Are Amaindi - 9 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

అరె ఏమైందీ? - 9

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"నీకు ఇంకా అమ్మాయిలతో పరిచయాలు వున్నప్పుడు, నన్నెందుకు ఆకర్షించడానికి ప్రయత్నించావు?" అయినా కోపంగా అడిగింది.

"నాకు ఒకళ్ళిద్దరితో సంభందం వున్నా, అవి కేవలం కాజువల్ రిలేషన్ షిప్స్. కేవలం సుఖం కోసం, అవసరం కోసం పెట్టుకున్నవి. వాళ్లెవరితోటి నాకిప్పుడు సంభందం లేదు." తన మగతనాన్ని ఆమెలో ఆలా కడుపుతూనే మాట్లాడుతున్నాడు సాకేత్. "నేను నిన్ను నిజంగానే ప్రేమించాను. అందుకనే నా ఆసక్తి నీకు ఎన్నో రకాలుగా తెలియపరిచే ప్రయత్నం చేసాను. థాంక్ గాడ్! నువ్వూ నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు."

దానికి ఏం మాట్లాడాలో తెలియక తన కౌగిలిని అతనిచుట్టూ మరింత బిగించింది ప్రమీల.

"నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు, కానీ ఒక్క విషయం మాత్రం నీకు చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ వుండరు. ఇకపై ప్రేమ అయినా, సెక్స్ అయినా కేవలం నీతో మాత్రమే."

"నువ్వు నన్ను నమ్మించనవసరం లేదు, నీ కళ్ళల్లో నాకది తెలుస్తూంది." అతని పెదవులమీద ముద్దు పెట్టుకుని అంది ప్రమీల.

ఆ ముద్దు తనలో ఏదో ట్రిగ్గర్ చేసినట్టుగా, తన నడుముని వేగంగా కదిపి ఆమెలో తన వేడిని దింపేసుకున్నాడు సాకేత్. ప్రమీల గట్టిగా అరిచి, తన కౌగిలిని మరింత బిగించింది అతని చుట్టూ.

"నేను ఇంతకుముందు కొంతమందిని అనుభవించివున్నా, నేను అనుభవించిన మొట్టమొదటి కన్యవి నువ్వే. వాళ్లెవరిదగ్గరా నిన్ను అనుభవించినప్పుడు నాకనిపించినట్టుగా అనిపించలేదు." ప్రమీల చెవిలో అన్నాడు సాకేత్.

"రాస్కెల్.....స్కౌండ్రల్.........." కోపంగా అంది ప్రమీల.

సాకేత్ నవ్వి ఆమె మీదనుండి కిందకి దిగబోయాడు.

"ప్లీజ్, కాసేపు ఇలాగేవుండు. ఎందుకో తెలీదు. నాకు కాసేపు నువ్వు ఇంకా ఇలాగె ఉండాలని వుంది." తన కౌగిలి బిగించి సాకేత్ ని ఆపుతూ అంది ప్రమీల.

కానీ సాకేత్ కి తెలుసు. తను వేడి దింపుకున్న తరువాత కూడా, అమ్మాయిలు తను వాళ్ళమీద అలా కాసేపు వుండాలని కోరుకుంటూ వుండేవారు.

"నేను వెంటనే నా ఫ్రెండ్స్ ఎవరినన్నా అడిగి ఏదన్న టాబ్ తీసుకోవాలి." కాస్సేపటి తరువాత తనే, సాకేత్ ని పక్కకి తోసి, బెడ్ మీద నుండి కిందకి దిగి, డ్రెస్ చేసుకుంటూ అంది ప్రమీల.

"దేనికి?" నొసలు చిట్లించి అడిగాడు

"ఏ ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేసుకున్నాం. ఇప్పుడు నన్ను కడుపు తెచ్చుకోమంటావా?" బెడ్ మీద నగ్నపర్వతంలా వున్నా సాకేత్ వైపు చూడడం ఇష్టంలేక వేరేవైపు చూస్తూ అంది, ప్రమీల.

బెడ్ మీద నుండి కిందకి దిగి, ప్రమీల దగ్గరికి వచ్చి, తనని రెండు చేతులతో కౌగలించుకుని అన్నాడు సాకేత్. "నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లిచేసుకునే ఉద్దేశం తో వున్నాను. కావాలంటే రేపే మీ వాళ్లతో మాట్లాడతాను. మన మొదటి కలయికలోనే నీకు కడుపు వస్తే అది నాకెంతో ఆనందం. రాకుండా మాత్రం నువ్వు టాబ్లెట్ లాంటివి ఏమీ వేసుకోకు దయచేసి." అన్నాడు.

