Nirupama - 5 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | నిరుపమ - 5

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

నిరుపమ - 5

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"మీరు నిరుపమ ఆత్మహత్యకి సంభందించి ఏదైనా క్లూ దొరుకుతుందని నాతో మాట్లాడడానికి వచ్చారు. కానీ మిస్టర్ స్మరన్ ఆ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ కాలేనేమో అనిపిస్తూంది." మరోసారి నిట్టూర్చాడు నిరంజన్.

"నిరుపమ మీకు చాలా క్లోజ్ కదా. మీరంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేది." నిరంజన్ అన్నది తను విననట్టుగానే అన్నాడు స్మరన్.

"నేను అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు నేను తనకీ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. నన్ను చూసి ఇంప్రెస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో జాయిన్ అయింది." నవ్వుతూ అన్నాడు నిరంజన్.

"తను తన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉండేదా?"

"తన తండ్రి తరువాత ఏ అరమరికలు లేకుండా ఇంకెవరితోనైనా తన విషయాలు షేర్ చేసుకుందీ అంటే అది కేవలం నాతోనే. తనకీ సంభందించిన ప్రతి విషయం నాతో చెప్పేది. అలాంటిది ....." మరోసారి దీర్ఘంగా నిట్టూర్చాడు నిరంజన్. "....అంతగా తనని ఆత్మహత్య చేసుకోడానికి కూడా ప్రేరేపించిన విషయన్నినాకెందుకు చెప్పలేదో నాకు బోధపడడం లేదు."  

"తను అన్నిట్లోనూ అందరితో ఓపెన్గా ఉండేదా?"

"లేదు మిస్టర్ స్మరన్. తన పేరెంట్స్, నేను ఇంకా తన క్లోజ్ ఫ్రెండ్ సమీర తో మాత్రం చాలా క్లోజ్ గా, ఓపెన్గా ఉండేది. అన్ని విషయాలు మాతో మాత్రం షేర్ చేసుకుంటూ ఉండేది."

"తనకీ బాయ్ ఫ్రెండ్స్ కానీ లేదా లవ్ అఫైర్స్ కానీ ......"

"తను చాలా పరిపక్వత వున్న పిల్ల మిస్టర్ స్మరన్. చాలా అలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకుంటుంది. తన గురించి ఎంతో ఆలోచించే తల్లితండ్రులు వున్నారని తెలిసి లవ్ లో పడే అమ్మాయి కాదు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్...." కాస్త ఆగి అన్నాడు నిరంజన్ "ఒక్క సమీర తప్ప గర్ల్స్ లోనే తనకి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. బాయ్ ఫ్రెండ్స్ అవకాశమే లేదు."

"తను తన తల్లితండ్రులుని చాలా అభిమానించింది కదా. ఎలాంటి విభేదాలు లేవు వాళ్ళతోటి."

"అసలు ఏ అమ్మాయి అయినా తన పేరెంట్స్ ని అంతగా ప్రేమిస్తుందంటే నేను నమ్మలేను. ఇంకా ఆమె పేరెంట్స్ కూడా అంతే. చూసారుగా ఆమె తల్లి నిర్మల ఏకంగా పిచ్చిది అయిపొయింది ఆమె చనిపోయాక."

"నో మిస్టర్ నిరంజన్. ఆమె తల్లి పిచ్చిది కాలేదు. ఆమెకి తన కూతురు చనిపోయింది, ఇంక లేదు అన్న విషయం తెలుసు. కానీ ఆ విషయం అంగీకరించడానికి ఆమె సిద్ధంగా లేదు." నిరంజన్ మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు స్మరన్.

కుర్చీలోకి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నిరంజన్. "యు అర్ రైట్ స్మరన్. నిర్మల తన కూతురు చనిపోయినందువల్ల పిచ్చిది అవలేదు. తనకి కేవలం ఆ విషయం యాక్సెప్ట్ చెయ్యడం ఇష్టం లేదు."

