Are Amaindi - 12 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 12

Featured Books
Categories
Share

అరె ఏమైందీ? - 12

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"తనని ఆ నిరంజన్ ముట్టుకోపోతే వాడిని అలా చితకేసింది. వాడితో తిరిగింది కానీ కనీసం వాడిని ముద్దుకూడా పెట్టుకోనివ్వలేదు. ఆ విషయం తనే నాతొ చెప్పింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎదో ఫిజికల్ ఇంటిమసీ వుండివుంటుందని నువ్వు అనుకోనవసరం లేదు." మళ్ళీ తనూజె అంది.

"ఆ విషయం నాకు తెలుసును. ఆ నిరంజన్ మాత్రమే కాదు. ఎవర్నీ తను ముట్టుకోనిచ్చి వుండదు." అనిరుధ్  నవ్వాడు.

"ఇందాక నువ్వీ విషయం లోనే ఏదో క్లారిఫికేషన్ ఇస్తానన్నట్టుగా గుర్తు." గుర్తు చేస్తూ అంది తనూజ.

తను నిరంజన్ ఫ్రెండ్ ముకుందాన్నికలుసుకోవడం, ఇంకా తామిద్దరికీ మధ్య హోటల్ లో జరిగిన సంభాషణ అంతా క్లియర్ గా చెప్పాడు అనిరుధ్. "మంజీర ప్రవర్తన చాలా చిత్రంగా అనిపించింది నిరంజన్ కి. అసలు పెళ్లయ్యాక తనతో సెక్స్ కి ఒప్పుంటుందో లేదో, తనసలు సెక్స్ కి పనికొస్తుందో లేదో అనిపించింది. ఒకసారి టెస్ట్ చూసి చూద్దామని గెస్ట్ హౌస్ లో తనని అనుభవించబోతే అదిగో అలాంటి అనుభవం ఎదురైంది వాడికి. వాడు ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ తో ఎంతగా భయపడిపోయాడు అంటే, మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నాడు. ఎవరితోటి సరిగ్గా మాట్లాడ్డం లేదు. ముకుందం వాడికి మంచి స్నేహితుడు కావడం వల్ల ఎదో కష్టం మీద ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగాడు వాడి దగ్గరనుండి."

"మంజీర తల్లి మానసిక పరిస్థితి బాగుండేది కాదు. తనుకూడా తన పన్నెండేళ్ల వయసులో చనిపోతే పనిమనుషుల చేతుల్లో పెరిగిందిమంజీర. సరిఅయిన పెంపకంలో లేకపోవడం వల్ల తెలియవలసిన విషయాలు, తెలియవలసినట్టుగా తెలియలేదు. అందువల్లే తనకి సెక్స్ మీద, రొమాంటిక్ విషయాల మీద అలాంటి నెగటివ్ ఫీలింగ్ వచ్చివుండాలి. అందులోనూ కొంతమంది బాగా ట్రెడిషనల్ కుటుంబాల్లో పెరిగిన ఆడపిల్లలు పెళ్ళికి ముందు రొమాంటిక్ థింగ్స్ పట్ల ఆలా ఓవర్ రియాక్ట్ అవుతూ వుంటారు." తనూజ అంది.

"మీరు చెప్పింది నిజమే కావచ్చు." చిరునవ్వునవ్వాడు అనిరుధ్.

"అయినా అది సరిచెయ్యలేని పెద్ద సమస్య కాదు. మంచి కౌన్సెలింగ్, ఇంకా సైకలాజికల్ ట్రీట్మెంట్ ద్వారా తన ప్రవర్తన లో మార్పు తీసుకురావచ్చు. పెళ్లయ్యాక తనతో నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు తనతో పెళ్ళికి ఒప్పుకో."

