Are Amaindi - 10 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | అరె ఏమైందీ? - 10

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

అరె ఏమైందీ? - 10

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

నిరంజన్ ఇంక మంజీర కలిసి తిరగడం  అనిరుధ్ చూడ్డం అన్నది తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండగా జరిగింది. ఇంటర్మీడియట్ కూడా తామిద్దరూ ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ ఒకే క్లాస్ రూమ్ లో చదివినా, తామిద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకుండా అలాగే జరిగింది ఆ తరువాత కూడా ఎటువంటి మార్పు లేదు. అనిరుధ్ పట్టించుకోకపోయినా తెలిసిన విషయం ఏమిటంటే, నిరంజన్ సర్వేశ్వరం ఫ్రెండ్ కొడుకని, మంజీర కి నిరంజన్ కి అంతకు ముందే పరిచయం ఉందని.  

నిరంజన్ తో మంజీర తిరుగుతూన్న వ్యవహారం గమనించాక, అనిరుధ్ కి ఆమె మీద చిరాకు, కోపం కూడా కలిగాయి. ఇంకెవరితోనన్నా సన్నిహితం గా వున్నా అంత ఫీలయ్యేవాడు కాదేమో కానీ, నిరంజన్ తో తనకెలా ఆలా తిరగాలనిపించిందో అనిరుధ్ కి అర్ధం కాలేదు. వాడికి కాలేజ్ లో అందంగా వున్న అమ్మాయిలందరూ ఫ్రెండ్సే. వాళ్ళని తీసుకుని తన కారులో డాబుగా తిరుగుతూ వుంటాడు.  అలాగే వాడికి లేని దురలవాట్లు కూడాలేవు.

తమిద్దరి స్నేహం తమకి పెద్దగా వూహ లేనప్పటి రోజుల్లోది. ఆ స్నేహాన్ని మంజీర పెద్దగా పట్టించుకోకపోవడంలో,  తనతో ఆ స్నేహాన్ని కొనసాగించాలని ఆమెకి అనిపించకపోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ నిరంజన్ లాంటి వాడితో స్నేహం చెయ్యాలనిపించడం, వాడితో లవ్లో పడడం ఏమిటి? ఇదే తనకి ఎంత ఆలోచించినా అర్ధం కానీ విషయం. తన తల్లిలాగే తనకి తన మైండ్ సరిగ్గా పనిచేస్తూ వుండివుండదు. లేకపోతే తనలాంటి అందమైన, ముచ్చటైన అమ్మాయికి అలాంటివాడితో స్నేహం చెయ్యాలనిపించదు

ఆ తరువాత తన ఆలోచనలు తమ చిన్నప్పటి రోజుల మీదకి మళ్ళాయి. తన తల్లి తరచూ వాళ్ళింటికి వెళుతూ ఉండేది, అలాగే ఆ నిర్మల కూడా మంజీర ని తీసుకుని తమ ఇంటికి వస్తూవుండేది. అలాంటి సందర్భాల్లో తామిద్దరూ కలిసి ఆడుకుంటూ వుండేవారు. ఎంత చిన్నప్పటినుండీ తామిద్దరూ స్నేహితులంటే, తామిద్దరూ ఒకళ్ళనొకళ్ళు బట్టల్లేకుండా చూసుకున్న సందర్భాలు వున్నాయి.

"అలాంటిది నాకెందుకు లేదు." తన థింగ్ ని చూపిస్తూ ఒకసారి తాను అడిగింది.

"అది బాయ్స్ కి మాత్రమే ఉంటుంది, గర్ల్స్ కి కాదు." తాను అన్నాడు.

"నేనొకసారి అది ముట్టుకోవచ్చా?" తనకి ఎందుకో ఆసక్తిగా అనిపించింది.

తాను అనీజీగానే అందుకు అంగీకరించాడు.

తన కుడిచేతివేళ్ళు దానిమీద కదలడం గుర్తుకొచ్చి, అప్పట్లాగే ఇప్పుడు కూడా వళ్ళంతా ఎదో థ్రిల్ తో నిండిపోయింది అనిరుధ్ కి. అలాంటి తెలిసీ తెలిసిన వయసులో తాము స్నేహితులు.