"మరి మీరు రంగనాథ్ కి ఆలా ఎందుకు చెప్పలేదు? తనకి ఎదో ట్రీట్మెంట్ అవసరం అన్నారట."

"తన భార్య తన కూతురు బ్రతికే ఉందని భావిస్తూ ఆనందంగా ఉందని రంగనాథ్ అనుకుంటున్నాడు. తనని అలాగా అనుకోనిద్దామని నేను అసలు విషయం చెప్పలేదు." కుర్చిలో ముందుకు వాలి తన రెండు మోచేతులు తమ రెండు కుర్చీలు మధ్య వున్న బల్ల మీద బాలన్స్ చేసుకున్నాడు నిరంజన్.

"తను చనిపోవడానికి కొద్ది రోజులు ముందు కూడా తన ప్రవర్తనలో మీరు ఎలాంటి మార్పు చూడలేదా? కొంచం అలోచించి చెప్పండి." స్మరన్ కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు. "ఆత్మహత్య చేసుకునేంత విషయంతో బాధపడుతూ కూడా తను మామూలు మనిషిగా ఎలా ఉండగలదు?"

నిరంజన్ మరొకసారి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. "ఇంచుమించులో తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పదిహేనురోజులుగా నిరుపమ నా దగ్గరికి రాలేదు. తనకి ఎగ్జామ్స్  ఏవో జరగబోతూ వున్నయి. ఆ ప్రిపరేషన్ లో బిజీ గా వుంది. సో అందులో ఆశ్చర్యం లేదు."

"మీరేమైనా ఆ పదిహేను రోజుల్లో తన ఇంటికి వెళ్ళారా? తనని చూసి తనతో మాట్లాడడానికి ప్రయత్నించారా?"

" ఒక్కసారి వెళ్ళాను. ఆ రోజు ఆ ఇంట్లోనే భోజనం కూడా చేశాను తనతో కూడా తెలిసి. కానీ తనలో ఎటువంటి మార్పు చూడలేదు. కానీ అందులో కూడా ఆశ్చర్యం లేదు. ఆ కాస్త సమయంలోను తనలో ఎటువంటి మార్పు లేకుండా తను ఉండగలదు."

"అది ఆమె చనిపోవడానికి ఎన్ని రోజులు ముందుగానో చెప్పగలరా?"

"ఫైవ్ డేస్ ముందనుకుంటా."

"ఆల్రైట్." కాస్త ఆగి అన్నాడు స్మరన్. "ఎనీహౌ ఈ విషయం చెప్పండి. చనిపోవడానికి మందు పదిహేను రోజులుగా తను మీ దగ్గరికి రాలేదు. కానీ ఆ పదిహేను రోజులు ముందు తనని మీరు కలిశారు కదా. అప్పుడు తను యూజువల్ గానే వుందా?"

"హండ్రెడ్ పర్సెంట్ తన యూజువల్ సెల్ఫ్. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా. తన ప్రెసెన్సు ఎలాంటిది అంటే డల్ గా వుండే మనుషుల్ని కూడా ఉత్సాహంగా మార్చేస్తుంది."

"ఐ సీ" స్మరన్ తలూపి లేచాడు. "మీరు చాలా కో ఆపరేట్ చేసారు. అవసరం అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక వెళ్ళొస్తాను."

" సారీ మిస్టర్ స్మరన్. నేను మీకు మరీ అంతగా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక పోయాను." తనూ కుర్చీలోంచి లేచి అన్నాడు నిరంజన్. 

"ఆలా ఎందుకు అనుకుంటున్నారు? చాలా వేల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు నాకు." స్మరన్ నవ్వాడు.

"నాకు అర్ధం కావడం లేదు. నేను మీకు ఏ వేల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను?" అయోమయంగా చూసాడు నిరంజన్.

