Orei Bawa - Osei Maradala - 19 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 19

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 19

అలా రోజులు గడిచిపోతూ పార్టీ జరిగే రోజు రానే వచ్చింది..... ఆరోజు మధ్యాహ్నం నుంచి అందర్నీ ఇంటికి వెళ్లిపోమని చెప్పి షార్ప్ ఫిక్స్ కల్లా పార్టీ జరిగే హోటల్ కి రమ్మని కృష్ణ అందరికీ ప్యూన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో అందరూ సంతోషంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఎవరి హాస్టల్స్ కి వాళ్ళు ఎవరి ఫ్లాట్స్ వాళ్ళు వెళ్లిపోయారు......

@@@@@@

సీత కూడా ఫ్లాట్ కి వెళ్ళాక “ బావ ఈ పార్టీ నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకే కదా??? “ అని ఏదో రహస్యం ఛేదించిన దానిలా అడిగింది

రామ్ నవ్వుతూ అవును అనగానే “ అయితే ఈ రోజు నిన్ను బాగా పొగుడుతారా??? “ అని ఎక్సైటింగ్ గా అడిగింది

రామ్ సీత నెత్తి మీద మూడుతూ “ ఇదేమైనా సభా కార్యక్రమం అనుకున్నావా నన్ను పొగడటానికి??? పార్టీ జస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు అభినందించి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు అంతే..... “ అని అన్నాడు

“ ఓ అవునా సరేలే అవును ఇంతకీ పార్టీకి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి??? అంటే డ్రెస్ కోడ్ అంటూ పెట్టుకుంటారు కదా కొందరు అలా ఈ పార్టీకి కూడా ఉందా???? “ అని అడిగింది

“ హా బ్లాక్ ఆర్ వైట్ రెండు కలర్స్లో ఏ టైప్ డ్రెస్ అయినా వేసుకోవచ్చు...... “ అని అన్నాడు

“ అవునా అయితే లాంగ్ ఫ్రాగ్ కూడా వేసుకోవచ్చా??? “ అని సీత అడగగానే రామ్ సీతని ఒక్కసారి లాంగ్ ఫ్రాక్ లో ఊహించుకొని “ నో నో అలా కాదు నువ్వు ఓన్లీ సారీ కట్టుకో నువ్వు...... అయినా నువ్వు ఎప్పుడు శారీ కట్టుకోలేదు కదా పెళ్లిలో తప్ప కాబట్టి నాకోసం ఈరోజు కట్టుకో...... “ అని క్యూట్గా మొహం పెట్టి అడిగాడు

“ కానీ నాకు సారీ కట్టుకోవడం రాదని తెలుసు కదా బావ??? జస్ట్ లంగా వోని వరకే నేను నేర్చుకుంది ఆ తర్వాత నేర్చుకోలేదుగా....... “ అని బుంగమూతి పెట్టి అడిగింది

“ నువ్వు చీర కట్టుకుంటాను అంటే నేను కట్టనా ఏంటి??? “ అని ఈసారి కొంటెగా కన్నుకొడుతూ అన్నాడు రామ్

సీత అనుమానంగా రామ్ వైపు చూస్తూ “ నీకు చీర కట్టడం ఎలా వచ్చు బావ??? అంటే నాకంటే ముందే ఎవరికైనా చీర కట్టావా??? “ అని అడిగింది

“ చి చి లేదే నీకు తెలుసు కదా నీకే నేను లంగా వోని కట్టేటప్పుడు తప్ప ఎప్పుడైనా టచ్ చేశానా??? ఏదైనా నీ మీద మాత్రమే ప్రయోగం చేస్తాను...... నేను చీర కడతాను అంది యూట్యూబ్ లో చూసి..... నేను ఏదైనా ఒక్కసారి చూస్తే వెంటనే నేర్చుకుంటాను కాబట్టి నీకు ఈజీగా చీర కట్టేస్తాను.....