మల్లీశ్వరి చెప్పినట్టుగా, ఆ నిర్మల అంటే వూళ్ళో తక్కిన ఆడవాళ్ళందరూ ఎదో భయపడుతూ వుండేవారు. తన తండ్రికి సర్వేశ్వరం బాగా స్నేహితుడవడం వల్ల, ఇంకా తమ కుటుంబానికి అయన బాగా సహాయం చేస్తూ వుండడంవల్ల కాబోలు  తన తల్లి మాత్రం ఆ నిర్మల తో బాగా స్నేహంగా ఉండేది. తన తల్లీ, ఆమె తల్లీ కూడా తనూ, మంజీర కలిసి ఆడుకోవడానికి బాగా ప్రోత్సహిస్తూ వుండేవారు.

  తనలో వున్న లోపం ఆ నిర్మల కి తెలుసో లేదో కానీ, తనని ఊళ్ళోవాళ్ళందరూ దూరం పెట్టడం, అలాగే తన తల్లిమాత్రం ఆమెతో బాగా స్నేహంగా ఉండడం ఆమె గుర్తించి ఉండాలి. అందుకనే ఆమె తన తల్లి అన్నా, అలాగే తను అన్నా బాగా అభిమానం చూపిస్తూ ఉండేది. తన తల్లిదగ్గర, తన దగ్గర మంజీర సంతోషంగా వుండగలదన్నఅభిప్రాయంతో కాబోలు, తనని తన కోడలుగా చేసుకోమని తరచూ తన తల్లిని అడుగుతూ వుండేది, దానికి తన తల్లి నవ్వుతూ అంగీకరించేది కూడా. కాకపోతే ఆమెకి అంతగా మతిస్థిమితం లేనికారణంగా, ఆమె మాట్లాడేది తన తల్లి సీరియస్ గా తీసుకుందని తను అనుకోడు.

ఇంకా తను తనని కూడా తరచూ అడుగుతూ వుండేది కూడా. "నువ్వు నా కూతురుని పెళ్లి చేసుకుని జాగ్రత్తగా చూసుకుంటావా?" అని.

"ఓ, తప్పకుండా అలాగే." తనూ నవ్వుతూ చెప్తూ వుండేవాడు. 

ఇంకా ఒక రోజు ఆవిడ ఏం చేసిందంటే, తన మెళ్ళో తాళి తీసి తనచేత మంజీర మేడలో వేయించింది. "ఇప్పటినుండి మంజీర నీ భార్య. నువ్వు తనని జాగ్రత్త గా చూసుకోవాలి." అంది.

తనకి ఆవిడ ఆలా చెయ్యడం కొంచెం షాకింగా అనిపించింది. అయినా తను అన్నాడు. "తప్పకుండా అలాగే చూసుకుంటాను."

ఆ విషయం గుర్తుకు రాగానే, ఒక్కసారిగా సడన్ గా ఎదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయి లేచి కూచున్నాడు అనిరుధ్. తమ చిన్నతనం లో ఆవిడ చేసిన ఆ పిచ్చిపని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. తనూ, మంజీర కూడా ఆ విషయం పూర్తిగా మర్చిపోయారు. కానీ ఆ పిచ్చిమనిషి మాత్రం నిజంగానే తామిద్దరికీ పెళ్లిచేశాననుకుంది తామిద్దరూ భార్యాభర్తలు అనుకుంది. ఆ రోజున ఆవిడ చేసిన పనికి, ఇప్పుడు సర్వేశ్వరం తను మంజీరని పెళ్లిచేసుకు తీరాలని పట్టుపట్టడానికి ఏమైనా సంభందం వుందా? కానీ ఆవిడ చనిపోయి పది సంవత్సరాల పైన అయిపోయింది. ఆ పిచ్చిమనిషి చేసిన చిన్నపిల్లల పెళ్లిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది?

వద్దనుకున్నా తనని ఆవిడ ఆ రోజుల్లో చూసిన తీరు గుర్తుకొస్తూనే వుంది అనిరుధ్ కి. బహుశా తనని ప్రేమించే తన స్నేహితురాలు కొడుకు అనే వుద్దేశంతో కాబోలు, తనంటే చాలా అభిమానం చూపించేది. తన భార్యగా మంజీర ఆనందంగా, సంతోషంగా వుండగలదన్న అభిప్రాయం తో వుండేది. అందుకనే తరచూ తనని మంజీరని పెళ్లిచేసుకోమని, జాగ్రత్తగా చూసుకోమని అడిగేది. ఆఖరికి తామిద్దరి పెళ్లి అలా చేసేసింది కూడా.

