Nirupama - 6 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 6

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

నిరుపమ - 6

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"అయితే తన మీద" తన రెండు మోచేతులు మధ్యలో వున్నబల్ల మీద బాలన్స్ చేసుకుని, స్మరన్ మొహంలోకి చూసింది  మేనక. "రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ జరిగి ఉండొచ్చా? అంతకన్నా పెద్ద కంపెల్లింగ్ రీజన్ ఈ అమ్మాయి విషయంలో నాకు కనిపించడం లేదు."

"లేదు. అది కారణం కాదని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తూంది." తనెలా అంత ఫ్రీగా అడగ గలుగుతోందో స్మరన్ కి బోధపడలేదు కానీ ఆ విషయం గురించి తన మేనకోడలు తో మాట్లాడడానికి స్మరన్ కి ఇబ్బందిగానే వుంది.

"తన బాడీకి పోస్ట్ మార్టం జరిగిందా?" మరో ప్రశ్న వేసింది మేనక.

"జరిగింది. అటువంటిది ఏమీ లేదు." నవ్వాడు స్మరన్. "ఇక్కడ మరొక్క విషయం. ఎక్కువ రోజులు గడిస్తే రేప్ అయినా గ్యాంగ్ రేప్ అయినా బయటపడవు. ప్రూవ్ చెయ్యడం కష్టం. తను చనిపోవడానికి వారం పది రోజుల ముందు అటువంటి అట్రాసిటీ కి గురయి ఉంటే అది పోస్ట్ మోర్టమ్ లో తెలియదు."

"అయితే ఆలా జరిగి ఉండొచ్చు కదా. అది బయటికి చెప్పలేక బాధపడి, బాధపడి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు." కుర్చీలో వెనక్కి జారగిలబడి అంది మేనక.

"నేనూ ఆమె తండ్రి దగ్గరనుంచి విన్నదాన్నిబట్టి, ఆ నిరంజన్ చెప్పింది విన్నదాన్ని బట్టి, ఇంకా ఆమెని ఫోటో లో చూసిన దాన్ని బట్టి, నిరుపమ చాలా ఆక్టివ్, ఇంటెలిజెంట్ మాత్రమే కాకుండా కరేజియస్ అండ్ బోల్డ్! తను బాగా ఆలోచిస్తుంది. ఒకవేళ తను రేప్ కి గాని గ్యాంగ్ రేప్ కి గాని గురయి వున్న, అలా సూసైడ్ చేసుకుని మాత్రం ఉండేది కాదు." కాస్త ఆగి మళ్లీ అన్నాడు. "ఎనీహౌ ఈ పాజిబిలిటీ కూడా వుంది. ఇదీ మనం మన దృష్టిలో ఉంచుకోవాలి."

"ఇంతకీ ఆ నిరంజన్ ఎవరు? ఎప్పుడు కలిసావు ఆయన్ని?" భృకుటి ముడేసింది మేనక.

" నిరుపమ తల్లి కి కజిన్. మొదటిసారి ఆ ఇంటికి వెళ్ళినప్పుడే కలిసాను. తను ఒక సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యాక ఈ ఊర్లోకి వచ్చి సెటిల్ అయ్యాడు. చాలా ఇంటరెస్టింగ్ క్యారెక్టర్! ఆ ఇంట్లో కలిసినప్పుడే కాదు, అతని ఇంటికి వెళ్లి కూడా మాట్లాడాను అతనితో." స్మరన్ అన్నాడు.

"అయితే చాలా విషయాలు తెలిసే ఉండాలి." నవ్వింది మేనక.

"కొంత ఇన్ఫర్మేషన్ రాబట్ట గలిగాను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నిరుపమ నిరంజన్ కి చాలా ఇంప్రెస్ అయింది. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో చేరడానికి కూడా ఆయనే కారణం. ప్రతీ విషయం తన తండ్రితో, ఇంకా  ఫ్రెండ్ సమీరతో షేర్ చేసుకున్నట్టుగానే ఆయనతోనూ షేర్ చేసుకునేది. బట్ ....." కాస్త ఆగి నిట్టూర్చాడు స్మరన్. "....తన సూసైడ్ కి సంబంధించి మాత్రం చిన్న క్లూ ఆయనకి కూడా ఇవ్వలేదు."