"ఒకవేళ అలాంటి ఇబ్బంది ఎప్పటికీ వున్నా తనతో పెళ్ళికి నాకు అభ్యంతరం లేదు." అనిరుధ్  అన్నాడు. "వాళ్ళమ్మగారు నన్ను అభిమానించింది. నేను తన భర్తగా ఉండాలని కోరుకుంది. ఏమీ తెలియని చిన్న వయసులోనే అయినా తనని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను." కాస్త ఆగాక తనూజ ఎదో చెప్పబోయేలోపునే మళ్ళీ అన్నాడు అనిరుధ్. "అలాగే ఆ సర్వేశ్వరం గారు మా కుంబానికి ఎంతగానో సహాయం చేశారు. అయన ఇచ్చిన డబ్బుతోటె మా అమ్మానాన్న ఎంతో ఇష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల మంజీర తల్లి ఇష్టపడే పని చేయడం, ఆ సర్వేశ్వరం గారికి ఆనందం కలిగించే పనిచెయ్యడం నా కర్తవ్యం. మంజీర ఆ నిరంజన్ ని ప్రేమించడం లేదని, ఇంకా తనకి నన్ను పెళ్లిచేసుకోవడానికి అభ్యంతరం లేదని తెలిసాక ఇందుకు ఒప్పుకోకపోవడానికి కారణం ఏముంటుంది?" అనిరుధ్ అడిగాడు.

"నీ ఈ నిర్ణయం మా అందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది. నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి నా అన్నయ్యకి, మేనకోడలికి ఈ విషయం చెప్తాను." కుర్చీలోనుండి లేచి అంది తనూజ.

"కానీ నేనొకసారి మంజీర తో మాట్లాడాలి. నన్ను తను మనస్ఫూర్తిగానే పెళ్లిచేసుకోవాలనుకుంటూందని తన నోటిద్వారా నేను వినాలి." తనూ కుర్చీలోనుండి లేచినిలబడి అన్నాడు అనిరుధ్.

"అందుకు అభ్యంతరం ఏముంటుంది? నువ్వెప్పుడూ కావాలంటే అప్పుడొచ్చి మంజీర తో మాట్లాడొచ్చు. నేను ముందు వెళ్లి ఈ హ్యాపీ న్యూస్ మా వాళ్ళకి చెప్తాను."

"మీరు మా ఇంట్లో కొంచెం కాఫీ తాగి వెళ్ళండి. చాలా రోజుల తరువాత మీరు మా ఇంటికి వచ్చారు." ప్లీడింగా అన్నాడు అనిరుధ్.

"నో ఫార్మాలిటీస్ ప్లీజ్. నువ్వొప్పుకుంటావో లేదో అని మా వాళ్ళు అసలే టెన్షన్ లో వున్నారు. వాళ్ళ ముఖతః ఈ హ్యాపీ న్యూస్ చెప్పి వాళ్ళెంత ఆనందిస్తారో చూడాలి." అలా అన్న తరువాత బై చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది తనూజ.

&&&

అంత ఎగ్జైటెడ్ గా, అంత హ్యాపీ గా ఈ మధ్యకాలం లో మంజీర ఎప్పుడూ ఫీలయింది లేదు. అనిరుధ్ తనతో పెళ్ళికి మనస్ఫూర్తిగా, ఏ బలవంతం లేకుండా ఒప్పుకున్నాడని తెలియగానే అంత ఆనందం, అంత సంతోషం కలిగింది. అసలు అంతకాలం తనెందుకు అంత తిక్కగా, అంత పిచ్చిగా ప్రవర్తించిందో తనకే బోధపడడం లేదు. అనిరుధ్ లాంటి హ్యాండ్సమ్ ఇంకా ఇంటెలిజెంట్ అబ్బాయిని వదిలేసి ఆ నిరంజన్ లాంటి వాడితోటి తనెందుకు తిరిగింది? తన తల్లి పిచ్చే తనకీ వచ్చింది. తన తల్లి అలా చనిపోవడం కూడా తనని బాగా అప్సెట్ చేసేసి, తనెలా బిహేవ్ చేస్తూందో తనకే తెలియకుండా పోయింది.

తనూ ఆ అనిరుధ్ తమ చిన్నతనంలో కలిసి ఆడుకున్న రోజులు అనిరుధ్ కి ఎంతవరకూ గుర్తువున్నాయో తెలియదు, తనకి మాత్రం బాగానే గుర్తు వున్నాయి. తామిద్దరూ ఎంత చిన్నతనం నుండి ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు బట్టల్లేకుండా చూసుకున్నారు. అలాంటి ఒక సందర్భం లో మేకులా నిలబడ్డ వాడి థింగ్ ని చూస్తూ వాడిని తను అడిగిన ప్రశ్న ఇప్పటికీ తనకి గుర్తు వుంది. "అలాంటిది నాకెందుకు లేదు?"

