Orei Bawa - Osei Maradala - 16 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 16

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 16

అభి అప్పుడు చేరుకొని పళ్ళు బిగిపెట్టి “ ఒకే సార్ నేను తనతో కొంచెం సేపు మాట్లడి పంపిస్తాను ..... “ అనగానే “ ఓకే అభి డైరెక్ట్ గా తనని ట్రైనర్ దగ్గరికి పంపించేయ్ ..... “ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాక క్యాబ్ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాక రామ్ సీత దగ్గరికి ఒక్క అడుగు వేస్తూ “ నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇక్కడే జాయిన్ అవుతున్నావని ??? “ అని అడిగాడు

@@@@@

సీత రామ్ టేబుల్ మీద ఎక్కి కూర్చుని కాళ్ళు ఊపుతూ “ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బావ ఎలా ఉంది నా సర్ప్రైజ్??? “ అని అడిగింది

రామ్ సీత దగ్గరగా వెళ్లి తనని టేబుల్ కి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి మొహల్లో మొహం పెట్టి “ నాకు నచ్చలేదు నీ సర్ప్రైజ్ ..... అవును ఉదయం అందుకేనా అంత హడావిడిగా కావాలని నన్ను ముందు పంపించావు??? “ అని కోపం నటిస్తూ అడిగాడు

సీత రామ్ ముక్కు లాగుతూ “ హహహ అవును బావా అందుకే నీకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వటానికి ఇలా చేశాను ...... ఎనీవే నేను చేసిన దానికి నాకు ఫలితం లభించింది...... నన్ను చూడగానే నీ కళ్ళల్లో షాక్ ప్లస్ సర్ప్రైజ్ రెండు కనిపించాయి అది చాలు ..... “ అని నవ్వుతూ అంది

“ మరి ఇంత ఉదయాన్నే వచ్చేసావేంటి??? యాక్చువల్గా నువ్వు లెవెన్ తర్వాత కూడా రావచ్చు కదా అందరితో పాటు??? పైగా నీతో పాటు ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారంట అంటే మీ కాలేజ్ వాళ్లేనా ??? “ అని అడిగాడు

“ ఉదయాన్నే ఎందుకంటే నీకు ఇలా సర్ప్రైజ్ ఇవ్వటానికి..... అవును నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ టీం లోనే డైరెక్ట్ గా నన్ను వేస్తారని ఊహించలేదు !!! ఎనీవే ఐ యామ్ ఆల్సో సర్ప్రైజ్డ్ విత్ దిస్ వన్..... “ అని నవ్వుతూ అంది

రామ్ సీత ముక్కుని మునిపంటితో లాగుతూ “ నాక్కూడా నచ్చింది బట్ నువ్వు నా కింద వర్క్ చేయడానికి ఇంకా వన్ మంత్ టైం ఉంది ......నీ సర్ప్రైజ్ కూడా నచ్చింది ఇంటికి వెళ్ళాక ఈ సర్ప్రైజ్ కి తగ్గ గిఫ్ట్ కూడా ఇస్తానులే..... “ అని సీత వేళ్ళు విరుస్తూ అన్నాడు

“ అంటే ఏంటి బావ ఇంటికి వెళ్ళాక నన్ను కొడుతావా??? అది కూడా బెల్ట్ తీసుకొని కొడతావా??? వాతలు తేలేలా కొడతావా ??? లేకపోతే గుక్క పెట్టి ఏడ్చేలా కొడతావా??? “ అని భయం నటిస్తూ అడిగింది

రామ్ విలన్ల హహహ అని గట్టిగా నవ్వుతూ ఉంటే ఇంతలో క్యాబిన్ డోర్ నాక్ సౌండ్ కి సీత కంగారుగా కిందకి దిగితే రామ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే ప్యూన్ ఎండి పిలుస్తున్నాడు అని చెప్పాడు......

రామ్ ఓకే అని సీతని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమని చెప్పి వెళ్ళాడు......