"ఆ విషయానికి సంబంధించి తన తండ్రికే ఏమీ తెలియనివ్వలేదు. అతనికి తెలియనివ్వక పోవడంలో ఆశ్చర్యం లేదు." మేనక కూడా నిట్టూర్చింది. "సో, ఆ నిరంజన్ తో చాలా క్లోజ్. తనకి బాగా ఇంప్రెస్ అయింది."

"అఫ్ కోర్స్, ఎస్. నిరంజన్ స్టేట్మెంటు ప్రకారం, తన తండ్రి తరువాత అంతగా అభిమానించి క్లోజ్ గా ఫీలయ్యింది నిరంజన్ తోటే."

"ఐ సీ." సాలోచనగా తలూపి కుర్చీలో ఇంకొంచెం అడ్జస్ట్ అయింది మేనక. " అంకుల్, ఒక పాజిబిలిటీ మీరిక్కడ ఆలోచించారా? ఆ నిరంజన్ తను ఎంతగానో అభిమానించే వ్యక్తి. ఒకవేళ ఆ నిరంజన్ నిరుపమతో చెడుగా బిహేవ్ చేసి ఉంటే తను ఎలా ఫీలయ్యి ఉండేది? ఐ మీన్ అతను రేప్ కానీ, రేప్ అటెంప్ట్ కానీ చేసివుంటే నిరుపమ చాలా బాధపడి సూసైడ్ చేసుకోవడానికి అవకాశం వుంది కదా."

"అందుకు అవకాశం వుంది. కానీ ఆ నిరంజన్ ని చూస్తే నాకు ఆలా అనిపించలేదు. నిజం చెప్పాలంటే నేను కూడా అతన్ని చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వూ అతన్ని చూసి ఒకసారి మాట్లాడితే నీ ఆలోచన మారొచ్చు."

"మనం ఎక్సటీరియర్ ని చూసి ఇంటీరియర్ అంచనా వెయ్యలేం అంకుల్. పైకి ఎంతో హుందాగా ఇంప్రెసివ్ గా కనిపిస్తూ కూడా పాడుపనులు చేసేవాళ్ళు వున్నారు కదా."

"నేను కాదనలేను. ఈ థియరీ కూడా ఫాలో అవుదాం." కుర్చీలో ఇంకోసారి అడ్జస్ట్ అయ్యాడు స్మరన్. "ఎనీహౌ నువ్వూ అతన్ని కలిసి ఒకసారి మాట్లాడి చూడు. నువ్వు నా మేనకోడలివని, నీకు తన గురించి నా ద్వారా తెలిసిందని, ఇంకా నీకూ సైకాలజీ అంటే ఇంటరెస్ట్ అని చెప్పు, సరిపోతుంది."

" ఓకే అంకుల్. అలాగే చేస్తాను." నవ్వింది మేనక.

"ఇప్పుడు నేను నిరుపమ ఫ్రెండ్ సమీర దగ్గరికి వెళుతున్నాను. అవసరమైతే ఇకపైన వీళ్ళతో మాట్లాడడం అదీ నువ్వే చెయ్యాలి. ఈ ఒక్క అసైన్మెంట్ మీదే కాన్సంట్రేషన్ చేస్తే తక్కిన అస్సైన్మెంట్లు నేను ఫాలో అవ్వలేను కదా."

"ఐ లవ్ ఇట్ అంకుల్. యు డోంట్ వర్రీ." నవ్వింది మేనక. "నీకు బాగా తెలుసు. ఇలా డిటెక్షన్ చెయ్యడం నాకు చాల ఇష్టమని. ఐ ఎంజాయ్ ఇట్."

"ఆల్రైట్ దెన్. అమ్మతో మాట్లాడుతున్నావు కదా." కుర్చీలోంచి లేస్తూ అడిగాడు స్మరన్.