సడన్గా సర్వేశ్వరం, ఇంకా ఆయన కూతురు ఆవిడ అభిప్రాయాన్ని గౌరవించాలనుకున్నారా? అదే నిజం అయితే ఆవిడ చనిపోయిన పది సంవత్సరాల తరవాత వరకూ వాళ్ళకి ఆ ఆలోచన ఎందుకు రాలేదు? ఆవిడ అభిప్రాయం గౌరవించాలన్న ఉద్దేశం వుంటే సర్వేశ్వరం మంజీరని నిరంజన్ కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేద్దామనుకున్నాడు? తను ఆ నిరంజన్ తో ఎందుకు అంత చనువుగా, అలా వుంది?

విషయం ముందుకన్నా కూడా ఇంకా పజిలింగ్ గా అనిపిస్తూ వుంది అనిరుధ్ కి. ఏది ఏమైనా ఆ మర్నాడే మంజీరని కలిసి విషయం మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు అనిరుధ్. అలాగే తను మనస్ఫూర్తిగా తనని పెళ్లిచేసుకోవాలన్న వుద్దేశంతోటే వుంటే అందుకు ఒప్పుకోవాలన్న ఉద్దేశానికి కూడా వచ్చాడు. అందుకు నిరంజన్ వైపునుండి సమస్యలు ఎమన్నా వచ్చేమాట అయితే వాటిగురించి అప్పుడే ఆలోచించ వచ్చు. అనిరుధ్ ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం, కేవలం ఇల్లు కాపాడుకోవాలని మాత్రం కాదు.  

&&&

"నేను చెప్తున్నానుగా అన్నయ్యా, నేను నా స్వార్ధం చూసుకుని, చదువుల కోసమని, ఇంకా పెళ్ళిచేసుకుని అలా దూరంగా వెళ్లిపోకపోయివుంటే నా మేనకోడలు పరిస్థితి ఇప్పుడిలా వుండి వుండేది కాదు. తను సవ్యంగా అలోచించి వుండేది. అంతా సవ్యంగా వుండివుండేది." సర్వేశ్వరం చెల్లెలు తనూజ కోపంగా అంది.

"నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇప్పుడు కూడా అంతా సవ్యంగానే వుంది." ఒక అనీజీ ఎక్సప్రెషన్ తో అన్నాడు సర్వేశ్వరం.

ఫోన్ చేసి రమ్మంటే ముందురోజు మధ్యాహ్నం వచ్చింది తనూజ. ఇంటికి వచ్చాక ఆమెకి మొత్తం విషయం అంతా వివరించి చెప్పాడు సర్వేశ్వరం.

"ఇందులో ఏది సవ్యంగా వుంది? ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళికి ఒప్పిద్దామనుకోవడం సవ్యంగా వుందా? పెళ్ళిచేద్దామనుకున్న అబ్బాయితో పెళ్లి క్యాన్సిల్ చేయడం సవ్యంగా వుందా? ఏదన్నా జాగ్రత్తగా అలోచించి చేస్తున్నావా నువ్వు?" కోపంగా అడిగింది తనూజ.

దానికి ఏం మాట్లాడాలో తెలియక అక్కడే వున్న మంజీర మొహంలోకి మౌనంగా చూస్తూ వుండిపోయాడు సర్వేశ్వరం.

"నీ ఫ్రెండ్ కొడుకు అన్నావు. చదువుకున్నవాడు, మంచి సంస్కారం వున్నవాడు అన్నావు. అలాంటివాడితో పెళ్ళెందుకు క్యాన్సిల్ చేసావు మరి?" కోపంగా అడిగింది తనూజ.

"వాడికేం సంస్కారం వుంది? అదును చూసుకుని నన్ను రేప్ చేద్దామనుకున్నాడు. అలాంటి వాడిని పెళ్లిచేసుకోకపోవడమే నాకు సంతోషం." మంజీర అంది.

"అలాంటి వాడితో నువ్వెలా తిరిగావు మరి? నీకు వాడితో పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని చెప్పినప్పుడు మీరిద్దరూ ప్రేమలో వున్నారని, నీ డాడ్ నాకు చెప్పాడు." మంజీర మొహంలోకి చూస్తూ అంది తనూజ.

"నేను ఎప్పుడూ వాడితో ప్రేమతో లేను. అలా తిరగడం లో కాస్త థ్రిల్ గా అనిపించి వాడితో తిరిగాను. వాడలాంటి వెధవ అని తెలియగానే, వాడితో అన్నీ కట్ చేసుకున్నాను."

