వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
"మీరు మాత్రమే ఆ బంగ్లా లోకి వెళుతూ వుంటారా? ఇంకెవరూ యూజ్ చెయ్యరా?" సమీర అడిగింది.
"ఎక్కువగా వెళ్ళేది నేనే. నా కొడుకు అరవింద్, కూతురు సుస్మిత అప్పుడప్పుడు మాత్రం వస్తారు. నాకున్న లాంటి అటాచ్మెంట్ వాళ్ళకి ఆ బంగ్లా తో లేదు. నాకున్న అటాచ్మెంట్ వల్ల, నా సర్వెంట్ డిబ్బూ ని తీసుకుని నేను మాత్రం కుదిరినప్పుడల్లా, ఇంకా ఆదివారాలు ఉదయం పూట ఆ బంగ్లా కి వెళతాను." అందావిడ.
చిన్నగా నవ్వింది సమీర అది వినగానే. “మీకెందుకు అలాంటి ఆటాచ్మెంట్ ఆ బంగ్లాతో?”
“అది నేను నా భర్త వర్ధన్ వర్మ ఎంతో ఆనందంగా, సంతోషంగా కాలం గడిపిన ప్రాంతం. నా జీవితం లోనే అంత సంతోషంగా ఆనందంగా అక్కడ నా భర్త తో గడిపినట్టుగా ఇంకెక్కడా గడపలేదు. ఆ తీపి జ్ఞాపకాలకోసమే నేను అక్కడకి వెళుతూ వుంటాను. నా పిల్లలిద్దరూ చాలా బిజీగా వుంటారు, అంతేకాకుండా వాళ్ళకంతగా గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు కూడా అక్కడ ఏమీ లేవు. సో, ప్రత్యేకంగా అక్కడకి రావాలని అనుకోరు. అప్పుడప్పుడు ఏదో వస్తూవుంటారు.”
"అంటే అక్కడ అప్పుడు మీరు మీ అబ్బాయిని పూర్తిగా స్పృహ లేని స్థితిలో కనిపెట్టారు. స్పృహలోకి వచ్చిన తరువాత తను బ్లాంక్ గా చూడ్డం తప్ప ఇంకేం చెయ్యడం లేదు." కన్ఫర్మేషన్ కోసం అన్నట్టుగా అడిగింది సమీర.
"ఎస్, అంతే." ఆల్రెడీ చెప్పాను కదా అన్న ఎక్స్ప్రెషన్ తో చూసింది శకుంతల
"ఆ సమయం లో అక్కడ మీరు, మీ అబ్బాయి తప్ప ఇంకెవరూ లేరా?"
"లేరు. నేను ఎక్కువగా అక్కడ ఒక్కదాన్నీ ఉండడానికే ఇష్టపడతాను. అక్కడవుండి మా ఆయనతో గడిపిన తీపి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ వుంటాను. " దీర్ఘం గా నిట్టూర్చింది శకుంతల. "అక్కడ నాకున్న ఒకేఒక చేదు జ్ఞాపకం, ఆయన ఆ బంగ్లాలోనే చనిపోవడం. మా ఆయన వర్ధన్ వర్మ గారు ఆ బంగ్లాలోనే గుండెపోటుతో చనిపోయారు."
"మీ అబ్బాయికి ఇంతకుముందు సైకలాజికల్ గా కానీ, ఫిజికల్ గా కానీ ప్రొబ్లెమ్స్ ఎమన్నా వున్నాయా?"
"మై సన్ అరవింద్ ఈజ్ హండ్రెడ్ పెర్సెంట్ పర్ఫెక్ట్ సైకాలజికల్లీ అండ్ ఫిజికల్లీ." దృఢస్వరం తో అంది శకుంతల. "మా అబ్బాయి మంచి స్పోర్ట్స్ మాన్ కూడా. ఫుట్ స్టేట్ అండ్ నేషనల్ ఛాంపియన్ షిప్స్ లో ఆడాడు. కాట్ లో హైయెస్ట్ రాంక్ తెచ్చుకుని, అతిపెద్ద యూనివర్సిటీ లో ఎం. బి . ఏ . చేసాడు."
