కానీ ఒక నిండు ప్రాణం ఆలా పోయిందంటే తట్టుకోలేకపోయాను. ఐ యాం సారీ." బెడ్ మీద ఎడ్జ్ లో మదన్ కి అపోజిట్ గా కూచున్నాక ఆ నిశబ్దాన్ని బ్రేక్ చేస్తూ అంది అంది తనూజ. "ఎనీహౌ ఆ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా వున్నారా? తను నదిలో ఆలా పడిపోవడం ఎవరైనా చూసారా?"

"ఎవరూ లేరు. తనలా పడిపోవడం ఎవరూ చూడలేదు." కళ్ళు తెరిచి తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్.

"ఎన్ని రోజులు అవుతూంది ఈ సంఘటన జరిగి?"

"ఒక వారం అలా అవుతూంది."

"ఎవరెవరికి ఈ విషయం తెలుసు?"

"నాకూ, సుస్మితకి ఇప్పుడు నీకూ తప్ప ఇంక ఎవ్వరికీ తెలియదు."

కాస్సేపు మళ్ళీ అక్కడ నిశబ్దం అలుముకుంది.

"ఆల్రైట్ బావా. ఇప్పుడు తక్కిన విషయం అంతా చెప్పు, ఏమి దాచకుండా." మదన్ చెప్పిన విషయానికి మానసికంగా అడ్జస్ట్ అయ్యాక అడిగింది తనూజ.

అప్పుడు సుస్మిత తనని ఎలా బ్లాక్మెయిల్ చేసిందీ చెప్పాడు మదన్.

"ఓహ్, బావా నిన్నలా బ్లాక్మెయిల్ చేసిందా?" పగలబడి నవ్వింది తనూజ. "అయినా నువ్వంత ప్రాణంలా ప్రేమిస్తూన్న అమ్మాయికి నిన్నలా బ్లాక్మెయిల్ చేసి ఆశ్రయం పొందాల్సిన అవసరం ఏమిటి?"

"అది నీకు తెలియాలంటే అంతకన్నా ముందు జరిగిన సంఘటన ఇంకొకటి నీకు తెలియాలి." అప్పుడు తను తామిద్దరూ కాలేజీలో చదువుకుంటూండగా, తను వెళ్లి సుస్మితని పలకరించడం, అప్పుడు సుస్మిత తనతో పొగరుగా మాట్లాడడం గురించి చెప్పాడు మదన్.

"వండర్ఫుల్! రెండు సందర్భాల్లోనూ నీతో ఎలా బిహేవ్ చెయ్యాలో అలానే చేసింది." మరోసారి పగలబడి నవ్వింది తనూజ. "ఇప్పుడు మరోప్రశ్న. అసలు ఇక్కడ అలా ఆశ్రయం పొందాల్సిన అవసరం తనకేం వచ్చింది?"

"నీకిప్పుడు పెద్ద కధే చెప్పాలి." అన్నాక సుస్మిత తండ్రి వింత విల్లు రాయడం గురించి, ఆమె తల్లితండ్రులు ఫ్లైట్ ఆక్సిడెంట్లో పోవడం గురించి, తరువాత ఆమె మామయ్య తనకి తన ఆస్తికి గార్డియన్ గా మారి ఇప్పుడు చంపాలనుకుంటూన్న విషయం గురించి వివరంగా చెప్పాడు.

"దట్ విల్ ఈజ్ స్ట్రేంజ్ బట్ నాట్ ది రెస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్." తనూజ అంది. "ఈ రోజుల్లో డబ్బుకోసం అలా చేసేవాళ్ళు చాలామందే వున్నారు. నిజం చెప్పాలంటే...." కాస్త ఆగి మళ్ళీ అంది "....తను రావాల్సిన చోటుకే వచ్చింది. ఇంక తనకి ఎలాంటి భయం ఉండదని నేను చెప్పగలను."

"యు ఆర్ అబ్సొల్యూట్లీ రైట్." తలూపాడు మదన్. "అసలు అలాంటి సంఘటన జరిగి ఉండకపోతే వుయ్ బోత్ ఆర్ ద హ్యాప్పీస్ట్ పీపుల్."

"ఇప్పుడు తక్కిన విషయం అంత చెప్పేయ్. అంతా పూర్తయ్యేదాకా నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను."