సీత సరే అని బయటికి వెళ్లాక రామ్ నవ్వుకుంటూ ఎండి క్యాబిన్ కి వెళ్ళగానే కృష్ణ నవ్వుతూ “ ఎలా ఉంది నీ న్యూ టీమ్ మెంబర్??? “ అని అడిగాడు

రామ్ నవ్వుతూ “ బాగుంది సార్..... “ అనగానే “ మరి అంత బాగుందా ఏంటి తనతో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు ??? ఒకవేళ తనే నీ భార్య కాదు కదా??? “ అని అనుమానంగా గెస్సింగ్ చేశాడు కృష్ణ

రామ్ షాక్ అయ్యి “ మీకు ఎలా తెలుసు సార్??? “ అనగానే “ అరె పాగల్ నీ క్యాబిన్లో సీసీటీవీ ఉందన్న విషయం మర్చిపోయి ఇద్దరు ఓ తెగ ఊపుకుంటూ మరి మాట్లాడుకున్నారు మరి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది ??? ఇప్పటివరకు మిమ్మల్ని చూస్తూ ఉన్నాను మీ ఇద్దరు ఏదో అచ్చిక కబుచ్చికలాడుతున్నారని డిస్టర్బ్ చేయలేదు కానీ మీరు మీ మాటల్లో పడిపోయి టైం మర్చిపోతూ ఉంటే తప్పక పిలిచాను...... “ అని కన్ను కొట్టి అన్నాడు కృష్ణ

రామ్ బ్లష్ అవుతూ “ ఎస్ ఆర్ తనే నా వైఫ్ సీత సీత మహాలక్ష్మి ...... బట్ నాకు తను ఇక్కడ జాయిన్ అవుతున్నట్టు నాకిందే టీమ్ మెంబర్గా యాడ్ అయినట్టు తెలియదు...... తను నాకు సర్ప్రైజ్ ఇవ్వటానికి ఇలా చేసింది...... “ అని అన్నాడు

“ వావ్ నీ వైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ...... నిన్ను సర్ప్రైజ్ చేయటానికి ఇంత ప్లాన్ చేసింది అంటే నాకెందుకో కావాలని ఇక్కడ జాబ్ కొట్టి ఉంటుందని అనిపిస్తుంది!!!! బై మిస్టేక్ సీత నీ టీం లో పడింది సరే అయిపోయిందేదో అయిపోయింది కదా అని నీకు చెబుదామనుకునే లోపు మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగ కనిపించేసరికి నీ భార్య తనేమోనని ఇలా గెస్ చేస్తే నిజమని తేలింది ...... ఏదేమైనా మీ ఇద్దరు ఒకే చోట ఉండాలని ఆ దేవుడు శాసిస్తే నేను ఆచరించి నీ టీంలో వేసేసాను పండగ చేసుకో ...... అలాగని వర్క్ డిలే చేస్తే తెలుసుగా నా గురించి!!!! “ అని నవ్వుతూనే అన్నాడు కృష్ణ

“ హహహ సార్ నా గురించి కూడా తెలుసు కదా నేను వర్క్ లో ఎంత సిన్సియర్ అనేది!!!! సో మీరు వర్క్ గురించి ఎక్కువ టెన్షన్ పడకండి ఇన్ టైం లో అంత కంప్లీట్ చేసే బాధ్యత నాది..... థాంక్యూ సార్ సీతని నా టీంలోనే వేసినందుకు..... బయట వేరే వాళ్ళ టీంలో అయితే తను కొంచెం ఇబ్బంది పడేది...... “ అని అన్నాడు

“ ఇట్స్ ఓకే కానీ ఎప్పుడూ నీ భార్యని అందరికీ పరిచయం చేస్తావు??? “ అని అడిగాడు

“ ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీ రోజు పరిచయం చేద్దామని అనుకుంటున్నాను సార్ ..... అలా సీతకి కూడా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను...... “ అని అన్నాడు రామ్