"ఓకే ఇప్పుడు ఆ బంగ్లా గురించి కొంత చెప్పండి. ఆ బంగ్లాలో ఆడ్ గా అనిపించే విషయాలు ఎమన్నా ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడన్నా, ఎవరికన్నా ఆ బంగ్లాలో ఇలా జరిగిందా?"
"లేదు. మా ఆయన హార్ట్ అటాక్ తో చనిపోవడం తప్ప, ఆ బంగ్లాలో ఆడ్ గా అనిపించే సంఘటన వేరేది ఏదీ జరగలేదు. అయినా మనుషులు హార్ట్ అటాక్ తో చనిపోవడం అసాధారణం ఏం కాదు కాబట్టి అది ఆడ్ అని కూడా అనలేం. ఇంకా ..........." కాస్త ఆగి అంది "............. ఒక్క మా అబ్బాయికి ఇలా తప్ప, ఇంకెవరికీ ఆశ్చర్యపడేలా, ఇబ్బందిపడేలా ఏం జరగలేదు."
“ఆ సమయంలో మీ అబ్బాయి అక్కడికి మామూలుగా వచ్చి వుంటాడా? లేదా వేరే ఏదన్నా కారణం వుండివుంటుందా?"
“ఇదేదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా అనిపిస్తూ వుంది. మనం అసలు విషయం మీదే ఫోకస్ చేద్దాం సమీ.” చిరునవ్వుతో అన్నాడు నిరంజన్.
“ఒకే.” తలూపింది సమీర. “బ్రైన్ కి ఏమన్నా డామేజ్ జరగడం వల్ల అలా కాలేదు కదా. ఫిజికల్ గా అతని బ్రైన్ కి ఏమన్నా డామేజ్ అయి అలా అయిందేమో కూడా మనం తెలుసుకోవాలి.”
“ఆ టెస్ట్ లు అన్నీ పూర్తయ్యాయి. ఫిజికల్ గా ఎటువంటి డామేజ్ లేదు. ప్రాబ్లెమ్ కేవలం సైకలాజికల్ అని తెలిశాకే ఇక్కడకి తీసుకు వచ్చాను.” శకుంతల చెప్పింది.
“ముందుగా మనం పూర్తిగా అబ్జర్వ్ చెయ్యాలి ఆ అబ్బాయిని. అప్పుడు కానీ ఒక నిర్ణయానికి రాలేం.” నిరంజన్ వైపు చూస్తూ చెప్పింది సమీర.
“మా అబ్బాయి ప్రస్తుతం మీ మెంటల్ కేర్ లోనే వున్నాడు. మీ సీనియర్ ఆల్రెడీ అతన్ని చూసి, వన్ వీక్ లో పూర్తిగా మీరు బాగు చేసేగలరని చెప్పారు.” శకుంతల అంది.
తనలో సడన్ గా వచ్చిన చిరాకు మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడింది సమీర. నిరంజన్ లో తనకి నచ్చని కొన్నివిషయాల్లో ఇదొక్కటి. పేషంట్స్ దూరం అయిపోకుండా వుండడానికి అంతా చూడకుండానే మాట ఇచ్చేస్తూ వుంటాడు.
“ఇదేం నీకు పెద్ద విషయం కాబోదు సమీ. ఇంతకన్నా కష్టమైనవే నువ్వు చాలా ఈజీగా క్యూర్ చేశావు." ఇండైరెక్ట్ గా భాద్యత అంతా సమీరదే అని తెలియచేస్తూ అన్నాడు నిరంజన్.
“సరే అయితే.” ఈసారి కూడా ముంచుకొచ్చిన చిరాకు ని ప్రయత్నం తో అపుకుంది సమీర. బాధ్యత అంతా తనమీదకి నెట్టేడం కూడా నిరంజన్ కి అలవాటే. “నేను తనని పూర్తిగా అబ్జర్వ్ చెయ్యాలి. ఒక నిర్ణయానికి అప్పుడే రాగలను .”