అప్పుడు మదన్ రెండు రోజులు తనూ, సుస్మిత తోటలోకి వెళ్లి అన్ని విషయాలూ మాట్లాడుకోవడం, తను రెండోరోజు తనని తోటలోనే విడిచిపెట్టి రావడం, తరువాత సుస్మిత చిట్టిరాణి ని చూశానని చెప్పడం అంత వివరంగా చెప్పాడు మదన్.

"నువ్వు చిట్టిరాణి గురించి అంతా తనకి వివరంగా చెప్పావు కదా?" మదన్ చెప్పడం అంతా పూర్తయ్యిందని కన్ఫర్మ్ అయ్యాక అడిగింది సుస్మిత.

"మామూలుగా అయితే అప్పుడే చెప్పేవాడిని కాదేమో. కానీ డైరీలో చదివేసింది కూడా కదా. అందుకనే తన గురించి మొత్తం చెప్పేసాను."

"అయినా ఇదేం అలవాటు బావా? డైరీలో అలాంటి విషయాలు కూడా రాస్తారా? అది రేప్పొద్దున్న పడరాని వాళ్ళ చేతుల్లోపడితే?" చిరునవ్వుతో అడిగింది తనూజ.

"సుస్మిత కూడా అదే అంది తరవాత. నాకు తెలిసొచ్చింది. ఆ డైరీని కాల్చి పారేయడమే కాదు, ఇకపైనే డైరీ ఏ రాయను." స్పష్టంగా అన్నాడు.

"ఓహ్ బావా అంతలా డిసైడ్ అయిపోకు. ఇకపైని నీ జీవితంలో అలాంటి సంఘటనలు జరగవులే." నవ్వింది తనూజ.

"కానీ తనకేం అయ్యిందంటావు? ఆ మామిడి చెట్టుమీద దెయ్యం ఉందన్నమాట మానడం లేదు. నా దగ్గరనుంచి ఆ తోటలోకి వెళ్లనని ప్రామిస్ తీసుకుంది. తానొక మామూలు అమ్మాయి అయివుంటే నేనింత కంగారు పడేవాడిని కాదు. కానీ తానొక చదువుకున్న అమ్మాయి, ఇంటెలిజెంట్. తనలా ఇమాజిన్ చేసుకోవడమేమిటి?" ఆందోళనగా అడిగాడు మదన్.

"తనకి ఏ సమయంలో కలిగింది అలాంటి అనుభవం?"

"మేమిద్దరం సాయంత్రం నాలుగు ఆ సమయంలో తోటకి వెళ్ళాం. ఆరున్నర ఆ సమయం వరకూ మాట్లాడుకున్నాం. తరువాత ఆడిటర్ రావడంతో నేనింటికి రావాల్సి వచ్చింది. తననీ వచ్చేమని అడిగాను. కానీ తను కొద్దిసేపు అక్కడ వున్నాకే వస్తానని పట్టుపట్టింది. దానితో తనని అక్కడే వదిలి వచ్చేక తప్పలేదు. తనెంతకి రాకపోవడంతో వెళ్లి చూసేసరికి, నిలబడి అక్కడవున్న పెద్ద మామిడి చెట్టువైపు చూస్తూ వుంది. నేను గట్టిగా భుజాలు పట్టి కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చి ఈ పాట మొదలు పెట్టింది."

"ఎక్సప్లనేషన్ ఈజీ బావా." బెడ్ మీద నుండి దిగి అంది తనూజ. "తను నిన్ను ప్రాణంలా ప్రేమించింది. అందుకనే నీ దగ్గరికి ఇలా వచ్చి చేరింది. చిట్టిరాణి ఇంక లేకపోయినా తను కూడా నిన్ను ప్రాణంలా ప్రేమించిందన్న విషయం సుస్మితని బాగా డిస్టర్బ్ చేసేసింది. సబ్కాంషస్ గా ఆ విషయం గురించే ఆలోచిస్తూ వుంది. అలా ఆలోచించడమే తను ఒంటరిగా, ఆ తోటలో, ఆ చీకట్లో, అలా వున్నపుడు అలాంటి హల్యూసీనేషన్ కి సబ్జెక్ట్ అయ్యేలా చేసింది."

"మరిప్పుడేం చేద్దాం? తనని ఆ భ్రమలో నుండి ఎలా బయటకి తీసుకురావాలి?" అదే కంగారుతో అడిగాడు మదన్.

