Yevaru - 3 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 3

Featured Books
Categories
Share

ఎవరు....? - 3

Part - 3

సాయంత్రం 6 గంటలు ఆ సమయంలో ఒక గ్రామంలోని కొంతమంది ప్రజలు కలిసి ఒక కుటుంబాన్నీ కొట్టి వాళ్ళను ఇంట్లొ పెట్టి తాళం వేసి. ఆ ఇంటికి నిప్పు పెడతారు. 

కొంచెం సేపట్లోనె మంటలు ఆ ఇంటిని కమ్మేశాయి. ఆ ఇంట్లొ బంధింపబడ్డ భార్య,భర్త, కూతురు ముగ్గరి ఆర్తనాదాలు ఆ గ్రామం అంతటా వ్యాపించాయి.

భర్త : దయచేసి నా భార్య బిడ్డనైన కాపాడండి. తలుపులు తెరవండి మీకు దణ్ణం పెడతాను.

భార్య : అయ్య అయ్య మీకు పుణ్యం ఉంటుంది మీకు దణ్ణం పెడతాను తలపులు తెరవండయ్యా...

కూతురు : అమ్మా....... మంటలు కాలిపోతున్న....

భార్య : అయ్యో... ఆఆఆఆఆఆఆ.. ఆఆఆఆఆ

భర్త : ఆఆఆఆఆఆఆఆ...... ఆఆఆఆఆ...

2 గంటల తరువాత వాళ్ళ కేకలు ఆగిపోయాయి. ఆ ఇంటితొ పాటు ఆ ఇంట్లోని వాళ్ళు తగలబడిపోయారు.
--------------------------------------------------------‐---------------
కృష్ణా నది ఒడ్డున దేవేంద్ర రెడ్డి అస్తికలను తన కొడుకు అరవింద్ నదిలొ కలుపుతున్నాడు. ఆ సమయంలొ అక్కడ దేవేంద్ర రెడ్డి భార్య ప్రియ మరియు సాగర్ ఉన్నారు. వారితొపాటు వెనకాల దేవేంద్ర రెడ్డి అనుచరులు శివ, వివేక్ మరియు గణేష్ నించోని ఉన్నారు.

కార్యక్రమం పూర్తయ్యాక అందరు కారు ఎక్కుతున్నారు. ఈలోపు సాగర్ ప్రియ దగ్గరకు వచ్చి 

సాగర్ : మేడమ్ మీతొ నేను ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 

ప్రియ : ఇంటికి పద సాగర్ అక్కడ మాట్లాడుకుందాం. 

సాగర్ : ఇది ఇంట్లొ మాట్లాడె విషయం కాదు. కార్లోనె మాట్లాడాలి. 
అరవింద్ కారు నువ్వు నడుపు. 
శివ మీ ముగ్గురు వెనకాల కారులొ రండి.
మీరు కారెక్కండి మేడమ్.

సాగర్, అరవింద్ మరియు తని తల్లి ప్రియ ఒకె కారులొ బయలుదేరారు. ఆ కారు అరవింద్ నడుపుతున్నాడు.

శివ, వివేక్, గణేష్ వెనకాల కార్లో వస్తున్నారు. ఆ కారుని గణేష్ నడుపుతున్నాడు.

ప్రియ : ఇప్పడు చెప్పు సాగర్. ఏంటి ఆ ముఖ్యమైన విషయం..?

సాగర్ : మేడమ్ దేవేంద్ర గారి కేసులొ ఎవ్వరిని నమ్మలేం. ఇందులొ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. 

ప్రియ : ఏమంటున్నావు సాగర్ ? 

సాగర్ : అవును మేడమ్ అంతా కలిసి కావాలనె నన్ను ఇక్కడి నుంచి రాజమండ్రికి ట్రాన్సఫర్ చేశారు. సీ.యం, హోమ మినిష్టర్ వరకు ఇందులొ ఉన్నట్టు నా అనుమానం. వాళ్ళె నన్ను ఇక్కడ నుంచి ట్రాన్సఫర్ చేయించారు.

