English Quote in Jokes by Bk swan and lotus translators

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగిపోయిన శ్రీనాధుడు

(నెట్లో సంచరిస్తున్న ఈ హాస్య గుళికను అందరితో పంచుకోవాలనిపించి)

ఆరోజు విజయవాడలో ఆఫీసర్ల క్లబ్ వార్షికోత్సవం. వూళ్ళో వున్న పెద్ద పెద్ద ఆఫీసర్లు భార్యలతో సహా వచ్చారు. సాహిత్యం మీద ఇష్టాగోష్ఠి. స్టేజీమీద రైల్వే డి.ఆర్.ఎం గారు ముఖ్య అతిథిగా ఆసీనులయ్యారు. ఆ క్లబ్బుకి వారి సతీమణి కార్యదర్శి. ముఖ్యాంశం శ్రీనాధుని కవితా వైభవం.

శ్రీనాధుని కవిత్వం గురించి సీస పద్యాలు ఉదహరిస్తూ ఒకరు మాట్లాడారు. ఆయన ప్రసంగం అవగానే అందరూ చప్పట్లు కొట్టారు. డి.ఆర్.ఎం గారు క్లబ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.

చివర వందన సమర్పణ చేస్తూ డి.ఆర్.ఎం గారి సతీమణి "శ్రీనాధుని కవిత్వం గురించి ఎన్నో చక్కని విషయాలు చెప్పారని అబినందిస్తూ ఆ శ్రీనాధుని ఒక వారం రోజుల క్రితమే తాను తమిళ్‌నాడు ఎక్స్ ప్రెస్ రైల్లో చూసానని, ఆయన ఫలానావారు అని తెలిసేలోగానే వారు రాజమండ్రీలో రైలు దిగి వెళ్ళిపోయారని, అలాంటి మహాకవిని కలిసి మాట్లాడలేకపోవడం తన దురదృష్టమని" విచారంగా చెప్పింది.

సభలో అంతా అవాక్కయ్యారు. ఆ నిశ్శబ్దానికి కారణం తెలియక భర్త వైపు చూసింది. డి.ఆర్.ఎం గారు భార్యకేసి కోపంగా చూసారు.

సరే కార్యక్రమం పూర్తి అయింది. డి.ఆర్.ఎం గారు సతీమణితో కార్లో ఇంటికి వెళ్తున్నారు.

మౌనంగా వున్న భర్తతో "ఏమండీ నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, నాకేసి కోపంగా చూసారు?" అని అడిగింది.

"నీకు బుద్ధిలేదు. ఏం వాగావో తెలుసా?"

"నేనేమన్నానండి?" అంది భయంభయంగా.

"తమిళ్‌నాడు ఎక్స్ ప్రెస్ రాజమండ్రీ మీదుగా వెళ్తుందా? ఆ మాత్రం ఇంగిత ఙ్ఞానం లేకుండా మాట్లాడితే నలుగురూ నవ్వరూ? చూసావా అందరు విస్తుపోయి నీకేసి ఎలా చూసారో?"

"అవునండి. అది హౌరా మెయిల్ అనబోయి తమిళ్‌నాడు అన్నా" అంది ఖిన్నురాలై.
(పేరు తెలియని రచయితకు ధన్యవాదాలతో)

English Jokes by Bk swan and lotus translators : 111259041
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now