“ ఓకే ఆల్ ది బెస్ట్ ఇక నువ్వు నీ వర్క్ చేసుకో..... అలాగే మరొక నెలరోజుల్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండు..... ఎలానో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక రెస్ట్ అనేది ఉండదు కదా !!!! “ అని నవ్వుతూ అన్నాడు కృష్ణ

ఓకే సార్ అని చెప్పి రామ్ తన కాబిన్ లోకి వెళ్లిపోయి సీత ఇచ్చిన సర్ప్రైజ్ కి సంతోషిస్తూ ఉంటే వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్న సీత దగ్గరికి అప్పుడే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి వచ్చిన తన కాలేజ్ ఫ్రెండ్ అయినా అమిత్ “ హాయ్ సీత “ అని పలకరించాడు

“ అమిత్ నువ్వా??? నువ్వు కూడా ఇక్కడే జాయిన్ అయ్యావా ??? “ అని ఇబ్బందిగా నవ్వుతూ అడిగింది సీత

“ హా సీత నువ్వు ఎక్కడ జాయిన్ అయితే నేను అక్కడే కదా!!!! “ అనగానే సీత షార్ప్ గా అమిత్ వైపు చూసేసరికి “ అదే అదే ఈ కంపెనీ ది బెస్ట్ కదా అందుకే ఇక్కడ జాబ్ సంపాదించాను ..... బై ది వే నేను కూడా మీ టీం నే ఇప్పుడే మేనేజర్ సార్ చెప్పారు.....

ప్రజెంట్ అభిరామ్ సార్ బిజీగా ఉన్నారంట అందుకని తర్వాత పరిచయం చేస్తాను అన్నారు ...... నా టీమ్ నెంబర్ వెయిటింగ్ హాల్లో ఉన్నారు అని చెప్తే ఎవరా అని వస్తే నువ్వు కనిపించావు ..... ఐ యాం సర్ప్రైజ్డ్ అండ్ ఆల్సో హ్యాపీ నా ఫ్రెండ్ మళ్ళీ తిరిగి సేమ్ టీమ్ మెంబర్గా వచ్చింది......

ఇప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేసుకోవచ్చు కొత్త వాళ్లతో అయితే మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉండేది మనిద్దరికీ ముందే పరిచయం కాబట్టి ఫ్రీగా కూడా ఉండొచ్చు...... “ అని పళ్ళు అన్ని బయటపెట్టి అన్నాడు అమిత్

సీతా షార్ప్ గా అమిత్ వైపు చూస్తూ “ బట్ నాకు ఇక్కడ అభిరామ్ సార్ బాగా క్లోజ్ అయ్యారు నాకంత ఇబ్బందిగా లేదు ..... తెలుసు కదా నేను ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాను అని కాబట్టి నాకు ఎక్కడున్నా పెద్ద ఇబ్బంది అనిపించదు ..... “ అని మాట్లాడుతూ ఉండగానే ప్యూన్ వచ్చి ఇద్దరినీ అభిరామత పిలుస్తున్నాడని చెప్పగానే సీత ఎక్సైట్మెంట్ తో పైకి లేస్తే అజిత్ టెన్షన్ గా ప్యూన్ వెళ్ళాడు

ఇద్దరూ లోపలికి వచ్చేసరికి రామ్ సీరియస్ గా మొహం పెట్టి కమ్ అని ఇద్దరికీ సీట్ ఆఫర్ చేసి కూర్చోండి అని చెప్పి “ మీ ఇద్దరూ నాకిందే వర్క్ చేయాలి కాబట్టి నా గురించి మీకు తెలియాలి ...... నేను వర్క్ విషయంలో చాలా స్ట్రీట్ ఇన్ టైం లో నేను ఇచ్చిన వర్క్ చేయకపోతే పనిష్మెంట్స్ కూడా ఉంటాయి......

