ఒక అర్ధరాత్రి అనాలోచితంగా తీసుకున్న దుందుడుకు నిర్ణయం దేశం మొత్తాన్నీ అంధకారంలోకి నెట్టివేసింది... అదే నోట్ల రద్దు అని కేంద్రం ముద్దు పేరు పెట్టిన ఒకానొక విఫల ప్రయోగం.... కొత్త నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినా.. అవి పెట్టిన పాట్ల పోట్లు చేసిన గాయాలు ఇంకా ప్రజల మనసుల్లో పచ్చిగానే వున్నాయి.. చెప్పు దెబ్బల్లా చురుక్కుమనిపిస్తూనే ఉన్నయి... దేశ ప్రగతిని పదేళ్ళు వెనక్కు నెట్టిన ఆ దుర్దినానికి నేటితో రెండేళ్ళు... తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలడం అంటే ఇదేనేమో.. మోడీజీ లక్ష్యం ఒకరైతే శిక్ష పడింది మాత్రం ఇంకొకరికి... పంక్తుల్లో చకోర పక్షుల్లా ఎదురు చూసి ఎదురు చూసి మనోవేదనతో పిట్టల్లా రాలిపోయిన అభాగ్యులు కొందరైతే... సరైన సమయానికి వైద్యం అందక నేల రాలిన నవ జాత శిశు మొగ్గలు ఎందరో... ... ఆదుర్దాతో కేంద్రం సామాన్యుల వీపు మీద రేపిన దద్దుర్ల దురద ఎన్ని లేపనాలు పూసినా సరే... తగ్గేలా లేదు. కేంద్రం పెద్దలు పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా లోలోపల తర్జన భర్జనలు పడుతున్న మాట మాత్రం వాస్తవం... ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ విషయంగా ఎలా స్పందిస్తారనే అంశం ఆశక్తికరంగా మారింది...