"తనని అంతగా అప్సెట్ చేసిన సంఘటన తను చని పోవడానికి ముందు కేవలం పదిహేను రోజుల వ్యవధిలో జరిగింది మిస్టర్ నిరంజన్. తను పరీక్షలని మీ దగ్గరకి రాకపోవడం కాదు, తను మీ దగ్గర మాములు గా ఉండలేనని తెలిసే నిరుపమ మీ దగ్గరికి రాలేదు. మీ ఎవరి దగ్గర షేర్ చేసుకోక పోవడం మాత్రమే కాదు తనకి మీ ఎవరికీ ఆ విషయం ఏ మాత్రం తెలియడం కూడా తనకి ఇష్టం లేదు." తను చెప్పబోయే విషయం నొక్కి చెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అన్నాడు స్మరన్. "అంతే కాదు తను ఆత్మహత్య చేసుకోవడానికి ఎదో పై విషయం కారణం కాదు. ఇది తన ఫామిలీ మెంబెర్స్ ని ఇంక మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటిది. అందుకే అది తను మీ ఎవరి దగ్గర షేర్ చేసుకో లేకపోయింది."

"మై గాడ్! మీరు చెప్పే విషయం నన్ను షాక్ కి గురి చేస్తూంది మిస్టర్ స్మరన్. ఆ విషయం నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఏ విధంగా అన్నది నాకు బోధ పడడం లేదు." నిరంజన్ మొహం అంతా షాక్ తో నిండిపోయింది.

"నా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితేనే గాని ఆ విషయం గురించి ఏమీ చెప్పలేను. మిమ్మల్ని అప్సెట్ చేసినందుకు క్షమించండి." స్మరన్ అన్నాడు.

"నో మిస్టర్ స్మరన్. మీరు అలా అనుకోనవసరం లేదు. మీరు చెప్పిన విషయం నన్ను కొంచం షాక్ కి గురి చేసింది అంతే." తలూపుతూ నిట్టూర్చాడు నిరంజన్. "నేను తన తల్లికి కజిన్ నే అయినా, నాకు ఆ కుటుంబానికి చాలా ఇంటిమసీ వున్నా, నాకు నిరుపమ కి బాగా పరిచయం పెరిగింది కేవలం నేను ఇక్కడికి వచ్చిన తరువాతే. ఇక్కడకి చాలా దూరంగా వున్న యూనివర్సిటీ లో సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఫోన్ తో కాంటాక్ట్ లో ఉండేవాడిని కానీ నిరుపమతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడ లేదు. ఒక సవంత్సరం కిందట రంగనాథ్ సజెస్ట్ చేసాడని ఇక్కడ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాను. అప్పటినుండి మాత్రమే నాకు నిరుపమ తో బాగా పరిచయం. తను అప్పుడు బి.ఎస్.సి మ్యాథ్స్ ఫైనల్ ఇయర్ చదువుతూ వుంది. తను ఎం.ఎస్.సి. మ్యాథ్స్ చదవాలనుకుంది. కానీ నన్ను చూసి ఇంప్రెస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో చేరింది. తన క్లోజ్ ఫ్రెండ్ అలా చెయ్యడం వల్ల అనుకుంటా, ఆమె క్లోజ్ ఫ్రెండ్ సమీర కూడా అలాగే చేసింది.."

"రంగనాథ్ తో మీరు బాగా టచ్ లో వుండేవారా? అదెలా?" ఆశ్చర్యంగా చూసాడు స్మరన్.

"ఆ రోజు రంగనాథ్ చెప్పాడు, మీరు మర్చిపోయినట్టున్నారు." నవ్వుతూ అన్నాడు నిరంజన్.  “రంగనాథ్ ఫామిలీ, మా ఫామిలీ ఇంకా నిర్మల ఫామిలీ కూడా ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం. ఇంకా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. రంగనాథ్ ఫామిలీ మాకు బంధువులు కాదంతే. రంగనాథ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా సెలెక్ట్ అయ్యాడు ఇంకా నిర్మలని ఇష్టపడ్డాడు. నేను కాదనడంతో నిర్మలని రంగనాథ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఎవరికీ అభ్యంతరం లేక పోయింది. నిర్మలకి కూడా తనని పెళ్లి చేసుకోక తప్పలేదు." నవ్వాడు నిరంజన్. "ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే రంగనాథ్ మొదటినుంచి నాకు చాలా మంచి ఫ్రెండ్."

