నేతి వెన్నల జిడ్డు వదలదతి సులభముగ
వృద్ధికుపకరించు పోషకాలు
జిడ్డు కృష్ణమూర్తి నీతి సూక్తులు అంతె
మనసునంటినవంటె వదిలిపోవూ
నెయ్యి వెన్నల జిడ్డు అంత సులువుగా వదలదు
ఇవి శారీరక వృద్ధికి ఉపకరించే పోషకాలు
అలాగే జిడ్డు కృష్ణమూర్తిగారి నీతివాక్యాలుకూడా
మనసులోకి ఎక్కితే తొందరగా వదిలిపోవు
(నేడు జిడ్డు కృష్ణమూర్తి వర్ధంతి)