Orei Bawa - Osei Maradala - 9 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 9

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 9

“ ఇప్పుడు కాదు హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను..... ఇప్పుడే ఎందుకు చెప్పు..... మొత్తానికి నువ్వు నేను జాబ్ చేయటానికి ఒప్పుకున్నావు..... రాహు “ అంటూ రామ్ ఒడిలోకి దూకి మరి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది

రామ్ సీత ముద్దుకి ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి సీత నడుము చుట్టూ చేతిని బిగించి అలానే ఉండిపోయాడు.....

@@@@@@@

సీత రామ్ పరిస్థితి పట్టించుకోకుండా “ థాంక్యూ బావ అక్కడికి వెళ్లాక డ్రెస్సెస్ ఆఫీస్ కి సంబంధించినవి అన్ని నువ్వే తీసుకోవాలి ఓకేనా!!! “ అని తన పాటికి తను అడుగుతూ ఉంటే రామ్ రోబో లాగ తల నిలువుగా ఊపి చేతిని చీర లోపల నుంచి నడుము మీద పెట్టగానే ఈసారి సీత స్టన్ అయ్యి బా బా బావ అని తడబడుతూ పిలిచింది

హా అంటూ సీత కళ్ళల్లోకి మత్తుగా చూడగానే సీత కళ్ళు వాల్చేస్తూ “ బావ నా నడుము మీద చేయి తియ్..... నువ్వు నన్ను అక్కడ పట్టుకుంటే ఏదోలా ఉంది..... “ అని రామ్ కాలర్ రెండు చేతుల్లో గట్టిగా పట్టుకుని అంది

“ నాకు అలానే ఉంది ఇంకొకసారి నువ్వు కాని ముద్దు పెట్టావంటే నేను మాత్రం ముద్దుతో ఆగను..... “ అని సీతను ముద్దు పెట్టుకోవాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటూ నడుము మీద గట్టిగా గిచ్చి వదిలేయగానే సీత ఔచ్ అంటూ కిందకి దూకి నడుము రుద్దుకుంటూ

“ అబ్బా బావ అయినా నేను నీకు ఎప్పుడూ ముద్దు పెట్టనట్టు ఏంటిది??? చిన్నప్పటినుంచి ఎన్నిసార్లు మనం ముద్దు పెట్టుకోలేదు??? ఈరోజు ఏదో కొత్తగా ముద్దు పెట్టుకున్నట్టు నువ్వు మరి ఇలా నడుము గిచ్చేయాలా???? చూడు ఎలా ఎర్రగా అయిందో!!!! “ అని నడుము చూపిస్తూ అంటే

రామ్ తల కొట్టుకొని సీత నడుముని రెండు చేతుల్లో పట్టుకుని దగ్గరికి లాగి బొడ్డు మీద కోరికి “ అప్పుడు వేరు ఇప్పుడు వేరు..... అప్పుడు నువ్వు ఓన్లీ నా మరదలు మాత్రమే ఇప్పుడు భార్య వి ఆ మాత్రమైన గుర్తుందా నీకు???? నాకు ఈ ఎక్స్పోజింగ్ ఏంటి వెళ్లి పడుకో పో...... “ అని కసిరాడు

రాము కొరకగానే ఇస్ అబ్బా అంటూ సీత బొడ్డు దగ్గర రుద్దుకుంటూ “ నా చీర నా ఇష్టం నీకేంటి నొప్పి??? నిన్ను నన్ను చూడమని చెప్పానా??? ఊరికే ఎక్కడపడితే అక్కడ కొరుకుతున్నావ్ గిచ్చుతున్నావు!!! పో బావా నువ్వు మారిపోయావు...... “ అంటూ తల మీద రెండు మొటికాయలు వేసి వెళ్లి పడుకొని ఫుల్ గా దుప్పటి కప్పుకుంటే