"బాయ్స్ కె ఇది ఉంటుంది. గర్ల్స్ కి ఉండదు."

తనకన్నా వాడికి నాలెడ్జి ఎక్కువ. అందుకనే వాడికా విషయం తెలిసింది, తనకి తెలీలేదు. అది ముట్టుకుని చూస్తానంటే మొహమాటంగానే ఒప్పుకున్నాడు. అప్పుడది స్మూత్ గా, సిల్కీ గా వుందితన వేళల్లో, ఇప్పుడది ఎలా వుండివుంటుందో? మొదట థ్రిల్ గా, తరువాత బాగా ఇరిటేటింగా అనిపిస్తూ ఉండడం తో ఆ టాపిక్ నుండి బలవంతం గా మనసు మళ్లించుకుంది మంజీర.      

తనకెందుకో ఏవైనా సెక్స్ ఇంకా రొమాంటిక్ విషయాల గురించి ఆలోచించినా, విన్నా లేక చూసినా కూడా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. తనకి ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుంది అంటే తనకి ఎందుకలా అనిపిస్తుంది అని ప్రోబ్ చెయ్యాలని కూడా ఎప్పుడూ అనిపించలేదు. సెక్స్, రొమాన్స్ లేకుండా తమ మధ్య రెలాషన్షిప్ అంటే అనిరుధ్ ఒప్పుకుంటాడా అనికూడా తనకి భయంగా వుంది. ఒకవేళ అనిరుధ్ ఒప్పుకోడు అంటే తనే వాటిని బలవంతంగా యాక్సెప్ట్ చెయ్యాలి. అంతేకాని తనని వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు.

అనిరుధ్, ఇప్పుడా పేరే ఎంతో మధురంగా, ఆనందంగా తోస్తూ వుంది. తన తల్లి తన భర్తగా ఒక్క అనిరుధ్ ని తప్ప ఇంకెవరినీ యాక్సెప్ట్ చెయ్యదు అని తెలిసాక అనిరుధ్ మీదకి మనసు మళ్ళించుకోవడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే చాలా ఈజీగా తన మనసు అనిరుధ్ ని యాక్సెప్ట్ చేసేసింది. తనది చాలా హ్యాండ్సమ్ పెర్సనాలిటీ. ఏ ఆడపిల్లయినా యిట్టె అతనివైపు ఆకర్షించబడుతుంది. నిజానికి అంతకాలం తను అనిరుధ్ గురించి ఆలోచించకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం.

తన తల్లి చావు తనకి పెద్ద పిడుగుపాటు లాంటిది. ఆ నిజం తను అసలు యాక్సెప్ట్ చెయ్యలేకపోయింది. తన తల్లితో కలిసివున్న ఆ ఇంట్లో, తన తల్లి జ్ఞాపకాలతో ఉండడం కూడా తనకి చాలా కష్టం అయిపొయింది. అందుకని సాధ్యమైంతవరకూ అనీ కొత్తగా ఉండేలా చూసుకుంటూ, వీలైనంతవరకూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసే పాతవన్నీ వదిలేసింది. అలా తనకి ఆ పాత  జ్ఞాపకాల్ని గుర్తుచేసే వాటిల్లో అనిరుధ్ ఒకడు. అందుకనే కష్టం అనిపించినా బలంతంగా అనిరుధ్ ని తన జీవితంలోనుండి బయటకి నెట్టేసింది. పాత జ్ఞాపకాలు అసలు లేకుండా ఉండడానికి, అవి తనని బాధించకుండా ఉండడానికి జీవితం కొత్తగా వెరైటీ గా ఉండడానికి కొత్త ఫ్రెండ్స్, కొత్త అలవాట్లు ఉండేలా చూసుకుంది. నిరంజన్ తో కారులో తిరగడం, అతనితో పబ్ లకి క్లబ్ లకి వెళ్లడం అందులో ఒక పార్ట్.

అలాగే అనిరుధ్ తనకి ఆ పాత రోజులు గుర్తు చేస్తూ ఉండడం తో తనతో మరింక అతను మాట్లాడకుండా వుండడానికి, తన దగ్గరికి రాకుండా వుండడానికి తనని హర్ట్ చేసింది. తనని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడింది. కాకపోతే తన ప్రయత్నం బాగానే ఫలించింది. కొన్నిరోజులలోనే అనిరుధ్ తనని పూర్తిగా విడిచిపెట్టేసాడు, తనవైపు చూడ్డం కూడా మానేసాడు. అదీ తనకి బాధగానే అనిపించినా పట్టించుకోవడం మానేసింది. 