ప్రియ : వాళ్ళకేంటి అవసరం ..?

సాగర్ : నా వల్లె దేవేంద్ర గారు సూర్యనారాయణ గారు మళ్ళి కలిసారు కాబట్టి. అది వాళ్ళకి నచ్చలేదు. 

ప్రియ : వాళ్ళకెందుకు నచ్చలేదు.? వాళ్ళిద్దరు కలిసి ఉంటె వాళ్ళకేంటి సమస్య?

సాగర్ : వాళ్ళిద్ధరి మద్య గొడవ వల్ల ఎవరికి లాభం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు పార్టీలొ విజయవాడ మొత్తం వీళ్ళ గుప్పెట్లొనె ఉండేది. వీళ్ళ ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళు పార్టీలొ చాలా మంది ఉన్నారు. 

అరివింద్ : అందుకె వీళ్ళద్దరిని విడదీశారా? 

సాగర్ : అవును. వీళ్ళిద్దరి మద్దతు పార్టీకి కావాలి కాని వీళ్ళు ఎదగకూడదు. అందుకె మీ నాన్నగారికి సూర్యనారాయణ గారికి మద్య గొడవలు పెట్టి విడదీశారు. తిరిగి వాళ్ళు మళ్ళి నా వల్ల కలిసెసరికి కోపంతొ నన్ను ఇక్కడ నుంచి పంపించేశారు.

ప్రియ : మరి ఆయన్ని చంపింది ఎవరు? సూర్యనారాయణ కాదా?

సాగర్ : కాదు ఆయన్నీ కేవలం బలి పశువుని చేశారు. హత్య చేశింది వేరే వాళ్ళని నా అనుమానం.

ప్రియ : ఎవరై ఉంటారు.?

సాగర్ : ఎవరు చేశారొ తెలుసుకోవాలంటె ముందు అసలు దేవేంద్ర గారిని ఎలా చంపారొ తెలుసుకోవాలి. అది జరగాలంటె ఈ కేసు దర్యాప్తు (Investigation) నా అద్వర్యంలొ జరగాలి.

ప్రియ : కాని నిన్ను రాజమండ్రికి బదిలి చేశారుగా. నువ్వు ఎలా ?

సాగర్ : దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తె చచ్చినట్టు ఈ కేసును నాకప్పగిస్తారు.

ప్రియ : చెప్పు సాగర్ ఏం చెయ్యాలొ? కచ్చితంగ చేస్తాను.

సాగర్
- ముందు మీరు కోర్టులొ సెక్షన్ CrPC 156 (3) ప్రకారం ఒక పిటిషన్ దాకలు చేయండి. 
- చనిపోయింది ఒక అధికార పార్టీ ఎం.ఎల్.ఏ. కాబట్టి కోర్టు ఇదివరకు పోలీసులకి ఇచ్చిన రీ ఇన్వషటిగేషన్ తాలుకు ఆదేశాలు సరిపోవని చెప్పండి
- లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పండి.
చాలు మిగిలింది మన లాయర్ మరియు జడ్జి గారు చూసుకుంటారు.

ప్రియ : అలా చేస్తె నీకు ఈ కేసు అప్పగిస్తారా?.

సాగర్ : కోర్టు ఇవ్వదు కాని ఇలా చేస్తె కచ్చితంగా ఈ కేసు నా వద్దకు వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను.

ప్రియ : సరె సాగర్ నువ్వు చెప్పినట్టె చేస్తా. 

అరవింద్ : అంకుల్ నాకొక డౌట్ 

సాగర్ : ఏంటది..?

అరివింద్ : మీరు ఇదంతా ఇంటికి వెళ్ళాక చెప్పొచ్చుగా కార్లోనె ఎందుకు చెప్పాలన్నారు.?