"కేవలం ఆ థ్రిల్ తోటే వాడితోటి పెళ్ళికి ఒప్పుకున్నావా? వాడి క్యారక్టర్ ఏమిటో అప్పటివరకూ నువ్వు కనిపెట్టనే లేకపోయావా? జీవితం అంటే అంత తేలికగా అనిపించిందా నీకు?" తనూజ ఇంకా కోపంగానే వుంది.

"నేను చేసింది తప్పే. వాడిది బాడ్ క్యారక్టర్ అని తెలిసినా వాడితో క్లోజ్ గా మూవ్ అయ్యాను. అందులో ఎదో కొంచెం థ్రిల్ వుండే అలా చేసాను." ఒక గిల్టీ ఎక్సప్రెషన్ తో అంది మంజీర.

"ఎంత తేలికగా చెప్తున్నావు? నువ్వలా వాడితో తిరిగిన తరువాత, క్యారక్టర్ వున్న వేరే ఎవడన్నా నిన్ను పెళ్లిచేసుకోవడానికి ముందుకు వస్తాడా?"

"అలా రాడు కాబట్టే ఆ అనిరుధ్ ని నేను అలా బ్లాక్మయిల్ చెయ్యాల్సి వచ్చింది." ఆ అనీజీ ఫీలింగ్ సర్వేశ్వరం లో ఇంకా అలాగే వుంది. "వాడూ వాళ్ళ నాన్న లాగే డబ్బుని, అందాన్ని పట్టించుకునే రకం కాదు."

అదివింటూనె నవ్వింది తనూజ. "కానీ నువ్వు మంజీరని అనిరుధ్ ఎదో క్యారక్టర్ వున్నవాడని ఇచ్చి పెళ్ళిచేద్దామని అనుకోవడం లేదు. కేవలం వదిన ఊరుకోదని భయపడి మంజీరని తన భార్యని చేద్దామనుకుంటున్నావు."

"అది నిజం. ఒక్క అనిరుధ్ తప్ప ఇంకెవరు మంజీర భర్త అయినా నిర్మల ఊరుకోదు. ఆ విషయం ఆ రోజు వరకూ నాక్కూడా తెలియదు. తెలిసి వుంటే ఇంకెవరికో మంజీరని ఇచ్చి పెళ్ళిచేద్దామని ఆలోచించే వాడినే కాదు." సర్వేశ్వరం అన్నాడు.

"అవునాంటీ. అనిరుద్ధే నన్ను పెళ్లి చేసుకోవాలని మామ్ అనుకుంది. అందుకనే ఆ చిన్నతనం లోనే మా ఇద్దరికీ పెళ్లి చేసేసింది. ఆ విషయాన్నీ మొన్నటివరకూ సీరియస్ గా తీసుకోకపోవడం నా తప్పే. నా మీదకి వచ్చిన ఆ నిరంజన్ గాడిని అలా చితకొట్టే వరకూ, నేను ఆ అనిరుధ్ తో కలిసి జీవించాలని మామ్ ఎంతగా అనుకుంటూందో అర్ధం చేసుకోలేకపోయాను." విచారవదనంతో అంది మంజీర.

"మై గాడ్! సుస్మితా! నీ లోకి మీ మామ్ రాలేదమ్మా. అది కేవలం నీ స్ప్లిట్ పెర్సనాలిటీ. తను చనిపోయేముందు నీ మామ్ నీతోటి తనెప్పుడూ నీతోనే ఉంటానని, నిన్ను కాపాడుతూ వుంటానని అందని అన్నావు కదా. అది నీ సబ్-కాంషస్ లో జీర్ణించుకుపోయి నీలో ఆవిడ స్ప్లిట్-పెర్సనాలిటీ తయారయింది. అది ఆ నిరంజన్ గాడు నిన్ను రేప్ చెయ్యబోయినప్పుడు, అలా ఎక్సపోజ్ అయి వాడినుండి నిన్ను కాపాడింది." తనూజ అంది.

"నేను చేసిన తప్పల్లా ఏమిటంటే నువ్వు సైకాలజీ చదువుతానని చెప్పినప్పుడు, చదివించడం. నువ్వు సైకియాట్రిస్ట్ కావడానికి సహాయపడ్డం. లేకపోతె నువ్విప్పుడిలా మాట్లాడేదానివికాదు." సర్వేశ్వరం చిరాగ్గా అన్నాడు.