“హి ఈజ్ ఆల్ యువర్స్ సమీ. నువ్వేం చేసినా, ఎలా చేసినా ఎవరూ అడ్డుపెట్టరు. శకుంతల మేడమ్ కి తన కొడుకి ని మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా అప్పచెప్పాలి. అదొక్కటే కావలసింది.” నిరంజన్ అన్నాడు.
నిరంజన్ లో తనకి నచ్చే విషయాలు వున్నాయి. పేషేంట్ ని ట్రీట్ చేసే విషయంలో తనకి పూర్తి స్వేచ్చని ఇస్తాడు. అలాగే తనకి ఇవ్వాల్సిన క్రెడిట్ ని పూర్తిగా ఇస్తాడు.
“ఎందుకో తెలియదు. నువ్వు మా అబ్బాయిని పూర్తిగా నయం చేయగలవని నాకు అనిపిస్తూవుంది. నా నమ్మకం అంతా నీ మీదే పెట్టుకున్నాను.” సమీర మొహంలోకి చూస్తూ అంది శకుంతల.
“నా మీద మీ నమ్మకానికి థాంక్ యు వెరీ మచ్.” మనస్పూర్తిగానే నవ్వింది సమీర. “మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను.”
తరువాత తన హ్యాండ్ బాగ్ లోనుండి చెక్ బుక్ తీసి, చెక్ ఎవరి పేరుమీద రాయాలో నిరంజన్ ని అడిగాక, రాసి అది తన చేతిలో పెట్టింది. “ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. నా కొడుకి కి పూర్తిగా నయం కాగానే ఇంతకు రెట్టింపు ఇస్తాను.”
తరువాత ఇంకాసేపు మాట్లాడి, శకుంతల అక్కడనుండి వెళ్లిపోయాక ఆ చెక్కు సమీర చేతిలో పెట్టాడు నిరంజన్.
“ఫిఫ్టీ లాక్స్!” చెక్కు మీద అమౌంట్ ని చూస్తూ షాకింగ్ గా అంది సమీర.
“ఎస్, తన కొడుకి ని మనం క్యూర్ చేస్తే మన రెప్యుటేషన్ చాలా పెరగడం మాత్రమే కాదు, ఫైనాన్షియల్ గా కూడా మనకి చాలా బెనిఫిట్ వుంటుంది.” నిరంజన్ అన్నాడు.
&&&
"అంటే ప్రస్తుతం నీకు ఎంట్రస్ట్ చేసిన పేషేంట్ చాలా ఛాలెంజిన్గ్ గా వున్నాడన్నమాట." నవ్వుతూ అంది సమీర అక్క తనూజ. "అయితే ఏం? ఎంత ఛాలెంజిన్గ్ గా ఉంటే అంత ఇష్టపడతావు కదా."
"అయితే మాత్రం ఎప్పటికి సాల్వ్ చెయ్యలేని పజిల్ లా ఉండిపోతే ఎలా?" చిరాకు పడుతూ అంది సమీర. "ఇప్పటికి వారం అవుతోంది నేను ఈ కేస్ టేక్ అప్ చేసి. నేను చెయ్యని ప్రయత్నం లేదు. బట్, ఎలాంటి చేంజ్ రాలేదు. ఆ రాస్కెల్ ఎంతసేపూ బ్లాంక్ గా చూడ్డం తప్ప ఇంకేం చెయ్యడం లేదు. ఆ నిరంజన్ ఏమో అంతా నాకే వదిలేసాడు. గంటకో సారి ప్రోగ్రెస్ ఎలా ఉందని మాత్రం అడుగుతుంటాడు." ఆఖర్లో గట్టిగా నిట్టూర్చింది.
"నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పటివరకూ నీకు అప్పగించిన అందరి పేషేంట్స్ ని అద్భుతంగా క్యూర్ చేసావు కదా. వీడిని కూడా అలాగే క్యూర్ చేస్తావు."