"మాట్లాడుతున్నాను. జాగ్రత్తలతో చంపేస్తోంది. నేనేమన్నా ఫారిన్ వెళ్ళిపోయినా? ఇదే వూళ్ళో దగ్గర్లోనే ఇంకో ఇంట్లో వున్నను." కోపంగా అంటూ మేనక కూడా కుర్చీలోంచి లేచింది.

"మీ అమ్మ నీ గురించి ఎందుకలా ఫీల్ అవుతుందో నువ్వూ అమ్మవైతేనే కానీ నీకు తెలియదు." చిరునవ్వుతో అన్నాడు స్మరన్.

"చుట్టూ తిప్పి అక్కడికి తెచ్చావా? నువ్వూ ఆ పెళ్ళికొడుకు ఊసు అదీ ఎత్తే లోపు నేనిక్కడనుంచి బయటపడడం మంచిది. బై అంకుల్." అక్కడినుంచి బయటికి వచ్చేసింది మేనక.

&

" చాలా అప్సెట్ అయ్యాక ఇప్పుడిప్పుడే నువ్వు యూజువల్ అవుతున్నావు. ఆ డిటెక్టివ్ తో నువ్వు మళ్లీ పాత విషయాలు తోడుకోవడం నాకు ఇష్టం లేదమ్మాయ్." సమీర తల్లి వనజ అంది.

అప్పుడు సమీర ఇంకా ఆమె తల్లి వనజ, తండ్రి ముకుందం హాలులో కూచుని వున్నరు. ముకుందం, వనజ అక్కడ వున్న సోఫాలో కూచుని ఉంటే సమీర వాళ్ళకి ఎదురుగుండా వున్న కుర్చీలో కూచుని వుంది.

" మామ్ చెప్పింది నిజమే. నువ్వు మళ్లీ ఆ విషయాలన్నిటి గురించి మాట్లాడాల్సొస్తుందంటే నాకూ ఇష్టం లేదు." ముకుందం అన్నాడు.

" డాడ్ నిరుపమ నా బెస్ట్ ఫ్రెండ్. నిజానికి మీ ఇద్దరికన్నా కూడా ఎక్కువ. తన గురించి ఆలోచించడమో, లేదా మాట్లాడడమో నన్నెప్పుడూ బాధ పెట్టదు. నాలో మార్పు తన గురించి ఆలోచించకపోవడం వల్ల రాలేదు. జస్ట్ కాజువల్ గా టైమే తెచ్చింది."  కుర్చీలో జారగిలబడుతూ చిరాగ్గా అంది సమీర.

"ఒకే డియర్. నేను కాదనను." ముకుందం అన్నాడు. "కానీ ఈ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా యూజ్లెస్ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు కారణం తెలుసుకుని ఆ రంగనాథ్ ఏం చెయ్యగలడు?"

"మీ డాడ్ చెప్పింది నిజం. ఆ అమ్మాయి చనిపోయాక మేమూ చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల ఏమి లాభం? ఇంతకన్నా ఆ రంగనాథ్ తన భార్య మానసిక పరిస్థితి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బావుండేది. తాను ఆల్మోస్ట్ పిచ్చిది అయిపొయింది." వనజ అంది.

"నేనేం చెప్పను మామ్? నిరుపమ పేరెంట్స్ గురించి ఆలోచిస్తేనే నాకూ చాలా గిల్టీ గా అనిపిస్తూ వుంది. నిరుపమ వున్నప్పుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని చూసేదాన్ని. నన్ను ఎంతో అభిమానంగా చూసే వాళ్ళు. ఇప్పుడు ఆ ఇంటిగురించి ఆలోచిస్తేనే అదొకలా వుంది. వాళ్ళని చూడడం మాట అలా ఉంచి,  అక్కడ జ్ఞాపకాల్ని తట్టుకోలేనని ఆ ఇంటికే వెళ్లడం మానేసాను. పాపం వాళ్లిద్దరూ ఎలా వున్నరో." సమీర మొహం బాధతో నిండిపోయి వుంది.

"ఇప్పుడే కదమ్మా అన్నావు నిరుపమ గురించి ఆలోచించడం, మాట్లాడడం నిన్ను బాధపెట్టవు అని. ఇంకా ఆమె జ్ఞాపకాలు మాత్రం నిన్ను ఎందుకు బాధించాలి?" ముకుందం అన్నాడు.