"ఇది చాలా చిన్న సమస్య లానే అనిపిస్తూంది. తనతో మాట్లాడితే కానీ నేనే విషయం చెప్పలేను. ఎనీహౌ నువ్వనవసరంగా కంగారుపడకు. నేనున్నాను కదా." దీర్ఘంగా నిట్టూర్చి అంది తనూజ. "ఎనీహౌ ఆ చిట్టిరాణి ఆ నదీ ప్రవాహంలోనుండి బ్రతికి బయటపడగలిగే అవకాశం ఏమైనా వుందా?"

"ఆ నది గురించి నీకు తెలుసుకదా. ప్రస్తుతం కూడా అంత వుధృతంగానూ వుంది. గజఈతగాళ్ళు కూడా అందులో ఈత కొట్టలేరు. చిట్టిరాణి ప్రాణాలతో బయటపడగలిగే అవకాశంలేదు." మదన్ మొహంలోకి మరోసారి అనీజీ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది.

"ఆల్రైట్ బావా. ముందు నేను తనతో మాట్లాడక......." తనూజ ఎదో అనబోతూ ఉంటే పక్కరూం తలుపు తెరిచిన శబ్దం వినిపించింది.

"తను వచ్చినట్టు వుంది. ఇప్పటివరకూ తనూ, వదినా ఊరంతా తిరిగి రావడానికి వెళ్లారు." మదన్ అన్నాడు కుర్చీలోనుంచి లేచి. "ఇంకా ఆలస్యం దేనికి? పద నిన్ను తనకి పరిచయం చేస్తాను." 

"అవసరంలేదు బావా. నేనే తనని పరిచయం చేసుకుంటాను." మదన్ భుజాల మీద చేతులు వేసి కుర్చీలో కూలేస్తూ అంది తనూజ. "మళ్ళీ నేనొచ్చి మాట్లాడేవరకూ అక్కర్లేని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు."

తనూజ ఆ రూమ్ లోనుండి వెళ్ళిపోగానే, కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మదన్.

&&&

లోపలికి వచ్చి తలుపు గడియపెట్టి ఇలా బెడ్ మీద నడుంవాల్చిందో లేదో ఎవరో తలుపుతట్టిన శబ్దం వినిపించి లేచి కూచుంది సుస్మిత. బహుశా మదన్ అయివుంటాడు. తను పెట్టిన కండిషన్ వాళ్ళ తనకి పొలంలోకి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ తోట దాటకుండా పొలంలోకి వెళ్లలేడు. తాను మదన్ ఆ తోటలోకే వెళ్ళడానికి వీల్లేదని కూచుంది. అలాంటి కండిషన్ పెట్టడం తనకీ బాధగానే వున్నా, పరిస్థితులవల్ల తప్పడం లేదు. బెడ్ మీద నుండి లేచివెళ్లి, గడియ తీసి తలుపులు బార్లా తెరిచింది సుస్మిత.

అప్పుడు మొదటిసారిగా సుస్మిత, తనూజ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. మదన్ అప్పటికే చెప్పి ఉండడం వల్ల తన ఎదురుగుండా నిలబడింది తనూజేనని ప్రత్యేకంగా చెప్పకుండానే బోధపడింది సుస్మితకి.  వనజని చూసాక, ఆమె చెల్లెలు తనూజ కూడా కొంతవరకూ తనలాగే అందంగా ఉండొచ్చని అంచనా వేసింది. కానీ ఇలా ఇంత అందంగా ఉంటుందని మాత్రం అంచనా వెయ్యలేదు. టైట్ జీన్స్ లోనే అయినా అద్భుతంగా వుంది. గుండ్రని ముఖం, ఆక్టివ్ గా వున్నా కళ్ళు, బంగారు రంగు వంటిఛాయ ఇంకా రెండు జడలుగా వేసుకున్న నల్లటి వత్తైన జుట్టు.

నిజానికి తనూజ కూడా సుస్మిత వున్నలాంటి షాక్ లోనే వుంది. మదన్ ప్రేమించాడు అంటే అంతో ఇంతో అందగత్తె అయివుంటుంది అని అనుకుంది. కానీ సుస్మిత మతి పోగెట్టేటంత అందంగా వుంది. ఏ డ్రెస్సులో అయినా అందంగా వుండే ఆకృతే అయినా ఆ ఆకుపచ్చరంగు చీరకట్టుతో, అదే కలర్ బ్లౌజ్ తో ఇంకా అద్భుతంగా వుంది. ఏ మగాడైనా ఇలాంటి అమ్మాయితో ప్రేమలో పడకపోతేనే ఆశ్చర్యపడాలి, పడితే కాదు. అసూయగా అనుకుంటూ అంది తనూజ. "ఐ యామ్ తనూజ. నేను......"