రామ్ తల కొట్టుకొని “ దీనికి నా బాధ అర్థం కాదు నా బాధ అర్థం చేసుకునేంత మైండ్ లేదు..... ఇంకా చిన్నపిల్ల మైండ్ దగ్గరే ఆగిపోయింది దీని మైండ్...... “ అని అనుకొని బాల్కనీలోకి వెళ్లిపోయి లాప్టాప్ పట్టుకొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసాడు

సీత మాత్రం శుభ్రంగా తొంగోని “ బావ జాబ్ కి ఒప్పుకున్నాడు ఇక నాకు అడ్డే లేదు...... “ అని హ్యాపీగా నిద్రపోయింది

రామ్ లోపలికి వచ్చేసరికి సీత బెడ్ మొత్తం ఆక్రమించి అడ్డదిడ్డంగా పడుకొని తను కప్పుకున్న బెడ్ షీట్ ఎప్పుడో దూరంగా వెళ్లిపోయి చీర ఆస్త వ్యస్తంగా మారిపోయి రామ్ కి అందాల విందు చేస్తూ ఉంటే రామ్ తల కొట్టుకొని “ దీనికి ఎప్పుడు ఈ బుద్ధులు పోతాయో ఏమో!!!!! చిన్నపిల్లలాగా బెడ్ మొత్తం ఆక్రమించింది..... పైగా ఈ ఎక్స్పోజింగ్ ఒకటి...... “ అనుకుంటూ

‌ సీత దగ్గరికి వెళ్లి తన చీర సరిచేసి మోకాళ్ళ పైకి జరిగిన చీరని కాళ్ళ మీదకి వేసి సీతని సరిగ్గా పడుకోబెట్టె దుప్పటి కప్పి తన పక్కన పడుకోగానే సీత ఒక్కసారిగా రామ్ గుండెల మీదకు చేరిపోయి కాలు చేయి వేసి గుర్రు పెట్టి నిద్రపోతుంది.....

రామ్ కి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు స్పీడ్ గా పరిగెడుతూ చేయి తన మాట విననంటూ సీత నడుము మీదకి చేరి మనసు గిలిగింతలు పెడుతూ ఉంటే నవ్వుకుంటూ సీత నుదుటి మీద ముద్దు పెట్టి “ ఒక్క క్షణం పెద్ద దానిలా కనిపిస్తే మరు క్షణం చిన్నపిల్లగా అయిపోతావు నీతో ఎలా వేగాలో ఏంటో!!!! “ అనుకుంటూ కళ్ళు మూసుకొని నిద్రపోయాడు

తర్వాత నాలుగు రోజులు హ్యాపీగా గడిచి పోగా రామ్ సీత సిటీకి వెళ్లే రోజు రానే వచ్చింది..... ఇంటిల్లిపాది తరలి రామ్ సీతల సంసారం చక్కబెట్టడానికి బయలుదేరారు......

సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారు సుధ గారు సురేంద్ర గారు ఒక కార్ లో బయలుదేరితే రామ్ సీత రాధ గారు వీరేంద్ర గారు మాత్రం మరో కార్ లో బయలుదేరుతారు..... వాళ్లు వెళ్లేటప్పుడు ఊరందరూ వాళ్లకి తోచినంతగా వాళ్ళ పొలాల్లో పండిన కూరగాయలు అప్పుడే ఈనిన గేద జున్నుపాలు అరిటికాయలు బియ్యం అన్ని ఇచ్చి తమ ఊరి పెద్ద బిడ్డలు తమ బిడ్డలు అనుకొని సాగనంపుతారు......

అలా ఆరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని గ్రేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లోకి దూసుకు వెళ్ళాయి రామ్ వాళ్ళ కార్లు......