"టైం లేదక్కా. రేపు ఎదో ఒక రిజల్ట్ చూపించక పోతే ఆ శకుంతలా దేవి తనని ఇక్కడనుండి తీసుకెళ్లిపోతుంది. ఆవిడా చాలా ఇంపేషెంట్ గా వుంది. ఇది మా బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. అలా అతన్ని ఇక్కడనుండి తీసుకువెళ్లి పోతే మా రెప్యుటేషన్ దెబ్బతినడమే కాదు, ఆవిడ అడ్వాన్స్ గా ఇచ్చిన ఫిఫ్టీ లాక్స్ తిరిగి ఇచ్చేయాల్సి రావచ్చు."
"అంత కోటీశ్వరురాలు ఆ ఫిఫ్టీ లాక్స్ తిరిగి ఇవ్వమని అడగదులే."
"అడగక పోవచ్చు. కానీ ఎలాంటి రిజల్ట్ చూపించకుండా ఆ ఫిఫ్టీ లాక్స్ మేం వుంచుకోగలమా?" చిరాకుపడుతూ అంది సమీర.
"కానీ అతను అలా మాడ్ గా మారడానికి కారణం ఏమై ఉంటుందంటావు? ఆ బంగ్లా లోకి ఇంకా కొంతమంది వస్తూ పోతూ వుంటారన్నావు. వాళ్ళెవరికీ అలా కానప్పుడు అతనికి మాత్రమే అలా ఎందుకు అయింది?" సమీర చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ అంది తనూజ.
"ఆ విషయం గురించి నేను ఆలోచించడం లేదక్కా. వాడిని ఎలాగన్నా ఈ లోకం లోకి తీసుకురావాలి, దట్సాల్."
"సరే నీ ఇష్టం. ఆ విషయం గురించి నేనేం అనదలుచుకోలేదు." కాస్త ఆగాక మళ్ళీ అంది తనూజ. "ఇంతకీ వాడి వయసు ఎంత? మాడ్ గా మారడానికి ముందు ఎలా ఉండేవాడు?"
"ఇరవై తొమ్మిది. వాడి చెల్లెలు కూడా నన్ను కలిసి మాట్లాడింది. స్పోర్టివ్ అండ్ యాక్టివ్ పర్సనాలిటీ. నిజానికి ప్రస్తుతం మమూత్ ఇండస్ట్రీస్ బాధ్యత అంతా తీసుకుని నడిపిస్తూన్నది అతనే. మంచి హ్యాండ్సమ్ పెర్సనాలిటీ అనికూడా చెప్పొచ్చు."
"రియల్లీ! వాడితో లవ్ లో పడతావేమో జాగ్రత్త. ఎగైనెస్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్." నవ్వింది తనూజ.
"అటువంటిదేమీ జరగదు." సిగ్గుతో బుగ్గలు ఎర్రబడిపోయాయి సమీర కి. "నాకు వాడికి మధ్యవున్న డాక్టర్ పేషేంట్ రెలాషన్షిప్ నేనుప్పుడూ మర్చిపోను."
"ఒకే డియర్. నేనింక పడుకుంటాను. రేపు మానింగే బయలుదేరి వెళ్ళాలి. నా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ నాకుంటాయి కదా." బెడ్ మీద పడుకుంటూ అంది తనూజ. "ఇప్పటికే నాలుగు రోజులుగా ఇక్కడ ఉండిపోయాను."
"ఇంకొక్క రెండు రోజులు ఉంటే ఏమైంది? నువ్వు లేకపోతె నాకు ఒక్కదానికి చాలా బోర్ గా ఉంటుంది. నీ పనికిమాలిన ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ఏమీ అయిపోవు." తనూ ఆమె పక్కనే పడుకుంటూ అంది సమీర.
"అందుకనే నిన్ను పెళ్లిచేసుకోమనేది. ఒక తోడు వస్తే ఆ తోడుతో పాటుగా ఇంకో తోడు కూడా వస్తుంది. నీకు మంచి కాలక్షేపం అవుతుంది."
"నువ్వు పెళ్లిచేసుకోకుండా నేను పెళ్లిచేసుకోనని నీకు చెప్పనా లేదా?" తనూజ వైపు తిరిగి అడిగింది సమీర. "నాకన్నా పెద్దదానివి నువ్వు పెళ్లిచేసుకోకుండా నేనెలా చేసుకుంటాను?"
