ఆ రాత్రి ఎవరో తలుపు తట్టారు... సమయానికి ఇంట్లో కరెంటుకూడా లేదు.. ఈ టైంలో ఎవరొచ్చుంటారా అని సందేహం.. ఎవరైనా దొంగైవుంటారా అని చిన్న అనుమానం... భయం భయంగా వెళ్ళి తలుపు తీశాను.. ఎవరో పాతికేళ్ళ అమ్మాయి.. కాస్త భయం భయంగా నా ముందు నిలబడింది.. ఎవరండి మీరు ఏం కావాలి... అని అడిగాను.... అంకుల్ నా పేరు మౌనిక ... మీకింది పోర్షన్లో అద్దెకు దిగాము.. పూర్తి సామాను ఇంకా తెచ్చుకోలేదు.. ఉన్నట్టుండి కరెంటు పోయింది మీ ఇంట్లో క్యాండిల్ ఉంటే కాస్త ఇస్తారా.. అని అడిగింది.. ఉండండి తెస్తాను..అని ఇంట్లోకి వెళ్ళి వెతికి తెచ్చి ఇచ్చాను...ఆమె క్రిందికి వెళ్ళిపోయింది... ఈలోగా కరెంటు వచ్చింది... యధాలాపంగా అద్దంలో ముఖం చూసుకున్నాను... అవును నిజంగానే అంకుల్ అని పిలిపించుకునే వయసొచ్చింది..కాలం ఎంతో వేగంగా పరిగెడుతోంది