కళ అంతం లేనిది
అంతరం ఎరుగనిది
కాల ప్రవాహంలో నిరంతరాయంగా సాగిపోతుంది
కాలాణుగుణంగా రూపాంతరం చెందుతుంది
అందుకే నిత్య నూతనంగా వుంటుంది
నిరంతరం చైతన్యపరుస్తుంది
నవ్విస్తుంది ఏడిపిస్తుంది
ఆలోచింపజేస్తుంది మైమరపిస్తుంది
ఏమైనా చేయాలని అనిపించేలా చేస్తుంది
ఇంకేం కావాలి అని అనుకునేలా చేస్తుంది
కలరవమై విహరిస్తుంది
కలవరమై పలవరించేలా చేస్తుంది
కళెప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది
కలకాలం కదలాడుతూనే ఉంటుంది.....
కదిలిస్తూనే ఉంటుంది