Nirupama - 8 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

నిరుపమ - 8

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"జస్ట్ ఆలా నా ఫ్రెండ్ ని కలుసుకుని మాట్లాడదామని వెళ్ళాను." మేనక మళ్లీ ఇంటికి వెళ్లేసరికి నిర్మల ఒక్కర్తీ మాత్రమే ఇంట్లో వుంది. "సారీ ఎక్కువ సమయం బయట గడిపేసినట్టుగా వున్నాను."

"ఏం పర్లేదులే. నిరుపమ కూడా ఇంతే. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందంటే, ముఖ్యంగా ఆ సమీర ఇంటికి వెళ్లిందంటే సమయం తెలియదు. ఎంత సేపైనా అక్కడే ఉండిపోతుంది." కుర్చీలోనుంచి లేస్తూ అంది నిర్మల. "నువ్వు కాస్త నీ రూంలో రెస్ట్ తీసుకుంటూ వుండు, నేను వంటింట్లో పనిపూర్తి చేస్తాను."

"మీరు ఏమి అనుకోకపోతే ఆంటీ నేను మీకు వంటింట్లో సాయం చేస్తాను." ఆమె మొహంలోకి చూస్తూ అంది మేనక. "నాకు వంట ఏమీ రాదు. మామ్ నేర్చుకోమంటుంది. కానీ నాకే నేర్చుకోవాలనిపించదు. కానీ మామ్ కి మాత్రం వంటింట్లో సాయంగా వుంటూ వుంటాను."

"నీకు నిరుపమకి తేడా ఏమీ కనిపించడం లేదు. తనని వంట నేర్చుకోమని అలా చెప్తూనే వుంటాను. ఇక్కడ కాకపోయినా అత్తారింట్లో మీరు వంట చెయ్యాలి కదా. కానీ తను వినదు. తనకి మూడ్ కుదిరితే వంటింట్లో నాకు సాయం మాత్రం చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు." నవ్వి అంది నిర్మల. "కానీ నీకు చెయ్యాలనిపిస్తే నా అభ్యంతరం ఏమీ లేదు."

"ఓహ్, ఆంటీ. థాంక్ యు వెరీ మచ్." నిర్మలని కౌగలించుకుని తన కుడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది మేనక.

"నువ్వు ప్రతినిమిషం నిరుపమనే గుర్తు చేస్తున్నావు." నీలినీడలు అలుముకున్నాయి నిర్మల మోహంలో. "తానూ అంతే ఏ ఎమోషన్ దాచుకోలేదు. ఎక్ష్ప్రెస్స్ చేసేస్తుంది."

"ఐ యామ్ సారీ అంటీ." ఆమెని విడిచిపెట్టి మామూలు అవుతూ ఎందుకందో తెలీదు కానీ అంది మేనక. అప్పుడు ఆ మొహంలోకి చూస్తూ ఉంటే గుండెలు నులుముతున్నట్లుగా అనిపిస్తూంది మేనకకి. అంకుల్ చెప్పింది నిజం. ఈమె తన కూతురు బ్రతికి వున్నట్టుగా తనని తను ఫోర్స్ చేసుకుంటూంది కానీ తనకి తెలుసు తను ఇక  లేదని.

"సారీ దేనికి? నేను తనకి చెప్తాను. అచ్చం అన్నిరకాలుగా తనలాగే వున్న అమ్మాయి తనకి ఫ్రెండ్ కాబోతోందని. ఈ సారీ తను ఫోన్ చేస్తే తనకి నీ గురించి చెప్తాను. నువ్వు మాట్లాడుదువు గని." ఇంకా మేనక మొహంలోకి చూస్తూ అంది నిర్మల. ఆ మోహంలో ఆ నీలినీడలూ అలాగే వున్నయి.

"ఒకే ఆంటీ అలాగే చేద్దాం. కానీ వంటింట్లోకి వెళ్దామా? వంట ప్రారంభించాలికదా. నాకు ఆకలి కూడా వేస్తూంది." తన కుడి చేతిని నిర్మల భుజాల చుట్టూ వేస్తూ అంది మేనక.

"మరి చెప్పవేం? వంటింట్లో నీకు ఇష్టమైనవి ఏంటో కూడా చెప్పు. అవే చేస్తాను." అక్కడినుంచి కదులుతూ అంది నిర్మల. ఆమె వెనకాతలే నడిచింది మేనక.

&

మేనకకి తన అసైన్మెంట్ గుర్తు వుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతోందో జాగ్రత్తగా అబ్సర్వ్ చేసి తన అంకుల్ కి చెప్పాలి. కానీ తను ఇక్కడ వున్న ఈ రెండు రోజుల్లో ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. అంతా మామూలుగానే వుంది. ఇంక అంతా అలాగే ఉంటుందేమో ఈ నెలరోజులూ అనికూడా అనుమానంగా వుంది. ఇలా అయితే తన అంకుల్ ఆ నిజాన్ని ఎలా బయటికి తియ్యగలడు తనిచ్చిన నెలరోజుల సమయంలో?

"నీకంత సౌకర్యంగానే వుందికదా ఆ రూంలో? నీకేం కావాలన్నా కూడా అడగడానికి మొహమ్మాటపడకు." స్టవ్ మీద కుక్కర్ పెడుతూ అంది నిర్మల.

"చాల సౌకర్యంగానే ఉంది. నేను ఏం కావాలన్నా కూడా మిమ్మల్ని అడగడానికి ఎప్పుడూ మొహమ్మాట పడను. నేను మీ దగ్గర చాల ఇంటిమేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎంత ఇంటిమేట్ గా అంటే మా మామ్ వచ్చేసిన తరువాత కూడా నాకు ఇక్కడే ఉండాలని వుంది." ఆమె ఇచ్చిన వంకాయలని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని, డైనింగ్ టేబుల్ మీద ప్లేటులో పెట్టి చాకుతో తరుగుతూ అంది మేనక.

"నిజంగా, నిజంగా నువ్వు అలా చేస్తావా?" మేనక దగ్గరగా వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేస్తూ అడిగింది నిర్మల.

"ఎందుకు చెయ్యను ఆంటీ?" చాకుని వంకాయలని ప్లేటులో వదిలేసి, నిర్మల మొహంలోకి చూస్తూ అంది "చూస్తూ వుండండి. మీరు వెళ్ళమనేంతవరకూ నేను ఈ ఇంట్లోనే వుంటాను."

"నాకు చాలా సంతోషంగా వుంది నువ్వు చెప్పింది విన్నాక. నువ్విక్కడ ఉంటే నాకు నిరుపమ ఉన్నట్టుగానే వుంది." ఇంకా ఏదో అనబోతూ వుంది కానీ అంతలో రంగనాథ్ ప్రవేశించాడు ఆ గదిలోకి.

"హాయ్ అంకుల్. మీ గురించే చూస్తూ ఉన్నాను. ఈ రోజు వంట మేమిద్దరం కలిసి చేస్తున్నాం. ఎలా వుందో మీరు నాకు చెప్పాలి." మళ్లీ వకంకాయలు తరగడంలో నిమగ్నం అవుతూ అంది మేనక.

" చాలా బాగానే ఉంటుంది. రుచి చూడకుండానే నేను ఆ విషయం చెప్పగలను." రంగనాథ్ నవ్వాడు. "అయినా నువ్వు తననెందుకు ఇబ్బంది పెట్టావు?" చిరుకోపంతో నిర్మల మొహంలోకి చూసాడు రంగనాథ్.

"నేనిబ్బంది పెట్టనా? తననే అడగండి." నిర్మల కూడా కోపంగా అంది.

"అంకుల్, నేనే కావాలని వంట నేర్చుకుంటానంటే ఆంటీ ఎలొ చేసారు." అప్పటికి వంకాయలు తరగడం పూర్తి కావడంతో లేచి నిలబడింది మేనక. "అయినా ఇప్పటివరకు ఈ వంకాయలు తరగడం తప్ప నేను చేసిందేమి లేదు."

" ఇంక నువ్వు చేయ్యాల్సిందీ ఏమీ లేదు. ఈ వంకాయల కూర చేసేస్తే ఈ రాత్రికి ఇంకా ఏమీ అఖ్ఖర్లేదు. నువ్వెళ్ళి మీ అంకుల్ తో కబుర్లు చెప్తూ వుండు. నేను కాఫీ తీసుకొస్తాను మీ ఇద్దరికీ." ఆ వంకాయల ముక్కలున్న ప్లేట్ ని అక్కడనుండి తీస్తూ అంది నిర్మల.

"సరే ఆంటీ." అని అక్కడనుంచి కదిలింది మేనక. ఆమెతో పాటుగానే కదిలాడు రంగనాథ్ కూడా.

&

"నిన్ను చూస్తూ వుంటే నిరుపమని చూస్తున్నట్టుగానే ఉందమ్మా. మనసుకి కాస్త స్వాంతనగా వుంది." కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకుంటూ అన్నాడు రంగనాథ్.

తన కుర్చీని రంగనాథ్ కుర్చీకి దగ్గరగా లాక్కుని అయన కుడి భుజం మీద తన కుడిచేతిని వేసింది మేనక. అయన కళ్ళు తెరిచి, తల తిప్పి మేనక మొహంలోకి చూసాడు.

"మీకు కొంతైనా నావల్ల స్వాంతన కలిగినందుకు నాకు ఆనందంగా వుంది అంకుల్. మీ జీవితంలో అతి పెద్ద విషాద సంఘటన జరిగింది. కానీ అది మర్చిపోయి మీరు మాములు మనుషులు కాక తప్పదు. అందుకు నేను జీవితాంతం ఇక్కడే ఉండడం అవసరం అయినా నాకు అభ్యంతరం లేదు." మేనక అంది.

"నేను మీ అంకుల్ ని సంప్రదించడం వల్ల ఇంత మంచి అమ్మాయి తో నాకు పరిచయం కలుగుతుందని నేను ఊహించలేక పోయాను. ఎందుకు నా గురించి నీకు అంతగా ఫీలింగ్ కలుగుతూంది?" కళ్ళు చిట్లించి అడిగాడు రంగనాథ్.

"చెప్పలేను అంకుల్. నాకు తెలీదు." కాస్త ఆగి దీర్ఘంగా నిట్టూర్చింది. "కానీ తన ఫోటో చూసి, తను సూసైడ్ చేసుకుందని తెలియగానే నా హృదయం బరువెక్కి పోయింది. ఇంకా మిమ్మల్ని, ఆంటీని చూస్తూ ఉంటే...." కారుతూ వున్న కన్నీళ్ళని నిగ్రహించుకోవడం మేనక వశం కాలేదు. "……నేను నా బాధని తట్టుకోలేక పోతున్నాను."

"నన్ను మామూలు మనిషిని కమ్మని చెప్పి నువ్వు నాలా కాకు." తన భుజం మీద వున్నఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కాడు రంగనాథ్.

"సారీ అంకుల్" తన చేతిని అయన చేతుల్లోంచి విడిపించుకుని కన్నీళ్లు తుడుచుకుంది మేనక. "నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరు ఏమనుకుంటారో అని భయంగా వుంది."

"నా అమ్మాయికి నా దగ్గర భయమా? చెప్పు అదేంటో?" కుర్చీలో అడ్జస్ట్ అయి, నిరుపమ మోహంలోకే ఆసక్తిగా చూస్తూ అడిగాడు రంగనాథ్.

" అంకుల్, నేను మీ గురించి అంతా చెప్పాము మామ్ కి. మామ్ కూడా చాలా బాధపడింది. వచ్చి మీతో మాట్లాడాలనుకుంటూంది. మీకేం అభ్యంతరం లేదు కదా?"

"అభ్యంతరమా? మా గురించి ఇలా ఆలోచించే వాళ్ళున్నారంటే నాకు సంతోషం గా వుంది. తనని ఖచ్చితంగా మా ఇంటికి రమ్మను. ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం." ఇంకా ఏదో అనబోతూ నిర్మల అక్కడికి రావడం చూసి ఆగి పోయాడు.

"వంకాయ కూర చేసి ఇంకా అన్ని సిద్ధం చేసేసరికి లేటయింది. ఇంకేం కాఫీ తాగుతారు? వచ్చి మీరిద్దరూ భోజనాలు చేసెయ్యండి." నిర్మల వాళ్ళిద్దరికీ దగ్గరగా వచ్చి అంది.

రంగనాథ్ ఇంకా మేనక ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు.

&

భోజనం పూర్తి చేసి, రంగనాథ్ ఇంకా నిర్మలతోటి కొంతసేపు మాట్లాడాక మేడ మీద తన గదిలోకి వచ్చింది మేనక. బెడ్ మీద వాలి కళ్ళు మూసుకోగానే మొదటి రెండు రోజులు ఎలా అనిపించిందో అలాగే ఏదో భయంగా అనిపించింది. ఇదే గదిలో, ఈ బెడ్ మీద వున్న సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది ఆ అమ్మాయి. ఎంత తనకి స్పిరిట్స్ మీద నమ్మకం లేక పోయినా ఎదోలాగే వుంది. తెల్లవారేక మాత్రం చాలా ధైర్యంగా రాత్రి ఫీలింగ్ కి సిగ్గుగా అనిపిస్తూంది. కళ్ళు మూసుకుని బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన సెల్ ఫోన్ మోగింది. ఫోన్ తీసుకుని చూసింది, తన అంకుల్ స్మరన్.

"ప్రత్యేకంగా రిపోర్ట్ చెయ్యడానికి ఏమీ లేదు అంకుల్. ఎవ్విరిథింగ్ ఈజ్ ఏజ్ యూజువల్. అందుకనే కాల్ చెయ్యలేదు నీకు." నిట్టూరుస్తూ అంది మేనక.  

"ఇట్స్ ఆల్రైట్. నో ప్రాబ్లెమ్." స్మరన్ అన్నాడు. "ఈ అసైన్మెంట్ కి సంబంధించి రేపు నువ్వొక పని చేసిపెట్టాలి."

"ఏ బ్రేక్ టు ది రొటీన్. ఐ లవ్ ఇట్. అదేంటో చెప్పు." నవ్వుతూ అడిగింది.

"నేను నిరుపమ ఫ్రెండ్ సమీర తో మాట్లాడాను. తనకి ఏమైనా సడన్ గా గుర్తుకు వస్తే ఫోన్ చేసి చెప్పమని చెప్పాను."

"తనకి ఏమైనా గుర్తుకు వచ్చిందా?" ఆసక్తిగా అడిగింది మేనక.

"ఏమీ గుర్తుకు రావడం కాదు. షి ఫౌండ్ సంథింగ్ ఇంటరెస్టింగ్! ఫోన్లో చెప్పడానికి అవదు వచ్చి చూడాలంటూంది. నాకు రేపు వెరీ అర్జెంటు వర్క్ వుంది. నువ్వు రేపు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి అదేంటో చూడు."

"ఓహ్, థాంక్ యు అంకుల్. నేను జస్ట్ ఇలాంటి బ్రేక్ గురించే చూస్తున్నాను. రేపు టెన్ కి అలా వెళ్ళనా?" ఉత్సాహంగా అంది.

"బెస్ట్ టైమింగ్. నేను అడ్రస్ చెప్తాను. నువ్వున్న ఇంటికి దగ్గరే. తేలికగా గుర్తు పట్టొచ్చు ఆ ఇల్లు. అలాగే ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. వెళ్లేముందు ఒకసారి ఫోన్ చేసి నువ్వు నా  నీస్ వి ఇంకా అసిస్టెంట్ వని అదేంటో చూడడానికి నేను పంపిస్తున్నాని చెప్పు."

"ఒకే అంకుల్. అలాగే చేస్తాలే."

"సరే అయితే. జాగ్రత్తగా విను." స్మరన్ అడ్రస్ చెప్తూ ఉంటే జాగ్రత్తగా వింది మేనక. "నేనిప్పుడే ఆమె ఫోన్ నెంబర్ కూడా నీకు షేర్ చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు స్మరన్.

స్మరన్ నుంచి వచ్చిన సమీర ఫోన్ నెంబర్  మెసేజ్ చూసాక మళ్లీ నిద్రకి ఉపక్రమించింది మేనక. ఈసారి పెద్దగా కష్టపడకుండానే నిద్రలోకి జారిపోయింది.


&

తెల్లవారి తెమిలి పదవుతూ ఉంటే సమీర నెంబర్ కి కాల్ చేసింది మేనక. స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. కాస్త ఆగి ట్రై చేసినా అలాగే వచ్చింది. వెళ్లాలో లేదో తెలియక కాస్సేపు అయోమయంలో పడింది. తన అంకుల్ కి ఫోన్ చేసి చెప్దామా అనుకుని మళ్ళీ ఆగిపోయింది. తాను ఎవరితోనైనా ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉంటే అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది. సమీర దగ్గరికి వెళ్లే పని పోస్టుపోన్ చేసుకుందామా అని కూడా ఆలోచించింది. కానీ ఇంట్లో చాలా బోర్ కొడుతూ వుంది. ఈ సమీర దగ్గరకన్నా వెళ్తే కాస్త కాలక్షేపం కావచ్చు. అంకుల్  చెప్పిన ప్రకారంగా ఇల్లు పెద్ద దూరం కూడా కాదు. తేలిగ్గానే వెళ్లొచ్చు. ఫోన్ చెయ్యకుండానే వెళ్లిచూద్దాం ఏమవుతుందిలే అన్న నిర్ణయానికి వచ్చింది. అప్పటికి నిర్మల, రంగనాథ్ ఇద్దరూ ఇంట్లోనే వున్నరు. చిన్న పనిమీద బయటికి వెళ్తున్నాను అని చెప్పి బయట పడింది. సమీర ఇంటికి వెళ్తున్నాను అని వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు.

స్మరన్ చెప్పినట్టుగా ఆ ఇల్లు కనిపెట్టడం చాలా తేలికే అయింది. ఇంటిముందు పెద్ద లాన్ వుంది. చెట్లు వున్నయి. ఇంటిముందు ఒక బోర్డు కూడా వుంది ' ఎన్. ముకుందం, ఎఫ్.సి.ఏ.' అని. తలుపులు మాత్రం దగ్గరకి వేసి వున్నయి. ఇంట్లో ఎవరైనా వున్నరా లేదా అనుకుంటూ తలుపుల దగ్గరకి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కేప్పుడు మాత్రం ఎదో మొహమ్మాటంగా అనిపించింది. తను ఫోన్ చేసి రాలేదు, తానెవరో ఈ ఇంట్లో ఎవరకి తెలియదు. రెండవసారి కాలింగ్ బెల్ నొక్కాలా వద్ద అని ఆలోచిస్తూ వుంటే తలుపులు తెరుచుకున్నాయి.

ఎదురుగుండా తనంత వయసే వున్న అమ్మాయి వోణీలో వుంది. కచ్చితంగా సమీరే అయిఉంటుంది. కానీ మేనక ఇమ్మీడియేట్ గా నోటీసు చేసిన విషయం ఏమిటంటే నిరుపమ ఎంత అందంగా వుందో ఈ అమ్మాయీ అంత అందంగానూ వుంది. నిరుపమ చనిపోయింది కాబట్టి తనకేమి అనిపించలేదు. కానీ ఈ అమ్మాయిని ఇలా చూస్తూ ఉంటే కొంత జెలసీ గా అనిపించింది. ఇప్పటివరకు తనే ఎంతో అందంగా ఉంటుందన్న అభిప్రాయంలో వుంది.

"హాయ్, నేను..." తన మొహంలోకి షాక్ తో, ఇంకా ఆశ్చర్యంతో చూస్తూన్న సమీర మొహంలోకి చూస్తూ ఎదో చెప్పబోయింది మేనక. సమీర ఎందుకలా ఆశ్చర్య పోతూ వుందో మేనకకి అర్ధం కాలేదు.

"నువ్వు వచ్చేసావా... నా గురించి వచ్చేసావా!" వణుకుతూవున్న గొంతుతో అంది సమీర.

"మీరంటున్నది నాకు అర్ధం కావడం లేదు. నేను ఎవరు అనుకుంటున్నారు?" అయోమయంగా అడిగింది మేనక.

"నేనుండలేనని వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు నా గురించి వస్తావని." మేనక ఇంకా ఎదో చెప్పబోయే లోపల సమీర మేనకని గట్టిగ హత్తుకుంది.

"మై గాడ్, నేను మీరనుకుంటన్నట్టు నిరుపమని కాదు." అప్పటికి విషయం అర్ధం అయి, తను కూడా సమీర చుట్టూ చేతులు వేస్తూ, అంది మేనక. "నేను డిటెక్టివ్ స్మరన్ నీస్ ని. మీరేదో ఇంటరెస్టింగ్ థింగ్ నిరుపమకి సంబంధించి కనిపెట్టారట కదా. మా అంకుల్ ఎదో అర్జెంటు పనిమీద బయటకి వెళ్లారు. చూసి రమ్మని నన్ను పంపించారు."

"మై గాడ్!" సడన్ గా సమీర మోహంలో డీప్ డిజప్పోయింట్మెంట్ కనిపించింది. "ఐ యాం సారీ. రియల్లీ సారీ. మీరు లోపలికి రండి." గట్టిగా నిట్టూరుస్తూ, మేనకని వదలి, తన చుట్టూవున్న మేనక చేతుల్ని విడిపించుకుని లోపలి నడిచింది. "ఆ కుర్చీలో కూర్చోండి." లోపలి వెళ్ళాక అక్కడే వున్న సోఫాలో కూలబడుతూ ఎదురుగా వున్న కుర్చీని చూపించింది.

"ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు తన డెత్ వల్ల మీరెంత ఎఫెక్ట్ అయ్యారో చెప్పడానికి." ఆ కుర్చీలో కూర్చుంటూ అంది మేనక.

"రాత్రంతా తనే కలలో వుంది. తెల్లారేక కూడా తన గురించే ఆలోచిస్తూ వున్నాను. మీరు కూడా తనంత హెయిట్ తో, తనంత అందంగానూ, ఇంకా తానెక్కువగా వేసుకునే పంజాబీ డ్రెస్, రెండు జళ్లతో ఉండేసరికి, మూమెంటరిగా తనే అని భ్రమ పడిపోయాను. ఐ యాం సారీ." సోఫాలో వెనక్కి  జారగిలబడుతూ అంది సమీర.

"యు నీడ్ నాట్. నిజానికి నేను కూడా తన గురించే ఆలోచిస్తూ వున్నాను. నేను ఆ ఇంట్లో, ఆమె గదిలోనే ఉంటూ వున్ననేమో నా మనసంతా కూడా నిరుపమతోనే నిండి పోయి వుంది." తానూ వెనక్కి కుర్చీలో వాలుతూ అంది మేనక.

"మీరు ఆ ఇంట్లో వుండడమేమిటి, నాకు అర్ధం కావడం లేదు." ఆశ్చర్యంగా అంది సమీర.

అప్పుడు మేనక, స్మరన్ తనకి అప్పచెప్పిన అసైన్మెంట్ గురించి చెప్పింది. "ఇప్పటివరకు నేను నోటీసు చేసింది ఏమీ లేదు. నాకు అక్కడ ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇంకా ఆ పెద్దవాళ్ళని ఇద్దరినీ ఆలా చూస్తూ ఉండలేక పోతున్నాను. ఆ నిర్మల తన కూతురు బ్రతికి ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తూంది." నిట్టూర్చింది మేనక.

"ఆ ఇంటికి వెళ్తే నిరుపమ జ్ఞాపకాల్ని నేను తట్టుకోలేను. అందుకనే ఆ పెద్దవాళ్ళిద్దరూ ఆలా సఫర్ అవుతున్నా నేను అక్కడికి వెళ్లడమే మానేసాను." సమీర కూడా నిట్టూర్చింది.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)