"చూడు డియర్........" సమీర వైపు తిరిగి, తన మొహంలోకి చూస్తూ అంది తనూజ. "..............ఫ్యామిలీ లైఫ్ మీద నాకు ఇంటరెస్ట్ లేదు, అలాగే నమ్మకం కూడా లేదు. ఉంటే ముప్పై ఏళ్ళు దాటేవరకూ పెళ్లిచేసుకోకుండా ఆగేదాన్ని కాదు. నేను ఎప్పటికీ పెళ్లిచేసుకోను."
"నేనూ నీ ఐడియాలజీ నే ఎందుకు ఫాలో అవ్వకూడదు? నీ చెల్లెల్నే కదా. నీలా ఉండడమే నాకూ ఇష్టం. నేనూ పెళ్లిచేసుకోను." కోపంగా అంది సమీర.
"అన్ని విషయాలలోనూ నేను వున్నట్టుగా నువ్వు ఉండగలవా? నా ఐడియాలజీ ని ఫాలో అవుతానని చెప్తున్నావు, కానీ అదసలు నువ్వు అంగీకరించగలవా? చాలా రోజుల కిందటే నేను చేస్తున్నట్టుగా, నిన్ను చెయ్యమని ఎప్పుడూ అడగొద్దని చెప్పావు, మర్చిపోయావా?" సీరియస్ గా సమీర ముఖం లోకి చూస్తూ అడిగింది తనూజ.
ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సమీర.
"నేను చేసేది తప్పో ఒప్పో నేనే చెప్పలేను. నా చెల్లెలే అంగీకరించని నా ఐడియాలజీ ని నాకు కాబోయేవాడు అంగీకరిస్తాడని నేను చెప్పలేను. అలాని అదంతా చెప్పకుండా నేనెవర్ని పెళ్లి చేసుకోలేను. అందుకనే పెళ్లే చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చేసాను."
"నీ సిద్ధాంతాలు అర్ధం కావాలంటే చాలా పరిపక్వత కావాలి. అంత మెచ్యూరిటీ లేక అప్పుడు అలా అన్నాను. అంత మెచ్యూరిటీ ఇప్పుడు కూడా నాకు వచ్చినదని నేను అనుకోవడం లేదు. కానీ అక్కా..........." కాస్త ఆగింది సమీర. "..........ఎప్పటికీ నువ్వే నా ఇన్స్పిరేషన్. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నీలాగా ఆలోచించగలిగే శక్తిని ఇవ్వమని దేవుడిని ప్రార్ధిస్తున్నాను."
"ఇనఫ్" నవ్వింది తనూజ. "నాకే కాదు. పెద్ద అసైన్మెంట్ నీకూ వుంది రేపు. ఇప్పుడు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, తెల్లారేసరికి ఏం చెయ్యాలన్న మంచి ఆలోచన వచ్చి, ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది."
తనూజ చెప్పింది ఆచరణలో పెట్టాలనుకుని, గుడ్ నైట్ చెప్పాక కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ట్రై చేసింది సమీర. కానీ నిద్ర అంత త్వరగా రాలేదు. ఎంత వద్దనుకున్నా గతానికి సంభందించిన ఆలోచనలు ముప్పిరిగొన్నాయి.
&&&
సమీర, తనూజ ల తల్లి సడన్ గా చనిపోయే సమయానికి సమీర కి పన్నిండేళ్లు, తనూజ కి పద్దెనిమిది ఏళ్ళు ఆలా వున్నాయి. సమీర కి మూడేళ్లు, తనూజ కి తొమ్మిదేళ్లు వయసు వున్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయాడు. బతికి వున్నప్పుడు కూడా తాగుడు ఇంకా జబ్బులతో ఆ కుటంబానికి అతను పెద్ద భారంగానే ఉండడం వల్ల, అతను చనిపోవడం ఒక రిలీఫ్ గానే అనిపించింది ఆ కుటుంబానికి.