అదే నువ్వనుకో గంటలు గంటలు ట్రై చేసిన ఆ చీర పర్ఫెక్ట్ గా రాదు..... పార్టీలో అప్పలమ్మలా ఉంటావు అందుకే చెప్పేది నేను చెప్పినట్టు నా చేతులతో నేనే స్వయంగా నీకు చీర కడతాను నువ్వు కట్టించుకో...... “ అని చిలిపిగా అన్నాడు

రామ్ కళ్ళల్లో కొంటెదనానికి సీత కళ్ళు వాల్చేసి “ పో బావ నువ్వు మరీ రోజు రోజుకి తుంటరోడిలా తయారవుతున్నావు..... “ అని సిగ్గు కనిపించనివ్వకుండా దిక్కులు చూస్తూ అంది

“ అంత సిగ్గుపడకు నీకసలు సిగ్గు సూట్ కాదు..... “ అని వెటకారంగా చెప్పి ఎరుపెక్కిన బుగ్గల మీద ముద్దులు పెట్టి “ నువ్వు చీర కట్టుకోవడం రాదు అన్నావు నేను నీకు ది బెస్ట్ ఆప్షన్ ఇచ్చాను...... నీకు తెలుసా నీకోసం చాలా కష్టపడి షాపింగ్ మాల్ మొత్తం తిరిగి శారీ కొన్నాను.......

నీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ నువ్వు నా చేత చీర కట్టించుకుంటాను అంటేనే ఆ చీర నీకు ఇస్తాను...... లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రెడీ అవ్వచ్చు...... “ అని బుంగమూతి పెట్టి అన్నాడు

“ హాయ్ కొత్త చీర చూపించు చూపించు బావ..... “ అని సీత అడుగుతూ ఉంటే “ అయితే నా చేత చీర కట్టించుకుంటానని చెప్పు!!!! “ అని డిమాండ్ చేశాడు రామ్

“ పో బావా నీకు తెలుసు కదా నాకు ఏవైనా కొత్తవి కనిపిస్తే అవి యూస్ చేసే వరకు వదలని...... ప్లీజ్ ప్లీజ్ బావ ముందు చీర చూపించు అది బాగుంటే నువ్వే కడుదువు..... “ అని అంది

“ ఇదే మాట మీద ఉండు “ అంటూ సీతకి తెలియకుండా తన కబోర్డ్ లో తన బట్టల కింద దాచిపెట్టిన సారీ తీసి సీత ఎదురుగా పెట్టి ఎలా ఉంది???? అని కళ్ళు ఎగరేశాడు

రామ్ కొన్న సారీ పార్టీవేర్ బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చి చాలా అందంగా ఉంది.......

ఆ శారీని సీత భుజం మీద వేసుకొని రూమ్ లోకి వెళ్లి అద్దంలో చూసుకోగా సీత ఫెయిర్ కలర్ అవటం వలన సారీ ఇంకా అందాన్ని పెంచినట్టుగా అనిపించి “ చాలా బాగుంది బావ నాకు బాగా నచ్చింది..... నేను సాయంత్రం ఈ సారి నే కట్టుకుంటాను...... “ అని ఎగ్జైటింగ్ గా అంది

“ అయితే నేను కూడా ఈసారి నే నీకు కడతాను..... “ అని కొంటెగా చెప్పి “ ఇక రా లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం..... “ అని సీత చేతిని పట్టుకొని డైనింగ్ హాల్ కి తీసుకువెళ్లి తనకి వడ్డించి రామ్ కూడా తినేసి ఇద్దరు బెడ్ మీద వాలి సాయంత్రం 4:00 కి అలారం పెట్టుకుని మరి ఒకరికొగిలిలో మరొకరు ప్రశాంతంగా నిద్రపోయారు......

సాయంత్రం అలారం ఆఫ్ చేసి మరి 4:30 కి బద్ధకంగా లేచిన ఇద్దరు ముందుగా సీతని రెడీ అవ్వమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి పంపించాడు రామ్......

సీత సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చి టవల్ చుట్టుకొని రామ్ ఎదురుగా నిలబడి సారీ కట్టు బావ అని అంది....