"ఐ సీ" నవ్వాడు స్మరన్.

"సమీర తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్. నిరుపమ ఖచ్చితంగా తనతో ఏమి షేర్ చేసుకుని ఉండదు. కానీ మీరు నాతో మాట్లాడి ఇంత ఇన్ఫర్మేషన్ రాబట్ట గలిగారంటే, తనతో మాట్లాడితే ఇంకొంచం ఇన్ఫర్మేషన్ రాబట్టగలరు. నాకెందుకో మీరు రంగనాథ్ కోరికని కచ్చితంగా తీర్చగలరని అనిపిస్తూంది."

"థాంక్ యు ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. నేను ఇప్పుడు కలుసుకోవాలనుకుంటున్నది సమీరనే. తన ఫోన్ నెంబర్ ఇంకా అడ్రస్ ఆల్రెడీ రంగనాథ్ దగ్గరనుంచి తీసుకున్నాను." దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ అన్నాడు స్మరన్. "నేను తెలుసుకోబోయే ఈ విషయం రంగనాథ్ కి మరింత బాధ కలిగించవచ్చు అని నాకు అనిపిస్తూంది. నేను ఆ ఆలోచన మానేమని ఆయనకి చెప్పను. కానీ అయన తెలుసుకుని తీరాలనే చాలా పట్టుదలగా వున్నరు."

"అయన అలా ఆలోచించడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా కొన్ని విషయాలు బాధ కలిగించేవే అయినా వాటిని తెలుసుకోవడమే మంచిది. మీరు సాధ్యమయినంత త్వరలో ఆ విషయం తెలుసుకుని నాకు కూడా చెప్పండి. మీరు ఎప్పుడైతే ఆ విషయం నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నారో నాకు చాలా ఆరాటం పెరిగింది."

"తప్పకుండ ఆ విషయం సాధ్యమయినంత త్వరలో తెలుసుకునే పరిచయం చేస్తాను." అలా అన్నాక నిరంజన్ రూమ్ లో నుండి బయటికి వచ్చేసాడు స్మరన్.  

&

పగలు అనిపించినంత ధైర్యంగా, తన అంకుల్ ఇంకా రంగనాథ్ దగ్గర చెప్పినప్పుడు అనిపించినట్టుగా, రాత్రి భోజనం పూర్తి చేసి కాస్సేపు రంగనాథ్ ఇంకా నిర్మలతో కబుర్లు చెప్పి మేడ మీద రూమ్ లో బెడ్ మీద నడుము వాల్చాక అనిపించలేదు మేనకకి. ఎదో తెలియని భయం, ఇంకా అనీజీనెస్ తో మనసంతా నిండిపోయింది ఇదే రూమ్ లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని ఆలోచిస్తూంటే. అంతే కాకుండా ఇలా వెల్లకిలా పడుకుని చూస్తూవుంటే ఆ అమ్మాయి ఉరేసుకున్న ఫ్యాన్ తిరుగుతూ కనిపిస్తూంది.

కాస్సేపు తన శరీరం ఊపిరి ఆడకుండా తన మీద కొట్టుకుంటూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటే, కాస్సేపు నిర్జీవంగా వేలాడుతూ కనిపిస్తూ వుంది. అదంతా తన ఇమాజినేషన్ మాత్రమే అయినా మనసంతా భయంతో నింపేస్తూ వుంది. ఎంత ఇష్టం లేక పోయిన ఆ అమ్మయి చనిపోయినప్పటి విషయం గురించి తన మనసు ఆలోచించకుండా ఉండలేక పోతూంది. చనిపోయిన తరువాత ఆ అమ్మాయి శరీరం ఎంత భయంకరంగా అయిపోయి ఉంటుంది? తను చనిపోయిన తరువాత తన శరీరం ఎలా అయిపోతుందో ఊహించి వుంటే అసలు సూసైడ్ చేసుకుని ఉండేది కాదు.

