దానమిచ్చిన పిదప తీసుకొనరాదెపుడు
మాట ఇచ్చి మడమ తిప్పరాదు
కనుక ఆలోచించి వాగ్దానమివ్వాలి
గుణములందు గొప్ప దాన గుణమూ
దానం ఇచ్చాకా తిరిగి తీసుకోరాదు
మాట ఇచ్చాకా వెనకడుగు వేయరాదు
కాబట్టి దానమైనా వాగ్దానమైనా ఆలోచించి చేయాలి.. అన్ని దానాల్లోకీ వాగ్దానం గొప్పదని భావం..ఓంశాంతి