లైక్ ఎక్కువ టైం వర్క్ చేయటం నేనిచ్చిన వర్క్ అయిపోయేంతవరకు ఆఫీస్ లోనే ఉండటం అలా అన్నమాట కాబట్టి మీ ట్రైనింగ్ పీరియడ్లో చాలా శ్రద్ధగా మీ ట్రైనింగ్ నేర్చుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా దగ్గర వర్క్ చేయండి ..... కాదని ఎక్స్ట్రాలు చేశారంటే కత్తిరించటం నాకు పెద్ద పని కాదు..... “ అని ఇండైరెక్ట్ గా సీతకి వార్నింగ్ లా అన్నాడు

సీత కోపంగా టేబుల్ కింద నుంచి రామ్ కాలు మీద తన హీల్ తో గట్టిగా కొట్టి ఉరిమి చూడగానే రామ్ మనసులో అబ్బా అనుకుంటూ “ దీనితో పెద్ద తలనొప్పొచ్చి పడింది ...... ఇలా అయితే రోజు నన్ను ఆడుకుంటూనే ఉంటుంది..... “ అనుకుంటూ సీత వైపు కోపంగా చూసి వెంటనే అజిత్ వైపు చూస్తూ “ మీ ఇద్దరు ఒకే కాలేజ్ నా??? “ అని అడిగాడు

“ హా కాలేజ్ మాత్రమే కాదు సార్ మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా!!! చెప్పవేం సీత నువ్వు ఒకసారి నాకు ప్రపోజ్ కూడా చేసావు కదా??? “ అని అన్నాడు

అజిత్ ఆ మాట అనటమే రామ్ ఒక్కసారిగా ఏంటి అని గట్టిగా అరుస్తూ సీతవైపు చూసేసరికి సీత కళ్ళు తేలేసి అజిత్ వైపు చూసి “ ఏం మాట్లాడుతున్నావు అజిత్ ??? “ అని అరిచింది

“ హా సీత నేను నిజమే కదా చెప్పింది??? ఏం నువ్వు నాకు కాలేజ్ టైంలో ప్రపోజ్ చేయలేదా ??? నిజం చెప్పు నేను నీకు తిరిగి ఐ లవ్ యు టూ చెప్పలేదా??? “ అని నవ్వుతూ అడిగాడు

సీత భయంగా గుటకలు మింగుతూ రామ్ వైపు చూసేసరికి అప్పటికే రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయి నిప్పులు కురిపిస్తూ ఉంటే “ ఈరోజుతో నా పని అయిపోయింది ..... “ అనుకుంటూ “ అది కాదు బా .... “ అని బావ అని పిలిచేలోపే రామ్ కోపంగా ఇద్దరు వైపు చూస్తూ “ మీ పర్సనల్ విషయాలు ఆఫీస్ లో మాట్లాడకండి గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్.... “ అని గట్టిగా అరిచాడు

@@@@@@@

మనం నీతు దగ్గర చూద్దాం పదండి.....

నీతూ ఎప్పుడైతే సీత రామ్ క్యాబిన్లోకి వెళ్లి మేనేజర్ వెళ్లిపోయిన కూడా చాలా సేపు ఉందో అప్పుడే డౌట్ స్టార్ట్ అయ్యి “ కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో ఉంది !!!! పైగా బావ మరదళ్ళు!!!! అసలు ఇద్దరి మధ్య ఏముందో ఎలా తెలుసుకోవాలి ??? “ అని అనుకుంటూ సీత బయటికి వచ్చే టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటే సీత బయటికి రావటం డైరెక్ట్ గా వెయిటింగ్ హాల్ కి వెళ్లిపోవడంతో అక్కడి నుంచి సీత కోసం వెళ్తే బాగుండదని లంచ్ అవర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది కాస్త ఈసారి అజిత్ తో కలిసి సీత రామ్ క్యాబిన్లోకి వెళ్లడం చూసి “ ఇదేంటి అభి క్యాబిన్లోకి వస్తూ పోతూ ఉంది??? “ అనుకుంటూ చూస్తూ ఉంది

ఇంకా ఉంది......