మన్నులోనే దొరకు విలువైన ఖనిజాలు
మట్టిలేక సాగు కాదు వీలు
మట్టిలోన పుట్టి మట్టిపాలగు మేను
మనుజులుందరు మట్టిబొమ్మలేగా
మట్టిని తవ్వితేనే విలువైన ఖనిజాలు దొరికేది
మట్టి లేకుండా వ్వవసాయంకూడా వీలుకాదు
తనువులన్నీ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయేవే..
అందుకే..మనిషి ఓ మట్టి బొమ్మ