పరుల నగ నగమల్లె భారమై తోచెపుడు
నాదన్న నాగమై కాటు వేయు
నీవైన సుగుణాలె నిజముగా నీ సొత్తు
నిక్కముగ నా మాట సత్యమేను
ఇతరుల సొమ్ము ఎప్పటికైనా మనకు భారంగా పరిణమిస్తుంది.. సొంతం చేసుకోవాలనే దుర్భుద్ధి పుడితే కాలనాగై కాటు వేస్తుంది.. నిజానికి నీ సుగుణాలే నీ సొత్తు ఇదే సత్యం అని భావం..ఓంశాంతి