విలువలు వాలుతలం పై
వాలిపోతుంటే...
బంధాలు చందాలగా దురమవుతాయి...
మదిలోని సంతోషం ముఖంలో తడిసి ముద్దయి
పెదవులపై చిరునవ్వు పదిమందిలో చులకనవుతుంది..
చల్లని నిచ్వసా, ఉచ్వసా కూడా
వేడితో ఉరకలేస్తుంది...
మన ఎదుట మనిషి ఉన్నప్పటికీ అతన్ని చేదించి,
వేదించాలి అనిపిస్తుంది.
మనలోని గర్వమూ, మనలోని అపనమ్మకం
కలగలిసి కోపమై పరవళ్ళతో
మన రూపు రేఖలను మారుస్తుంది.
అప్పుడే తన కోపము
మన శత్రువు అవుతుంది...