వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
“అనవసరం గా గాభరా పడకు.” అప్పటికి డ్రెస్ చేసుకోవడం పూర్తి చేసుకున్న సమీర, అతనికి దగ్గరగా వెళ్ళి, అతన్ని సున్నితంగా కౌగలించుకుని, అతని ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టింది. “ఇలా వచ్చి కూచో. నువ్వెవరో, ఈ ప్లేస్ ఏమిటో, నువ్వు ఇక్కడకి ఎలా రావాల్సి వచ్చిందో అంతా వివవరంగా చెప్తాను. అదివిన్నాక బహుశా నీకు నీ గతం అంతా గుర్తుకు రావచ్చు.” అరవింద్ ని అక్కడ బెడ్ ఎడ్జ్ మీద సెటిల్ చేసి, తనూ అతనికి ఎడమ పక్కన కూచుని, నెమ్మదిగా అతనెవరో, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి ఎలా వచ్చాడో, తనెవరో అంతా వివరం గా చెప్పింది.
“ఏమిటీ? ఒక వారం రోజులుగా నేను ఇలా వున్నానా?” మరోసారి అతని మొహం ఆశ్చర్యం, దిగ్భ్రమ తో నిండిపోయింది.
“ఎస్, నీ అంతగా నన్ను ఫ్రస్ట్రేట్ చేసిన పేషెంట్ లేడు ఇప్పటివరకూ. నీ మామ్ శకుంతల గారు నిన్ను ఇక్కడనుండి తీసుకువెళ్ళి వేరేచోట జాయిన్ చేస్తానని గోల. ఆఖరికి చిన్న ట్రిక్ ఫలించి నువ్వు నీ సెన్సెస్ లోకి వచ్చావు. లేకపోతే నేను మొదటిసారిగా ఫైల్యూర్ రుచిచూడాల్సి వచ్చేది.” అన్నాక గట్టిగా వూపిరి పీల్చుకుని మళ్ళీ అంది. “ఇంతకీ ఇప్పటికయినా నీకు నువ్వెవరో గుర్తుకు వచ్చిందా?”
మరోసారి అతని మొహం ఆందోళనతో నిండిపోయింది. “అసలు నాకు ఏదీ గుర్తుకు రావడం లేదు. ఏదీ కూడా, చివరికి నేనెవరు అన్న విషయం తో సహా. నేనెలా అంతలా అన్ని విషయాలు మర్చిపోయాను?” అతని గొంతులో పూర్తి ఆందోళన వుంది.
“రిలాక్స్, రిలాక్స్. ఒకోసారి కేవలం కొన్ని సెకండ్స్ పాటయినా మైండ్ కి ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే ఇలా అవుతూ వుంటుంది. నీ విషయం లో అదే జరిగివుంటుంది. క్రమం గా నీకన్నీ విషయాలు గుర్తుకు వస్తాయి. నువ్వు ప్రశాంతం గా వుండు.”
దానికి అరవింద్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతని మొహం లో ఆందోళన మాత్రం అలాగే వుంది.
“వుండు. ఈ విషయం నేను వెళ్ళి నా సీనియర్ కి, ఇంకా నీ అమ్మగారికి చెప్పాలి. నీకు అన్నీ గుర్తుకు రాకపోయినా, నీ విషయం లో ఇది చాలా పెద్ద డెవలప్మెంట్.” బెడ్ మీద నుండి లేచి అంది సమీర.
“నువ్వెక్కడికీ వెళ్లకు ప్లీజ్.” సమీర ఎడమ చేయి పట్టుకుని తన పక్కన కూలేసుకుంటూ అన్నాడు అరవింద్. “ప్రస్తుతానికి నాకు తెలిసి ఆత్మీయం గా అనిపిస్తూన్న మనిషివి నువ్వే. నువ్వు వెళ్లిపోతే నేనుండలేను.”
