Yevaru..? - 4 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 4

Featured Books
Categories
Share

ఎవరు....? - 4

Part - 4

సమయం అర్ధరాత్రీ 1 గంట…
ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ ఔటస్కర్ట్స్ (industrial outskirts)
ఎక్కడికక్కడ ఖాళీగా రేకుల షెడ్డులు పడున్నాయి.
దూరంగా కుక్కలు మొరుగుతున్న శబ్దం…

సరిగ్గ ఆ సమయంలొ ఒక పోలీసు వాహనం వచ్చి రోడ్డు ప్రక్కకు ఆగింది. అర్ధరాత్రి పూట అక్కడ పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి రోడ్డు మొత్తం చీకటిగా నిర్మానుష్యంగా ఉంది.

ఆ చీకట్లొని పోలీసు బండి హెడ్లైట్స వెలుతురొ ఒక వ్యక్తిని చేతులు కట్టేసి బండ్లో నుండి బయటకి లాక్కోని వచ్చి 
ఎదురుగా నిలబెట్టారు. 

అదె పోలీసు బండిలొ డ్రైవర్ ప్రక్కనున్న సీటు నుంచి 36 ఏళ్ళ వయసున్న ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) దిగాడు. 

చేతులు కట్టి ఉన్న వ్యక్తి : సర్ నేను ఏ తప్పు చేయలేదు సర్. దయచేసి నన్ను వదిలేయండి సర్.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : నేరం చేసి పట్టుబడ్డ ప్రతి వాడు చెప్పె మాటెరా ఇది

అని తన రివాల్వర్ బయటకు తీసి అందులోకి బుల్లెట్సను ఎక్కిస్తున్నాడు.

రివాల్వర్ చూసిన ఆ వ్యక్తి భయపడుతూ..

చేతులు కట్టి ఉన్న వ్యక్తి : సర్... సర్... వద్దు సర్ నిజంగానె నేను ఏ తప్పు చేయలేదు సర్. దయచేసి నన్ను ఏం చేయద్దు సర్....

అని చేతులు జోడించి ఏడుస్తున్నాడు...

అప్పుడ అజయ్ అక్కుడున్న ఎస్.ఐ మనోహర్ (S.I Manohar) వైపు తిరిగి. 

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ఏం మనోహర్ ఏం చేద్దాం.? చూస్తుంటె వీడు నిజం చెప్పేలా లేడు. నువ్వెం ఏం అనుకుంటున్నావు.?

ఎస్.ఐ మనోహర్ (S.I Manohar) : మనం కస్టిడిలోకి తీసుకొని విచారణ చేసి నిజం చెప్పిద్దాం సర్.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : అక్కడ వరకు అవసరం లేదు. ఇక్కడె ముంగించేద్దాం. వీడు ఎలాగొ నిజం చెప్పడు

తరువాత ఆ నేరస్తుడు వైపు తిరిగి. మౌనంగా తననె చూస్తున్నాడు. నిశ్శబ్దం. గాలి చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దం..

భయంతొ ఆ నేరస్తుడు బిక్కు బిక్కుమంటు అజయ్ వైపె చూస్తున్నాడు.

నేరస్తుడు : సర్ నన్ను నమ్మండి సర్ నిజంగా నేనేం చేయలేదు సర్. నాకేం తెలియదు సర్.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె నిన్ను నమ్ముతున్న. కాబట్టి నీకొక అవకాశం. పారిపోయి బ్రతికిపో..
కానిస్టేబుల్స్ తన చేతికున్న సంకెళ్ళు తీసేయండి...
పోరా...

అతని చేతికున్న సంకెళ్ళు తీసేశారు. కాని అతను కదలకుండా అక్కడె నించోని ఏ.సీ.పి అజయ్ వైపె చూస్తున్నాడు..

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : వెళ్ళిపోరా. ఇంకా ఇక్కడె నించున్నావేం.

అజయ్ అలా అనగానె నెమ్మదిగా వెనుదిరిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక తను పరిగెట్టడం మొదలు పెట్టాడు. 

పరిగెట్టిన కొంచెం సేపటి గన్ పేలిన శబ్దం వచ్చింది. ఆ నేరస్తుడి వెనక కుడికాలు తొడలొ గుండు దిగింది. అయినా సరె ఆగకుండా తను పరిగెడుతూ ప్రక్కన ఉన్న పొదల్లోకి దూరాలని చూశాడు. 

