Nirupama - 9 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 9

Featured Books
Categories
Share

నిరుపమ - 9

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"మీ పరిస్థితి నాకు అర్ధం అయింది. మీరు అక్కడికి వెళ్తే ఆ జ్ఞాపకాలతో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే నాకూ అనిపిస్తూంది. మీరు అవి తట్టుకోగలరనే కాన్ఫిడెన్స్ వచ్చేవరకు అక్కడికి వెళ్లొద్దు. అయినా ఆ పెద్దవాళ్ళ ఇద్దరిగురించి బాధపడొద్దు. నేను వాళ్ళకి వాళ్ల అమ్మాయి లాగే అనిపిస్తూ వున్నాను. నన్ను చూసి చాలా స్వాంతన పొందుతున్నారు. కొంతకాలంపాటు నేను వాళ్ళని చూసుకుంటాను."

"నిజంగానే? నువ్వు చెప్పేది వింటూవుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూంది." సడన్గా సమీర మొహం ఆనందంతో నిండిపోయింది.

"హండ్రెడ్ పర్శంట్ ట్రూ. జస్ట్ బి రిలాక్స్డ్. నిరుపమ బెస్ట్ ఫ్రెండ్ గా మీ ఫీలింగ్ వాళ్ళ గురించి ఎలా ఉంటుందో నేను అంచనా వెయ్యగలను. ఫర్ ది ప్రెసెంట్ ఐ యామ్ దేర్ ఫర్ దెమ్." కుర్చీని సోఫాకి దగ్గరికి లాక్కుని, సమీర కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అంది మేనక. ఇంత తక్కువ సమయంలో తనకి సమీరతో ఇంత క్లోజ్ గా ఫీలింగ్ రావడం మేనక కి ఆశ్చర్యం గా వుంది.

"యు నో వన్ థింగ్? ఈ మధ్య కాలంలో నన్నెంతో ఆనంద పరిచిన మనిషివి నువ్వే. నాకు నిన్ను చూస్తూ ఉంటే నిరుపమని చూస్తూన్న ఫీలింగే కలుగుతూ వుంది.” కాస్త ఆగి అంది "ఒక్క విషయం చెప్పు. నువ్వెప్పుడూ ఇలా పంజాబీ డ్రెస్ ఇంకా రెండు జడలు వేసుకుంటావా?"

"మోస్ట్ అఫ్ ది టైం" నవ్వింది మేనక. "పైకి వెళ్తే నా డ్రెస్ ఇదే. ఇంట్లో వుంటే మాత్రం రాత్రిపూట లంగా వోణి కట్టుకుంటాను. అప్పుడప్పుడు చీర కూడా. నాకు ఒక్క జడ వేసుకోవాలని వున్నా మా మామ్ ఒప్పుకోదు."

"మై గాడ్! కేవలం హైట్ అండ్ వెయిట్ మాత్రమే కాదు, తక్కిన విషయాల్లోనూ నీకు నిరుపమతో సిమిలారిటీస్ వున్నయి. ఆ పెద్దవాళ్లిద్దరూ నిన్ను చూసి ఆలా రిలీఫ్ కావడంలో ఆశ్చర్యం లేదు." నిట్టూరుస్తూ అంది సమీర.

"నాకీ విషయానికి ఆనంద పడాలో విచార పడాలో అర్ధంకావడంలేదు." ఒక కన్ఫ్యుజింగ్ ఎక్స్ప్రెషన్ తో అంది మేనక.

"సర్తైన్లీ దిస్ ఈజ్ సంథింగ్ వుయ్ కెన్ ఫీల్ హాపీ." సమీర అంది. "ఆమె పేరెంట్స్ కి మాత్రమే కాదు నిన్నిలా చూస్తూ వుంటే నాకు కూడా రిలాక్స్డ్ గా ఇంకా హాపీ గా వుంది.  కెన్ వుయ్ బోత్ బి క్లోజ్ ఫ్రెండ్స్?" తన చేతిని మేనక చేతిలోంచి విడిపించుకుంటూ అడిగింది సమీర.