"ఒకే అయితే. కానీ నువ్వు మొదట డ్రెస్ చేసుకో. బట్టలు లేకుండా నిన్నలా చూడలేకపోతున్నాను." కళ్ళుమూసుకుంటూ అంది.

అందుకు బట్టలు వేసుకోడానికి బదులుగా, మరొకసారి తనని బెడ్ మీదకి తీసుకుని వెళ్ళిపోయాడు సాకేత్. కోపంగా ప్రతిఘటించబోయింది ప్రమీల, కానీ అతనిబలం ముందు సాగలేకపోయింది. కాస్సేపటిలోనే మరొకసారి అతనికి సహకరించడం మొదలుపెట్టింది. ఈసారి మొదటిసారికన్నా ఎక్కువసేపు, తన మగతనాన్ని ఆమెలో కదిపాడు సాకేత్. అంత సుఖం అతనితో అలా అనుభవించాక, ఒక సంవత్సరం వరకూ సుఖం అవసరం లేదేమో అనిపించింది ప్రమీలకి.

అంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేసరికి ఒక సినిమా చూసి వెళ్తే ఎంత సమయం పడుతుందో, అంత సమయం పట్టింది.

&&&

ఆ రోజు అనిరుధ్ వెళ్లే సమయానికి, మనోజ్ ఇంట్లో అతని ఫామిలీ మెంబెర్స్ అందరూ వున్నారు. ప్రమీల కూడా తనతో నవ్వుతూ, ఏ అరమరికలు లేకుండా మాట్లాడేసరికి, చాలా రిలీఫ్ గా ఫీలయ్యాడు అనిరుధ్. అందరూ హలో వున్న కుర్చీల్లో, ఇంకా సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ వున్నారు.

"ఆ సర్వేశ్వరం తన కూతుర్ని పెళ్లిచేసుకోమని నిన్నలా బలవంతం చెయ్యడం తప్పే. ఒక అబ్బాయితో అలా తిరిగిన అమ్మాయిని నేను పూర్తిగా సపోర్ట్ చెయ్యలేను కూడా. కానీ.........." మనోజ్ తల్లి మల్లీశ్వరి అంది. ".........నిన్ను మంజీరని పెళ్లి చేసుకోవద్దని మాత్రం చెప్పలేను. తనని నువ్వు పెళ్లి చేసుకుంటే అది నాకు ఆనందం కలిగించే విషయం."

"మీరెందుకు అలా అంటున్నారు?" ఆశ్చర్యంగా అడిగాడు అనిరుధ్.

"ఆ సర్వేశ్వరం చాలా మంచిమనిషి. చాలా మందికి చాలా రకాలుగా ఉపకారాలు చేశాడు. అతనివల్ల ఉపకారం పొందిన ఫ్యామిలీలలో మా ఫ్యామిలీ కూడా వుంది."

"మా ఆవిడ చెప్పింది నిజం." మనోజ్ తండ్రి చలపతి అన్నాడు. "అప్పట్లో ఒకసారి మా ఆవిడకి జబ్బుచేసి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చెయ్యాల్సి వచ్చింది. ఆ సమయంలో సర్వేశ్వరం నాకు డబ్బిచ్చి చాలా సహాయం చేసాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తానన్నా కూడా ఒప్పుకోలేదు."

"ఆ సర్వేశ్వరం గారి మంచితనం నాక్కూడా బాగానే తెలుసు. మా నాన్నగారికి మంచి స్నేహితుడు కూడా. ఎన్నో సందర్భాల్లో అయన మాక్కుడా ధనసహాయం చేశారు. అయన సహాయం చేసివుండకపోతే మేము మా ఇల్లు కట్టుకుని ఉండగలిగే వాళ్ళమే కాదు." అనిరుధ్ అన్నాడు.

"అంత మంచి మనిషి ఇప్పుడు నిన్నెందుకలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నదే థౌజండ్ డాలర్స్ కొశ్చిన్." ప్రమీల అంది. "అలాగే మమ్మీ, నువ్వా అమ్మాయిని పెళ్ళిచేసేసుకోమని సలహా ఇచ్చేసే ముందు పాపం ఇతగాడు ఆ అమ్మయిని చేసుకుని సుఖంగా వుండగలడా అని కూడా ఆలోచించు. తనకి చాలా తలపొగరు."

