ముందు వాడి చూడండి తరువాతే నమ్మండి అని
నాగార్జున.. ఇది ప్రూవ్ కాదు అప్ప్రూవ్డ్ అని ఆయన కోడలు సమంత బుల్లి తెరపై యుద్ధానికి దిగారు సమంత త్రిపులెక్స్ డిటర్జంట్ పౌడరుకు నాగార్జున ఘడీ డిటర్జెంట్ పౌడరుకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఆయా ఉత్పత్తుల ప్రచారంలో భాగంగా వీరు నటిస్తున్న ప్రకటనలు వీరి మధ్య పరోక్ష యుద్ధం జరుగుతోందా అన్నట్లు ఉన్నాయి గతం లోనూ ఇలాగే రెండు ప్రముఖ శీతల పానీయ తయారీ సంస్థలైన థమ్సప్ పెప్సీ సంస్థలు మెగాస్టార్ చిరంజీవి ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోటాపోటీ ప్రకటనలు గుప్పించాయి..ఏదేమైనా ఈ వింతపరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది