Orei Bawa - Osei Maradala - 13 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 13

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 13

ఆఫీస్ చేరుకోని లోపల అడుగుపెట్టిన రామ్ ని చూసి నీతూ ఎగ్జైటింగ్ గా రామ్ దగ్గరికి వచ్చి అభి అని పిలుస్తూ హత్తుకోవడానికి రెండు చేతులు ముందుకు చాప గానే రామ్ సీరియస్గా నీతూ వైపు చూస్తూ తనని హత్తుకోవడానికి వస్తుందని అర్థమయ్యి చెయ్యి పెట్టి రెండు అడుగుల దూరంలోనే ఆపేసి “ మనం ఆఫీస్ లో ఉన్నాము నీతూ!!!! పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు!!! ఇకనుంచి నాకు కొంచెం దూరంగా ఉండు..... “ అని సీరియస్ గా చెప్పి “ నేను ఎండి ని కలిసి వస్తాను అని ఎండి కాబిన్ కి వెళ్ళిపోయాడు

@@@@@@

పర్మిషన్ అడిగి లోపలికి వెళ్లిన రామ్ ని చూసిన ఎండి “ రా రా అభి నీకోసమే వెయిట్ చేస్తున్నాను..... థాంక్యూ అభి బాగో లేకపోయినా ఇచ్చిన వర్క్ చేసినందుకు!!! ఇంతకీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది??? “ అని నవ్వుతూ అడిగాడు

రామ్ నవ్వుతూ “ సారీ సార్ మీకు ఒక నిజం చెప్పకుండా దాచాను..... యాక్చువల్ గా నాకు బాగోలేక లీవ్ పెట్టలేదు..... నా పెళ్లి ఫిక్స్ అయింది అది కూడా సడన్గా అందుకే ఇక్కడ అందరికీ చెప్పి హడావిడి చేయడం ఇష్టం లేక సిక్ లీవ్ పెట్టి వెళ్లాను...... మొన్నే ఊరికి వచ్చాను నిన్నంతా ఇల్లు సర్దుకుంటూ సరిపోయింది అందుకే ఈరోజు వచ్చాను...... “ అని అన్నాడు

ఎండి ముందు షాక్ అయినా వెంటనే సంతోషిస్తూ “ కంగ్రాట్స్ అభి “ అంటూ పైకి లేచి హత్తుకోగానే “ థాంక్యూ సర్ మీ దగ్గర అబద్ధం చెప్పినందుకు మరోసారి సారీ..... “ అని అన్నాడు

“ అభి మనిద్దరం ఒకే వయసు వాళ్ళం ఎన్నిసార్లు చెప్పాను నన్ను పేరు పెట్టి పిలవమని!!!! అయినా నువ్వు పిలవవు..... సరే ఓకే మరి ఇన్నిసార్లు సారీ చెప్పటం ఏంటి???? పర్వాలేదు ఇంతకీ నా చెల్లెమ్మని ఎప్పుడు పరిచయం చేస్తావ్??? “ అని అడిగాడు ఎండి అయినా కృష్ణ

“ హహహ సార్ ఇప్పుడు టైం లేదు కదా పైగా ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర్లో ఉంది సో ఫస్ట్ నేను ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను..... ఇప్పుడు ఫంక్షన్స్ పార్టీస్ అంటూ ఇవన్నీ పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు..... కొన్ని రోజులాగి గ్రాండ్ గా నా భార్యని నేనే అందరికీ పరిచయం చేస్తాను..... అప్పటివరకు మీరు కూడా ఎవరికి చెప్పకండి..... నేను మొదట మీకే చెప్తున్నాను ఎందుకంటే అబద్ధం చెప్పటం నాకు నచ్చదు కాబట్టి..... “ అని అన్నాడు రామ్

“ హహహ అవి నాకు తెలుసుగా నీ సిన్సియారిటీ అందుకే కదా నువ్వు సిక్ లీవ్ తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చినా సీరియస్ అవ్వకుండా సరదాగా మాట్లాడుతుంది!!! ఓకే జోక్స్ ఎ పార్ట్ ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పటికీ సబ్మిట్ చేస్తావు??? “ అని అడిగాడు కృష్ణ