టవల్ లో ఉన్న సీతని చూసి రామ్ గుటకలు మింగుతూ “ టవల్ మీద ఎలా చీర కడతానే??? “ అని మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి సారీ ఫోల్డ్స్ విప్పుతూ అన్నాడు రామ్

“ అమ్మో నీ ముందు అలా ఉండాలంటే నావల్ల కాదు బావ....... నేను ఇలా టవల్ లోనే ఉంటాను నువ్వు సారీ కట్టేయ్...... లేకపోతే నువ్వు కళ్ళు మూసుకొని కడతానంటే టవల్ తీస్తాను...... “ అని అంది

రామ్ చిరుకోపంగా సీతవైపు చూస్తూ “ నిన్ను ఎన్నిసార్లు నేను ఇలా చూడలేదే చెప్పు??? ఈరోజు ఏదో కొత్తగా చూస్తున్నట్టు తెగ మెలికలు తిరుగుతున్నావు!!! “ అంటూ రామ్ నే సీత ఒంటి మీద ఉన్న టవల్ తీసేసి తన అందాలని చూసి నుదుటి మీద చిరు చెమట పడుతూ ఉంటే మనసులో “ అనవసరంగా టవల్ తీయించానని అనిపిస్తుంది...... దీన్ని ఇలా చూసి నేను సారీ కట్టగలనా??? “ అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు

సీత రామ్ చూపుకి తడబడి ఒక్కసారిగా వెనక్కి తిరిగి “ బావ నువ్వు అలా చూడకు ప్లీజ్ నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు ఏదోలా ఉంది...... “ అని బుగ్గలు ఏరుపెక్కేల సిగ్గు పడింది

రామ్ సీత నడుముని రెండు వైపులా పట్టుకొని తన వైపు తిప్పుతూ “ ఏ మాట కా మాట చెప్పుకోవాలి సీత నీ బ్యూటీ స్పాట్ ఒకటి ఇదైతే అని గడ్డం దగ్గర ఉన్న పుట్టుమచ్చ చూపించి చెప్పి రెండోది ఇది అని బొడ్డు పక్కనే ఉన్న పుట్టుమచ్చని రెండు వేళ్ళ మధ్య నలిపి హాట్ గా కనిపిస్తుంది...... “ అంటూ తల వీధిలించి యూట్యూబ్ ఓపెన్ చేసి చీర ఎలా కట్టాలో చూస్తూ అలానే కడుతూ సీత శరీరాన్ని టచ్ చేస్తూ ఉన్నాడు

రామ్ నలపగానే బావ అని కళ్ళు మూసుకుని అరిచిన సీత రామ్ చేతులు తన శరీరం మీద ఆడుతూ ఉంటే సీత చిగురుటాకులా వణికి పోతూ ఎప్పుడు లేని సిగ్గు దొంతర్లు తనలో చేరి రామ్ వైపు చూడటానికి కూడా కళ్ళు ఎత్త లేకపోయింది.......

అలా పైట వేసి పిన్ పెట్టి కుచ్చులు పోసి నడుము దగ్గర దోపే టైంలో సీత కంగారుగా రామ్ చేతిలోకి కుచ్చులు తీసుకొని “ నేను దోపుకుంటాను బావ..... “ అంటూ తనే దోపుకొని పిన్ పెట్టుకుంది

రామ్ సారీ కట్టడం పూర్తయిన వెంటనే బయటికి వెళ్లి ఒక వాటర్ బాటిల్ ఖాళీ చేసి “ ఇంకొకసారి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు రా బాబోయ్...... “ అని తన చేతులు వైపు చూసి వాటికి గట్టిగా ముద్దు పెట్టి అందంగా బ్లష్ అవుతూ బయటికి వచ్చేసరికి అప్పటికే సీత తన సిగ్గుని దాచలేక అలా సిగ్గుపడుతూనే అద్దంలో తనని తాను చూసుకొని “ పర్లేదు బాగానే కట్టాడు...... “ అనుకుంటూ ముడిపెట్టిన జడని ముడి తీసి జడ వేసుకుంటూ ఉంది

రామ్ లోపలికి వచ్చి “ ఓయ్ ఆగు ఈరోజు అంతా నేనే నిన్ను రెడీ చేస్తాను...... “ అంటూ సీత జుట్టు మీద ప్రయోగాలు చేయటానికి ఫిక్స్ అయి సీత చెప్తున్నా వినిపించుకోకుండా చేసి ఒక సైడ్ పిన్స్ పెట్టి రెండో సైడ్ వదిలేసి హెయిర్ మొత్తం లీవ్ చేసి మొహానికి లైట్ గా మేకప్ వేసి రెడ్ కలర్ బిందీ పెట్టి దాని కింద కుంకుమ పెట్టి పాపిటల్లో కనీ కనిపించకుండా లైట్గా కుంకుమ పెట్టి చేతులకి తను తీసుకున్న బంగారపు పగడపు గాజులు అటు ఇటు వేసి మధ్యలో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ నార్మల్ గాజులు వేశాడు......

