Are Amaindi - 13 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 13

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

అరె ఏమైందీ? - 13

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"అయితే నీ వుద్దేశమేమిటి? నీ మామ్ స్పిరిట్ గా వుండి, ఆ సమయం లో నీలోకి వచ్చి, నిన్ను నిరంజన్ నుండి రక్షించిందనా?"

"ఆ విషయం లో నేను చాలా కన్ఫ్యూజన్ లో వున్నాను. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు." విచారం నిండిన మొహం తో అంది మంజీర.

"నువ్వొక గ్రాడ్యుయేట్ వి. స్పిరిట్స్ అవి వున్నాయన్న అభిప్రాయం నీలో డెవలప్ అవడం మంచిది కాదు. అలాంటివన్నీ ముందే నువ్వు వదుల్చుకోవడం చాలా మంచింది."

"అదే ఆంటీ కూడా చెపుతూంది, అలా ఆలోచించడానికే నేనూ ట్రై చేస్తున్నాను." మంజీర అంది. "కానీ నమ్మబుద్ధి కావడం లేదు. డాడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంఫర్మ్ అయిపోయారు నా ద్వారా మామే మాట్లాడిందని, ఇంక నాకు ఎవరితో పెళ్ళిచేసినా తను వూరుకోదని. నిన్ను ఒప్పించడానికి బ్లాక్ మెయిల్ చెయ్యడం వరకూ వెళ్ళడానికి అదే కారణం."

"మీ ఊహ కరక్టే. నేనూ అంత తేలిగ్గా నిన్ను పెళ్లిచేసుకోవాలన్న ఆలోచనకి రాలేదు."

అది వినగానే మంజీర మొహం కొంచెం విచారంతో నిండింది."నేను నిన్ను తప్పుపట్టలేను. చాలా సందర్భాల్లో నిన్ను హర్ట్ చేసాను. అంతేకాకుండా నేను నిరంజన్ తో అలా తిరగడం చూసిన వాళ్ళెవ్వరూ మా మధ్య లవ్వు గీవ్వు లేదంటే నమ్మలేరు. ఎనీహౌ నా ఆంటీయే నీకు అంత క్లియర్ గా చెప్పి నాతో పెళ్ళికి ఒప్పించి ఉంటుంది." 

"మీ ఆంటీ నాతో అంతా క్లియర్ గా మాట్లాడి నాకు క్లారిటీ ఇచ్చిన నిజమే. కాకపోతే నాకు మనోజ్ పేరెంట్స్ నీ డాడ్ గురించి చాలా పాజిటివ్ గా చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలని చూసారు. నువ్వు మంచిదానివని, ఎదో తెలిసీ తెలియక పొరపాటుగా ఆలోచించివుంటావని అన్నారు. మనోజ్ కూడా మాక్జిమం నన్ను నీతో పెళ్ళికి ఒప్పించాలని చూసాడు. సో నీతో మరొకసారి స్ట్రెయిట్ గా మాట్లాడి, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను పెళ్లిచేసుకుందామనుకుంటూవుంటే, నేను అందుకు ఒప్పుకుందామనుకున్నాను.  "

"థాంక్స్ టు  దట్ మనోజ్ అండ్ హిజ్ ఫ్యామిలీ." చిరునవ్వు నవ్వింది మంజీర. "ఎనీహౌ నువ్వు మొత్తం విషయం అంతా వాళ్ళకి చెప్పావన్నమాట."

"మనోజ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడికి నేను ఏ విషయం చెప్పకుండా ఉండను. అలాగే ఈ విషయం వాళ్ళింట్లో వాళ్ళకి చెప్పొద్దని చెప్పలేదు."

"నో ప్రాబ్లెమ్. అందువల్ల మంచే జరిగింది కదా." మళ్ళీ నవ్వింది మంజీర.

"మనోజ్ అన్న ఇంకోవిషయం చెప్పనా?" చిలిపిగా చూస్తూ అన్నాడు అనిరుధ్.

"ఆ చెప్పు." ఆసక్తిగా చూస్తూ అడిగింది మంజీర.

"ఏది ఏమైనా దబ్బపండులా నీలా అందంగా వున్న అమ్మాయిని వదిలేసుకోవడం చాలా తెలివితక్కువ అన్నాడు."