"వై నాట్? ఐ లవ్ టు బి ఏ ఫ్రెండ్ విత్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ లైక్ యు. నీకు తెలుసా? నాకు ఇప్పటివరకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు." కుర్చీలోనుంచి సోఫాలో సమీర పక్కకి షిఫ్ట్ అవుతూ అంది మేనక.

"నిరుపమ తప్ప నాకూ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు." సమీర నవ్వింది "ఇప్ప్పుడు నువ్వొచ్చావు."

"మన క్లోజ్ ఫ్రెండ్షిప్ కి ఫస్ట్ స్టెప్ గా ఒక పని చేద్దామా? మీరు, మీరు మానేసి నువ్వు, నువ్వు అనుకుందామా?" మేనక అడిగింది.

"మనం ఆల్రెడీ అదే చేస్తున్నాం. గమనించలేదా?" మళ్ళీ అందంగా నవ్వింది సమీర.

"యు అర్ రైట్." తలూపుతూ మేనక కూడా అంతే అందంగా నవ్వింది. "నౌ బిజినెస్. నువ్వేదో ఇంటరెస్టింగ్ థింగ్ నిరుపమకి సంబంధించి ఫైండ్ అవుట్ చేసావుట కదా. అదేమిటి?"

"అది చాలా రోజులుగా అక్కడే వుంది. ఇంకా చాలా రోజులుగా అక్కడే ఉంటుంది. నేను నీకది ఎలాగూ చూపిస్తాను. కానీ క్లోజ్ ఫ్రెండ్స్ గా మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళం పూర్తిగా తెలుసుకోక పోతే ఎలా?" మేనక మొహంలోకి చూస్తూ అంది సమీర.

"యు అర్ రైట్." తలూపుతూ అంది మేనక. " డాడ్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసే వారు. నా చిన్నతనంలోనే పోయారు. మామ్ మొదటినుంచి ఓ నేషనలైజ్డ్ బ్యాంకు మేనేజర్. వేరే ఆస్తులు కూడా కొంచెం వున్నయి. కాబట్టి ఫైనాన్సియల్ గా ప్రొబ్లెమ్స్ ఏమీ లేవు. బి.ఏ. ఎకనామిక్స్ లో డిస్టింక్షన్ వచ్చింది. ఎం.ఏ. ఎకనామిక్స్ తో చేసి, పి.హెచ్.డీ చేసి, లెక్చరర్ గా చెయ్యాలని నా కోరిక. కానీ ఎలాగైనా నా పెళ్లి చేసేయాలని మా మామ్ కోరిక."

"జస్ట్ లైక్ మై మదర్. నేను ఎంతో ఇష్టంతో జాయిన్ అయిన ఎం.ఏ. సైకాలజీ పూర్తి చెయ్యనిచ్చేలా కనిపించడం లేదు. వారానికి రెండు సంబంధాలయినా తెస్తూ ఉంటుంది." నిట్టూరుస్తూ అంది సమీర.

"మనం ఎవరితోనైనా లవ్ లో పడి వాళ్లనే పెళ్లి చేసుకుంటాం అనేలోపు మన పెళ్లి చేసేయాలని వాళ్ళ ఆలోచన." మేనక అంది.  

"యు అర్ రైట్. అందుకూ అవకాశం వుంది కదా. ఇప్పటి వరకు లవ్ లో పడలేదని మనం తక్కిన అమ్మాయిలకి ఎక్సెప్షన్ అనుకోలేం. మోరోవర్ మన ఛాయస్ చక్కగా ఉంటుందనీ చెప్పలేం. నా ఉద్దేశంలో పెద్దవాళ్ళు తెచ్చే సంబంధాలే మంచివి."

"ఎగ్జాట్ గా నా ఒపీనియన్ కూడా అదే." మేనక నవ్వింది. "నా గురించి ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఇక నీ సంగతేమిటి?"