మళ్ళి గన్ పేలింది ఈసారి తన కుడి వైపు మొల క్రింద తుంటి భాగంలొ గుండు దిగింది. అతను గట్టిగా అరుస్తూ రక్తం కారె చోట చేతులు అడ్డుపెట్టుకున్నాడు. ప్రక్కన ఉన్న రాయిని తీసి అజయ్ పై విసరబోయేంతలొ ఈసారి తన కుడి వైపు ఛాతిలొ ఇంకొ గుండు దిగింది. దాంతొ అతను నెల మీద కూలబడ్డాడు.

బాధతొ అతను గట్టిగా అరుస్తూ ఎడుస్తున్నాడు. "నన్ను వదిలేయండి" అంటూ ప్రాధేయపడుతున్నాడు. సరిగ్గ అదె సమయంలొ ఇంకొ గుండు పొదల వైపు నుండి వచ్చి తనకి కుడి వైపు తలలొ దిగింది. దాంతొ అక్కడికక్కడె అతను చనిపోయాడు. 

ఆ బుల్లెట్ వచ్చిన వైపు పొదల్లో నుంచి సీ.ఐ ప్రవీణ్ (C.I Praveen) ప్రశాంతంగా నడుచుకుంటూ బయటకి వచ్చాడు. తరువాత తను ఎస్.ఐ మనోహర్ చేతి పైన మరియు అక్కడ ఉన్న ఓ ఇద్దరి కానిస్టేబుల్స్ కాళ్ళ పైన తన రివాల్వర్ తొ కాల్చాడు. 

తరువాత గాల్లొ రెండు రౌడ్లు కాల్చి ఆ రివాల్వర్ ని చనిపోయిన నేరస్తుడి కూడి చేతిలొ పెడతాడు. అలా పెట్టేటప్పుడు తన వేలుని రివాల్వర్ ట్రిగ్గర్ పై ఉండేలా నొక్కి పెడతాడు.

తరువాత అజయ్ తన పై అధికారి డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ కి కాల్ చేస్తాడు

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సర్ డ్రగ్స్ కేసులొ మనం వెతుకుతున్న వాడు పేరు కిషోర్ శర్మ అతని లోకేషన్ కనుకున్నాం…
ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ ఔటస్కర్ట్స (Ibrahimpatnam Industrial outskirts) లో అతన్నీ ట్రేస్ (trace) చేశాం.

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : అజయ్.. careful…
కస్టడి లోకి తీసుకోండి… ఎన్కౌంటర్ సిట్యువేషన్ (encounter situation) వద్దు... 

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : కాని సర్ ......

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఏమైంది...?

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సర్ కిషోర్ శర్మని పట్టుకొని బండ్లొకి ఎక్కిస్తుంటె మన సీ.ఐ ప్రవీణ్ (C.I Praveen) యొక్క రివాల్వర్ లాక్కొని పరిగెత్తాడు సర్  

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : తన చేతికి మన ప్రవీణ్ రివాల్వర్ దొరకడమేంటి.? అయిన అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారయ్యా? వాడు అలా పారిపోతుంటె మీరేం చేస్తున్నారు.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : పట్టుకోవాలని చూశాం సర్ కాని మా మీదె కాల్పులు జరిపాడు దాని వల్ల మన ఎస్.ఐ మరియు ఇద్దరి కానిస్టేబుల్సుకి గాయాలు కూడా అయ్యాయి. 

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : మరి నువ్వేం చేస్తున్నావు.? 

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : అది చూసి నేనూ కాల్పులు జరిపాను సర్. అతని రెండు తొడల్లొ రెండు బులెట్లు దిగాయి. కుడి వైపు ఛాతిలొ ఒక బులెట్టు దిగింది.

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : మరి వాడు బ్రతికె ఉన్నాడా..?

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : నేను కాల్చిన తరువాత వాడు బ్రతికె ఉన్నాడు సర్ కాని...

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : మళ్ళి కాని ఎంటయ్యా...?

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : గాయాలతొ నేలపై పడి ఉన్న అతన్ని తీసుకెళదామని అతని వద్దకు వెళితె. రివాల్వర్ తొ తనని తానె కుడి వైపు నుంచి తలపై కాల్చుకొని చనిపోయాడు సర్.

అరేస్టు చేసి కస్టడిలోకి తీసుకురావాల్సిన కిషోర్ శర్మ చినపోయాడు అని తెలియగానె. డీ.ఎస్.పి రాజ్ గోపాల్ కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సర్ లైన్లొ ఉన్నారా?

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఆ ఆ.. ఉన్నాను 

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ఇప్పుడు ఏం చెయ్యమంటారు సర్?