"రాస్కెల్ అలా అన్నాడా?" గలగలా నవ్వి అంది మంజీర. "ఎనీహౌ అదీ నిజమే కదా."

"కానీ ఆ రోజు నీ దెబ్బకి ఆ నిరంజన్ బాగా భయపడిపోయాడు. నువ్వు, మీ డాడ్ అనుకుంటున్నట్టుగానే అది మీ మామ్ స్పిరిట్ అనే తను అనుకుంటున్నాడు. ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావో, ఎలా కొట్టావో తెలియదు కానీ జన్మలో నీ జోలికి మళ్ళీ రాడు."

"ఆ విషయం నీకెలా తెలుసు?" కళ్ళు చిట్లించి అడిగింది మంజీర.

"నువ్వు నాకు విషయం చెప్పట్లేదు. మీ డాడ్ కూడా నాకు విషయం ఏమీ చెప్పట్లేదు. నేను నిన్ను పెళ్ళిచేసుకోవాలని మాత్రం పట్టుపట్టి కూచున్నారు. వాడి ద్వారా నాకు విషయం ఎమన్నా బోధపడుతుందేమోనని వాడిని కలిసి మాట్లాడాను. వాడు చాలా అయోమయం లోనూ, భయపడిపోయి వున్నాడు. వాడిద్వారా కూడా నాకు క్లారిటీ రాలేదు. కేవలం నీ ఆంటీ మాత్రమే నాకు క్లారిటీ ఇచ్చారు."

"థాంక్స్ టు ఆంటీ. బ్లాక్ మెయిల్ చేసి నిన్ను ఒప్పించడం తప్పని, నిన్ను మాట్లాడి తను ఒప్పిస్తానని బయలు దేరింది. తన మిషన్ లో సక్సెస్ అయింది." మనోహరంగా నవ్వింది మంజీర.

దానికి అనిరుధ్ కూడా నవ్వి, కుర్చీలో మోర్ కంఫర్ట్ కి అడ్జస్ట్ అయ్యాడు. "మొత్తం క్రెడిట్ అంతా మీ ఆంటీ కి మాత్రమే రాదు. మనోజ్ ఇంకా అతని పేరెంట్స్ కూడా వెళుతుంది."

"ఆల్రైట్" తలూపింది మంజీర."కానీ నిరంజన్ లాంటి వాడిని అంతలా అలా భయపడేలా చేసాను అంటే నేను ఆ రోజు వాడిని ఏం చేసానో, వాడితో  ఏం మాట్లాడానో. ఇంటికొచ్చి నా డాడ్ తో ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తు లేదు. అది కేవలం నేనే అయితే నేను చేసిందేదీ నాకు ఎందుకు గుర్తు లేదు?"

"స్ప్లిట్ పెర్సనాలిటీ ల గురించి, మల్టిపుల్ పెర్సనాలిటీల గురించి నువ్వు చదివే ఉంటావు కదా. నీ ఆంటీ నీకు వాటిగురించి చాలా చెప్పే వుంటుంది."

"ఆ, నాకూ వాటి గురించి తెలుసు. నా ఆంటీ కూడా  నా ప్రాబ్లెమ్ గురించి తెలిసిన దగ్గరనుండి నన్ను నా డాడ్ ని అది నా మామ్ కాదని, కేవలం నా స్ప్లిట్ పెర్సనాలిటీ అని కన్విన్స్ చెయ్యడానికే ట్రై చేస్తూ ఉంది. బట్ ............." గట్టిగా నిట్టూర్చి అంది మంజీర. "...........అంత తేలిగ్గా నమ్మబుద్ధి కావడం లేదు."

"నీ మామ్ నీలో అలా ఎక్స్పోజ్ కావడం ఆ రోజే మొదటిసారా?"

"లేదు. అంతకుముందు కూడా నేను కొన్నిసార్లు నేను నా డాడ్ దగ్గర నా మామ్ లా బిహేవ్ చేసానుట. నా డాడ్ తను నా మామ్ తో మాట్లాడుతున్నాననుకుని చాలా సంతోషించారు. అప్పుడెప్పుడూ కూడా నా మామ్ ఇలా వయొలెంట్ గా బిహేవ్ చెయ్యలేదు."   

