Nirupama - 18 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 18

Featured Books
Categories
Share

నిరుపమ - 18

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"నాకర్ధం అవుతూందిరా." వాడికి కుర్చీ దగ్గరగా లాక్కుని మరోసారి వాడి కుడి భుజం మీద చెయ్యి వేసి అంది మేనక.  "కానీ మనం ఫాక్ట్స్ యాక్సప్ట్ చేసే తీరాలి. వేరే దారి లేదు."

"ఐ నో ఇట్ అక్కా." కన్నీళ్లు తుడుచుకున్నాడు ఆనంద్ . " తనెందుకు సైకాలజీ చదవాలనుకుందో నాకు తెలియదు. కానీ తను మాథ్స్ లో జీనియస్. నాకు మాథ్స్ లో వచ్చే డౌట్స్ అన్ని యిట్టె సాల్వ్ చేసిపెట్టేది. నాకెలా చదువుకోవాలో, ఎలా జ్ఞాపకం వుంచుకోవాలో ఎన్నో ట్రిక్స్ చెప్పేది. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూనే ఉండేది. ఏరోజూ తను ఏ విషయం గురించి బాధపడుతున్నట్టుగా అనిపించలేదు.  నేను తను సూసైడ్ చేసుకుందని తెలిసిన రోజు షాక్ తో స్పృహ తప్పిపోయాను. చాలా రోజులు మామూలు మనిషిని కాలేక పోయాను."

"అంతగా ఎఫెక్ట్ అయ్యావా?" తన చేతిని వాడి భుజం మీద నుంచి తీసేస్తూ అడిగింది మేనక ఆశ్చర్యంగా.

"చెప్పానుగా నాకు తను స్వంత అక్క కన్నా ఎక్కువ." ఆనంద్  అన్నాడు. "మా మామ్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. తనతో కూడా ఎంతో చనువుగా ఉండేది నిరుపమక్క. కానీ తను సూసైడ్ ఎందుకు చేసుకుంది అన్నది మాకు అంతుపట్టని విషయం."

"అది ఎవరికీ అంతుపట్టని విషయం రా. నేను ఇక్కడ వున్నది అది తెలుసుకోవడానికి సాయం చెయ్యడానికే." మేనక అంది."బాగా ఆలోచించు. నీకే చిన్న విషయం గుర్తుకొచ్చినా చెప్పు. అదెంత చిన్న విషయం అయినా పర్లేదు. ఇన్వెస్టిగేషన్ కి పనికి రావొచ్చు."

కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు ఆనంద్ . "బహుశా తను సూసైడ్ చేసుకోవడానికి పదిహేను, ఇరవై రోజుల ముందనుకుంటా ఒకరోజు మార్నింగ్ పది పదిన్నర టైం లో కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసింది నిరుపమక్క."

"వాట్?" కుర్చీలో ఎలెర్ట్ అయిపోయింది మేనక. "నీకెలా తెలుసు ఆ విషయం?"

"నాకు కొంచం ఫీవర్ గా ఉందని స్కూల్ కి సెలవు పెట్టాను ఆ రోజు. ఇదిగో ఇక్కడే, ఈ కుర్చీలోనే కూచుని చదువుకుంటున్నాను. పుస్తకాలు లోపల దాచేసుకుంటాను కానీ, ఈ బల్ల కుర్చీలు వరండాలో ఇక్కడే వదిలేస్తాం. తాను వచ్చి నన్ను పలకరించింది. కాలేజీ కి ఎదో స్ట్రైక్ వాళ్ళ ఆ రోజు సెలవు అంది."

"తను ఎలా వుంది అప్పుడు?" వాడు కాస్త ఆగగానే ఎగ్జైటీన్గా అడిగింది మేనక.

"నిజం చెప్పాలంటే రోజూ కన్నా ఎక్కువ ఉత్సాహంగా, ఆనందంగా. తన ఫ్రెండ్ సమీర తో మాట్నీ కి వెళ్లాలని ఆలోచిస్తూంది. తనకి అప్పుడు కొచం ఫీవర్ గానే ఉందని, అయినా తనతో వచ్చి మాట్నీ మూవీ చూసిందంటే ఆ ఫీవర్ కాస్త ఎగిరిపోతుందని అంది. అప్పట్లో ఇక్కడ కొంతమందికి ఫీవర్లు వచ్చాయి. వైరల్ ఫీవర్లు అనుకుంటా."

