Telugu Quote in Blog by Bk swan and lotus translators

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

---------- Forwarded message ---------
వీరినుండి: BK BORN STAR TV
Date: 17 జూన్, 2024, సోమ 3:42 PM
Subject: గో మూపురం చైతన్య గోపురం mo
To: Brahma Kumaris


పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆ పరమాత్మ ప్రతిరూపమే అని భావించ,పూజించి,గౌరవించి సత్కరించే సమున్నత సంప్రదాయం ఉన్న సమున్నత దేశం మనది. మానవ సేవే మాధవ సేవని నమ్మి భూత దయను మానవ కనీస ధర్మంగా భావించి ఆ సేవలకే తమ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు ధన్యజీవులు కోకొల్లలుగా జన్మించిన పుణ్య భూమి మనది
నిజానికి పరమాత్మ పరంధామ నివాసి,మానవాత్మలందరూ వారి ప్రియ సంతానం. వృక్షాలూ.. పశు పక్ష్యాదులూ.. జలచర భూచరాలు ఇవన్నీ ప్రకృతి అధ్బుత సృష్టి
మరీ ముఖ్యంగా చతుష్పాద క్షీరదాల్లో గోవులకున్న స్థానం అత్యంత ప్రత్యేకమైనది.పరమ పవిత్రమైనది.
ముఖ్యంగా హైందవ మతానికి చెందినవారు గోవును గోమాతగా ... కామధేనువుగా తలుస్తారు... పిలుస్తారు కొలుస్తారు... ఆవు నుంచి వచ్చే ప్రతీ పధార్ధం అమృత తుల్యమైనది... ఆరోగ్య ప్రదాయని అని ఆయుర్వేదం నిర్ధారించింది
ఆవు శ్వాస ఆవు నీడ ఆవు పాలు ఆవు నెయ్యి గోమూత్రం గోమయం...ఇవన్నీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విశేష ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషిస్తాయన్నది నిర్వివాదాంశం
సుభాష్ పారేకర్ వంటి పర్యావరణ ప్రేమికులు గో ప్రాశస్త్యం గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
వీరి అవిశ్రాంత అవిరళ కృషి ఫలితంగా గో ఆధారిత వ్యవసాయం ప్రజాదరణ పొందుతోంది..
ఇప్పటి వరకూ గోక్షీరాన్ని పూజా పునస్కారాల్లోనూ దివ్య క్రతువుల్లో మాత్రమే విరివిగా ఉపయోగించేవారు
ఐతే ఇప్పుడిప్పుడే ప్రజలు గో క్షీరాన్ని తమ ఆహారం లో భాగంగా చేసుకుంటున్నారు
ఇదే అదనుగా చూసుకుని కొన్ని విదేశీ బహుళ జాతి సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి.నిజానికవి ఆవుపాలు ఎంతమాత్రం కానేకావు.... సంకరజాతి పశువుల పాలనే ఆవు పాలుగా మోసపూరిత ప్రచారం చేసి విక్రయిస్తున్నారు... వాస్తవానికి ఆవు పాలనే పేరుతో వారు విక్రయిస్తున్నది కాలకూట విషాన్ని
అది నోటికి రుచికరంగా వుంటూనే మన ఆరోగ్యాన్ని అంచెలంచెలుగా స్వాహా చేస్తుంది.యావత్ ప్రపంచంలో భారతీయ గోవుకు మాత్రమే మూపురం వుంటుంది
ఈ మూపురం దేవాలయ గోపురమంత పవిత్రమైనది
హిమాలయశిఖరమంత ఉన్నతమైనది
గోవు మూపురం పై సూర్యకిరణాలు పడినప్పుడు ఆ మూపురం లోని నాడుల్లో జరిగే అంతర్గత రసాయన చర్యల వలన ఆవు పాలలోఅద్వితీయ ఔషధీ గుణాలు సంతరించుకుంటాయి
ఇటువంటి అధ్భుత నిర్మాణం భారతీయ గోవులకే స్వంతం.కాబట్టి అందరూ దేశవాళీ ఆవు పాలనే త్రాగండి
బహుళ జాతి సంస్థల తలుకుబెలుకు ప్రకటనల మోజు లో పడి మీ ఆరోగ్యానికి చేటు తెచ్చుకోకండి...ఓంశాంతి

Telugu Blog by Bk swan and lotus translators : 111970347
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now