"నీకు, నీ కూతురికి ఇప్పుడు కావల్సినది ఒక సైకియాట్రిస్ట్ సహాయమే. మీ ఇద్దరి మనసులు కూడా ఇప్పుడు సరిగ్గా పనిచెయ్యడం లేదు." తనూజ కూడా చిరాగ్గా అంది.

"కాదు. మాకిప్పుడు కావల్సినది నీలాంటి సైకియాట్రిస్ట్ సహాయం కాదు. విచికిత్సానంద స్వామి లాంటి ఒక మహానుభావుడి సహాయం. ఆయనే బతికివుంటే ఇప్పుడీ సమస్యకి చక్కటి పరిష్కారం చెప్పేవారు." సర్వేశ్వరం అన్నాడు.

"ఇప్పటివరకూ ఇంకా నువ్వు అయన గురించి చెప్పడం మొదలు పెట్టలేదామిటా అనే ఆలోచిస్తున్నాను." ఇంకా చిరాగ్గా అంది తనూజ.

"ప్రతీ సమస్యకి అయన దగ్గర పరిష్కారం వుండేది. ఆయన చెప్పినట్టుగా చేసిన ప్రతిపనిలోనూ నేను విజయం సాధించాను. లేకపోతె అంత తక్కువ పెట్టుబడితో ఇలా ఇంత ఆస్థి సంపాదించడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు." తనూజ చెప్పింది విననట్టుగానే అన్నాడు సర్వేశ్వరం.

"నువ్వు విజయం సాధించింది, ఇంత ఆస్థి సంపాదించింది నీ హార్డ్ వర్క్ తో, నీ ఇంటెలిజెన్స్ తో. ఆ విషయం గమనించకుండా ఎందుకు నీ గొప్పతనానికి ఇంకొకళ్ళని కారణంగా చెప్తావు?"

"నువ్వు ఆ విషయాన్ని అర్ధం చేసుకోలేవు. నువ్వు అర్ధం చేసుకోలేని విషయాల్ని నీకు చెప్పకపోవడమే మంచిది." నిట్టూరుస్తూ అన్నాడు సర్వేశ్వరం.

"సరే ఆ విచికిత్సానంద గురించి డిస్కషన్ చేద్దామనే వుద్దేశంతో నేనూ లేను. కానీ ఆ అనిరుధ్ ని బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళిచేద్దామనే నీ ఉద్దేశం తో నేను ఏకీభవించలేను. అలా పెళ్లిచేసుకున్నవాడు సవ్యంగా కాపురం చేస్తాడని గ్యారంటీ ఏమిటి?"

"మంజీర ఎంత అందంగా ఉంటుందో నీకు తెలుసు, నాకున్న ఆస్థి గురించి నీకు తెలుసు. ఇదంతా వాళ్లిదరికే కదా. పెళ్లయ్యాక కొంతకాలం కోపంగా వున్నా, తరువాత సంతోషంగా కాపురం చేస్తాడు." సర్వేశ్వరం అన్నాడు.

"అలా ఆలోచించడం సరికాదు. నీ ఆలోచన తప్పని ప్రూవ్ అవ్వడానికి అవకాశం వుంది. ఒకవేళ డబ్బుకి అందానికి లోగేవాడే అయితే, నువ్వా ప్రపోజల్ పెట్టగానే ఒప్పుకునేవాడు."

దానికి ఏం చెప్పాలో తెలియాక మౌనంగా వుండిపోయాడు సర్వేశ్వరం.

"కానీ మామ్ నేను ఇంక ఎవర్ని పెళ్లిచేసుకున్నా ఊరుకోదు. ఆ విషయం ఆ రోజు డాడ్ కి చాలా స్పష్టంగా చెప్పిందని డాడ్ నాకు చెప్పారు." మంజీర అంది.