"చెప్తా నా గురించి. కానీ మీ అంకుల్ సంగతేమిటి? అయన ఫామిలీ ఏం చేస్తున్నారు?" ఆసక్తిగా చూస్తూ అడిగింది సమీర.

"ఆయనది చాలా విషాద కరమైన లైఫ్. తన భార్య మూడోనెల  ప్రేగ్నన్ట్ గా వున్నప్పుడు అనుకుంటా ఆమె ఒక ఆక్సిడెంట్ లో చనిపోయింది. ఎవరు ఎంతగా చెప్పిన మా అంకుల్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. తను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా చేసే వారు. తన భార్య చనిపోయాక, ఆ జాబ్ కి రిజైన్ చేసి 'స్మరన్ డిటెక్టివ్ ఏజెన్సీ' స్టార్ట్ చేసారు. తనకి వేరే  అసిస్టెంట్స్ ఎవరూ లేరు. నన్నే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా యూజ్ చేసుకుంటూ వుంటారు." చెప్పింది మేనక.

"నిజంగా వెరీ సాడ్. నేను ఇది అసలు ఊహించలేదు. అలాంటి ఒక హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఒక అందమైన భార్యతో, పిల్లలతో ఆనందంగా వుండివుంటారనుకున్నాను." షాకింగ్ గా అంది సమీర.

"తనని చూసి ఇలా ఇంప్రెస్ అయింది కేవలం నువ్వు మాత్రమే కాదు. చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు కూడా. కానీ తను ఎంతమాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు." చిరునవ్వుతో సమీర మొహంలోకి చూస్తూ అంది మేనక.

తను ఏం మాట్లాడిందో గుర్తుకొచ్చి బుగ్గలు ఎరుపెక్కి పోయాయి సమీరకి. "మీ అత్తయ్య ఎలా ఉండేది? ఐ మీన్ అయన భార్య." వెంటనే మాట మార్చడానికి అన్నట్టుగా అంది.

"తను చనిపోయే సమయానికి నాకు నాలుగేళ్లొ, ఐదేళ్లో అనుకుంటా. నాకు తను పెద్దగా గుర్తు లేదు. బాగానే ఉండేదేమో. కానీ నిజమైన ప్రేమకి అందంతో పనేమిటి?"

"యు అర్ రైట్. స్వచ్ఛమైన ప్రేమకి మీ అంకుల్ జీవితమే ఒక ఉదాహరణ. భార్య పోయి నెల రోజులు కూడా కాకముందే ఇంకో పెళ్లి గురించి ఆలోచించే మగవాళ్ళున్న ఈ రోజుల్లో మీ అంకుల్ ఆలా ఉండడం నిజంగా గ్రేట్. తన గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు." మొహంలో అడ్మిరేషన్ తో అంది సమీర.

"మరేం. ఇంక మా అంకుల్ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు. మరి నీ గురించి మొదలు పెడతావా?" సోఫాలో అడ్జస్ట్ అవుతూ అడిగింది మేనక.

"మా నాన్న ఛార్టర్డ్ అకౌంటెంట్. వేరే చోట ప్రాక్టీస్ వుంది. రోజూ అక్కడికే వెళతారు, ఈ రోజూ అక్కడికే వెళ్లారు. అమ్మ హౌస్ వైఫ్. రోజూ ఇంట్లోనే ఉంటుంది. ఈ రోజు మా నాన్నగారి చెల్లెలి ఇంటికి వెళ్ళింది, సాయంత్రానికి వచ్చేస్తుంది. నేను ఒక్కత్తినే కూతుర్ని మా పేరెంట్స్ కి. ఈ ఇల్లు కాకుండా ఇంకా ఏవో కొన్ని ఆస్తులు వున్నయి. నీలాగే నాకూ ఫైనాన్సియల్ గా ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవు. చెప్పాగా ఆల్రెడీ. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నా పెళ్లి చేసేయడమే నా పేరెంట్స్, ముఖ్యంగా నా మామ్ ప్రెజంట్ మిస్సన్. టూ బి ఫ్రాంక్……" మళ్ళీ అందంగా నవ్వింది సమీర. "నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ తో పూర్తి చెయ్యాలని మరీ అంత సీరియస్ గా ఏమీ లేను. మామ్ బలవంత పెడుతూందని మాత్రమే కాకుండా మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసేసుకుందామనే ఆలోచనలోనే వున్నను."