“అలాగని పూర్తిగా నీతోటే వుండిపోలేను కదా.” మరోసారి అతన్ని వాటేసుకుని అతని కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకుంది. అతనిమీద ఎందుకు తనకే తెలియని ఫీలింగ్ వచ్చింది? ఎందుకు పదే పదే అతన్ని హత్తుకుని ముద్దుపెట్టుకోవాలనిపిస్తూవుంది ఆమెకే అర్ధం కావడం లేదు. “నీకు గుర్తుకు రాకపోయినా, నువ్వు కావాలనుకునే వాళ్ళు చాలామందే వున్నారు. నేనూ సాధ్యమైనంత వరకూ నీతో వుండడానికే ట్రై చేస్తాను. కానీ నేను వెళ్ళి కొన్ని పనులు చేయక తప్పదు. ప్లీజ్.”
ఆమె అలా అన్నాక అతను మళ్ళీ ఆమెని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ అతని మొహం లో ఏదో బాధ మాత్రం చాలా స్పష్టంగా వుంది.
&&&
“నా కొడుకు జీవితాంతం అలా బ్లాంక్ గా చూస్తూ వుండిపోతాడేమోనని భయపడ్డాను. నిజంగానే ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. వాడికి నేను ఎప్పటికీ గుర్తుకు రాకపోయినా పరవాలేదు. అలా బ్లాంక్ మ్యాడ్ గా కాకుండా, కనీసం ఇలాగన్నా వాడుంటే నాకదే పదివేలు.” ఆనందం నిండిన గొంతు తో అంది శకుంతల.
అరవింద్ లో వచ్చిన మార్పు గురించి తెలియగానే హుటాహుటిన బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి వచ్చారు, అరవింద్ తల్లి శకుంతల ఇంకా చెల్లెలు సుస్మిత. కానీ వాళ్ళని చూసిన తరువాత కూడా అరవింద్ లో ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు ఏదో పూర్తి పరాయివాళ్లు అన్నట్టుగానే బిహేవ్ చేశాడు.
“మీ సీనియర్ చెప్పినట్టుగానే నువ్వు చాలా కాపబుల్. చేసి చూపించావ్. థాంక్యు వెరీ మచ్.”
“నో మెన్షన్. లాస్ట్ మూమెంట్ వరకు అతని లో ఈ మార్పు తీసుకు రాగలనని నేనూ అనుకోలేదు. అంతా గాడ్స్ గ్రేస్.” చిరునవ్వుతో అంది సమీర.
“కానీ తను తన స్వంత తల్లిని కూడా గుర్తుపట్ట లేకుండా వుండడం చాలా బాధాకరం. ఎప్పటికీ తనకి అన్ని విషయాలు గుర్తుకు రావచ్చు?” సుస్మిత అడిగింది.
“ఒక వారం రోజులపాటు అతన్ని నా పర్యవేక్షణ లో వుంచుకుంటాను. విషయాలన్నీ గుర్తుచేసే ప్రయత్నం చేస్తాను. క్రమం గా ఈ వారం రోజుల్లో అతనికి అన్నీ గుర్తుకు వస్తాయనే భావిస్తున్నాను.” సమీర అంది.
“యు ఆర్ కాపబుల్ టు డు దట్ డాక్టర్ సమీరా. నాకా నమ్మకం వుంది.” శకుంతల అంది.
అలా అన్నాక శకుంతల, సుస్మితా మరోసారి అరవింద్ ని చూసి అక్కడనుండి వెళ్లిపోయారు.
&&&
వారం రోజుల సమయం గడిచిపోయింది. శకుంతల, సుస్మితా అప్పుడప్పుడు వచ్చి చూశారు అరవింద్ ని. ఇంకొంతమంది కూడా చాలా క్లోజ్ అయినవాళ్లు వచ్చి అరవింద్ ని చూసారు. సమీర ఏవో కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అరవింద్ మాత్రం ఏమీ గుర్తు చేసుకోలేక పోయాడు, చివరికి తన పేరుని కూడా. ఆ మర్నాడు అరవింద్ ని ఇంటికి తీసుకుని వెళ్లవచ్చని చెప్పింది శకుంతలకి సమీర.