తల్లికి సహాయపడుతూనే తనూజ చదువుకుంటూ ఉండేది. సమీర మాత్రం స్కూల్లో చేరి పూర్తిగా చదువుమీద దృష్టి పెట్టడానికి అయింది. అలాంటి సమయం లో తమ తల్లి చనిపోవడం ఒక పెద్ద కుదుపు లాగే అనిపించింది ఇద్దరికీ. ఇప్పుడు తనూజ తన చదువు పూర్తిగా ఆపి ఏదన్నా పనిలో చేరితే తప్ప, చదువుల మాట పక్కనపెట్టి, ఇల్లు గడిచే అవకాశం కూడా కనిపించడం లేదు. తను చదువుకోగలిగినా, లేకపోయినా చెల్లెలు చదువు ఆపేడం తనూజ కి అసలు ఇష్టం లేదు.
"మీకు అవసరమైన సహాయం అంతా నేను చేస్తాను. మీరిద్దరూ చదువుకోండి." తమ ఎదురింట్లో వుండే పరంధామం తమింటికి వచ్చి అన్నాడు ఆరోజు. అప్పుడప్పుడు అతను తమింటికి వస్తూ, తమ కుటుంబం తో స్నేహం గా ఉండేవాడు.
"మీరు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు." తనూజ అంది. "కానీ నా చెల్లెల్ని నేనే కష్టపడి చదివించుకుంటాను. ఎవరి సహాయం తీసుకోవడం నాకిష్టం లేదు."
"నీ చెల్లెల్ని చదివిస్తావు సరే, మరి నీ విషయమేమిటి? పెద్ద లాయరు అవ్వాలని నీ కోరిక, అది తీరనవసరం లేదా?" నవ్వాడు అతను. "ఇద్దరి ఆడ పిల్లల పెళ్లిళ్లు చేసేసాను. వాళ్ళేమీ నా మీద ఆధారపడి లేరు. భార్య కూడా లేకుండా ఇంట్లో వంటరిగా వున్నాను. స్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన నాకు మంచి పెన్షన్ వస్తూంది. మీ ఇద్దరికీ సహాయం చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది."
"ఆయన ఆలా అడుగుతూన్నప్పుడు, ఆయన సహాయం తీసుకుంటే తప్పేంటి? ఆయనెంతో మంచివారు. మనకి చాలా కాలంగా తెలుసు." ఆయన అక్కడఉన్నప్పుడే కోపంగా అంది సమీర.
“చూసావా, నీ చెల్లెలికి కూడా నా సహాయం తీసుకోవడం లో అభ్యంతరం లేదు. నువ్వే ఆబ్జెక్ట్ చేస్తున్నావ్.” ఆయన అన్నాడు.
“అది చిన్నపిల్ల. దానికి తెలీదు.” తనూజ చిరాగ్గా అంది. తనకి అది ఇష్టం లేదన్న విషయం చాలా స్పష్టం గా తెలిసిపోతూ వుంది ఆమె మొహంలో.
“సరేలే. నాకూ ఏమన్నా రెండు ఇళ్ళు చూసిపెట్టు, అంట్లు తోమి వూడిగం చేయడానికి. మనకి అదే రాసిపెట్టి వుంటే ఎవరన్నా మంచిచెప్పినా వినాలనిపించదు.” సమీర లో కోపం ఇంకా ఎక్కువైంది.
“నువ్వలా కోప్పడకు. నీ అక్కకి కూడా మీ అమ్మలాగే అభిమానం ఎక్కువ. ఎవరి సహాయం తీసుకోవడానికి అంతగా ఇష్టపడదు. కానీ......" సమీర మొహంలోకి చూస్తూ ఆలా అన్నాక తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు ఆయన. ".........నువ్విదేదో సహాయం లా అనుకోకు. మీరిద్దరూ బాగా సంపాదనా పరులయ్యాక మీ దగ్గరనుండి వడ్డీతో సహా నేనిచ్చినది తీసుకుంటాను. కానీ మీ జీవితం ఇలా ఒకళ్ళ ఇళ్లలో పనిచేస్తూ గడిచిపోవడం నాకిష్టం లేదు."
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)