"అది నీ మామ్ కాదు, కేవలం నీ సబ్-కాంషస్ మైండ్. నీ మనసులోనే నీకు తెలియని భాగం నువ్వలా బిహేవ్ చేసేలా చేసింది."

"నేను విషయాన్ని అలా అర్ధంచేసుకోవడానికే ట్రై చేస్తున్నా. నువ్వు మాటి మాటికీ నాకది చెప్పక్కర్లేదు." చిరుకోపంతో అంది మంజీర. "ఎనీహౌ నువ్విప్పుడు నన్ను పెళ్లిచేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరించినట్టే కదా"

"అది నేను చెప్పడానికి ముందు నువ్వు నాకొక విషయం చెప్పు." అనిరుధ్ అన్నాడు. "నువ్వు కేవలం నీ మామ్ అంతగా కోరుకుందన్న ఉద్దేశంతోనే నన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నావు. నీ ఉద్దేశం లో అది నీ స్ప్లిట్ పెర్సనాలిటీ కాదు, నీ మామ్ మాత్రమే తన అభిప్రాయం అలా చెప్పింది. నీ మామ్ నన్ను తప్ప ఇంకెవ్వరినీ నీ భర్తగా యాక్సెప్ట్ చెయ్యదు అన్న వుద్దేశంతోటే నువ్వు, నీ డాడ్ నేను నీ భర్త కావాలనుకుంటున్నారు, అవునా?"

కింద పెదవిని పళ్ళ మధ్య బిగించి ఎదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది మంజీర. ఆ పోజ్ లో ఎంత మధురంగా వుందిఅంటే, ఆ మూతిమీద ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచనని బలవంతంగా నిగ్రహించుకున్నాడు అనిరుధ్.

"నీ డాడ్ మా కుటుంబానికి ఎంతగానో సహాయం చేశారు. ఎందుకనో నీ మామ్ నేను నీ భర్త కావాలనుకుంది. ఎన్నోసార్లు నా కూతుర్ని పెళ్లిచేసుకుంటావా, తనని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగింది. ఏమీ తెలియని వయసులోనే అయినా నేను నిన్ను పెళ్లిచేసుకుంటానని, జాగ్రత్త గా చూసుకుంటాను అని మాట ఇచ్చాను. నా మనసులో వేరే ఎవరూ లేరు కాబట్టి నిన్ను తప్పకుండా పెళ్లిచేసుకుంటాను, నా మాట నిలబెట్టుకుంటాను. కానీ నీ మనసులో ఏముందో కూడా నాకూ తెలుసుకోవాలని వుంది." మంజీర వైపే అలా చూస్తూ అన్నాడు అనిరుధ్.

"మామ్ మైండ్ సరిగ్గా పనిచేసేది కాదు, ఒక చిన్నపిల్లలా బిహేవ్ చేసేది. మనిద్దరం ఎప్పుడు కలిసి ఆడుకోవడం, నువ్వు నన్నపుడు ట్రీట్ చేసే తీరు ఆవిడని ఇంప్రెస్ చేసి ఉండాలి. అందుకే నువ్వే నన్ను పెళ్ళిచేసుకోవాలని అనుకుంది. నిన్ను అన్నిసార్లు అలా అడిగింది. నన్నూ చాలా సార్లు నిన్ను పెళ్లిచేసుకోమని, నీకు భార్యగా ఉండమని అడిగింది. ఆ కోరిక ఆవిడని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, ఆ చిన్నతనంలో మనిద్దరికీ పెళ్లి కూడా చేసేసింది. తన తాళి తీసి నీ చేత నా మెళ్ళో వేయించింది."

"ఆ విషయం నీకూ గుర్తుందా?" నవ్వాడు అనిరుధ్.

"ఆ బాగానే గుర్తుంది." తనూ నవ్వింది మంజీర. "ఆ తర్వాత ఎప్పుడో డాడ్ ఆ తాళి నా మెళ్ళో చూసి కోప్పడి, అది తీసి తిరిగి తన మెళ్ళో వేసేసారు." అప్పుడు సడన్గా సీరియస్ గా మారిపోయింది మంజీర మొహం. "ఎస్ అనిరుధ్. నేను నిన్నే పెళ్లిచేసుకోవాలనుకోవడానికి కారణం మామ్ నువ్వు నా భర్తవి కావాలని అంతగట్టిగా అనుకోవడం. నిజానికి ఈ విషయం గురించి తెలిసినా నేను కానీ, డాడ్ కానీ దాని గురించి సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ మొన్న........."

