పల్లవి :ఏనాటిదో ఈ బంధం ఎద చాలని మధురానుబంధం
నేనేడు జన్మలు ఎత్తితే..
ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం మమతానురాగబంధం
కళ్లల్లోన నిన్ను దాచినా ఊహల్లోన ఊసులాడినా..
స్వప్నంలోన ఎంత చూసినా విరహమేతీరదే.
జాజి కొమ్మ గాని ఊగినా కాలి మువ్వ గాని
మోగినా చల్లగాలి నన్ను తాకినా నీవనే భావమే.
చరణం :1నీ ప్రేమలో ఆరాధనై నేనిండుగా మునిగాక
నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ చేరునో చేరదో తెలియదు
ఆ కానుక ఆశనే వీడక వెనక పడెను
మనసుపడిన మనసే నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నో యుద్దాలు చేస్తానులే నీ చిరునవ్వుకై
నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే
చరణం -2 నేను నిన్ను ప్రేమిస్తున్నాను
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
నేను ఏమి చెప్పినా కూడా నాకు ఏమి లోటు ఉంది
ఓ! ఐ లవ్ యూ ఐ లవ్ యూ
నా విలువైన ప్రేమను నీకు బహుమతిగా ఇచ్చాను
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రోజుకు
వంద సార్లు చెప్పాలనుకుంటున్నాను
నిన్ను చూస్తూ వెయ్యి సార్లు చెబుతున్నా
నేను నిన్ను ప్రేమిస్తున్నాను…