దానికి మనోజ్ ఏదో అనబోయేలోగానే ప్రమీలే మళ్ళీ అంది చిరునవ్వుతో. "నేను ఇదేదో ఇతన్ని చేసుకుందామన్నఆలోచనతో ఇలా అంటున్నాననుకోనవసరం లేదు. ఎప్పుడైతే అన్నయ్య నన్ను ఎలా చూస్తాడో, తానూ నన్నలాగే చూస్తానని స్పష్టం చేసేసాడో, అప్పటినుండి నాకు తనమీద బ్రదర్లీ ఫీలింగ్ మాత్రమే వుంది.”

అది విని అక్కడున్న అందరూ నవ్వారు. అనిరుధ్ చాలా రిలీఫ్ గా ఫీలయ్యాడు.

"తన తల్లికి సరిగ్గా మతిస్థిమితం వుండేది కాదు. అలాంటి మతిస్థిమితం లేని తల్లి చేతుల్లో పన్నిండేళ్లవరకూ పెరిగింది. అంత లేత వయసులో తల్లి చనిపోతే, అప్పటినుండి ఆమె జీవితం పనిమనుషుల చేతుల్లోనే వుంది. తను సరిగ్గా ఆలోచించ లేక ఏవో తప్పటడుగులు వేసుంటుందే కానీ, తప్పుడు మనిషి అయితే మాత్రం కాదు. తను కూడా నిన్ను చేసుకోవడానికి అంగీకరిస్తే, నువ్వు తనని చేసుకోవడమే మంచిదని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను." మల్లీశ్వరి అంది.

"నేను తనకి అదే చెప్పాను. మంచి పెంపకం లో లేకపోవడం వల్ల తను ఆలా తయారైందే కానీ, మంజీర చెడ్డది కాదు." మనోజ్ అన్నాడు.

"తనకి ఒక అత్త వుంది. సర్వేశ్వరం చెల్లెలు. తనపేరు తనూజ అనుకుంటా. తనకి మంజీరఅన్నా, ఇంకా మంజీర అమ్మ అన్నా చాలా అభిమానం. కానీ తను చదువుకుంటూ ఎప్పుడూ హాస్టల్ లో వుంది. అలాగే మంజీర కి ఆరేడు ఏళ్ల వయసు వున్నప్పుడే పెళ్ళై చాలా దూరంగా వెళ్ళిపోయింది. అందుకని తన అన్నయ్య కుటుంబానికి పెద్దగా సహాయం కాలేకపోయింది." మల్లీశ్వరి అంది.

"నా చిన్నతనంలో, వాళ్ళింటి దగ్గర వున్నప్పుడు, ఒకటి రెండు సందర్భాల్లో ఆవిడని చూసిన గుర్తు నాక్కూడా వుంది." అనిరుధ్ అన్నాడు.

అనుకోకుండానే అప్పుడు అనిరుధ్ కి ఆ తనూజ గుర్తుకువచ్చింది. అప్పుడు తనది చాలా చిన్న వయసు. కానీ ఆవిడ చాలా అందంగా అనిపిస్తూ వుండేది. తనేదో చిన్నతనంవల్ల ఆలా అనుకున్నాడా, లేకపోతె నిజంగానే ఆవిడ అందంగా వుండేదా అన్నది అనిరుధ్ కి బోధపడడం లేదు.

"ఆ ఇంట్లో ఒక స్వామీజీ కూడా వుండేవారు. నేను ఆ యింటికి మా అమ్మతో వెళ్ళినప్పుడు, ఒకటి రెండు సందర్భాల్లో అయన నా దగ్గరికి వచ్చి పలకరించారు." ఇంకా గుర్తు చేసుకుంటూ అన్నాడు అనిరుధ్.

"ఆయనపేరు విచికిత్సానంద. సర్వేశ్వరానికి అయన అంటే చాలా గురి. ఆయన్ని అడక్కుండా ఏ పనీ మొదలు పెట్టేవాడు కాదు. అసలు అయనవల్లే జీవితంలో అంత పైకి వచ్చానని అయన అభిప్రాయం. అందుకనే ఆయన్ని తన ఇంట్లోనే అట్టేపెట్టుకున్నాడు." మల్లీశ్వరి అంది.

"నిజంగానే ఆ  విచికిత్సానంద చాలా గొప్ప వ్యక్తి. నాకూ ఒకటి రెండు సందర్భాల్లో సలహాలు ఇచ్చారు. అవి చాలా చక్కగా వర్కవుట్ అయ్యాయి." చలపతి అన్నాడు.