అప్పుడు మంజీర ని ఆపి అనిరుధ్ ఎదో చెప్పబోయాడు.

"ప్లీజ్ అనిరుధ్. నువ్వు మాటిమాటికి అది నా స్ప్లిట్ పెర్సనాలిటీ అని చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పిందే నిజం కావచ్చు. కానీ........." కాస్త ఆగింది మంజీర. ".........కాకపోతే ఆ సంఘటన మామ్ నువ్వు నా భర్తవి కావాలని ఎంత గట్టిగా అనుకునేది అన్నది గుర్తు చేసింది. నువ్వు నా భర్తవి కాకపోతే తను ప్రశాంతంగా వుండలేదు అనిపించింది. ఎక్కడవున్నా తను ఆనందంగా ఉండాలి అంటే నువ్వే నన్ను పెళ్లిచేసుకోవాలి."

"అంటే దానర్ధం..........."

"నేను చెప్పాల్సినది ఇంకా అయిపోలేదు అనిరుధ్." మంజీర అంది. " ఐ వాంట్ టు బి ఫ్రాంక్ విత్ యు. నేను నిన్నేం ప్రేమించేలేదు. ఇప్పటికి కూడా నిన్నేదో లవ్ చేసేస్తూన్న ఫీలింగ్ నాకు లేదు. కానీ నీకులాగే నా మనసులో ఎవరూ లేరు. ముందో వెనకో నేను పెళ్లిచేసుకోక తప్పదు. అది నిన్నే చేసుకుంటే మామ్ సంతోషిస్తుంది. ఏమీ కానీ నీకే మామ్ కి ఇచ్చిన మాట నెరవేర్చాలని వుంది. అలాంటిది ఆవిడ కూతురిగా ఆవిడ కోరిక తీర్చాలని నేనెంతగా అనుకుంటాను?"

"థాంక్స్ టు యువర్ ఫ్రాంక్ నెస్." నిట్టూరుస్తూ అన్నాడు అనిరుధ్.

"బట్ అనిరుధ్.........." గలగలా నవ్వుతూ అంది మంజీర. "..........చిన్నతనంలో మనిద్దరం ఎలా ఆడుకున్నామో నాకిప్పటికీ గుర్తువుంది. ఆ రోజుల్లోనే నువ్వు నన్ను చాలా జెంటిల్ గా ట్రీట్ చేసేవాడివి. అది చూసే మామ్ ఇంప్రెస్ అయి అలా కోరుకుని వుంటుంది.. అంతే కాకుండా నువ్వొక స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గై వి. ఏ ఆడ పిల్లయినా నువ్వు భర్తగా వస్తావంటే ఆనందిస్తుంది. అందరూ ప్రేమించుకునే పెళ్లిచేసుకోవట్లేదు కదా. అలాగే మనం కూడా. నిన్ను నేను మనస్ఫూర్తిగానే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను." అంది.

"దట్ సెటిల్స్ ఎవరీ థింగ్" నవ్వి కుర్చీలోనుండి లేచాడు అనిరుధ్. "మరింక నేను వెళ్ళొస్తా. నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా.  ప్రిలిమినరీ ఎక్జామ్ తొందరలోనే వుంది. దానికి చదవాలి."

"అయితే నన్ను పెళ్లిచేసుకోవడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేనట్టేగా." తనూ బెడ్ మీదనుండి కిందకి దిగి, అనిరుధ్ మొహంలోకి చూస్తూ అడిగింది.

"మనోజ్ చెప్పినట్టుగా నీలాంటి జామపండు లాంటి అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి నాకేమన్నా అభ్యంతరం వుంటే, నా మతి సరిగా లేనట్టే. నీ అంతట నువ్వుగా నన్ను పెళ్లిచేసుకోవాలనుకోవడం నా లక్." నవ్వాడు అనిరుధ్. "మరి నన్ను వెళ్లనీ." గుమ్మంవైపుగా తిరిగి రెండు అడుగులు వేసాడు. 

"జస్ట్ వెయిట్........." కంగారుగా అంది మంజీర. "...............ఒక చిన్న ముఖ్యమైన విషయం నీకు చెప్పడం మర్చిపోయాను."