"తను నిజంగా అంత ఉత్సాహంగా, ఆనందంగా కనిపించిందా?" ఆశ్చర్యంగా అడిగింది మేనక. సమీర చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది మేనకకి. కచ్చితంగా ఆ రోజే తను సమీర ఇంటికి వెళ్లి ఉంటుంది.

"నిజం అక్కా. నాతో అరగంట కన్నా ఎక్కువే స్పెండ్ చేసింది ఇంట్లోకి వెళ్లబోయే ముందు. నా మాథ్స్ లో డౌట్స్ అన్ని క్లియర్ చేసింది. ఒకే ఒక చిన్న డౌట్ మిగిలి పోయింది. అది అడిగే లోపు ఇంట్లోకి వెళ్ళిపోయింది."

"ఐ సీ" సాలోచనగా తలూపింది మేనక. "ఇంకేమైనా నోటీసబుల్ థింగ్ వుందా?" అడిగింది.

"నేనిక్కడే కూచుని స్టడీస్ కంటిన్యూ చేస్తున్నా. బహుశా ఒక అరగంట పైనే గడిచిందనుకుంటా. మళ్ళీ తను ఇంట్లోనుంచి బయటకి వచ్చింది."

"వాట్? తను మళ్ళీ బయటకి వచ్చిందా?" కుర్చీలో మరోసారి నిఠారుగా అయిపోయింది మేనక.

"ఎస్, అక్కా. కానీ ఈ సారి ఎందుకో డిఫరెంట్ గా అనిపించింది. తన మొహం సీరియస్ గా వుంది. నేను నా మాథ్స్ లో డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం తనని పిలిచాను. కొచం గట్టిగానే పిలిచాను. కానీ తను వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది."

"దటీజ్ రియల్లీ వెరీ మచ్ సర్ప్రైజింగ్!" ఆనంద్  కాస్త ఆగగానే అంది మేనక.

వాడు ఇంకా ఎదో చెప్పబోతూ ఉండగా అక్కడికి ఒకావిడ వచ్చింది. "మా మామ్." ఆనంద్  అని వాళ్ళ అమ్మ మొహంలోకి చూసాడు . "యు ఆర్ లేట్ మామ్." అన్నాడు.

"గ్రోసరీ అంత కొనేసరికి టైం పట్టిందిరా." తన చేతుల్లో వున్న బాగ్స్ ని కిందపెట్టి మేనక మొహంలోకి చూసింది. "నువ్వు ఎదురింట్లోకి వచ్చిన అమ్మాయివి కదా. నిన్ను వాళ్ళింట్లో చూసాను."

"అవునండీ" తలూపి చెప్పింది మేనక

"నువ్వు వాళ్ళ రెలాటివా?" ఆనంద్  కి వచ్చిన సందేహమే వచ్చింది ఆవిడకి కూడా. "కానీ వాళ్ళ రెలెటివ్స్ అందరూ నాకు తెలుసు. నీలాంటి అమ్మాయి ఒకరు రెలెటివ్ గా ఉన్నట్టు వాళ్ళెపుడూ నాకు చెప్పలేదు."

మేనక ఆనంద్  వైపు ఇబ్బందిగా చూసింది. అప్పుడు తనెవరో, ఎందుకు అక్కడ వుందో వివరించాలంటే ఎంబరాసింగా అనిపించింది.

"నో మామ్. ఈ అక్క వాళ్ళ రెలెటివ్ కాదు." అంటూ విషయం వివరించాడు ఆనంద్ .

"ఓహ్, గాడ్! ఆ ముసలావిడకే కాదు, ఆయనకి కూడా మతి పోయింది. ఇప్పుడు తనెందుకు చనిపోయిందో ఆ విషయం తెలుసుకుని ఏమి చేస్తాడు?" ఆవిడ అంది.

"తన ఒక్క గా నొక్క కూతురు ఆలా సూసైడ్ చేసుకుని చనిపోతే తను ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలనే ఆత్రుత తనకి ఉండదా?" మేనక కోపంగా అంది.