"చదువుకున్నవాళ్ళు కూడా అలంటి స్వాముల్ని నమ్మడం నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది డాడీ. ఆ సర్వేశ్వరం తన హార్డ్ వర్క్ ఇంకా తెలివితేటల వల్లే జీవితంలో పైకి వచ్చి వుంటాడు. కానీ అది ఆ స్వామివల్ల అయిందని ఎందుకు అనుకుంటాడో నాకు అర్ధం కాదు." మనోజ్ చిరాగ్గా అన్నాడు.

"అలంటి స్వాముల గొప్పతనం నీలాంటి కుర్రకుంకలికి అర్ధం కాదు. అయన అనుగ్రహం వల్లే కొంచెం పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఆ సర్వేశ్వరం కోట్లకి పడగలు ఎత్తగలిగాడు. లేకపోతే అంత తక్కువ పెట్టుబడితో, ఎవరన్నా అంత సాధించగలరా?" చలపతి అడిగాడు.

"ఈ విషయం లో అన్నయ్యనే నేనూ సపోర్ట్ చేస్తాను డాడీ. ఎవరన్నా హార్డ్ వర్క్ వల్ల, ఇంకా ఇంటెలిజెన్స్ వల్ల గొప్పవాళ్ళు అవతారు తప్ప అలంటి స్వాముల వల్ల కాదు." ప్రమీల అంది.

"సరేలే, మీలాంటి మూర్ఖులని అలంటి స్వాముల గొప్పతనం గురించి నమ్మించడానికి ప్రయత్నించడం కన్నా కూడా నోరుమూసుకుని ఊరుకోవడం మంచిది." మల్లీశ్వరి కోపంగా అంది.

ఆవిడ కోపం చూసి అక్కడ అందరూ నవ్వారు మళ్ళీ.

"ఆ నిర్మల అందం చూసే సర్వేశ్వరం పెళ్లిచేసుకున్నాడని అందరూ అనుకుంటారు. కానీ ఆ విచికిత్సానందే తనని పెళ్లిచేసుకోమని, ఆలా పెళ్ళిచేసుకుంటే బాగా కలిసొస్తుందని సర్వేశ్వరానికి సలహా ఇచ్చాడు. అందువల్లనే అయన తనని పెళ్లిచేసుకున్నాడు. ఒకసారి సర్వేశ్వరం నాతొ చెప్పాడు." చలపతి అన్నాడు.

"నిజంగా ఆ నిర్మలని పెళ్లిచేసుకున్న తరువాతే ఆ సర్వేశ్వరానికి కలిసొచ్చి అంత ధనవంతుడు కాగలిగాడు. ఆ విచికిత్సానంద ఇచ్చిన ఏ సలహా సర్వేశ్వరానికి వృధాపోలేదు." మల్లీశ్వరి అంది.

దానికి ఎవరూ ఏమనక పోవడంతో కాస్సేపు అక్కడ మౌనం అలుముకుంది.

"కానీ ఆ సర్వేశ్వరం నిర్మలని మనస్ఫూర్తిగా ప్రేమించాడన్నది నిజం. తనకి మతిస్థిమితం లేకపోయినా తనని ఎంతో అభిమానంగా చూసుకున్నాడు. ఆమె పోయేనాటికి తను కావాలనుకుంటే ఎంతోమంది అందమైన అమ్మాయిలు పెళ్లిచేసుకోవడానికి ముందుకొచ్చేవారు. కానీ ఎప్పుడూ ఇంకో పెళ్లిగురించి ఆలోచించలేదు." ఆ నిశబ్దాన్ని ఛేదిస్తూ మళ్ళీ మల్లీశ్వరే అంది.

"ఇది మాత్రం ప్రతిఒక్కరూ అంగీకరించాల్సిన నిజం" చలపతి అన్నాడు.

"ఆ తండ్రీ కూతురు ఇద్దరూ చాలా మంచివాళ్ళు. నువ్వే వేరే ఏ విషయం ఆలోచించకుండా ఆ అమ్మాయిని పెళ్లిచేసుకో. ఇది మా అందరికీ చాలా ఆనందం కలిగించే విషయం." చలపతి అన్నాడు.