"తెలుసు. లోపలి రా." తను లోపలి రావడానికి చోటిస్తూ అంది సుస్మిత. "ఎనీహౌ మనకి పరిచయాలు అవసరం లేదనుకుంటా. మీ బావ నా గురించి అంతా చెప్పేవుంటాడు." తరువాత అక్కడే వున్నబెడ్ మీద కూర్చుంది.

"అంతా చెప్పాడు ఒకేఒక్క విషయం తప్ప." అక్కడవున్న కుర్చీని సుస్మితకి అపోజిట్ గా లాక్కుని అందులో కూలబడుతూ అంది. "నువ్వింత అద్భుతమైన అందగత్తెవని తప్ప తక్కిన విషయాలన్నీ చెప్పేసాడు. ప్రవరాఖ్యుడిలాంటి మా బావ ప్రేమలో పడడం ఏమిటా అని ఆశ్చర్యపడ్డాను. కానీ నిన్ను చూస్తూవుంటే అర్ధం అవుతూంది. తను నీతో ప్రేమలో పడకపోతేనే ఆశ్చర్యం, పడితే కాదు."

"కేవలం అందం చూసే ప్రేమలో పడే మాట అయితే తను నా వరకూ రావక్కర్లేదు." నవ్వి అంది సుస్మిత. "నువ్వెంత అందంగా వున్నావో నీ దగ్గర చాలా మంది అనేవుంటారు. నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను."

కుర్చీలో వెనక్కి వాలి నవ్వింది తనూజ. "నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. కానీ నీ అంత అందంగా ఉంటానని మాత్రం అనుకోవట్లేదు." కాస్త ఆగి మళ్ళీ అంది. "నా గురించి ఏమేం చెప్పాడు మా బావ?"   

"నీకు కొంచెం తిక్క అని, ఒక్కోసారి ఎదుటివాళ్ళ ఫీలింగ్స్ గురించి పట్టించుకోకుండా బిహేవ్ చేస్తావని చెప్పాడు." తనూజ మొహంలోకే సూటిగా చూస్తూ అంది సుస్మిత.

"తను కరక్ట్ గానే చెప్పాడు. నేను ఒప్పుకుంటున్నా." నవ్వింది తనూజ. "చిన్నప్పటినుంచి అలా అలవాటైపోయింది. నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా."

"ఎవరిలోపం వాళ్ళు ఒప్పుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం." సుస్మిత నవ్వింది.

"ఆల్రైట్. ఇప్పుడు విషయానికి వస్తాను." కుర్చీలో అడ్జస్ట్ అయింది తనూజ. "నీ గురించనే నన్ను ప్రత్యేకంగా రమ్మన్నాడు మా బావ. నీకు ఇక్కడ బోర్ కొట్టకుండా చూడాలన్నది ఒక కారణం అయితే, ఒక సైకాలాజిస్ట్ గా చిట్టిరాణి దయ్యంగా మారిందన్న నీ భ్రమని నేను తొలగాగించాలన్నది ఇంకో కారణం. నాకు నా బావకి మధ్య దాపరికాలేమీ వుండవు. తను నాకు అన్ని విషయాలు చెప్తాడు. నీ గురించి కూడా పూర్తిగా అన్ని విషయాలు నాకు చెప్పేసాడు."

"నీ ఉద్దేశంలో కూడా నాది కేవలం భ్రమే, అంతకన్నా ఇంకేం కాదు." సూటిగా తనూజ మొహంలోకి చూస్తూ అంది సుస్మిత.

"నువ్వు నాలా సైకాలాజిస్ట్ వి కాకపోవచ్చు. కానీ చదువుకున్నావు కదా. నువ్వే చెప్పు అసలు దెయ్యాలు, భూతాలు లాంటివి వున్నాయంటావా?" కుర్చీలో ఇంకోసారి అడ్జస్ట్ అవుతూ అడిగింది తనూజ.

"నువ్వు నా బావ సైడ్ నుంచి తను చెప్పినది మాత్రమే విన్నావు. ఇప్పుడు నా సైడ్ నుంచి పూర్తిగా విన్నాక ఎలా హెల్ప్ చెయ్యగలవో డిసైడ్ చేసుకో." సుస్మిత అంది.