అప్పట్లో తన తల్లి ఇంక తనతో లేదు అని గుర్తు చేసే పాత జ్ఞాపకాల్ని భరించలేక, వాటికి కారణమయ్యే విషయాలనన్నిటినీ దూరం పెట్టి, చాలా కాలం అదే కంటిన్యూ చేసింది. ఇప్పుడు అనిరుధ్ గురించి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాక, ఆ పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చినా ఇప్పుడవి తనని బాధపెట్టడం లేదు, మధురంగానే వున్నాయి.

ఆ రోజుల్లో ఒక రోజు తన తల్లి ఏం చేసిందో ఆలోచిస్తూంటే తనకిప్పుడు నవ్వు వస్తూంది. తన మెడలో వున్నా తాళి తీసి అనిరుధ్ కి ఇచ్చి, తన మెడలో వేయించింది. "ఇప్పటినుండి తను నీ భార్య. తనని నువ్వు జాగ్రత్త గా చూసుకోవాలి." అంది అనిరుధ్ తో.

"ఓ, తప్పకుండా అలాగే." అన్నాడు అనిరుధ్.

తామిద్దరికీ అప్పుడు ఏడేల్లో, ఎనిమిదేల్లొ వుంటాయేమో. అప్పుడు అనిరుధ్ కి ఎలా అనిపించిందో తనకి తెలియదు కానీ, తనకి మాత్రం ఏమీ ప్రత్యేకంగా అనిపించలేదు. తరువాత తన తండ్రి వచ్చి, తన తల్లిని తిట్టి తన తాళి తన మెడలోనుండి తీసి తిరిగి తన తల్లి మెడలో వేసాడు.

కాకపోతే తన తల్లి అప్పుడు తన పెళ్లి నిజంగానే అనిరుధ్ తో చేసేసింది అనుకుంటూందని, అనిరుధ్ నిజంగానే తన భర్తగా భావిస్తూందని తనెప్పుడూ అనుకోలేదు. నిజానికి అంతకు ముందు కూడా చాలా సార్లు అనిరుధ్ ని నువ్వు నా కూతుర్ని పెళ్లిచేసుకుంటావా, తనని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగేది. ఓ తప్పకుండా అలాగే అనేవాడు అనిరుధ్.

తన తల్లి అనిరుధ్ ని అంతగా తన భర్తగా అనుకోవడానికి కారణం ఏమిటి? తామిద్దరూ ఆమె కళ్ళముందు కలిసి ఆడుకునేవారు. ఆ చిన్నతనం లో కూడా అనిరుధ్ తనని జెంటిల్ గా ట్రీట్ చేసేవాడు. అందువల్ల అనిరుధ్ తన భర్త అయితే తనని జాగ్రత్తగా చూసుకుంటాడు అని తన తల్లి అనుకునివుంటుంది.    

తన తల్లికి అంతగా మతిస్థిమితం ఉండేది కాదు. చాలా విషయాలు తెలిసేవి కావు, ఇంకా చాలా సందర్భాల్లో చిన్నపిల్లలా ప్రవర్తించేది. లేకపోతే అంత చిన్నతనంలో తామిద్దరికీ పెళ్లి ఎలా చేస్తుంది? ఆవిడతో అనిరుధ్ అమ్మగారు మాత్రమే చాలా కలివిడిగా స్నేహం గా ఉండేది. వూళ్ళో తక్కినవాళ్ళందరూ నిజానికి తనతల్లి అంటే భయపడుతూ ఉండేవారు. ఆవిడ దగ్గర తను సంతోషంగా ఉండగలదు అన్న ఉద్దేశంతో కూడా తనతల్లి అనిరుధ్ ని తన భర్త ని చేసి ఉంటుంది.తన తల్లి చనిపోయేక, తను పెద్దపిల్ల అయినప్పుడు, తను ఎంత భయపడిపోయింది? అనిరుధ్ తల్లే  ధైర్యం చెప్పి దగ్గరవుండి అంతా చూసుకుంది.