"అవును. ఆరోజు వాడిని చితకేసాక, వాడి గెస్ట్ హౌస్ నుండి ఇంటికి వచ్చింది నీ వదిన నిర్మలే. మంజీర కాదు. తను ఎంత కోపంగా వుందంటే, నా గుండె ఆగినంత పనయింది. 'నేను ఆ అనిరుధ్ కి ఇచ్చి పెళ్లిచేశానని తెలిసి కూడా నా కూతుర్ని వేరే వాడికిచ్చి పెళ్ళిచెయ్యాలని చూస్తావా? నువ్వు నా కూతుర్ని ఇంక వేరే ఎవడికి ఇచ్చి పెళ్ళిచేసినా, వాడిని చంపి పారేస్తాను. నా కూతురికి ఇప్పటికే పెళ్లి అయింది. ఆ అనిరుద్ధే  దాని మొగుడు.' అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను. మంజీరని కేవలం అనిరుధ్ కి మాత్రమే ఇచ్చి పెళ్ళిచెయ్యాలని." సర్వేశ్వరం అన్నాడు. 

"వదిన అంటే నాకు ప్రేమ వుంది. వదిన అంతగా అలా కోరుకుంటే అది నేను గౌరవిస్తాను. కానీ మొన్న మంజీర ద్వారా అలా చెప్పింది వదిన కాదు. అది మంజీరలో స్ప్లిట్-పెర్సనాలిటీ. అంటే మంజీరలో సబ్-కాంషస్ తనకి తెలీకుండా తనలా బిహేవ్ చేసేలా చేసింది." తనూజ అంది.

"పోనీ నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ మంజీరని ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేసినా, తనలో ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ అలా ఎక్సపోజ్ అయి అలా ఇబ్బంది పెట్టె అవకాశం వుంది కదా." సర్వేశ్వరం అన్నాడు.

"అవును అందుకు అవకాశం వుంది." తనూజ తలూపింది.

"మరందుకు అవకాశం వుంటే ఇలా తప్ప మంజీరని తనకిచ్చి పెళ్ళిచేయడానికి వేరే అవకాశం లేదు." సర్వేశ్వరం అన్నాడు.

"ఎందుకు వుండదు? తనని మంజీరని పెళ్లిచేసుకోమని అడిగి చూద్దాం. నువ్వు చెప్పింది కూడా నిజమే. మంజీర అందంగా ఉంటుంది. నీకు బోలెడు ఆస్థి వుంది. తను తెలిసో తెలియకో ఆ నిరంజన్ తో తిరిగిన విషయం పట్టించుకోకుండా, అనిరుధ్ మంజీర తో పెళ్ళికి అంగీకరించొచ్చు. నువ్వలా బ్లాక్ మెయిల్ చేసావు కాబట్టికానీ, మామూలుగా అడిగివుంటే తను తనతో పెళ్ళికి ఒప్పుకునే వుండేవాడు." తనూజ అంది.

"ఒప్పుకుని వుండేవాడు కాదు." అనీజీ గా ఫీలవుతూ అందిమంజీర "తెలిసో తెలియకో వాడితో నేను పొగరుగా బిహేవ్ చేసాను. కొన్నిసార్లు ఇన్సల్ట్ చేసాను కూడా. అందువల్ల వాడు నాతొ పెళ్ళికి ఈజీగా ఒప్పుకోడు."

"అలా ఎందుకు చేసావు?" నవ్వుతూ అడిగింది తనూజ.

"చెప్పాను కదా. నా మైండ్ సరిగ్గా పనిచేయలేదు. అందుకే అలా బిహేవ్ చేసాను." చిరుకోపంతో అంది మంజీర.

"నువ్వు ఒక్క విషయం చెప్పు." సడన్ గా సీరియస్ ఎక్సప్రెషన్ తో అంది తనూజ. "నీ మామ్ కావాలనుకుందనే నువ్వు అనిరుధ్ ని పెళ్లిచేసుకుందామనుకుంటున్నావా? అలా అయితే నువ్వు అతనితో సంతోషం గా ఉండగలవా?"

కింద పెదవిని రెండు పెదాల మధ్య బిగించి మౌనంగా ఉండిపోయింది మంజీర.

"నీ నుండి స్పష్టమైన సమాధానం కావాలి. నువ్వు అనిరుధ్ ని పెళ్లిచేసుకుందామన్న నిర్ణయం కేవలం నీ మామ్ ఆలా కోరుకుందనేనా? లేకపోతే ఇంకెవరిని చేసుకున్న ఆవిడ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదనా? నువ్వూ, మీ డాడ్ ఇద్దరూ కూడా ఆవిడ కేవలం స్ప్లిట్ పెర్సనాలిటీ కాదు, నిజంగానే స్పిరిట్ గా వుండి నీ మీదకి వస్తూంది అని నమ్ముతున్నారు కదా."

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)