"నువ్వూ ఆ అమ్మాయి చిన్నప్పుడు మంచి స్నేహితులు. కలిసి ఆడుకున్నారు. ఆ సర్వేశ్వరం నువ్వు తన కూతుర్ని పెళ్ళిచేసుకోవాలని పట్టుబట్టాడానికి కారణం ఎదో మీ ఇద్దరి బాల్యంలో జరిగిన సంఘటనే అయివుంటుంది. అదేమిటో తెలుసుకోవాలని నువ్వు జుట్టు పీక్కోకుండా, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి అంగీకరించడమే మంచిదని నాకు తోస్తూంది." మనోజ్ అన్నాడు.

"ఆ నిర్మల ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. అందుకని మేమందరం ఆమెని దూరం పెట్టేవాళ్ళం. కానీ మీ అమ్మ మాత్రం ఆమెతో కలుపుగోలుగా వుండేది. తన ఇంటికి వెళ్లి తనతో టైం స్పెండ్ చేసేది. ఆ కారణంగానేనేమో ఆ నిర్మల కూడా మీ అమ్మతో బాగానే వుండేది. ఆ ఇద్దరిదీ ఎదో జన్మలో ఋణానుబంధం అయివుంటుంది." మల్లీశ్వరి అంది.

"ఇందంతా వింటూ వుంటే నాక్కూడా నీకు మంజీర ని పెళ్లిచేసుకోమని చెప్పాలనిపిస్తూ వుంది." ప్రమీల అంది.

"మంజీర కేవలం ఎదో బలవంతం వల్ల నన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరిస్తూందా, లేకపోతె మనస్ఫూర్తిగా అంగీకరిస్తూందా అన్నవిషయం నాకు తెలియాలి." అనిరుధ్ అన్నాడు. "ఒకవేళ తను నన్ను మనస్ఫూర్తిగా పెళ్ళిచేసుకోవాలని అనుకుంటూవుంటే, నేనూ గతాన్ని మర్చిపోయి ఆమెని పెళ్లిచేసుకుంటాను. నిరంజన్ తో అలా తను తిరిగిన విషయం కూడా పట్టించుకోను."

"నీకా విషయం తెలియాలంటే నువ్వు మరొకసారి ఆ మంజీరని కలుసుకుని మాట్లాడడం మంచింది." మనోజ్ అన్నాడు. "నీకది అంత కష్టమైనా విషయం కాదు కూడా."

"నువ్వు చెప్పింది నిజం. నేను మంజీరని మరోసారి కలుసుకుని మాట్లాడతాను. తనకి నన్ను పెళ్లిచేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమైతే తక్కిన విషయాలు పట్టించుకోను." అనిరుధ్ అన్నాడు.

మరికొంతసేపు వాళ్లతో అలా మాట్లాడి, వాళ్లింట్లోనే భోజనం పూర్తిచేశాక ఇంటికి చేరుకున్నాడు అనిరుధ్.

&&&

ప్రశాంతంగా నిద్రపోదామని ఆ రోజు రాత్రి అనిరుధ్ చేస్తూన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మంజీర తనతో పొగరుగా బిహేవ్ చెయ్యడం స్టార్ట్ చేసిన తరువాత, తన గురించి, తనతో కలిసి తను ఆడుకున్న ఆటల గురించి ఆలోచించడం మానేసాడు అనిరుధ్. కానీ మనోజ్ ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాక, తన నిర్ణయం మార్చుకుంటే మంచిది అనిపిస్తూ వుంది. మంజీర మనస్ఫూర్తిగా తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ వుంటే, గతాన్ని మర్చిపోయి తనని తన భార్యగా అంగీకరించడానికి తనకి అభ్యంతరం లేదు. కానీ అంత పొగరుగా ఆలా ప్రవర్తించిన అమ్మాయి ఆలా ఎలా మారిపోయి తనని ఇష్టపడుతుంది? అందులోనూ ఆ నిరంజన్ అంటే అంత విముఖత రావడానికి కారణం ఏమిటి?   

"తను తల్లిలేని పిల్ల. ఎదో తెలియక నీతో ఆలా ప్రవర్తిస్తూ వుంది. అది నువ్వు సీరియస్ గా తీసుకోకు నాన్నా." మంజీర తనంటే పట్టించుకోకుండా, ఇంకా తను మాట్లాడినప్పుడు తనతో పొగరుగా మాట్లాడినప్పుడు, తన తల్లికి ఫిర్యాదుచేస్తే, ఆవిడ అంది.

తన తల్లి మాటలు పట్టించుకుని, తన పొగరు బిహేవియర్ పట్టించుకోకుండా, తనతో స్నేహంగా వుండడానికే ప్రయత్నిస్తూ వుండేవాడు. కానీ తను తనతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా, తనని చాలా తక్కువగా చూస్తూ, తక్కువ చేసిమాట్లాడుతూ వుంటే, ఇంక తనని పట్టించుకోవడం మానేసాడు.