"ఎదో అంది, అయితే ఇప్పుడు మీ క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమా?" కోపంగా అంది వనజ. "తన గురించి ఆలోచించను, మాట్లాడాను అనడానికి గిల్టీగా అనిపించి అలా అంది."

" ఓకే మామ్. మీరు ఇద్దరు ఇలా గొడవ పడకండి. నేను మళ్లీ అప్సెట్ కాను, సరేనా?" చిరాగ్గా అంది సమీర.

ముగ్గురు సైలెంటుగా ఉండిపోయారు ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటూ. అంతలో కాలింగ్ బెల్ మోగింది.

"ఆ డిటెక్టీవ్వే అనుకుంటా. వెళ్లి చూడు." వనజ అంది సమీర మొహంలోకి చూస్తూ.

సమీర కుర్చీలోంచి లేచి వెళ్ళింది తలుపులు ఓపెన్ చెయ్యడానికి.

&

"నిరుపమ సూసైడ్ చేసుకున్నాక నువ్వు చాల అప్సెట్ అయ్యావని నేను విన్నాను. ఆ రంగనాథ్ మరీ అంత పట్టుదలగా లేకపోతే నేను నిన్నిలా ఇబ్బంది పెట్టి ఉండేవాడిని కాదు." స్మరన్ సమీర ఖాళీ చేసి ఇచ్చిన కుర్చీలో సెటిల్ అవుతూ అన్నాడు.

ఆ ముగ్గురూ ఊహించినట్టుగా ఆ వచ్చింది స్మరనే. స్మరన్ లోపలికి వచ్చాక మామూలు పలకరింపులు అయ్యాక ముకుందం ఎదో పనివుందని బయటికి వెళ్ళిపోతే కిచెన్ లో పని వుందని వనజ అక్కడినుంచి వెళ్ళిపోయింది. సమీర కుర్చీకి ఎదురుగా వున్న సోఫా లోకి మారింది.

"ఫరవాలేదు లెండి. తాను నాకు క్లోజ్ ఫ్రెండ్. తన గురించి ఆలోచించను, మాట్లాడను అంటేనే నాకు గిల్టీ గా వుంటుంది." సోఫాలో వెనక్కి జారగిలబడి నిట్టూర్చింది సమీర. "కానీ నేను మీకు ఈ విషయంలో పెద్దగా ఉపయోగ పడగలను అనుకోవడంలేదు. తన పేరెంట్స్ తో మాత్రమే కాదు నాతో కూడా ఆ విషయం గురించి ఏవీ షేర్ చేసుకోలేదు తను. తను సూసైడ్ చేసుకుందని తెలిసాక నేను విపరీతంగా షాక్ అయ్యాను."

"మీతో ఎదో షేర్ చేసుకుని ఉంటుందని నేనూ అనుకోలేదు. కానీ ఎదో ఒక క్లూ అయినా మీ ద్వారా దొరుకుతుందని ప్రయత్నం చేస్తున్నాను." స్మరన్ నవ్వాడు.

"సరే అయితే. మీరు ఏం అడగలనుకుంటున్నారో అడగండి." సమీర కూడా నవ్వుతూ అంది. ఇంకెవరైనా అయితే ఆ విషయం గురించి ఆలా మాట్లాడడానికి చిరాకు పడివుండేది. ఏజ్ అంచనా వెయ్యలేక పోతూంది కాని స్మరన్ చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తూ వున్నాడు సమీరకి. ఎదో మాట్లాడాలనే అనిపిస్తూ వుంది. ఇంకా స్మరన్ కి అయితే సమీరని చూస్తూ ఉంటే అందంగా వున్న అమ్మాయిలకి అందంగా వున్న ఫ్రెండ్సే ఉంటారేమో అనిపించింది. పంజాబీ డ్రెస్సులో నిరుపమ ఆ ఫొటోలో ఎంత అందంగా వుందో, వోణీలో సమీర కూడా అంత అందంగానూ వుంది. బహుశా ఒక ఇరవై, ఇరవై ఒకటి సంవత్సరాలుకన్నా ఈ అమ్మాయికీ ఎక్కువ ఉండక పోవచ్చు.