మెడలో వైట్ స్టోన్ నెక్లెస్ దానితోపాటు ఎప్పుడూ మెడలో ఉండే బంగారపు చైన్ కాళ్ళకి తను కొత్తగా తెచ్చిన మువ్వల పట్టీలు తన పాకెట్ లో నుంచి తీసి ఆల్రెడీ సీత కాళ్లకి ఉన్న పట్టీలు తీసేసి అవి పెట్టేసి సీతని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి “ పర్ఫెక్ట్ చాలా అందంగా ఉన్నావు ఇప్పుడు అద్దంలో చూసుకో..... “ అంటూ తనని పైకి లేపి సీత వెనుక నిలబడి భుజం చుట్టూ చేతులు వేసి ఆ భుజం మీద గడ్డం నిలిపి అద్దంలో సీతని చూపిస్తూ అన్నాడు

సీత ఒక్కసారి తనను తాను చూసుకొని వెంటనే ఇద్దరినీ కలిపి చూసి “ చాలా అందంగా ఉన్నాను బావ ఇలా..... “ అంటూ రామ్ జుట్టు చెరిపి “ థాంక్యూ ఇక నువ్వు వెళ్లి రెడీ అవ్వు లేటవుతుంది...... “ అని అంది

“ నిజమేనే బాబు నిన్ను రెడీ చేయడానికే ముప్పావు గంట తీసుకున్నాను ఇక నేను ఇంకొక పావుగంటలో రెడీ అయిపోయి బయలుదేరాలి....... “ అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి బ్లాక్ కలర్ టీషర్ట్ పైన బ్లాక్ కలర్ జాకెట్ బ్లూ జీన్స్ వేసుకుని హెయిర్ ని జెల్ రాసి వంచి ఒక చేతికి వాచ్ పెట్టుకుని బయటికి వచ్చిన రామ్ ని చూసిన సీత అలానే ఫ్రీజ్ అయిపోయింది

సీతనో చూసిన రామ్ కళ్ళు ఎగిరేసి ఎలా ఉన్నాను??? “ అని అడిగితే సీత రామ్ దగ్గరికి వచ్చి తన కంటి కొసల కాటుక తీసి చెవి వెనక పెట్టి “ ఇంత అందంగా ఉన్నావు బావ...... ఎంతైనా నువ్వు ఈ సీత మొగుడివి కదా అందంగా ఉండాలి లే..... “ అని గర్వంగా అంది

రామ్ సీత నెత్తి మీద మొట్టి “ చాల్లే నువ్వు నీ వేషాలు..... “ అంటూ సేమ్ సీత లాగే చెవి వెనక చుక్క పెట్టి “ ఈరోజు చాలా అందంగా ఉన్నావు..... ముందే చెప్తున్నాను పార్టీలో అడ్డమైన డ్రింక్స్ తాగకు.....

జాగ్రత్త జ్యూస్ తో పాటు మందు కూడా ఉంటుంది..... చాలావరకు అన్ని ఒకే కలర్లో ఉంటాయి కాబట్టి చూసి తాగు...... లేదంటే నేను ఏమిస్తే అదే తీసుకో...... అలాగే ఈ పార్టీలో నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను..... కచ్చితంగా నేను ఇచ్చే సర్ప్రైస్ కి నువ్వు షాక్ అవుతావు చూస్తూ ఉండు..... “ అని నవ్వుతూ చెప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకొని సెల్లార్ లోకి వెళ్లి ఈసారి బైక్ కాకుండా కార్ తీసుకొని పార్టీ జరిగే ప్లేస్ కి స్టార్ట్ అయ్యారు


ఇంకా ఉంది......

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.......