"ఐ యాం సారీ. నా ఉద్దేశం అది కాదు." వెంటనే తన తప్పుని గ్రహించినట్టుగా అంది ఆవిడ. "ఒకపక్క ఆ ముసలావిడ కూతురు చనిపోడంతో పిచ్చిది అయిపొయింది. ఇప్పుడు ఏమి తెలుసుకున్నా ఆ చనిపోయిన కూతురు తిరిగిరాదు. అంతకన్నా ఆ ముసలావిడ ఆరోగ్యం మీదే దృష్టి పెట్టడం మంచిది కదా."

ఏమి మాట్లాడాలో మేనకకి తెలియక వెళ్లిపోదామన్న నిర్ణయానికి వచ్చి కుర్చీలోనుంచి లేచి నిలబడింది. "వస్తా ఆనంద్ . నీకేమన్నా గుర్తుకొస్తే నాకు చెప్పు. మోస్ట్ అఫ్ ది టైం నేను ఇంట్లోనే వుంటాను." తరువాత ఆవిడ మొహంలోకి చూసే "వస్తానండి" అని చెప్పి అక్కడనుండి కదల బోయింది.

"చిన్నమాట అమ్మాయ్." అని ఆవిడ మేనకకి దగ్గరగా వచ్చింది. "ఎన్నో ఏళ్ళు గా ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్నాం. ఆ పెద్దవాళ్ళిద్దరితో నాకెంతో పరిచయం వుంది. నిరుపమ నాతోనూ ఎంతో చనువుగా ఉండేది. ఏమిటో ఆలా చనిపోయింది. ఆ పెద్ద వాళ్ళిద్దరిని ఆలా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను."

"నేనర్ధం చేసుకోగలను ఆంటీ." అదంతా తనకెందుకు చెపుతూందో అర్ధం కాక అంది మేనక.

"నాకు వాళ్ళ దగ్గరకి వచ్చి పలకరించి మాట్లాడాలంటేనే ఎదో గిల్టీ గా అనిపిస్తూంది. నిరుపమ లేని ఆ ఇంట్లోకి రాలేకపోతున్నాను. వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆ పెద్దవాళ్ళిద్దరికి ఎదురింటి పంకజం వాళ్ళ గురించి అడిగిందని, వాళ్ళ గురించి బాధపడుతోందని చెప్పమ్మా."

"వాట్ ఈజ్ దిస్ ఆంటీ?" మేనక కోపంగా అంది. "వాళ్ళతో పరిచయం వున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గరికి రావడానికే గిల్టీగా ఫీలయితే వాళ్ళెప్పుడు మామూలు మనుషులవుతారు? వాళ్ళతో మీకంత పరిచయం వున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం మీ బాధ్యత కాదా? నేనేం మీరడిగారని, మీ ఫీలింగ్ గురించి వాళ్ళకి చెప్పను. మీరే వచ్చి వాళ్ళతో మాట్లాడండి." అని చెప్పి అక్కడనుండి వచ్చేసింది.

&

"ఆనంద్ నిరుపమ కాలేజీ నుంచి ఉదయమే ఇంటికి వచ్చేసిందని చెప్పిన రోజు, సమీర తన ఇంటికి మేనక ఇంచుమించులో పదకొండున్నర టైములో వచ్చిందని చెప్పిన రోజు ఒక్కటే. ఆ కంక్లూజన్ కి మనం సేఫ్ గా రావొచ్చు." మేనక చెప్పిందంతా విన్నాక సాలోచనగా అన్నాడు స్మరన్.

"నాట్ జస్ట్ దట్ అంకుల్. మేనక ఇంట్లోకి వెళ్లే ముందు, ఇంట్లోనించి బయటకి వచ్చాక ఆ డిఫరెన్స్ చూడండి. ఆనంద్  చెప్పిన ప్రకారం లోపలి వెళ్లే ముందు చాల ఉత్సాహంగా, ఆనందంగా సంతోషంగా వుంది. కానీ మళ్ళీ పైకి వచ్చినప్పుడు చాలా అప్సెట్ గా వుంది. ఆనంద్ చాలా గట్టిగా పిల్చినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. దానర్ధం లోపల ఎదో జరిగింది." మేనక కూడా డీప్ గా ఆలోచిస్తూంది.

