" సిరి వెన్నెల" ను ఇంటి పేరు చేసుకున్న
" సీతారామ శాస్త్రిగారూ !
" సుస్వరార్చనకు , అక్షర కుసుమాలను అవలీలగా కూర్చి
" సూర్యోదయ స్తుతి చేసి ,
" సృష్టి లోని అణువణువుకు ప్రణమిల్లి ,
"సేవల్లో 'స్వర' సేవే శ్రేష్టమని ,
" సొగసు లద్దిన పదజాలంతో ,
" సోనలూరే భావధారలతో ,
" సౌందర్యలహరి " పోలు స్తుతి-మాల తో
"సమృద్ద సాహిత్య" అభిషేకాలతో
సర్వాంతర్యామిని నిత్యార్చన చేసి
" సదా నీ సేవలో అంటూ నింగి కెగసిన
నీ కీర్తి అమరం , నిను విని నీతో జీవించిన
మా జన్మ ధన్యం. సంజీవని నీ సినీ సాహిత్యం.