"ఏమిటది?" ఆగి మంజీర మొహంలోకి ఆసక్తిగా చూస్తూ అడిగాడు అనిరుధ్.

"ఇది ఒక చిన్న కోరిక. నువ్వు కాదనవనే అనుకుంటున్నాను." సడన్ గా మంజీర మొహం అనీజీనెస్ తో నిండిపోయింది.

"నువ్వడిగే రీజనబుల్ కోరిక ఏదీ నేను కాదనను." అనిరుధ్ లో ఆసక్తి ఇంకా పెరిగింది.

"అది అంత రీజనబుల్ కోరిక కాదు. అందుకే అడగడానికి సంకోచిస్తున్నా." మంజీర మొహంలో అనీజీనెస్ కూడా పెరిగింది.

"అడగకముందే నిర్ణయానికి రాకు. ముందు అదేమిటో అడుగు." మంజీర మొహంలోకి అలాగ చూస్తూనే మంజీర దగ్గరగా వచ్చాడు అనిరుధ్. "నువ్వు నన్ను ఏదీ అడగాలనుకున్నా నిస్సందేహంగా అడగొచ్చు."

"మనిద్దరిమధ్యా అదెప్పుడూ నాకిష్టం లేదు. పెళ్లయ్యాక కూడా. దానికి నువ్వొప్పుకుంటావా?" మంజీర తన జీవితంలో ఎప్పుడూ ఎవరిని ఏది అడగడానికి అంత ఇబ్బంది పడి వుండదు.

"నాకింకా క్లారిటీ లేదు. అదేమిటో కొంచెం స్పష్టంగా చెప్పగలవా?" కళ్ళు చిట్లించాడు అనిరుధ్.

"అదే సెక్స్. మనిద్దరిమధ్యా సెక్స్ వుండకూడదు. ఎప్పుడూ కూడా. దీనికి నువ్వు ఒప్పుకుంటావా?"

ఎప్పుడైతే మంజీర తనదొక చిన్న కోరిక అని ఆందో, తను  ఇటువంటిదే అడగబోతూ వుందని అనిరుధ్ కి అనిపించింది. అనుకున్నట్టుగానే అయింది. రొమాన్స్ ఇంకా సెక్స్ పట్ల మంజీర కి వున్న వ్యతిరేకత గురించి ముకుందం చెప్పింది అనిరుధ్ మర్చిపోలేదు.

"హండ్రెడ్ పెర్సెంట్ నేను ఒప్పుకుంటాను. నీకిష్టం లేకపోతె మనిద్దరిమధ్య ఎప్పుడూ సెక్స్ వద్దు. మనిద్దరం మంచి స్నేహితులుగా ఉండిపోదాం" చిరునవ్వుతో తను చెప్పినదానికి ఎంతమాత్రం ఆశ్చర్యపడకుండా అన్నాడు అనిరుధ్.

"మరి పిల్లలు.........." అనిరుధ్ దానికి ఏమాత్రం ఆశ్చర్యపడకపోవడానికి ఆశ్చర్య పడుతూ అడిగింది మంజీర

“"ఎవర్నైనా తెచ్చుకునిపెంచుకుందాం. లోకంలో ఎంతమంది పిల్లలు ఎవరూ లేకుండా బాధపడడం లేదు? అందులో ఒకళ్ళకైనా మనం ఆసరా అవుదాం నీ అంతగా నువ్వుగా కావాలి అనుకుంటే తప్ప మన మధ్య సెక్స్వుండదు."

“నిజంగా ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా?" ఆశ్చర్యం, ఇంకా ఆనందం నిండిన మొహం తో అడిగింది మంజీర.

"నిన్ను నమ్మించాలంటే ఏం చెయ్యాలో చెప్పు? ఎవరిమీదన్నా ఒట్టువేసి చెప్పమన్నావా?" కళ్ళు చిట్లించి అడిగాడు అనిరుధ్.

"థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్." తనకి తెలియకుండానే అనిరుధ్ ని రెండు చేతులతో వాటేసుకుని, అతని కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకుంటూ అంది మంజీర.