"రియల్లీ? ఇక్కడ మనిద్దరికీ కొంచం డిఫరెన్స్ వచ్చినట్టుగా ఉంది. నాకెందుకో మరీ అంత తొందరగా పెళ్లి చేసుకోవాలని లేదు."

"ఎవ్విరివన్ ఎంటైటిల్స్ టు హేవ్ హిజ్ ఆర్ హర్ ఓన్ టేస్ట్. క్లోజ్ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన మన టేస్ట్ ఇంక ఓపీనియన్స్ అన్నీ ఒకటి కావాలని ఏమీ లేదు. నిరుపమకి నాకు కూడా కొన్ని అభిప్రాయాల్లో డిఫరెన్సెస్ ఉండేవి. తను నీలాగే త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో వుండేది కాదు." సమీర అంది.

"తను ఆలా సూసైడ్ చేసుకోవడం కన్నా కూడా, మీ ఎవ్వరికి ఏ మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఆలా చేయడం నాకు చాలా ఆశ్చర్యం గా వుంది. అందుకు కారణం ఏమై ఉంటుందో నీ ఊహకి కూడా అందడం లేదా?" నిరుపమ టాపిక్ రావడంతో అంది మేనక.

"కొంచెం కూడా లేదు. అసలు ఎందుకు అంత పని చేసి వుంటుందో కొంచెం కూడా ఊహించ లేకపోతున్నాను." నిట్టూరుస్తూ అంది సమీర.

"తనకి బాయ్ ఫ్రెండ్స్ లేరు, ఏ లవ్ అఫైర్స్ లేవు, నువ్వు స్యూరా?"

"ఉంటే నేను మీ అంకుల్ కి చెప్పేదాన్ని. నేను, తను ఏమీ పురుష ద్వేషులం కాదు. కాకపోతే మాకు బాయ్స్ తో ప్రత్యేకంగా పరిచయాలు అయితే లేవు. నాకు తను, తనకి నేను తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు." కాస్త ఆగి అంది మళ్ళీ "ఐ యాం స్యూర్. ఏ ప్రేమ విఫలమో లేక మోసగించబడ్డమో తన సూసైడ్ కి కారణం కాదు. అలాగే తన మీద జరిగిన ఏ అట్రాసిటీయో కూడా కారణం కాదు. మీ అంకుల్ ఈ ప్రశ్నలన్నీ అడిగారు. నేను సమాధానం చెప్పాను. మళ్ళీ నీకు కూడా చెప్పే ఓపిక నాకు లేదు." నీరసాన్ని అభినయిస్తూ అంది సమీర.

"ఆల్రైట్. నో మోర్ కొశ్చిన్స్. ఇప్పుడైనా నీకంత ఇంటరెస్ట్ కలిగించిన విషయం అదేమిటో చెప్తావా?" నవ్వుతూ అడిగింది మేనక.

"అదేమిటో చెప్పముందు నీకు ఒక విషయం చెప్పాలి." నిరుపమ ఒకరోజు తన ఇంటికి ఉదయం పదకొండున్నర  సమయానికి రావడం,  తను డాక్టర్ దగ్గరికి నిరుపమని తన ఇంట్లోనే వదలిపెట్టి వెళ్లడం మళ్ళీ తను ఇంటికి వచ్చాక తను వెళ్లి పోవడం వివరంగా చెప్పింది మేనక. "ఇదంతా నేను మీ అంకుల్ కి వివరంగా చెప్పాను. ఫ్యూ సెకండ్స్ మాత్రమే అయినా తన మోహంలో అప్పుడా ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటై ఉంటుంది అన్నది ఇప్పుడు కూడా నాకు అర్ధం కావడం లేదు. అంతే కాదు. నాకు వంట్లో బాగోలేదని తనకి తెలుసు. అయినా ఎలా ఉన్నావని కూడా అడగ లేదు. నేను ఒక్కర్తినే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా నాతో వస్తానని కూడా అనలేదు. నేను కొంచం హర్ట్ అయ్యాను కూడా."

