ఆన ఆను పదమందు రాధ నడుమనుజేర్చ
ఆరాధనను పదము లిఖితమగును
రాధతత్వమెరిగి నీదు సాధనజేయ
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
అన అనే పదానికి ఒట్టు అనే అర్ధం కలదు
ఈ పదం మధ్యలో రాధ పేరును చేరిస్తే ఆరాధన అనే పదం తయారవుతుంది.. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి వుండడమే రాధ తత్వం... ఈ పరమ సత్యాన్ని గుర్తించి నీ సాధనలో నిబద్ధతను పెంచటంకోసం ఓ బ్రహ్మ పుత్రా ...తక్షణమే మేలుకో అని అర్ధము
...........................................................ఓంశాంతి