మంజీర ఆలా పొగరుగా బిహేవ్ చెయ్యడం అన్నది తను హై స్కూల్ లో వుండగానే స్టార్ట్ అయింది. తల్లి చనిపోయిన తరువాత, కొంతకాలం పాటు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా వుండిపోయింది. అలాంటి బాధలో అది సహజమే అనుకున్నాడు. ఆ తరువాత కొంతమంది తో మాట్లాడుతూ స్నేహం గా వుంటే, తనూ వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నం చేసాడు.

"నువ్వు తరచూ వచ్చి నాతొ ఇలా మాట్లాడ్డానికి ప్రయత్నం చెయ్యకు. ఎవరన్నా నేను బాయ్స్ తో స్నేహం గా వున్నాననుకోవడం నాకు నచ్చదు." చిరాగ్గా అంది.

"అదేమిటి? నువ్వు కొంతమంది అబ్బాయిలతో మాట్లాడుతున్నావు కదా." తను ఆశ్చర్యం గా అడిగాడు.

"వాళ్ళు నా స్టేటస్ తో సమానమైనవాళ్లు. నీలా అలగాజనం కాదు."

ఆ సమయంలోనే తను తన ప్రవర్తన గురించి తన తల్లికి ఫిర్యాదుచేస్తే, తను పై ప్రకారంగా చెప్పింది.

తను ఏడవ తరగతి చదివే సమయం లో కాబోలు,  సర్వేశ్వరం ఒక రోజు తన ఇంటికి వచ్చి తన తల్లి ని అడిగాడు. "నా చెల్లెలు తనూజ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. ఈ విషయంలో మీరే ఎలాగైనా పూర్తి సహాయం చెయ్యాలి." అన్నాడు.

"ఎంతమాట. ఈ విషయం లో మీరు నన్ను ఇలా అడగాలా? ఇదంతా పూర్తయ్యేవరకూ నేను దగ్గరవుండి చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి." తన తల్లి అంది.

తరువాత కొన్నిరోజుల పాటు తన తల్లి చాలా హడావిడిగా, ఎక్కువ సమయం సర్వేశ్వరం ఇంట్లో మంజీర తోనే గడిపింది. ఏవో సెలెబ్రేషన్స్ అవీ కూడా జరిగాయి. తన తల్లి వెంటనే తను అడిగినా చెప్పలేదు కానీ, అంతా సద్దుమణిగాక చెప్పింది. "తను పెద్ద మనిషి అయింది."

"పెద్ద మనిషి అవ్వడం అంటే........." నిజంగానే అప్పటికి అదేమిటో తనకి తెలియదు.

"నేను అది నీకు చెప్పలేను. ముందు ముందు నీకే తెలుస్తుందిలే." తన తల్లి చిరునవ్వుతో అని ఊరుకుంది కానీ ఎంత అడిగినా అదేమిటో మాత్రం చెప్పలేదు.     

తరువాత తనకన్నా సీనియర్ ద్వారా అదేమిటో, అదయ్యాక ఒక స్త్రీ లో వచ్చే మార్పులేమిటో, అది ఒక స్త్రీ జీవితంలో ఎంత ముఖ్యమైన విషయమో తెలిసింది అనిరుధ్ కి. తనంటే పడకపోయినా, తన ప్రవర్తన వల్ల తనతో మాట్లాడటం తగ్గించేసినా, చాప కింద నీరులా తనలో వస్తున్న మార్పులని మాత్రం గమనించకుండా ఉండలేకపోయాడు అనిరుధ్. పదవతరగతి లోకి వచ్చే సమయానికే పూర్తిగా పరిపక్వత చెందిన యవ్వనంతో స్ఫూటంగా ఉండేది మంజీర. అలాగే తనలో పొగరు కూడా బాగా పెరుగుతూ వచ్చింది. తను తల్లిలేని పిల్ల అన్న జాలి కూడాపోయి తనని చాలావరకూ పట్టించుకోవడం మానేసాడు అనిరుధ్.కొన్ని సందర్భాల్లో ఇంటర్ లో, ఇంకా డిగ్రీ లో కూడా తనతో మాట్లాడ్డానికి ప్రయత్నించాడు, కానీ తను తనతో అలాగే ఇన్సల్టింగా మాట్లాడి హర్ట్ చేసింది.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)