ఈ ఆలోచనలు తను తట్టుకోలేక పోతూవుంది. ఈ ఆలోచనల వల్లో, లేకపోతే నిజంగానే ఈ రూమ్ లో ఏమైనా ఆ అమ్మాయి సంబంధించి వుందో తెలియదు కానీ తనతోటె తన పక్కనే ఎదో ఉందనిపిస్తూ వుంది. తన మనసంతా ఎదో తెలియని భయంతో నిండిపోతూ వుంది. కిందనున్న రూమ్ లోకి దేంట్లోకన్నా వెళ్ళిపోతే మంచిది, తన అబ్సర్వేషన్ కి ఈ ఇంట్లో ఎక్కడ వున్న ఫరవాలేదు అనిపించి చటుక్కున లేచి కూచుంది మేనక.

అంతలోనే మరో ఆలోచన వచ్చి సిగ్గుతో మొహం జేవురించింది. ఒక చిన్నపిల్లలా తనెందుకు ఇలా భయపడుతూంది? ఒకవేళ ఇప్పుడు కూడా నిరుపమ ఈ రూమ్ లోనే వున్నా తనెందుకు ఆ అమ్మాయికి భయపడాలి? చనిపోయే ముందువరకూ కూడా తనూ తనలాంటి అమ్మాయే కదా. తనీ భయాన్ని జయించాలి. మామూలు ఆడ పిల్లలా ప్రవర్తించ కూడదు. గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చి బెడ్ మీద మళ్ళీ పడుకుని కుడి వైపుకి వత్తిగిల్లింది. ఈ మాయదారి ఆలోచనలు కొంచం తగ్గితే బాగుండు, ఇంకా ప్రవాహంలో వస్తూన్న పనికిమాలిన ఆలోచనలని గమనించి అనుకుంటూండగా తన అంకుల్ స్మరన్ తరచూ చెప్పే విషయం గుర్తుకు వచ్చింది.

'ఆలోచనల్ని కానీ, ఫీలింగ్స్ ని కానీ పట్టించుకోకూడదు. వాటిని ఫోర్స్ గా బయటకి తోసేసే ప్రయత్నం అసలే చెయ్య కూడదు. వాటిని ప్రత్యేకంగా అబ్సర్వ్ చెయ్యాల్సిన అవసరం లేక పోయినా, వాటంతటవి నోటీసు లోకి వస్తే మాత్రం ఇరిటేట్ అవ్వకూడదు. వాటిని ప్రత్యేకంగా రిమూవ్ చేసేసే ప్రయత్నం కానీ, అబ్సర్వ్ చేసే ప్రయత్నం కానీ చెయ్యక పోతే  కాస్సేపటికి అవే వానిష్ అయిపోతాయి.'

తను సాధారణంగా అనవసరమైన ఆలోచనలు, ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఈ సజెషనే అమలు లో పెడుతూంటుంది, కానీ ఈరోజు ఎందుకో ఇప్పటి వరకు గుర్తుకు రాలేదు. గుర్తుకు వచ్చిన తరువాత ఇంక అమలు లో పెట్టడానికి ఆలస్యం చెయ్యలేదు.

తరువాత ఎప్పుడు నిద్రపట్టిందో గుర్తు లేదు కానీ తెల్లవారి లేచాక మాత్రం చాలా రిలీఫ్ గా, రిలాక్స్డ్ గా అనిపించింది. రాత్రంతా ఆలా భయపడ్డందుకు చాలా సిగ్గుగా కూడా అనిపించింది. 

