పోరాటమే ఆయుధం
నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మగా మారుతుంది.
చీకటితో పోరాడితేనే గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారుతుంది.
ఉలితో పోరాడితేనే రాయి శిల్పంగా మారుతుంది.
అగ్గితో పోరాడితేనే ఇనుము ఆయుధంగా మారుతుంది.
మట్టితో పోరాడితేనే విత్తు మొక్కగా మారుతుంది.
నీటితో పోరాడితేనే ముత్యపు చిప్ప ముత్యంగా మారుతుంది.
కష్టాలతో పోరాడితేనే మనిషి జీవితం విజయవంతంగా మారుతుంది !!