“వాళ్ళు నాకు పరాయి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. నువ్వొక్కత్తివే నాకు ఆత్మీయురాలిలా వున్నావు. నాకు ఇక్కడే వుండాలని వుంది.” ఇంక తను ఇంటికి వెళ్లబోతున్నాడానే విషయం చెప్పగానే అరవింద్ అన్నాడు.
అప్పుడు అరవింద్, సమీర అతని రూమ్ లో బెడ్ మీద పక్క పక్కన కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.
“వాళ్ళు నీకు పరాయివాళ్ళలా కనిపించ వచ్చు. కానీ నువ్వంటే వాళ్ళు ప్రాణం పెడతారు. వాళ్ళు నీ తల్లీ చెల్లెలూనూ.” నవ్వింది సమీర. “నువ్వు ఆరు లక్షల కోట్లకి పైగా టర్నోవర్ వున్న ఒక పెద్ద కంపనీ కి మానేజింగ్ డైరక్టర్ వి. నీ కింద ఎంతోమంది పనిచేస్తూ, నీ మాట వినేవాళ్ళు ఎంతోమంది వున్నారు. నీ లైఫ్ ఎంతో బాగుంటుంది బయట ప్రపంచం లో. ఈ మెంటల్ కేర్ లో వుండిపోవాలని ఎందుకు అనుకుంటావ్?”
“నా పేరు కూడా గుర్తుకురాని పరిస్తితులలో నేనేం చేయగలను? నేనిప్పుడు ఆ కంపనీ కి మానేజింగ్ డైరక్టర్ గా వుంటే వాళ్ళకి చాలా నష్టం వచ్చే అవకాశం వుంది కూడా.” విచారంగా అన్నాడు.
“నీ పరిస్తితి ఇలాగే వుండిపోదు. నువ్వు నీ రొటీన్ లో పడితే, అన్ని విషయాలు నీకు నెమ్మది నెమ్మది గా గుర్తుకు వచ్చేస్తాయి. నువ్వు పూర్తిగా మామూలు అరవింద్ అవుతావు. నా మాట నమ్ము.” అరవింద్ ఎడమ భుజం మీద తన కుడి చేయి వేసి అతని మొహం లోకి చూస్తూ అంది సమీర.
“నేను నీకు నిజం చెప్తున్నాను. నాకు మామూలుగా అయిపోవాలని లేదు. ఇక్కడనుండి వెళ్లిపోవలని లేదు. నాకు ఏమీ గుర్తుకు రాకపోయినా ఇక్కడ నీతో వుంటే చాలని వుంది.”
అది వినగానే అందంగా నవ్వింది సమీర. “నువ్వు మీ ఇంటికి వెళ్లిపోయినా నేను నీ దగ్గరకి వస్తూనే వుంటాను నువ్వు పూర్తిగా బాగు అయ్యేవరకూ. నేను నీ సైకియాట్రిస్ట్ ని. ఆ విషయం మర్చిపోకు.”
“అవునులే. నీకు నాతో వున్నది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ షిప్. నాలా నువ్వు ఫీలవ్వవు. నేను ఇక్కడవున్నా, ఎక్కడవున్నా నీకొక్కటే.” నిష్టూరంగా అన్నాడు అరవింద్.
“అరవింద్………” అరవింద్ మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని, తనవైపు తిప్పుకుని, అతని మొహంలోకి చూస్తూ అంది సమీర. “………. నీ మీద నాకు ఏ ఫీలింగ్ లేదనడం నిజం కాదు. ఏదో ఫీలింగ్ నాలో నీ మీద స్టార్ట్ అవడం వల్లే నిన్ను ఈ లోకం లోకి తీసుకురావడానికి అలా చేయగలిగాను. ఏదో ఫీలింగ్ వల్లే నువ్వు నన్ను అనుభవిస్తూ వున్నా మౌనంగా వుండిపోయాను. నీ మీద నేనే అర్ధం చేసుకోలేని ఫీలింగ్ వల్లే నిన్ను కౌగలించుకుంటున్నాను, ముద్దులు పెట్టుకుంటున్నాను. ఒక సైకియాట్రిస్ట్ ని అయివుండీ నన్ను నేను అర్ధం చేసుకోలేకపోవడం నాకు బాధగానే వుంది, కానీ ఇది నిజం.” అంటూ ఆగింది.