“ హా సార్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఇంకొక టూ త్రీ డేస్ లో టోటల్ వర్క్ అయిపోతుంది..... ఇక మళ్లీ ప్రాజెక్ట్ వెరిఫై చేసుకుని ఎర్రర్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడమే!!! “ అని అన్నాడు రామ్

“ ఓకే అభి వీలైనంత త్వరగా వర్క్ కంప్లీట్ చేయడానికి చూడు.... నవ్ యు గో టు యువర్ వర్క్..... “ అని అనగానే “ ఓకే సార్ థాంక్యూ... “ అని చెప్పి బయటికి వెళ్లి తన క్యాబిన్లో కూర్చున్నాడు రామ్

రామ్ ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న నీతూ రామ్ వెళ్లి తన క్యాబిన్లో కూర్చోగానే వెంటనే రామ్ క్యాబిన్ లోకి పర్మిషన్ లేకుండా మరి వెళ్లి “ అభి మొన్న షాపింగ్ మాల్లో నువ్వు చెయ్ పట్టుకొని తీసుకువెళ్లావు కదా ఆ అమ్మాయి ఎవరు??? తనతో అంత క్లోజ్ గా ఉన్నావు ఏంటి??? నువ్వు త్వరగా ఏ అమ్మాయితో క్లోజ్ అవ్వవు కదా!!!! “ అని అనుమానం గా అడిగింది

సిన్సియర్ గా వర్క్ చేసుకుంటున్నా రామ్ సడన్గా నీతూ అలా అడిగేసరికి కోపం వచ్చిన అది చూపించే సమయం కాదని తల పైకెత్తి “ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నీతూ...... ఇక్కడ ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడాలి పర్సనల్ ఇష్యూస్ తీసుకురాకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా???

అయినా వర్కింగ్ టైం లో ఇలా వచ్చి మాట్లాడుతున్నావేంటి??? మన ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర్లోనే ఉంది మర్చిపోయావా??? నేను ఇచ్చిన వర్క్ మొత్తం చేసేసావా???? చేస్తే నాకు సబ్మిట్ చేసి తర్వాత వచ్చి మాట్లాడు..... “ అని అన్నాడు

ఆఫీస్ లో వర్కింగ్ టైంలో పర్సనల్ విషయాలు మాట్లాడితే రామ్ కోపం వస్తుందని గుర్తుకు వచ్చిన నీతూ “ సారీ సారీ అభి ఓకే నేను వెళ్తున్నాను వర్క్ చేస్తాను..... లంచ్ టైం లో మాట్లాడుకుందాము.... “ అని చెప్పి తన క్యాబిన్ కి వెళ్ళిపోయి రామ్ ఇచ్చిన వర్క్ చేసుకుంటూ ఉంటుంది

@@@@@@

రామ్ వెళ్లిపోయిన తర్వాత సీతకి బోర్ గా అనిపించి ఇల్లంతా తిరుగుతూ ఏమైనా ఆర్గనైజ్ చేద్దాము అనుకొని మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏం పెడదాము ఏం పెడితే అందంగా ఉంటుంది అని నోట్ చేసుకొని అవన్నీ ఆన్లైన్ బుక్ చేసుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపేసి అభి ఆల్రెడీ వండి ఉంచిన లంచ్ ని మైక్రోవేవ్లో హీట్ చేసుకుని తినేసి “ బావ భోజనం చేశాడో లేదో!!! “ అనుకుంటూ ఫోన్ తీసుకొని రామ్ కి ఫోన్ చేస్తుంది

అప్పటివరకు వర్క్ చేసుకుంటూ ఉన్న రామ్ సెల్ రింగ్ కి డిస్టర్బ్ అయి ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ చూడగానే స్క్రీన్ మీద అందమైన లంగా వోణీ లో మెరిసిపోతున్న సీత ఫోటో కనిపించగానే పెదవుల మీద నవ్వు ఆటోమేటిక్గా వచ్చేసి ఫోన్ లిఫ్ట్ చేసి “ చెప్పవే ఏంటి ఫోన్ చేశావు??? “ అని ఒక చేతితో కీబోర్డ్ మీద వేలు ఆడిస్తూనే అడిగాడు

అప్పుడే లంచ్ టైం అయిందని నీతూ రామ్ ని తీసుకొని క్యాంటీన్ కి వెళ్దామని వచ్చి రామ్ చేతిలో ఫోన్ అది కూడా నవ్వుతూ మాట్లాడటం అది కూడా వర్క్ చేస్తున్నప్పుడు చూసి షాక్ అయ్యి క్యాబిన్ డోర్ దగ్గరే నిలబడి చూస్తూ ఉంది.....