&

"ఆమె పేరెంట్స్ పడే బాధ చూస్తూ ఉంటే నేను నా కోపం ఆపుకో లేకపోతున్నాను. స్కౌండ్రల్, ఏవీ ఆలోచించకుండా ఎంతపని చేసింది!" కోపంగా అంది మేనక. స్మరన్ ఆఫీసులో స్మరన్ కి ఎదురుగుండా కూర్చుని వుంది. "ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఫూల్స్. వాళ్లందరిలో ఇంకా పెద్ద ఫూల్ ఈ నిరుపమ." కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టంగానే వుంది మేనకకి.

"ఆలా మాట్లాడకు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఫూల్స్ కాదు. వాళ్ళల్లో కొంతమందికి కంపెల్లింగ్ రీజన్స్ ఉంటాయి." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అన్నాడు స్మరన్.

"అంటే ఆత్మహత్యల్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా?" చిరాగ్గా అంది మేనక.

"నేను సపోర్ట్ చెయ్యడం లేదు." కుర్చీలో ఇంకొంచం అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్. "కానీ కొన్ని సందర్భాల్లో చనిపోవడమే సొల్యూషన్ లా వాళ్ళకి అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళల్లో చాలా ఫేమస్ పీపుల్ కూడా వున్నరు."

"కానీ అలాంటి కంపెల్లింగ్ రీజన్ ఏది నిరుపమకి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను."

"ఈ విషయాన్నీ నేనూ ఒప్పుకుంటాను. సడన్గా తాను విపరీతమయిన ఎమోషన్ కి లోనయింది. మూమెంటరీగా తట్టుకోలేకపోయింది. ఇంపల్సివ్ గా ఉరేసుకుంది. తను ఆ సమయంలో కొంచెం ఆలోచించగలిగి ఉంటే, కొంచం డిస్ట్రాక్షన్ వచ్చి ఉంటే, ఐ యామ్ స్యూర్, తను సూసైడ్ చేసుకునేది కాదు." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు స్మరన్.

"మై గాడ్! అంకుల్,  నువ్వు చెప్పినట్టే అయివుంటుంది!" షాక్ తో నిండిపోయింది నిరుపమ మొహం.

"మనం సూసైడ్ చేసుకునే వాళ్ళని మూడు రకాలుగా డివైడ్ చెయ్యొచ్చు. మొదటి రకం, వీళ్ళకి చాలా కంపెల్లింగ్ రీజన్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ తోటో, మరోరకంగానో కొంతకాలం పాటు వీళ్ళని ఆపగలిగినా ఏదోలా వీళ్ళు చనిపోడానికే చూస్తారు. టెర్మినల్ డీసీజెస్ తో బాధపడే వాళ్ళు, ఇంకా విపరీతమయిన అప్పుల్లో కూరుకు పోయిన వాళ్ళు వీళ్ళకి ఉదాహరణ. ఇక రెండో రకం. వీళ్ళకి మొదటి రకం వాళ్ళకి ఉన్నంత కంపెల్లింగ్ రీజన్స్ ఉండవు, కానీ ఏవో రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చినా, లేదా వాళ్లే కొంత ఆలోచించ గలిగినా సూసైడ్ జోలికి పోరు. బాగా ఇన్సల్ట్ చెయ్యబడ్డ వాళ్ళు, ఎగ్జామ్స్ లో తప్పిన వాళ్ళు, ఎంతో ఆశించింది మిస్సయిన వాళ్ళు, రేప్ లేదా గ్యాంగ్ రేప్ కి గురైన వాళ్ళు  దీనికి ఉదాహరణ. ఇక మూడో రకం, జీవితంలో బోరుకొట్టి ఏం చేయాలో తెలియక, తీవ్రమయిన డిప్రెషన్ కి గురయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళు. ఆశ్చర్యపడకు. ఇలాంటివాళ్ళు కూడా వున్నరు."

"నువ్వు చెప్పినదాన్ని బట్టిచూస్తే నిరుపమ ఖచ్చితంగా రెండవ రకానికి చెంది ఉండాలి." సాలోచనగా అంది మేనక.

"యు అర్ రైట్. నా అభిప్రాయం కూడా అదే." తలూపాడు స్మరన్.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)