"మీ ఇద్దరికీ ఎంతకాలంగా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరూ ఎంతకాలంగా ఫ్రెండ్స్?"

"నా సిక్స్త్ స్టాండర్డ్ నుంచి. నాన్న చార్టర్డ్ అకౌంటెంట్. అప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాం. నాన్న ప్రాక్టీస్ వేరే చోట వుంది. నిరుపమ వాళ్ళు ఎప్పటినుంచో ఇక్కడే వున్నరు. నేను తానూ ఒకటే క్లాస్. అదే స్కూల్లో నేనూ జాయిన్ అవ్వడంతో నాకు పరిచయం అయింది. కొద్దీ రోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళం తరచూ వెళ్లడం మాకు చాలా యూజువల్."

"తను ఎంతో మంచి అమ్మాయి. అందంగానే కాదు ఎంతో ఆక్టివ్ గానూ ఉండేది. మా అమ్మాయినే కాదు, తను ఆలా సూసైడ్ చేసుకోవడం మమ్మల్నీ చాల అప్సెట్ చేసింది." వనజ తను తెచ్చిన కాఫీ కప్పు స్మరన్ కి అందిస్తూ అంది.  

"రియల్లీ సాడ్." ఆ కాఫీ కప్పు అందుకుంటూ అన్నాడు స్మరన్. "ఏ పరిచయం లేకపోయినా ఆ అమ్మాయి ఆలా చనిపోయిందంటే నాకే ఎంతో బాధగా అనిపిస్తూ వుంది. మీకలా అనిపించడంలో ఆశ్చర్యంలేదు."

ఆ తరువాత వనజ మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయింది.

"తను అన్ని విషయాలు నీతో షేర్ చేసుకుంటూ ఉండేది." స్లో గా కాఫీ ని సిప్ చేస్తూ అన్నాడు స్మరన్.

"వైస్ వెర్సా." నవ్వింది సమీర. "నేనూ నా అన్ని విషయాలూ తనతో షేర్ చూసుకునేదాన్ని."

"నువ్వు కాకుండా తనకి ఇంకా వేరే ఎవరైనా ఫ్రెండ్స్ వున్నరా?"

"తను అందరితో చక్కగా మాట్లాడుతూ ఫ్రెండ్లాగే ఉండేది. కానీ తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ని మాత్రం నేనే. నాకు కూడా అంతే. తను తప్ప వేరే క్లోజ్ ఫ్రెండ్ ఎవరూ లేరు."

"అయితే నేను తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ వున్నరా అని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదన్న మాటే."

"అస్సల్లేదు." కాదన్నట్టుగా తలూపింది సమీర. "మా ఇద్దరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు."

"తను చనిపోవడానికి ఎన్ని రోజుల ముందు మీ ఇద్దరూ కలిశారు?"

"కలుస్తూనే వున్నాం. మాట్లాడుకుంటూనే వున్నాం. తను సూసైడ్ చేసుకున్న రోజు కూడా మేమిద్దరం వాళ్ళింట్లో కలిసి మాట్లాడుకున్నాం. కాకపోతే మా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూండడం వాళ్ళ నా కాన్సంట్రేషన్ అంతా వాటిమీద అయిపోయింది. తన మూడ్ ని ఇంకా బిహేవియర్ ని అంతగా అబ్సర్వ్ చెయ్యలేదనుకుంటా. కానీ..." కాస్త ఆగి అంది సమీర "నిజంగా తను ఏ విషయం గురించి అయినా బాగా మధన పడుతూ వుండివుంటే ఆ విషయం ఖచ్చితంగా నా నోటీసులోకి వచ్చి వుండేది."

"నీ దృష్టిలో తనని అంతగా సూసైడ్ కి ప్రేరేపించగల విషయం ఏదైనా వుందా?" కుర్చీలో వెనక్కి వాలాడు స్మరన్.