“మరయితే ఇంకేం. మనం పెళ్లిచేసుకుని భార్యభర్తలం అవ్వచ్చుకదా.” ఆశగా అడిగాడు అరవింద్.
“నీ తల్లి శకుంతలా దేవి సామాన్యురాలు కాదు. అతి పెద్ద కోటీశ్వరురాలు. అంతే కాదు చాలా స్ట్రిక్ట్ అని కూడా విన్నాను. నీకు మీ కుటుంబంతో సమానం అయిన కుటుంబం నుండి కోడలిని తెచ్చుకోవాలని అనుకుంటూ వుండివుంటారు. ఒక సామాన్యురాలిని అయిన నాతో నీ పెళ్ళికి ఆవిడ అంగీకరిస్తారని నేను అనుకోను.”
“నాకు ఆవిడ అసలు గుర్తే లేదు. అందువల్ల ఆవిడ ఇష్టం అయిష్టాలతో నాకు సంబంధం లేదు. నేను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నానని చెప్తాను. అందుకు అంగీకరిస్తే ఆ యింటికి వెళతాను. లేకపోతే వెళ్లను. అయినా నేనంటే తనకి చాలా ఇష్టం అని చెప్పావుగా, అందువల్ల కచ్చితంగా ఒప్పుకుంటుంది.” ఒక డిటర్మిండ్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు అరవింద్.
“నువ్వు తొందరపడి ఏమీ చెప్పకు. ఆలోచించి చెప్పు. నేను నీ దగ్గరికి వస్తూనే వుంటానుగా. అంతవేగంగా నీ పెళ్లి ఏం ఆవిడ ఎవరితోనో నిశ్చయం చేసేరు.” అలా అన్నాక బెడ్ మీద నుండి లేచింది సమీర. “కాసేపట్లో ఇంకా నీ మామ్, సిస్టర్ వస్తారు. వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధం గా వుండు.”
అరవింద్ కూడా లేచి సడన్ గా సమీర ని కౌగలించుకున్నాడు. “నేను అలా మ్యాడ్ గా మారినందుకు నాకు విచారం ఏమీ లేదు. అందువల్లే కదా ఇంత అందమైన నువ్వు నాకు దొరికింది.” ఆమె మెడ మీద ముద్దు పెట్టి అన్నాడు అరవింద్.
తనకి తెలీకుండానే అతని కౌగిట్లో ఇమిడిపోయి, రెండు చేతులతో అతనిని గట్టిగా కౌగలించుకుని, అతని కుడిచెవి మీద ముద్దుపెట్టుకుంది సమీర. “నేనెప్పుడూ ఇలా ఎవరితొనన్నా లవ్ లో పడతాననుకోలేదు. ప్రొఫెషనల్ ఎథిక్స్ కి వ్యతిరేకం అని తెలిసినా, నీతో ఇలా కమిట్ అయ్యాను.” ఆమె అలా అంటూండగా ఆమె చేతిలో వున్న సెల్ ఫోన్ మోగింది.
“మై గాడ్! నీ మామ్. అప్పుడే ఆమె ఇక్కడకి వచ్చేసినట్టువున్నారు. నేను వెళ్ళాలి. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయివుండు.” అరవింద్ కౌగిలినుండి విడిపించుకుని వేగంగా వెళ్ళిపోయింది అక్కడనుండి సమీర.
సమీర వెళ్ళినవైపే చూస్తూవుండిపోయాడు అరవింద్.
&&&
“మీరు అరవింద్ ని మీ ఇంటికి తీసుకువెళ్లడం లో అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే ఇంకా కొన్నిరోజులపాటు అతను నా పర్యవేక్షణ లో వుండాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్.”