"ఐ సీ" సాలోచనగా తలూపింది మేనక.

"ఆ రోజు నా పేరెంట్స్ ఇంట్లో లేరు. నేను తనని నా బెడ్ రూంలో ఉండమని చెప్పాను. నేను వచ్చేసరికి తను నా బెడ్ రూమ్ లో ఒక ఇంగ్లీష్ నవల చదువుతూ వుంది. వెళ్లిపోయేముందు ఒక అరగంట నాతో కూడా బాగానే మాట్లాడింది."

"ఇదంతా ఇప్పుడే నాకు చెప్పావు కదా. ఏముంది ఇందులో కొత్త విషయం?" కొంచం చిరాగ్గా అంది మేనక.

"మీ డిటెక్టివ్స్ కి కొంచం ఓపిక కూడా తక్కువగా ఉంటుందనుకుంటా." నవ్వుతూ సోఫా లోనుంచి లేచింది సమీర. "రా నాతోటి చూపిస్తాను." అంటూ అక్కడినుంచి నడిచింది. మేనక కూడా ఆమె వెనకాతలే నడిచింది.  తిన్నగా ఆమెని తన బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళింది సమీర.

"ఇది నా బెడ్ రూమ్. నేనొచ్చేసరికి ఈ బెడ్ మీదే కూచుని తను బుక్ చదువుతూ వుంది. అంతకన్నా ముందు బెడ్ మీద అసహనంగా కదులుతూ ఉండి ఉంటుంది." బెడ్ కి దగ్గరగా వెళ్లి అంది సమీర.

" ఇప్పటికీ నువ్వు పాయింట్ కి రాలేదు." అసహనంగా అంది మేనక.

"డిటెక్టివ్స్ కి ఓపిక తక్కువగా ఉంటుందని మరోసారి రుజువు చేసావు." సమీర అంది.

"డిటెక్టివ్స్ ని అందరిని ఇందులోకి తీసుకురాకు. డిటెక్టివ్స్ కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం కొండంత సహనం. నా అంకుల్ ని కొంతకాలం అబ్సర్వ్ చేస్తే నీకా విషయం బోధపడుతుంది. నాకు డిటెక్షన్ అంటే ఇష్టమే కానీ ఇంకా అందులో ప్రొఫెషనల్ కాలేదు. అవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. నా మెయిన్ ఛాయస్ ఫస్ట్ ఎం. ఏ. ఎకనామిక్స్ నెక్స్ట్ పి.హెచ్.డి. నెక్స్ట్ లెక్చరర్ గా పనిచేయడం."

"ఆల్రైట్ డియర్. మై అపాలజీ. ఎనీహౌ విషయానికి వచ్చేస్తున్నాను. ఇలా చూడు." అక్కడ వున్న గోడ దగ్గరికి వెళ్లి ఒకచోట చూపించింది. అది బెడ్ పిల్లోస్ వున్న చోటు. "నిన్న బెడ్ మీద దొర్లుతూ ఉంటే ఆక్సిడెంటల్గా కనిపించింది."

"ఏమిటది?" సమీర వేలుపెట్టి చూపిస్తూన్న చోటికి దగ్గరగా వెళ్లి తానూ చూసింది మేనక. అది బాల్ పాయింట్ పెన్ తో చిన్న అక్షరాలోతో వ్రాయబడి వున్నా స్పష్టంగానే వుంది.

"నేనీ ఫీలింగుని భరించలేను." అది బయటికి చదివింది సమీర.