"యు ఆర్ రైట్. లోపల ఏదో జరిగి ఉంటుంది." స్మరన్ తలూపాడు.

"తన తల్లితండ్రులతో ఆర్గ్యుమెంట్? మనకి తెలియని విషయాలు ఏమైనా వాళ్ళ మధ్య వుండివుండొచ్చు కదా." మేనక అంది.

"నాకు ఆలా అనిపించడం లేదు. ఒకవేళ అలాంటి సీరియస్ ఆర్గ్యుమెంట్ ఏమైనా వాళ్ళ మధ్య జరిగి ఉంటే అది ఆమె సూసైడ్ కి కారణమవొచ్చని రంగనాథ్ కి తడుతుంది కదా."

"యు ఆర్ రైట్ అంకుల్." మళ్ళీ ఆలోచనలో పడింది మేనక. "బహుశా ఆ ఆర్గుమెంట్ తన తల్లితో మాత్రమే అయి ఉండొచ్చు. అప్పుడు రంగనాథ్ అసలు ఇంట్లో వుండి ఉండకపోవచ్చు. ఆ విషయం తన తండ్రికి చెప్పడానికే కష్టమయి తను సూసైడ్ చేసుకుని ఉండొచ్చు."

"విషయానికి కొచం దగ్గరకి వచ్చామేమో. రిమోట్ పాజిబిలిటీ వుంది." నవ్వుతూ అన్నాడు స్మరన్.

"కానీ నాకిదింకా పెద్ద పజిల్ లాగే వుంది అసలు ఇది మనం సాల్వ్ చెయ్య గలమా అనిపిస్తూంది." విచారంగా అంది మేనక.

"డోంట్ వర్రీ. ఇంకా వన్ వీక్ టైం వుంది నేనిచ్చిన గడువు పూర్తి కావడానికి. ఆ గడువు పూర్తి అయ్యేలోపు నేను ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేస్తాను." కాన్ఫిడెంట్గా అన్నాడు స్మరన్.

"అంకుల్" మోచేతులు రెండూ బల్లమీద ఆనించి స్మరన్ మొహంలోకి సూటిగా చూసింది మేనక. “మీకు ఈ విషయం లో ఆల్రెడీ ఒక స్పష్టత వుంది. మీరు అది నాకు చెప్పడం లేదు." కోపంగా అంది.

"నీకు డిటెక్టివ్ కావాలని లేదు. అందుకనే నువ్వు పూర్తిగా ఇంటరెస్ట్ పెట్టలేదు. లేకపోతే ఇప్పటికే నువ్వు కూడా ఒక స్పష్టత కి వచ్చేదానివి." కుర్చీలో వెనక్కి  జారగిలబడుతూ అన్నాడు స్మరన్.

"చూడండంకుల్." ఇంకా తన మోచేతుల్ని అలాగే ఉంచి సీరియస్ గా అంది మేనక. "ఐ అగ్రీ. నా గోల్ డిటెక్టివ్ కావడం కాదు. బట్, నేను మీకు మనస్ఫూర్తిగా సాయం చేస్తున్నాను. నా మైండ్ ని పూర్తిగా యూజ్ చేస్తున్నాను."

"మరైతే తేలికగా తట్టే విషయాలు కూడా నీకెందుకు తట్టడం లేదు?" కుర్చీలోనుంచి పైకి లేచాడు స్మరన్. "నేను బయటకి వెళ్ళాలి. తరువాత మాట్లాడుకుందాం."

"నాకు తేలిక విషయాలు కూడా తట్టడం లేదా? యాం ఐ దట్ మచ్ డంబ్?" తను కూడా కుర్చీలోనుంచి లేచి స్మరన్ కి ఎదురుగుండా వచ్చింది మేనక. "అవేమిటో మీరు నాకు చెప్పే తీరాలి." స్మరన్ వే ని బ్లాక్ చేస్తూ అంది.

"నేన్నీకు చెప్పను. యూజ్ యువర్ మైండ్ అండ్ బ్రేక్ యువర్ హెడ్. అప్పటికీ తట్టక పోతే నేను బయటపెట్టే వరకు వెయిట్ చెయ్యి. నువ్వూ బయటకి నడిస్తే నేనీ ఆఫీస్ లాక్ చెయ్యాలి."