“ లంచ్ చేసావా బావ “ అని సీత అడగగానే “ లేదే ఇంకా టైం ఉంది కదా!!! “ అని అన్నాడు రామ్

సీత చిరు కోపంగా” ఏంటి బావ టైం ఫుడ్ తీసుకోకపోతే ఎలా చెప్పు??? అయినా ఫుడ్ ఎవరైనా నెగ్లెట్ చేస్తారా???? ముందు వెళ్లి అన్నం తిని వర్క్ చెయ్ ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు లేదంటే అప్పటివరకు నేను తినను.... “ అని పీకల దాకా తిన్నా కూడా తినలేదని అబద్ధం చెప్పింది

“ ఏంటి నువ్వు ఇంకా తినలేదా??? “ నీ కీబోర్డ్ మీద వేళ్ళని ఆడించటం ఆపేసి షాక్ గా అడిగాడు రామ్

“ హా బావ అన్నం తినడానికి కూర్చోగానే నువ్వే గుర్తుకు వచ్చావు..... నువ్వు తిన్నావా లేదా అడుగుదామని ఫోన్ చేశాను!!! కానీ నువ్వు తినలేదు కదా నువ్వు తినే వరకు నేను తినను..... నువ్వు నా కడుపు మాడుస్తావో లేకపోతే నువ్వు తిని నా కడుపు నింపుతావో నీ ఇష్టం!!!! “ అని చెప్పి ఫోన్ కట్ చేయగానే

రామ్ ఫోన్ ని తలకేసి కొట్టుకుంటూ మెంటల్ ది అని అనుకోని లాప్టాప్ క్లోజ్ చేసి తను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేయగానే నీతూ లోపలికి వచ్చి “ అభి రా కాంటీన్ కి వెళ్లి తిందాం..... “ అని ఏమీ చూడనట్టు తెలియనట్టు నవ్వుతూ అంది

రామ్ నవ్వుతూ “ లేదు నీతూ నేను క్యారేజ్ తెచ్చుకున్నాను అదే తింటాను..... “ అనగానే నీతూ ఒకే అని అయోమయంగా “ ఒక విషయం అడుగుతాను చెప్తావా అభి??? “ అని అడిగింది

“ హ నీతూ “ అని తింటూ అనగానే “ ఇప్పటివరకు నీతో మాట్లాడిన అమ్మాయి ఎవరు??? నువ్వు ఎవరితోనూ అంత క్లోజ్ గా మాట్లాడవు కదా మరి ఇంత క్లోజ్ గా మాట్లాడావంటే తను నీకు ఎంత స్పెషల్ నో అర్థమవుతుంది!!!! “ అనగానే రామ్ బ్లష్ అవుతూ “ హా చాలా స్పెషల్ “ అని మనసులో తను మాట్లాడింది తన భార్యతో అని చెప్పాలని ఉన్నా సీతకి షాక్ ప్లస్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకొని “ తను నా మరదలు నేను తిన్నానా లేదా అని కనుక్కోవడానికి ఫోన్ చేసింది..... “ అని అన్నాడు

“ డు యు లవ్ హర్??? “ అని నీతూ అనుమానంగా అడగగానే అది వినిపించనట్టే రామ్ లంచ్ చేస్తూ ఉంటే అభి అని మళ్ళీ పిలిచింది నీతూ