"యు అర్ రైట్! అదే వ్రాయబడి వుంది." సమీర మొహంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అంది మేనక. "నీ అభిప్రాయంలో అది కచ్చితంగా నిరుపమే రాసిందా?"

"హండ్రెడ్ పర్శంట్ నిరుపమే రాసింది. ఆమె హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు. అంతే కాదు. ఇది ఆ రోజు తను నా బెడ్ రూమ్ లో టైం స్పెండ్ చేసినప్పుడు రాసిందే. అందులో కూడా ఎలాంటి సందేహం లేదు." సమీర అంది. "కానీ తను ఏ ఫీలింగుని భరించలేక పోయిందో నాకు అంతు పట్టడం లేదు."

"ఖచ్చితంగా ఒక నెగటివ్ ఫీలింగ్. అంతే కాదు ఆ ఫీలింగ్ కి, నువ్వు తను రాగానే తన మొహంలో చూసిన ఎక్స్ప్రెషన్ కి కూడా ఎదో లింక్ వుంది." మేనక సాలోచనగా అంది.

"యు అర్ రైట్. కానీ ఏ నెగటివ్ ఫీలింగ్?"

"నాకు తెలిసినంతవరకు ఫీలింగ్స్ కేవలం రెండు రకాలు. పాజిటివ్ అండ్ నెగటివ్. సంతోషం వల్ల వచ్చేవి ఇంకా బాధ వాళ్ళ వచ్చేవి. ఇది ఖచ్చితంగా తను ఎదో బాధ పడుతూ ఉండడం వాళ్ళ వచ్చిన ఫీలింగ్. కానీ ఆ బాధ ఏమిటో ఇప్పుడే చెప్పగలగడం కష్టం. ఇన్వెస్టిగేషన్ ఇంకొంచం ముందుకు సాగాలి." మేనక అంది.

"ఎనీహౌ ఈ క్లూ ఏమైనా ఉపయోగ పడొచ్చా?" భృకుటి ముడిచి అడిగింది సమీర.

"తప్పకుండా ఉపయోగ పడుతుంది. థాంక్ యు వెరీ మచ్ ఫర్ షేరింగ్ ఇట్ లైక్ దిస్. ఇకపై కూడా నువ్వు నాతో ఏది నీ దృష్టిలోకి వచ్చినా ఇలాగే షేర్ చేసుకుంటావు కదా." ఆ రూమ్ లోనుంచి బయటికి నడుస్తూ అంది మేనక. "నెల రోజులు లోపుగా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తానని మా అంకుల్ మాట ఇచ్చ్చారు ఆ రంగనాథ్ అంకుల్ కి. తను వేరే అసైన్మెంట్ లలో బిజీ గా వుంటారు. నేనే మాక్సిమం సాయం చెయ్యాలి."

"వై నాట్? తప్పకుండా. ఇప్పుడు నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ వి కూడా కదా." సమీర నవ్వింది.

"సరే నేను మరి వెళ్ళొస్తాను. సాధ్యమైనంత త్వరలోనే నిన్ను మళ్ళీ కలుస్తాను." అని వీధి గుమ్మం వైపు నడవబోయింది మేనక.

"నా క్లోజ్ ఫ్రెండ్ని మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా పంపిస్తానా? కిచెన్ లోకి రా." అంటూ మేనక కుడిచేతిని పట్టుకుని వంటింట్లోకి తీసుకువెళ్ళింది సమీర.

అక్కడ సమీర కాఫీ కలుపుతూ ఉంటే మేనకకి సడన్గా నిరంజన్ గుర్తుకొచ్చాడు. "నీకు ఇంకా నిరుపమకి కూడా నిరంజన్ అనే అయన చాలా పరిచయం కదా. మా అంకుల్ చెప్పాడు." మేనక అడిగింది.

"ఎస్. అయన ఒక రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్. ఒక వన్ ఇయర్ కిందట ఇక్కడకి దగ్గరలోనే ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు. నిరుపమకి రెలెటివ్ కూడా."

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)