"లేదు. కనీసం ఊహకి కూడా ఏది రావడం లేదు." మళ్ళీ కాదనట్టుగా తలూపుతూ అంది సమీర. "ఒకవేళ అలాంటిది ఏమైనా వుండివుంటే హండ్రెడ్ పర్శంట్ నాకు చెప్పే వుండేది."

"అంటే తను చనిపోయే వరకు కూడా తను నీతో చాల యూజువల్ గా, క్యాజువల్ గానే వుంది."

"అలాగే వుంది. నాకు డిఫరెన్స్ ఏమి కనిపించలేదు." సోఫాలో అడ్జస్ట్ అవుతూ అంది సమీర.

"ఎనీహౌ ఏదైనా గుర్తుంచుకో గలిగిన సంఘటన, లేదా నోటీసు చేయదగ్గ విషయం తను సూసైడ్ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు జరిగిందా?"

"ఆలా ఏం జరిగినట్టుగా అనిపించడం లేదు. నాకు తెలిసినంతవరకు ఏం జరగలేదు." భృకుటి మూడేసి ఆలోచిస్తూ అంది సమీర.

"కాస్త గుర్తు చేసుకో. బాగా ఆలోచించు. అది ఎంత చిన్న విషయం అయినా ఫర్వాలేదు."

"యు డిటెక్టివ్స్ ఆర్ ఇంపాజిబుల్." నవ్వుతూ అంది సమీర.

"తప్పదు మరి. మీకు ఎంతో సాధారణంగా కనిపించే విషయంలో ఎదో క్లూ దొరుకుతుంది మాకు. ప్లీజ్ ట్రై చెయ్యి."

"సరే అయితే." మరోసారి భృకుటి ముడేసి, కింద పెదవిని పళ్ళ మధ్య బిగబట్టి ఆలోచనలో పడింది సమీర.

ఆ పోశ్చర్ లో మరీ అందంగా కనిపిస్తూ వుంది సమీర స్మరన్ కి. తనని అలాగే చూస్తూ వున్నాడు స్మరన్.

"ఇది నిరుపమ సూసైడ్ చేసుకోవడానికి పదిహేను రోజుల కింద జరిగిందనుకుంటా. ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళలేదు ఒంట్లో బావులేక, కానీ తను వెళ్ళింది. నాన్న ప్రాక్టీసుకి వెళ్లిపోయారు. అమ్మ ఎవరో చుట్టాలింటికి వెళ్ళింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా వున్నను. అప్పుడు తను వచ్చింది."

"తను కాలేజీ కి వెళ్ళింది కదా." భృకుటి ముడేసాడు స్మరన్.

"ఎదో స్ట్రైక్ వల్లో దేనివల్లో కాలేజీ జరగలేదని చెప్పింది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి తనని ఇంట్లోనే ఉండమని చెప్పి నేను వెళ్ళిపోయాను."

"ఇందులో నోటీసు చేయదగ్గ విషయం ఏం వుంది?"

"నేను ఆలా వేళ్ళ బోయేముందు జస్ట్ ఫ్యూ సెకండ్స్ తన మొహంలోకి చూసాను." సమీర ఆగింది.

"ప్లీజ్ కంటిన్యూ." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ ఆసక్తిగా అన్నాడు స్మరన్.

"అప్పుడు తన మోహంలో ఒక ఎక్స్ప్రెషన్ కనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటన్నది అర్ధం లేదు." నుదుటిమీద ముడతలు వచ్చాయి సమీరకి ఆమె ఎదో ఆలోచిస్తూందని తెలియచేస్తూ.

"ఎక్స్ప్రెషన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బాధ వాళ్ళ వచ్చే ఎక్స్ప్రెషన్స్, రెండవది సంతోషం వాళ్ళ వచ్చే ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్ ఏ రకానికి చెందిందో అయినా చెప్పగలవా?"

"ఆలా చెప్పవలసి వస్తే అది కచ్చితంగా బాధ వాళ్ళ వచ్చే ఎక్సప్రెషనే." సమీర సాలోచనగా అంది కానీ ఆమె నుదుటి మీద ముడతలు ఇంకా అలాగే వున్నయి.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)