రామ్ కార్ దిగి మిగిలిన పెద్ద వాళ్ల కోసం చూస్తూ ఉండగా సీత ఆ అపార్ట్మెంట్ ని తలపైకెత్తి చూస్తూ “ బావ ఈ అపార్ట్మెంట్లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు??? “ అని కళ్ళు విప్పార్చి అడిగింది

సెవెంత్ ఫ్లోర్ అని నవ్వుతూ చెప్పగానే “ సూపర్ బావ వ్యూ మాత్రం సూపర్ ఉంది..... ఇలాంటి అపార్ట్మెంట్లు జస్ట్ కాలేజ్ కి వస్తూ పోతూ ఉన్నప్పుడు చూడడమే తప్ప ఫస్ట్ టైం ఇలా అపార్ట్మెంట్ లోకి రావడం..... నాకు బలే ఎక్సైటింగ్ గా ఉంది..... “ అని కళ్ళల్లో మెరుపుతో అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది

రాధ గారు వీరేంద్ర గారు సీత సంతోషాన్ని చూసి సంతోషించారు......

ఇంతలో పెద్దవాళ్లు కూడా రావటంతో అందరూ కలిసి రామ్ అపార్ట్మెంట్ కి వెళ్లేసరికి అప్పటికే రామ్ గురించి తోటి ఫ్లాట్ వాళ్లు చుట్టూ చేరిపోయి “ అరే రామ్ వీళ్ళందరూ ఎవరు??? “ అని అడిగారు

రామ్ నవ్వుతూ ఒక్కొక్కరిని పరిచయం చేసి చివరిగా సీత భుజం చుట్టూ చేయి వేసి నా భార్య అని అన్నాడు......

ఎందుకో రామ్ తనని తన భార్య అని చెప్పటం సీతకి బాగా నచ్చి రామ్ కళ్ళల్లోకి నవ్వుతూ చూసింది......

ఇంతలో రాధ గారు సుధ గారు లోపలికి వెళ్లి గృహప్రవేశానికి ఏర్పాట్లు అన్నీ చేసి ఇద్దరినీ గ్రాండ్ సక్సెస్ఫుల్గా లోపలికి కుడికాలు పెట్టించి మరి రప్పించి బయట నిలబడి ఉన్నా తోటి ఫ్లాట్ వాళ్ళని లోపలికి పిలిచి పాయసం చేసి పెట్టి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి రామ్ సీతలు ఆశీర్వాదం తీసుకుంటే అప్పటికప్పుడు వాళ్ళు తెచ్చి పెట్టుకున్న తాంబూలాలు ఇచ్చి పంపిస్తారు......

వాళ్లంతా వెళ్ళిపోయాక సీత పెద్ద వాళ్ళందరితో కలిసి ఫ్లాట్ మొత్తం చూస్తూ ఉంటుంది...... రామ్ ఫ్లాట్ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..... అందులో ఒక మాస్టర్ బెడ్ రూమ్ 2 నార్మల్ బెడ్రూమ్స్ ఉంటే మాస్టర్ బెడ్ రూమ్ కి బాల్కనీ ఉండి బాల్కనీలో తనకి నచ్చిన మొక్కలు అన్నీ పెంచుతున్నాడు...... అక్కడే ఒక హ్యంగింగ్ ఉయ్యాలా కూడా ఉంది..... ఇంకా ఒక కిచెన్ ఒక పూజగది హాల్ కి ఆనుకొని మరొక బాల్కనీ ఉంటే ఆ బాల్కనీలో మొత్తం గులాబీ పువ్వుల చెట్లు వేసి హంగింగ్ మొక్కలు కూడా ఉంచి కింద పచ్చిక బయలు ఆర్టిఫిషియల్ పరిచి ఉంటే దానిమీద ఒక టేబుల్ రెండు చైర్స్ వేసి ఉంటాయి......

మొత్తానికి ఫ్లాట్ నీట్ అండ్ క్యూట్ గా ఉండటంతో సీతకి బాగా నచ్చి మొత్తం తిరిగి వచ్చి అభి దగ్గరికి వెళ్లి ఎక్సైటింగ్ గా “ బావ మన ఫ్లాట్ సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది..... “ అంది

మిగిలిన వాళ్ళందరూ కూడా అదే అని ఫ్లాట్ లోకి కిచెన్ సామాన్లు కొన్ని , ఒక వాషింగ్ మిషన్ ఒక ఏసి మాస్టర్ బెడ్ రూమ్ లో ఒక బెడ్ ఆల్రెడీ ఉండటంతో ఎక్స్ట్రా బెడ్ కొనాలి అని ఫిక్స్ అయ్యారు......