అనిరుధ్ తనతో మాట్లాడ్డానికి వస్తున్నాడు అంటే తనకి ఎంతో ఆనందంతో పాటుగా, అనీజీ గా కూడా వుంది. ఇలా ఆలోచనల్లో మునిగిపోయివున్న మంజీర "లోపలి రావచ్చా?" అన్న స్వరం విని ఉలిక్కిపడింది. తలెత్తిచూస్తే గుమ్మందగ్గర అనిరుధ్ నిలబడి వున్నాడు.

"తప్పకుండా రావచ్చు." బెడ్ మీద నుండి లేవకుండానే అతనివైపు చూస్తూ చెప్పింది మంజీర

&&&

"నువ్వు ఎక్కువగా ఇదే రూమ్ లో వుంటావా? లాస్ట్ టైం కూడా నిన్ను ఇదే రూమ్ లో కలిసాను." ఆ రూమ్ లో మునుపు కూర్చున్న కుర్చీలోనే కూచున్నాక సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక అన్నట్టుగా అన్నాడు అనిరుధ్.

"ఎస్, ఇది నా రూమ్." అప్పటికే అనిరుధ్ వైపు తిరిగి కూచుంది మంజీర. "చూస్తున్నావుగా, ఈ రూమ్ లో నాకు అన్ని ఫెసిలిటీస్ వుంటాయి. అందుకనే నేను మాక్సిమం టైం ఈ రూమ్ లోనే స్పెండ్ చేస్తూవుంటాను."

అనిరుధ్ ఇంకేం మాట్లాడాలా అని ఆలోచిస్తూవుంటే మళ్ళీ మంజీరె అంది తల దించుకుని. "ఐ యాం సారీ. ఐ యాం అబ్సలూట్లీ సారీ,"

"దేనికి?" నొసలు మూడేసి చిరునవ్వుతో అడిగాడు అనిరుధ్. మంజీర దేనికి సారీ చెప్పదలుచుకుందో తను వూహించగలడు.

"అప్పట్లో నువ్వు నాతో మాట్లాడదలుచుకున్నప్పుడు నీతో ఇన్సల్టింగా మాట్లాడి నిన్ను హర్ట్ చేసాను."

ఆదివినగానే నవ్వాడు అనిరుధ్. "అప్పట్లో చాలా చిన్నపిల్లవి నువ్వు. ఎదో తెలిసో తెలియకో ఆలా బిహేవ్ చేసావ్. నేనది మరిచిపోయాను, నువ్వూ అది మర్చిపో."

"ఆ తరువాత కూడా నువ్వు ఎన్నోసార్లు నాతో మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పుడు నిన్నసలు పట్టించుకోలేదు."

"నేను దానికి కూడా పెద్దగా బాధపడలేదు. కానీ ఆ నిరంజన్ లాంటి వాడితో స్నేహంగా ఉండాలని నీకెలా అనిపించింది? వాడుకున్న ఆడపిల్లలతో స్నేహాలు, వాడెలాంటి పోకిరీవెధవో నీకు తెలీదా? వాడిబదులు నువ్వెవరితో స్నేహం చేసినా నేనంత బాధపడేవాడిని కాదు."

"అప్పట్లో నాకు మైండ్ సరిగ్గా పనిచెయ్యలేదు. అందుకే వాడితో తిరిగాను. నా ఆలోచనా తీరు సరిగ్గా ఉంటే నేను నిన్నెదుకు దూరం పెడతాను?" మంజీర అంది. "మామ్ చనిపోయిన తరువాత ఆవిడవున్నప్పుడు వున్న ఆలోచనలు ఏవీ నేను భరించలేకపోయాను. అందుకే ఆ రోజులతో అసోసియేట్ అయివున్నవాటిల్లో అవకాశమున్నవాటినన్నిటీనీ దూరం పెట్టేసాను. నిజానికి నీతో మాట్లాడకుండా ఉండడానికి, నిన్ను దూరం పెట్టడానికి నాకు చాలా కష్టంగా ఉండేది."

"నీ పరిస్థితి ని నేను అర్ధం చేసుకోగలను. ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. మా యింట్లో మా అమ్మానాన్నతో నేను గడిపిన తియ్యటి రోజులు గుర్తుకువస్తూంటే, ఇప్పటికీ నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మా అమ్మానాన్న ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లది. అది వదిలిపెట్టాలని అనిపించదు."

