ఈ రోజు ఏంటో చాలా రోజులు తర్వాత కొత్తగా అనిపించింది.
పెళ్లి అయిన తర్వాత, ప్రేమ ఎక్కడో పోగొట్టుకున్నట్టు ఉంది.
రోజూ లేస్తున్నాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం..
ఏవో ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం..
ఎవరి ఫోన్లో వాళ్ళు రిల్సో, వీడియోలో చూసుకున్నాం..
చివరిగా తన వైపు ప్రేమగా ఎప్పుడు చూసానో కూడా గుర్తులేదు అంటే నమ్ముతారా?
రోజూ కలిసే పడుకున్నాం.. అలవాటు అయిపోయుంటమా?? ముందు అంత ఫీలింగ్స్ రావట్లేదు ఎందుకు...
ఈ రోజు ఒక పుస్తకం చదువుతుంటే మళ్ళీ మేము ప్రేమించుకున్న రోజులనాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడాయి.. ఆ రోజుల్లో వున్న ప్రేమంతా ఏం అయిపోయిందో.. రోజులతో పాటు కరిగిపోయిందా? కొత్తదనం లేక అలవాటుగా మారిపోయిందా?
తను ఆఫీసు నుంచి రాగానే.. తన వైపు చూస్తూ నవ్వుకున్నాను.. ఎంత పోరాడి సాధించాం .. ప్రేమని పెళ్లి వరకు తెచం.. గట్టిగా హాగ్ చేసుకొని "ఐ లవ్ యు" అని చెప్పాను.. "ఐ లవ్ యూ టూ" అని అంటూ నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నా కళ్ళలో నీరు తిరిగాయి.
తను ఎప్పుడూ ప్రేమలోనే ఉన్నాడు... నేనే గుర్తించలేకపోయాను.
ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తేనే ఉన్నట్టు కాదు... మనస్పూర్తిగా చూస్తే మౌనంలో కూడా ప్రేమ వినిపిస్తుంది. శూన్యంలో కూడా ప్రేమ కనిపిస్తుంది.
-Aiswarya Nallabati