దివ్వెలారిపోవ కొండెక్కెనని తెలిపి
హారమ్ము తెగిపోవ పెరిగెననుచు
సరుకులైపోవంగ నిండుకొనెనని చెప్పు
తెలుగుకన్న గొప్ప భాష కలదే
దీపాలు ఆరిపోతే కొండెక్కాయని చెబుతాం
దండ తెగిపోతే పెరిగిపోయిందంటాం
సరుకులైపోతే నిండుకున్నాయి అని చెప్తాం
ఇంత సకారాత్మక దృక్పధమున్న తెలుగు భాషకూడా గొప్పదేకదా..ఓంశాంతి