అమ్మ వోడి లో ప్రశాంతంగా నిద్ర
పోతున్నా పసి పాపలా...
షరతు లే ,లేని ప్రియురాలి ప్రేమ లాలన లో
నులివెచ్చని యద కౌగిలిలో ఒదిగిన ప్రియుడి లా,
ఈ లేత పొగ మంచు తెరల చాటున
అలుముకున్నా పచ్చని ప్రకృతి
ఒకవైపు....
ఆ దృశ్యాన్ని మరింత అద్భుతం గా
మర్చడనికి అన్నట్టు,
గాలితో నృత్యం చేస్తూ మబ్బుల అంచులనీ తాకుతూ, కీలాకిలా రవాలనే స్వరాలు గా మలిచి
కృతఙ్ఞత లు తెలుపుతూ ,
రేపనే ఆలోచనే లేక స్వేచ్ఛ గా
అల్లరి చేస్తూ కేరింతలు కొడుతున్న గువ్వలు
గోరింకలు ఒకవైపు....,
వెచ్చని నా తనువుని తాకుతూ,
వెళ్ళే ఆ చల్లని పిల్ల గాలుల చిలిపి సవ్వడులు ఒకవైపు...
ప్రపంచాన్ని మేల్కొల్పడానికీ నేనే ఉన్న అన్నట్టు ,
ఆ ధవళ వర్ణపు మంచు తెరలని చీల్చుకుంటు నేలని
తాకడానికి ప్రయత్నిస్తున్న భానుడి కిరణాలూ,
ఒకవైపు....
రెక్కడి తే గాని డొక్కడని జీవితాల నడుమ ,
బతుకు బండి ముందుకు నడిపించే పని లో
పూర్తిగా నిమగ్నమై..!
ఆస్వాదించే మనస్సు ,ఆనందించే తీరిక లేక
అంతం లేని మా ఈ ఆకలి కేకలకు సమాధానం
చెప్పేది ఎవ్వడంటూ, దేన్ని పట్టించుకోకుండ రేపటి కోసం భయపడుతూ బతుకు భారమై ముందుకు సాగిపోతున్న, ఈ కాలపు యాంత్రిక మనిషి....ఇంకోవైపు....!
మధుకర్...✍️