"నిరంజన్ వాళ్ళ నాన్న డాడ్ కి ఫ్రెండ్. అప్పుడప్పుడు ఇంటికి కూడా వస్తూండే వాడు. ఏదో వెరైటీ కోసమే స్నేహం చేసాను వాడితో. వాడితో ఆ పబ్ లకి అది తిరగడంలో నాకేదో థ్రిల్ ఉండేది  వాడిమీద నాకెప్పుడూ ప్రేమలాంటిది లేదు."

"కానీ మీరిద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు కదా. మీ పెద్దవాళ్ళు మీకు పెళ్ళిచెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా విన్నాను."

"అందుకు కారణం నిరంజన్ డాడ్. అతను నన్ను తన కోడలిని చెయ్యమని అడిగాడు. తన ఫ్రెండ్ ఇంట్లో అయితే నేను ఆనందంగా వుంటానన్న ఉద్దేశం తో డాడ్ నన్ను   నిరంజన్ ని పెళ్లి చేసుకోమని అడిగారు. నేనూ ఒప్పుకున్నాను."

"ఆ నిరంజన్ గురించి తెలిసికూడా ఎలా ఒప్పుకున్నావు?" ఆశ్చర్యంగా అడిగాడు నిరంజన్.

"నేను అంతగా ఆలోచించలేదు. నిరంజన్ ని పెళ్లి చేసుకుంటే డాడ్ సంతోషిస్తారు. అంతే ఆలోచించాను." నిట్టూరుస్తూ అంది మంజీర.

“అలా జరిగి వుండకపోతే నువ్వు వాడిని పెళ్లిచేసుకుని వుండేదానివి కదా.” అనిరుధ్ అన్నాడు మంజీర మొహంలోకి పరిశీలనగా చూస్తూ. "నాకు మీ ఆంటీ అంతా చెప్పారు."

“కాదనలేను. తర్వాత ఎలా ఫీలయివుండేదాన్నోచెప్పలేను. కాని ఆ సంఘటన అలా జరగడం మాత్రం మా పెళ్ళిని ఆపేసింది.” నవ్వింది మంజీర. “డాడ్ నేను ఆ ఇంటి కోడలు కావాలనుకుంటున్నారు, ఆయన సంతోషిస్తారనే తప్ప, నా పెళ్లి గురించి, నా కాబోయే భర్త గురించి ఏమీ సీరియస్ గా ఆలోచించలేదు.”

“"ఎక్జాట్ గా ఆ రోజు ఏం జరిగింది? మీ ఆంట్ అదేదో స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ వల్ల నువ్వలా బిహేవ్ చేసావని అంటున్నారు."

"కానీ నాకది నమ్మబుద్ధి కాదు. ఆ నిరంజన్ నన్ను ముద్దు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో నా దగ్గరికి రాబోయాడు, నన్ను రేప్ చేద్దామనే ఉద్దేశంతో వున్నాడని అర్ధమైంది. ఆ తరువాత జరిగినదేమిటీ నాకు గుర్తు లేదు. ఇంటికొచ్చి నా డాడ్ తో కూడా అంతా మాట్లాడాక ఈ లోకంలోకి వచ్చాను. నా లోనుండి నా మామ్ ఏం చెప్పిందో డాడ్ నాకు చెప్పారు. ఆ నిరంజన్ ని నేను ఏం చేసింది తరవాత నాకు తెలిసింది." మరోసారినవ్వింది మంజీర. 

మంజీర తో పాటుగా తానూ నవ్వాడు అనిరుధ్.

"మరొక విషయం. ఆ నిరంజన్ నాకన్నా చాలా బలవంతుడు. వాడిని నేనలా కొట్టగలగడమేమిటి? నా మామ్ నా లోకి వచ్చివుండక పోతే నేనలా చేయగలిగి ఉండేదానిని కాదు."

"కొన్ని ప్రత్యేకమైన మానసిక పరిస్థితులలో మనకి అటువంటి శక్తీ వస్తుందట. మీ ఆంట్ చెప్పారు."

"ఒక ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్ట్ గా ఆవిడ మరొకలా ఎందుకు చెప్తుంది? కాకపోతే అది స్ప్లిట్ పెర్సనాలిటీ గా నేను నమ్మలేకపోతున్నాను. మా డాడ్ ముందే నమ్మలేరు." 

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)