ఆ సమయం లో నిరంజన్ ఛాంబర్ లో సమీర, నిరంజన్, శకుంతల ఇంకా ఆమె కూతురు సుస్మిత వున్నారు.
“అతనిని తరచూ ఈ మెంటల్ కేర్ కి తీసుకువస్తూ అతనికొక పేషేంట్ ని అని అభిప్రాయం కలిగించడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేనే మీ ఇంటికి వచ్చి తనని చూస్తూ వుంటాను.” కాస్త ఆగాక మళ్ళీ అంది సమీర.
“కాకపోతే డాక్టర్ సమీరా………. “ సుస్మిత మొదలు పెట్టింది. “……….. మా అన్నయ్యకి ఇంకా ఏమీ ఎందుకు గుర్తుకు రావడం లేదు? తన పేరు కూడా తనకి గుర్తు లేదు. ఇక్కడవుంచి ట్రీట్ చేస్తే తనకి అన్నీ గుర్తుకు వస్తాయనుకుంటే, తనని ఇంకొన్నాళ్ళు ఇక్కడే వుంచడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు. మీరు ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ అయినా చేయండి. డబ్బులు మాకు సమస్య కాదు. కానీ నా అన్నయ్యని చివరికి తన మామ్ ని కూడా గుర్తుపట్టలేకుండా అలా చూడ్డం అంటే నాకు చాలా బాధ గా వుంది.”
“ఎస్, డాక్టర్ సమీరా. మా అమ్మాయి చెప్పింది నిజం. మీరు తనకి మీ ట్రీట్మెంట్ తో అన్నీ గుర్తుకు వచ్చేలా చేయగలమనుకుంటే మాకు తనని ఇక్కడ మారికొన్నిరోజులపాటు వుంచడానికి ఏ అభ్యంతరం లేదు. తన కొడుకు తననే గుర్తుపట్టలేని దౌర్భాగ్యం ఏ తల్లికీ రాకూడదు.” శకుంతల అంది.
“మీరీ మాట అంటారనీ నేను ఎక్స్పెక్ట్ చేశాను.” సమీర నవ్వి అంది. “నేను మామూలుగా తనకి అన్నీ గుర్తుకు వచ్చేస్తాయా అని చూశాను. కానీ తనకి అన్నీ గుర్తుకు రావడానికి నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేయలేదు. ఒకవేళ తను అన్నీ గుర్తు చేసుకోవాలనే నేను అనుకుంటే, తనని డీప్ హిప్నోసిస్ లోకి పంపి ఆ ప్రయత్నం చేసేదాన్ని. అది సక్సెస్ అయివుండేది కూడా. కావాలనే నేను అలా చేయలేదు.”
“డాక్టర్ సమీరా, మీరు నాకు అర్ధం కావడం లేదు. మీరు మా అబ్బాయికి ఏమీ గుర్తుకు రాకూడదని ఎందుకు కోరుకుంటున్నారు?” సమీర మొహంలోకి చూస్తూ ఆశ్చర్యంతోనూ, ఇంకా కోపంతోనూ అలా అన్నాక శకుంతల నిరంజన్ మొహం లోకి చూసింది. “నిరంజన్ మీరేం మాట్లాడడం లేదేమిటి?”
సమీర చెప్పింది విన్నాక, సుస్మిత కి కూడా ఆశ్చర్యం, కోపం వచ్చి ఆమె మొహం లో అవి ప్రస్ఫుటమవుతూ వున్నాయి
“డాక్టర్ సమీర చాలా సమర్ధురాలు. అందుకే తనకి మీ అబ్బాయిని అప్పగించిన తరువాత, నేను ఆ మాటర్ లో జోక్యం చేసుకోనే లేదు. కారణం లేకుండా అటువంటి నిర్ణయం తను తీసుకోదు. అదేమిటో వినాలని నాకూ ఆశక్తిగానే వుంది.” నిరంజన్ అన్నాడు.