&

ఇంటికి వచ్చిన తరువాత కూడా చాల ఫ్రెస్ట్రేటింగ్ గా అనిపించింది మేనకకి. తన కంటిముందే ఉండి కూడా తను తెలుసుకోలేకపోతున్న విషయాలు ఏమిటో బోధపడలేదు. నిర్మల భోజనం చేసాక రోజూ చేసినట్టుగానే ఆమెని హిప్నోటైజ్ చేసి నిద్రపుచ్చాక మెడమీద తన గదిలోకి వచ్చింది. బెడ్ మీద పడుకున్నాక సీరియస్ గా ఆలోచించడం మొదలు పెట్టింది.

నిరుపమ ఆమె పేరెంట్స్ కి ఒక్కగానొక్క కూతురు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టింది. ఎలాంటి సమస్యలు లేవు. పేరెంట్స్ ఇద్దరూ ఎంతో ముద్దుగా చూసుకుంటూ వున్నారు. అలాంటిది ఒకరోజు సడన్గా సూసైడ్ చేసుకుంది ఎలాంటి కారణం లేకుండానే.

అసహనంగా కుడి వైపునుండి ఎడమవైపుకు దొర్లింది మేనక. ఆలోచిస్తూంటే బుర్ర వేడెక్కుతూంది కానీ విషయం ఏమి తట్టడం లేదు.

కారణం లేకపోవడం కాదు. తను ఆ కారణం ఎవరికీ తెలియనివ్వలేదు. ఆ కారణం ఎవరికీ తెలియడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. గోడ మీద క్లూ, బుక్ లో క్లూ కేవలం తను అనుకోకుండా ఒక డెస్పరేట్ మూమెంట్లో ఇచ్చినవి. కావాలని ఇచ్చినవి కాదు.

మళ్ళీ ఎడమ వైపునుండి కుడి వైపుకి దొర్లింది చిరాగ్గా.

ఆ క్లూస్ కూడా తను అప్సెట్ అయిన మొట్ట మొదటి రోజే ఇచ్చినవి. విషయం ఏదైనా అది చాల ఎక్స్ట్రీమ్ గా అప్సెట్ చేసింది తనని. ఇమ్మీడియేట్ గా తను తట్టుకోలేక పోయింది. ఇంటికి ఆ రోజు తను పది ఆ సమయం లో వచ్చింది. ఇంట్లో ఇంచుమించులో హాఫ్ ఏన్ అవర్ ఆలా స్పెండ్ చేసింది. ఆ స్పెండ్ చేసిన టైం లోనే తనంతగా అప్సెట్ చేసిన విషయం జరిగింది. తరువాత తిన్నగా తన క్లోజ్ ఫ్రెండ్ సమీర ఇంటికి వెళ్ళింది. బహుశా మైండ్ డైవర్సన్ కోసమే వెళ్లి ఉంటుంది. సమీర ఇంట్లోనే వుండివుంటే ఏమై ఉండేదో, కానీ తనని ఇంట్లోనే అట్టేపెట్టి సమీర డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. ఆ సమయంలో సమీర ఇంట్లో బెడ్ రూంలో నిరుపమ రెస్ట్ తీసుకుంది. బహుశా తనని అంతగా అప్సెట్ చేసిన ఆ సంఘటన జరిగాక ఒక రెండు గంటలు గడిచి ఉంటాయి. నిరుపమ కొంత సర్దుకుని ఉంటుంది. కానీ తనలో ఇంకా తట్టుకోలేని సంఘర్షణ కొనసాగుతూనే ఉండి ఉంటుంది. బెడ్ మీద నిద్ర పోవడానికి ట్రై చేసింది. కానీ నిద్ర పోలేక పోయింది. అక్కడే వున్న పెన్ తీసుకుని గోడ మీద ఆలా ఎక్ష్ప్రెస్స్ చేస్తే కానీ వుండలేకపోయింది. తరువాత బుక్ తీసుకుని చదవడానికి ట్రై చేసింది. చదవలేక పోయింది. తను ఆ మూమెంట్లో  ఏదైతే విపరీతం గా ఫీలయ్యిందో అది ఆ బుక్ లో పేపర్ మీద ఆలా ఎక్ష్ప్రెస్స్ చేసింది.