ఒక యవ్వనంలో వున్నఆడపిల్ల, అందులోనూ మంజీర లాంటి అందమైన అమ్మాయి, తనని అలా గట్టిగా వాటేసుకోవడం, అలా ముద్దుపెట్టుకోవడం అనిరుధ్ కి జీవితం లో అదే మొదటిసారి. తన బలమైన వక్షోజాలు రెండూ తన కుడిభుజానికి హత్తుకుని, సిల్కీగా, చల్లగా వున్న ఆమె పెదాలు తన కుడిబుగ్గకి ఒత్తుకుంటూ వుంటే ఎక్కడో స్వర్గంలో తేలుతున్నట్టుగా అనిపించింది అనిరుధ్ కి. తను కూడా ఆమెని వాటేసుకుని ఆమె రెండు బుగ్గలమీద బలంగా ముద్దుపెట్టుకోవాలన్న కోరికని అతి ప్రయత్నం మీద అణుచుకున్నాడు.

"నువ్విలా చేస్తూవుంటే నా మాట నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది." చిరునవ్వుతో అన్నాడు అనిరుధ్. "అయినా ఇలా ముద్దులు పెట్టుకోవడం కూడా సెక్స్ లో భాగమే."

ఆ విషయం అప్పుడే గమనించినట్టుగా వులిక్కిపడి అనిరుధ్ ని విడిచిపెట్టి దూరంగా జరిగింది మంజీర. "థాంక్యూ, నువ్వు ఈ విషయానికి ఇంత తేలికగా ఒప్పుకుంటావనుకోలేదు." అతని మొహంలోకి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అంది.

"ఇట్స్ ఆల్ రైట్" చిరునవ్వు నవ్వాడు అనిరుధ్. "అది మాత్రమే కాదు, నువ్వు ఇబ్బంది పడేలా మన జీవితం లో ఏదీ జరగదు. ఇంక నేను వెళ్లివస్తాను. చెప్పాను కదా నేను సివిల్స్ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ కావాలి." అలా అన్న తరువాత ఇంకా మరి వెనక్కి చూడకుండా వెళ్లి పోయాడు అనిరుధ్.

అనిరుధ్ వెళ్లిన వంకే చాలా సేపు చూస్తూ వుండిపోయింది మంజీర.     

&&&

"థాంక్యూ ఆంటీ, థాంక్యూ వెరీ మచ్!" తన గదిలోకి వచ్చిన తనూజ దగ్గరికి వెళ్లి, తన మెడ చుట్టూ చేతులు వేసి, ఎడమ బుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అంది మంజీర. "నువ్వంత మంచి సలహా ఇచ్చివుండక పోతే, మా చెత్త బ్లాక్ మెయిల్ ప్లానే కంటిన్యూ అయి వుండేది."

మంజీర చుట్టూ తను కూడా చేతులు వేసి అలాగే తీసుకుని వచ్చి అక్కడున్న బెడ్ మీద కూలేసి తను కూడా ఆ బెడ్ మీద తన పక్కనే కూచుంది తనూజ. "నీ డాడ్ నాకెంతో సాయం చేశారు. నన్నెంతో కాస్ట్లీ కాలేజ్ లో జాయిన్ చేసి, హాస్టల్ లో వుంచి బోలెడు ఖర్చు భరించి నన్ను చదివించారు. నేను పీ హెచ్ డీ చేసి డాక్టరేట్ తీసుకునేవరకూ నన్నే ఇబ్బందీ పడనివ్వ లేదు. ఇంకా.........."

"ఆంటీ. మనకి డబ్బుకేం లోటు? ఎంతో మందికి ఎన్నోరకాలుగా సహాయం చేశారు డాడ్. స్వంత చెల్లెలువి  నీకలా చెయ్యడం లో ఆశ్చర్యం ఏముంది? నువ్వదోక పెద్ద విషయం లా ఎందుకు ఆలోచిస్తున్నావు?" కళ్ళు చిట్లించి, నొసలు మూడేసి తనూజ మొహంలోకే చూస్తూ అడిగింది మంజీర. 

"కావచ్చు. కానీ ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ మీ డాడ్ కి మొదటినుండీ లేవు. తను మొదటినుండి ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసును. నేను తనకన్నా పది పన్నెండేళ్ళు పైనే చిన్నదాన్ని. మా ఇద్దరి మధ్య ముగ్గురు పుట్టి చిన్నతనం లోనే చనిపోయారు, అందుకనే అంత గాప్ వచ్చింది."

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)