“విషయం ఏమన్నా వుంటే అదిమాకు స్ట్రైట్ గా చెప్పండి. మమ్మల్ని సస్పెన్స్ తో చంపొద్దు ప్లీజ్.” సుస్మిత అంది చిరుకోపం తో.
“అరవింద్ ఆ రోజు ఆ బంగ్లా లో అలా అవడానికి మీకు ఇంకా అరవింద్ కి నేను చెప్పిన కారణం లాక్ ఆఫ్ ఆక్సిజన్. కొన్ని సెకండ్స్ పాటయినా మెదడు కి ఆక్సిజన్ అందకపోతే మనుషులు అలా టర్న్ అయే అవకాశం వుందని నేను మీకు చెప్పాను. కానీ నా అభిప్రాయం లో ఆరోజు అరవింద్ అలా మైల్డ్ మ్యాడ్ అవ్వడానికి కారణం అది అయివుండదు.”
సమీర గ్యాప్ ఇచ్చిన కాస్త సమయం లో సుస్మిత మళ్ళీ కోపంగా ఏదో అనబోతూ వుంటే, ఆమె అలా అనడానికి ముందే సమీర అంది. “మీకు నా నిర్ణయం పూర్తిగా అర్ధం కావాలంటే నేను కొంత వివరం గా చెప్పాలి. సస్పెన్స్ తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేనెందుకు అనుకుంటాను?” మళ్ళీ కాస్త ఆగి వాళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అనబోయే ముందే మళ్ళీ అంది సమీర. “ఆ రోజు తను ఆ భవనం లో తన మైండ్ డైజెస్ట్ చేసుకోలేనిది ఏదో చూశాడు. అది అతనసలు డైజెస్ట్ చేసుకోలేని విషయం అవడం వల్ల, షాక్ లోకి వెళ్ళిపోయి అలా అయిపోయాడు.”
సమీర అలా అన్నాక శకుంతల ఇంకా సుస్మిత ఒకళ్ళ మొహాల్లొకి ఒకళ్ళు షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో చూసుకున్నారు.
“అసలు ఆ బంగ్లాలో అలా చూడడానికి ఏముంటుంది? నేను తరచూ ఆ బంగ్లా కి వెళ్తూ వుంటాను. ఇప్పుడూ అక్కడికి వెళ్తున్నాను. నాకక్కడ నమ్మలేకుండా ఏమీ కనిపించలేదు. అలాగే అరవింద్, సుస్మితా కూడా ఆ బంగ్లా కి చాలా సార్లు వెళ్లారు. వాళ్ళెప్పుడూ అంతలా షాక్ అయ్యేలా అక్కడ ఏం చూడలేదు.” అదే షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో సమీర మొహం లోకి చూస్తూ అంది శకుంతల. “ఆ బంగ్లా లో జరిగిన ఒకే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నా భర్త అక్కడ హార్ట్ అటాక్ తో చనిపోవడం. అలాంటిది నా కొడుకు అక్కడ ఏదో చూసి షాక్ తో అలా అయ్యాడంటే నేను నమ్మలేకపోతున్నాను.”
“అతను ఏం చూసివుంటాడన్నది నేను చెప్పలేను. కాకపోతే ఆ చూసినది డైజెస్ట్ చేసుకోలేక మాత్రమే అలా అయ్యాడని చెప్పగలను.” ధృడ స్వరం తో అంది సమీర.
“ఒకే డాక్టర్. మీరు చెప్పినదే నిజం అనుకుందాం. తను ఏదో నమ్మలేనిది, జీర్ణించుకోలేనిది చూసే అలా అయ్యాడు. బట్………” కాస్త ఆగాక మళ్ళీ అంది సుస్మిత. “……… అలాగని అతను విషయాలు గుర్తుచేసుకోకుండా ఎన్ని రోజులు వుంచుతాం? ఏదో ఒకరోజు అన్నీ గుర్తు రావాల్సినదే కదా. మీరు తనని హిప్నటైజ్ చేసి తనకి అన్నీ గుర్తుకొచ్చేలా చేయడమే మంచింది కదా.”
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)