గగనం లో ప్రయాణం గాల్లో దీపo.
ఎప్పుడు కొoడెక్కుతుందో ఎవరికీ తెలుసు.
మన ట్రిప్ కి ఆన్లైనలో టికెట్ బుకింగ్ సులువే.
సౌకర్యం లేకపోతే బుక్ అయ్యేది మనమే.
గడ్డం ఉన్న సింగ్ గారికి పైలెట్ గా 30 ఏళ్ల అనుభవం.
గగనతలoలో లో ఏ పక్షి గడ్డము అడ్డం రాకపోవడo
మనo చేసుకున్న అదృష్టం.
విమానం గాల్లో కి ఎగరడం, లాండింగ్ అవ్వడం.
పిల్లల సంతోషాలకు. ఆలవాలం .
ప్యాసింజర్ లకు రాహు కాలం .
నూటికి నూరుశాతం ప్రమాదాలు జరిగే కాలం.
ప్రమాదం ముందుగా పలకరించేది ముందు సీటును
అందుకే వెనుక సీటు అందరికీ మక్కువ.
పక్షి తన పిల్లలకి రెక్కలతో రక్షణ ఇస్తుంది.
ఈ గగనాక్షి రెక్కల ప్రక్కన ఎగ్జిట్తో రక్షణ ఇస్తుంది.
ప్రమాద రక్షణకి ఇస్తారు లైఫ్ జాకెట్.
అది ధరించడమే మనకి పెద్ద డౌట్.
కరోనాని కనకాన్ని మోసుకొచ్చేది విమానమే.
కంటికి కనపడనిది కరోనా
కంటికి కనపడని ప్రదేశం లో దాచేది కనకం.
రెండు పెరగడం మన దేశ ఆర్థిక ప్రగతికి సున్నo.
అందరూ మాస్కు బాబులే
విమానం అంతా sanitize పూతలే
ఏ బాబు జేబులో కరోనా మందు ఉందో
ఎవరికి తెలుసు.
Air hostess సురక్షితం కోసం మూగ సౌజ్ఞలు ,కళ్లు
తిప్ప కుండా చూసే యువకుడికి చివరలో చెప్పే థాంక్స్ ,
బూడిదలో పోసిన పన్నీరే.
కారణం యువకుడు చూసేది airhostess డ్రెస్సే.
రావత్ గారికే లేదు రక్షణ వలయం.
కారణo చెప్పని. బ్లాక్ బాక్స్లు, పేపరులు
పెదవి విప్పని ప్రభుత్వం.
మనమెంత గాల్లో దూదిపింజలం
.
ప్రైవేట్ భాగ స్వామ్యం పనితీరు భేష్.
నేలమీదే నడవలేని నన్ను గగనతలం చూ పించి
గమ్యం చేర్చిన ఇండిగో A 320 శభాష్.
విమాన ప్రయాణం గొప్ప కాదు.
సురక్షితంగా ల్యాండింగ్ గొప్ప.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
సామర్లకోట.