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా ఏం చెయ్యాలొ...

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సారీ సర్?

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : సరే జరిగిందేదో జరిగిపోయింది. 
• ముందు మన వాళ్ళను త్వరగా హాస్పెటల్ కి తీసుకెళ్ళు. 
• అక్కడ ఉన్న సీన్ ని డిస్టర్బ్ చెయ్యద్దు. 
• పత్రికల వాళ్ళకి మరియు మీడీయా వాళ్ళకి ఈ వార్త తెలియకుండా చూడూ..

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్..

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఒక్క విషయం గుర్తుంచుకొ అజయ్. ఇది సరిగ్గా హ్యాండిల్ చేయకపోతె. అది ఎన్కౌంటర్ కాదు నీపై ఎంక్వైరి అవుతుంది.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్..

డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఎన్కౌంటర్ జరగడం కాదు. పై అధికారులకి ఎలా వివరంగా చెప్పాలన్నదె అసలు సమస్య. దానికి సంబందించి వివరంగ రిపోర్ట్ రెడి చెయ్యు..

అని చెప్పి డీ.ఎస్.పి ఫోను పెట్టేశాడు.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ప్రవీణ్ త్వరగా వీళ్ళని బండె ఎక్కించు. హాస్పెటల్ కి తీసుకెళ్ళాలి..

సీ.ఐ ప్రవీణ్ : మరి ఆ శవాన్నీ సర్....?

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : దాన్నీ అలానె వదిలసి ఫారన్సిక్ టీమ్ వాళ్ళకి సమాచారం ఇవ్వు. మిగిలింది వాళ్ళొచ్చి చూసుకుంటారు. అప్పటి వరకు ఇక్కడ ఓ ఇద్దరు కానిస్టేబుల్స్ని శవానికి కాపలా పెట్టు..

సీ.ఐ ప్రవీణ్ అక్కడ ఓ ఇద్దరు కానిస్టబుల్స్ని కాపలా పెట్టి ఫారన్సిక్ టీమ్ కి ఇన్ఫార్మ చేస్తాడు. తరువాత ఏ.సీ.పి అజయ్ తొ కలిసి హాస్పటల్ కి వెళతాడు...

వారం రోజులు తరువాత ఏ.సీ.పి అజయ్ కు డీ.జీ.పి ఆఫీసు నుంచి కాల్ వస్తుంది. దేవేంద్ర రెడ్డి హత్య కేసును దర్యాప్తు జరిపె ప్రత్యేక బృందం లొ (SIT) తనని తీసుకుంటున్నట్టు చెబుతారు..

అలా తను వెళ్ళి సాగర్ వర్మను కలుస్తాడు. 

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : గుడ్ మార్నింగ్ సర్

సాగర్ వర్మ : గుడ్ మార్నింగ్ Mr. అజయ్ రండి కూర్చోండి.. మీ ట్రాక్ రికార్డ్ చూశాను వేరి ఇంప్రెస్సివ్ (Very Impressive)

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ఠాంక్యూ సర్...

సాగర్ వర్మ : ఇది దేవేంద్ర రెడ్డి కేసుకు సంబంధించిన ఫైల్ ఒకసారి మీరు దీన్ని చదవండి.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్...

సాగర్ వర్మ : ఈ కేసు దర్యాప్తుకు ఒక సి.ఐ మరియు ఇద్దరు ఎస్.ఐ లు కావాలి. మీకు తెలిసిన ఎఫీశ్యంట్ ఆఫీసర్స (efficient officers) ఎవరైన ఉంటె చెప్పండి..

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సి.ఐ ప్రవీణ్ అని నాతొ పాటు మాధక ద్రవ్యాల కేసులొ పని చేశాడు. అతనితొ పాటు వేరె కేసుల్లొ నాతొ పని చేసిన ఇద్దరు ఎస్.ఐలు కూడా ఉన్నరు. వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు సర్...  

సాగర్ వర్మ : మరి ఇంకేం వాళ్ళ ప్రోఫైల్సు నాకు పంపించండి నేనొకసరి చెక్ చేస్తాను..

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్

అలా దేవేంద్ర రెడ్డి కేసులొ సాగర్ వర్మ తొ ఏ.సీ.పి అజయ్, సీ.ఐ ప్రవీణ్, ఎస్.ఐలు ఇద్దరు సుందర్ మరియు జాన్ బాబు
ఐదుగురు కిలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్నీ (SIT) ఎర్పాటు చేశారు...