“ ఏంటి నీతూ పదేపదే విసిగిస్తున్నావు లంచ్ చేయనివ్వు..... అసలే వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది నాది...... ఇన్ని రోజులు సరిగా చేయలేదు కదా!!!! “ అని సీరియస్ గా చెప్పి బాక్స్ ఖాళీ చేస్తూ ఉంటే నీతూ అయోమయంగానే బయటికి వెళ్లిపోయి క్యాంటీన్లో సాండ్విచ్ ఆర్డర్ చేసుకొని అది తినేసి వాటర్ తాగేసి తన క్యాబిన్ కి వెళ్ళిపోయింది

రామ్ తన బాక్స్ ఖాళీ చేశాక సీతకి ఫోన్ చేసి తిన్నాను అని చెప్పగానే “ హహ బావ నేను కూడా ఆల్రెడీ తినేసాను.... నీ చేత తినిపించడానికి జస్ట్ చిన్న అబద్ధం ఆడాను...... లేకపోతే నువ్వు తినవు కదా!!! వర్క్ లో పడితే నిన్ను నువ్వే మర్చిపోతావు..... “ అని అంది

“ నా దగ్గర అబద్ధాలు చెప్తావా ఇంటికి వచ్చాక చెప్తానే పని..... బాయ్ వర్క్ ఉంది..... ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్..... “ అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేసి వర్క్ లో పడిపోయాడు

@@@@@@@

రామ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో త్రీ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యి ఇప్పుడు తన టాలెంట్ తో రీసెంట్గా టీఎల్ వరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ ని తన అండర్లో కంప్లీట్ చేస్తున్నాడు..... ఇది తన అండర్లో కంప్లీట్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ అందుకే రామ్ అంతా సీరియస్ గా సిన్సియర్గా కంగారుగా ప్రాజెక్ట్ మొత్తం క్లియర్ గా ఉండాలని పగలు రాత్రి తేడా లేకుండా శ్రమ పడుతూ ఉన్నాడు.....

కానీ సడన్గా పెళ్లి అని చెప్పేసరికి వన్ వీక్ లీవ్ తీసుకుని ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకొని ఖాళీగా ఉన్న సమయంలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ తన ప్రాజెక్ట్ త్వరగా మంచి క్వాలిటీ ఉండేలా ఫినిష్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాడు......

ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రామ్ కి మంచి పేరు వచ్చి హైక్ కూడా వస్తుంది...... తను అంత త్వరగా టిఎల్ అయినందుకు అందరూ ఈర్ష్య చెందకుండా తన టాలెంట్ తో మాత్రమే ఆ పోజిషన్ వరకు వెళ్ళాడని నిరూపించాలి అనుకున్నాడు...... బికాస్ తన కంటే ముందుగా జాయిన్ అయిన వాళ్లు కూడా ఇప్పటికీ కొందరు టీమ్ మెంబర్స్ గానే ఉన్నారు......

సాయంత్రం రామ్ ఇంటికి వెళ్లేసరికి అది హైదరాబాద్ అయ్యేసరికి ఆన్లైన్ షాపింగ్ చేసిన త్వరగా డెలివరీ ఇవ్వటం వలన సీత ఫ్లాట్ ని తనకి నచ్చినట్టు రెన్యువల్ చేసి అందంగా మార్చేసింది.....

రామ్ ఫ్లాట్లోకి అడుగుపెట్టటమే మరో ప్రపంచం లోకి అడుగు పెట్టిన ఫీల్ వచ్చి కర్టన్స్ అన్ని స్కై బ్లూ కలర్ లోకి మారితే , రకరకాల షోకేస్ బొమ్మలు , వాల్స్ కి అందమైన పెయింటింగ్స్ టైప్ స్టిక్కర్స్ , హ్యాంగింగ్స్ తో పాటు డ్రీమ్ క్యాచర్ కూడా పెట్టి ఉండి హాల్ మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటే అలా సడన్ గా తన ఫ్లాట్ ఒక ఫ్యామిలీ ఉండేలా తయారయ్యేసరికి కొంచెం షాక్ అయ్యి తర్వాత వెంటనే పెదవుల మీద నవ్వుతో సీత అని పిలవగానే “ హా బావ బెడ్రూంలో ఉన్న వచ్చేయ్...... “ అని అంది

బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి సీత చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు రామ్......

ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......