అదంతా అయ్యేసరికి నైట్ టైం అయిపోవడంతో వంట చేస్తాను అన్నా రామ్ వద్దని చెప్పి ఆర్డర్ పెట్టి మరో ఆరు గంటకి ఆర్డర్ రాగానే అందరూ తినేస్తారు.....

రామ్ సీతలకి ఒక గది రాధ సుధ గారు మహాలక్ష్మి గారు ఒక గది సూర్యనారాయణ గారు వీరేంద్ర గారు సురేంద్ర గారు ఒక గది తీసుకొని పడుకోవటానికి వెళ్ళిపోతే సీత రూమ్ లోకి రాగానే ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయి నైట్ ట్రాక్ లోకి మారిపోయి బెడ్ మీద పడుకొని పక్కనే వర్క్ చేసుకుంటున్న రామ్ తో “ బావ ఈ ఫ్లాట్ రెంట్ ఎంత??? “ అని రామ్ థైస్ మీద చేయి వేసి అడిగింది

రామ్ నవ్వుతూ “’ఇది మన ఓన్ ఫ్లాట్ నేను జాబ్ చేస్తూ వచ్చిన మనీ ఇంకొంచం లోన్ అప్లై చేసి కొన్నాను మన పెళ్ళికి ముందే..... “ అని అన్నాడు

సీత ఎక్సైటింగ్ గా పైకి లేచి “ ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా??? ఇది మన ఓన్ ఫ్లాట్ నా??? బాబోయ్ బావ నువ్వు ఇంత సంపాదించావని మాటవరసకి కూడా చెప్పలేదే!!! అమ్మానాన్న అత్తయ్య మావయ్య తాతయ్య అమ్మమ్మలకి అందరికీ తెలుసా??? “ అని అడిగింది

“ లేదు ఇంకా చెప్పలేదు వాళ్లు అడగలేదు కదా రేపు చెబుదాంలే...... జర్నీ చేసే అలసిపోయావు కదా నిద్రపో..... “ అని తన తలన ముద్దు పెట్టగానే సీత నవ్వుతూ “ నిద్ర రావడం లేదు బావ కబుర్లు చెప్పచ్చు కదా!!! “ అని రామ్ చేయి చుట్టూ చేతిని వేసి భుజం మీద తలవాల్చి అడిగింది

“ ఏం చెప్పాలి మా సీతమ్మకి??? “ అంటూ ఒక చేతితో లాప్టాప్ మీద వేళ్ళు ఆడిస్తూనే అడిగితే “ బావ నువ్వు ఇంటి దగ్గర ఇలా వర్క్ చేస్తూనే ఉన్నావు ఇక్కడ వర్క్ చేస్తున్నావు అంత హెక్టిక్ వర్క్ ఎందుకు పెట్టుకున్నావు??? “ అని అయోమయంగా అడిగింది

“ అదేం లేదు సీత ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి డెడ్లైన్ దగ్గర్లో ఉంది దానికోసమే ఇలా కష్టపడుతున్నాను..... టీం లీడర్ నేనే కాబట్టి అన్నీ చూసుకోవాలి కదా!!!! “ అని అన్నాడు

ఓహో అంటూ “ బావ నేను కూడా ఇంకొక టు వీక్స్ లో జాబ్ లో జాయిన్ అవ్వాలి నాకు కావాల్సినవన్నీ నువ్వే కొనిస్తానన్నావు గుర్తుందా???? అలాగే అమ్మ వాళ్లతో కూడా చెప్తానన్నావు కానీ ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు???? “ అని గారం గా అడిగింది

“ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో హైదరాబాద్ రాగానే చెప్తాను అన్నావు మరి చెప్పలేదు ఏంటి??? “ అని అడిగాడు



ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......