"ఆల్రైట్. ఐ యాం అల్ ఇయర్స్. చెప్పు నువ్వేమి చెప్పదలుచుకున్నావో." మళ్ళీ చిన్న చిరునవ్వు వచ్చి చేరింది తనూజ పెదవుల మీదకి.

"అలా కుర్చీలో నాకు ఎదురుగుండా కాదు, బెడ్ మీద నా పక్కకి రా. నేనంతా క్లియర్ గా చెప్తాను నీకు."

తరువాత తనూజ సుస్మిత పక్కనే బెడ్ మీద కూర్చున్నాక, సుస్మిత చెప్పడం మొదలు పెట్టింది. ఎలాంటి డిస్టర్బన్స్ చెయ్యకుండా ఆసక్తిగా వినడం ప్రారంభించింది తనూజ.

&&&

తనూజ ఆ ఇంటికి వస్తూందన్న విషయం తెలియగానే, వనజ మొదట ఆ విషయం వంశీకే చెప్పింది. "తనిక్కడ కొన్ని రోజులు ఉంటుందనుకుంటా. అయినా నువ్వేం కంగారు పడక్కర్లేదు. నీతోటి ఏం మిస్బిహేవ్ చేసినా నాకు చెప్పు. తోలు వలిచేస్తాను తనకి."

తనూజ వచ్చి కొద్దిరోజులు ఆ ఇంట్లోనే ఉంటుందని తెలియగానే గతుక్కుమన్నాడు వంశీ. అయినా తన మోహంలో ఫీలింగ్స్ కనిపించకుండా జాగ్రత్తపడుతూ అన్నాడు. "అదెప్పుడో తను చాలా చిన్నపిల్లగా వున్నప్పుడు అలా బిహేవ్ చేసింది. ఇప్పుడెందుకు అలా బిహేవ్ చేస్తుంది? అయినా అప్పుడు తప్పు నా వైపు నుంచి కూడా వుందికదా."

"ఇప్పుడా విషయంలో డీప్ గా వెళ్లడం నాకు ఇష్టంలేదు. తనలో మార్పు వచ్చి ఉంటే మంచిదే. కానీ నిన్నేమైనా అంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదు. నిన్ను తనేమన్నా నువ్వు నాకు చెప్పి తీరాల్సిందే." స్పష్టంగా అంది వనజ.

"అలాగే వదినా" అని పొలంలోకి వచ్చేసేడే కానీ, మనసు మనసులా లేదు వంశీకి. ఆ రోజు అంత గొడవై వెళ్లిపోయిన తరువాత మళ్ళీ ఈ ఇంటిగుమ్మం తొక్కలేదు ఆ తల్లీ కూతురు. మదన్, ముకుందం మాత్రం అక్కడికి వెళ్లేవారు. ఇంత కాలం తరువాత తానేమైనా మారిందో లేకపోతే ఆ అహంకారం, గర్వం ఇంకా పెరిగాయో తనకి తెలియదు. మళ్ళీ వచ్చి తనతో ఇన్సల్టింగా బిహేవ్ చేస్తే ఏం చెయ్యాలో బాధపడడం లేదు. ఎంత తను తనకి చెప్పమని చెప్పినా, తను వెళ్లి తనూజ మీద వనజకి కంప్లైంట్ చెయ్యలేడు. అప్పుడు జరిగిన ఆ గొడవకు ఇప్పటికింకా వ్యవహారం పూర్తిగా సర్దుబాటు కాలేదు.

చిన్నప్పటినుంచి ఏదో గర్వం, అహంకారం ఉండేవి ఆ పిల్లలో. తన తల్లి మంగవేణిది కూడా తన పెద్ద కూతురు వనజ లాంటి మనస్తత్వం అయితే తనూజ బాగానే ఉండేది. కానీ మంగవేణి చాలా అహంకారం, గర్వం వున్న మనిషి. అవి వనజలో ఎలా మిస్సయ్యాయో తెలియదు కానీ ఆ లోటు కూడా పూడుస్తూ తనూజకి  పుష్కలంగా వచ్చేయి. తన తల్లిలాగే కుదిరినప్పుడల్లా వంశీని ఇన్సల్ట్ చేస్తూ ఉండేది. వనజ వున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవారు ఇద్దరూ. వంశీని కానీ, మదన్ ని కానీ చిన్నమాట అన్నా ఊరుకునేది కాదు వనజ.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)