ఈ సారి స్ట్రెయిట్ గా పడుకుని ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచించడం మొదలు పెట్టింది.

తరువాత తను కొంతలో కొంత అడ్జస్ట్ అవ్వగలిగింది. పదిహేను రోజుల వరకూ తనలో ఫీలింగ్స్ ఎవ్వరికీ తెలియనివ్వకుండా మేనేజ్ చెయ్యగలిగింది. కానీ ఒక వీక్ మూమెంట్లో, ఇక తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఆ పదిహేను రోజులు తను మాక్సిమం సఫర్ అవుతూనే వుంది.

దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఒళ్ళు విరుచుకుంది మేనక. ఆలోచనలు వాటంతట అవి సాగుతూనే వున్నయి.

ఆమె అలా చనిపోవడం ఆమె తండ్రిని చాలా అప్సెట్ చేసింది ఆయన షాక్ అయిపోయాడు. తన కూతురు సూసైడ్ చేసుకుందన్న విషయం కన్నా కూడా తనెందుకు సూసైడ్ చేసుకుందో తెలియక ఆయనెక్కువ మధన పడుతున్నాడు.

మరోసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకుంది మేనక ప్రవాహం లా వస్తూన్న ఆలోచనల్ని ఆహ్వానిస్తూ.

తన కూతురు అలా సూసైడ్ చేసుకోవడం ఆమె తల్లిని పిచ్చిదాన్ని చేసేసింది. నో, ఆవిడ పిచ్చిది కాలేదు. తన అంకుల్ చెప్పింది నిజం. తన కూతురు బ్రతికే వుందన్నట్టుగా ఆవిడ కావాలనే ఇమాజిన్ చేసుకుంటూంది. లోపల్లోపల ఆవిడకి తన కూతురు ఇక లేదని చాలా స్పష్టంగా తెలుసు. ఆవిడ బిహేవియర్ అబ్సర్వ్ చేస్తే ఆ విషయం ఎవరికైనా ఈజీ గా అర్ధం అయిపోతుంది.

ఇంకో ఆలోచన మనసులోకి వచ్చేలోగా సడన్గా తట్టింది మేనక కి. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించి బెడ్ మీద లేచి కూచుంది. తన అంకుల్ చెప్పినది నిజం! తన ముక్కు ముందే వున్న విషయం కూడా తను చూడ లేకపోతూంది.

నిర్మల పిచ్చిది కాదు. కేవలం తన కూతురు లేదన్న విషయం తట్టుకోలేక ఆవిడ అలా వూహించుకుంటూంది. తన కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయిందని, ఇక లేదని ఆవిడకి బాగా తెలుసు. కానీ.....ఇక బెడ్ మీద కూచోలేక కిందకి దిగిపోయింది మేనక.

రంగనాథ్ ఆరాట పడుతున్నట్టుగా తన కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలుసుకోవడానికి తనెందుకు ఆరాట పడడం లేదు. అంత సడన్ గా నిరుపమ అలా సూసైడ్ చేసుకోవడం తననెందుకు ఆశ్చర్యపరచలేదు? నిజానికి ఆ విషయం గురించి తెలుసుకోవడానికి తనే ఎక్కువ తపన పడాలి కదా.

దీనికి అర్ధం ఒక్కటే. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా అనిపించింది మేనకకి ఆలోచిస్తూంటే.

తన కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో నిర్మలకి తెలుసు.  

&

మేనక చెప్పింది విన్నాక గట్టిగా నవ్వాడు స్మరన్. "ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి నీకు ఇంత కాలం పట్టిందా?" అన్నాడు మేనక మొహంలోకి చూస్తూ.

"అంటే నిర్మలకి ఆ విషయం తెలిసివుంటుందని మీకు ముందునుంచి తెలుసా?" ఆశ్చర్యంగా అడిగింది మేనక.

"అఫ్ కోర్స్, ఎస్." తలూపాడు స్మరన్. "నిర్మల కి పిచ్చి లేదని కావాలనే నిరుపమ బ్రతికి వున్నట్టుగా తను వూహించుకుంటూందని తెలియగానే నేనది సస్పెక్ట్ చేసాను. ఎస్, యు ఆర్ రైట్. తన కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుందో నిర్మలకి తెలుసు."

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)