సాగర్ : ఎప్పుడైతె ఈ కేసులొ ముఖ్యమంత్రి మరియు హోమ్ మంత్రులు కూడా ఉన్నారని తెలసిందొ. అప్పటినుంచె మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా నాకు అనుమానం మొదలైంది. అందుకె ఎవరికి తెలియకూడదనె కారులొ మాట్లాడాలి అన్నాను.

అరవింద్ : ఓహో...

సాగర్ చెప్పినట్టుగానె ప్రియ కోర్టులొ సెక్షన్ CrPC 156(3) క్రింద పిటీషన్ వేస్తుంది. 

ప్రియ తాలుకు లాయర్ కోర్టులొ సాగర్ చెప్పినట్టు వాధించడం వల్ల జడ్జి సానుకూలత చూపించాడు

జడ్జి : వాదనలు విన్న తరువాత ఈ కేసును సాధారణ కేసులా కాకుండా ప్రత్యేకంగా చూడాలి కాబట్టి. ఈ కేసు దర్యాప్తును అనుభవజ్ఞుడైన ఒక స్వంతంత్ర పోలీసు అధికారి ఆద్వర్యంలొ జరగాలని కోర్టు ప్రభుత్వాన్నీ అదేశించడమైనది.

కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఒక స్వంతంత్ర పోలీసు అధికారి ఆద్వర్యంలొ ఒక ప్రత్యేక బృందం ఈ కేసుకై ఏర్పాటు చెయ్యాలి. కాని దానికి హోమ్ మంత్రి సంకోచిస్తున్నాడు. 

ఈ కోర్టు ఆదేశాలు అప్పటికె వివిధ వార్తా మాద్యమాల్లొ వచ్చేసింది. దేవేంద్ర రెడ్డి అనుచరులు విజయవాడ నగర వ్యాప్తంగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

దీంతొ ప్రభుత్వంపై ఒత్తిడి రా సాగింది. దీంతొ చేసేది ఏం లేక వెంటనె ఒక స్వంతంత్ర అధికారిని నియమించి అతని అద్వర్యంలొ దర్యాప్తుని కొనసాగంచమని హోంమంత్రికి సీ.యం చెబుతాడు.

వెంటనె హోంమంత్రి పోలీసు అధికారులతొ ఒక సమావేషం ఏర్పాటు చేస్తాడు. 

హోంమంత్రి : ఈ కేసుకి ఎవరిని నియమిస్తె సరిగ్గ ఉంటుందొ చెప్పండి. దాని వల్ల ప్రజలకు ఈ దర్యాప్తు మీద నమ్మకం కూడా కలగాలి.

డీ.జీ.పి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) : సర్ ఈ కేసు చాలా సున్నితమైనది. కాబట్టి మనకి ఒక నిష్పాక్షికమైన మరియు సామర్ద్యం గల వ్యక్తి కావాలి.

హోంమంత్రి : అదె ఎవరా ఆ వ్యక్తి?

డీ.జీ.పి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) : నా అభిప్రాయం ప్రకారం సాగర్ వర్మ ఈ కేసుకు సరైన వ్యక్తి సర్

హోంమంత్రి : అతనా...? అతన్నీ మనం ట్రాన్సఫర్ చేసేశాం కదయ్యా. అతను కాకుండా వేరే ఇంకెవరు లేరా...?

డీ.జీ.పి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) : కాని సర్ ఈ కేసుకు అతనె సరైన వ్యక్తి. అతనికి వీళ్ళద్దరి గురించి బాగా తెలుసు. గతంలో వాళ్ళ మధ్య జరిగిన ఎన్నో గోడవలని ఇతనె చాలా సమర్ధవంతగా అదుపు చేశాడు. మరియు అతని ట్రాక్ రికార్డ్ (Track record) కూడా చాలా బాగూంది.

అదనపు డీ.జీ.పి (లా అండ్ ఆర్డర్) : అవును సర్ డి.జీ.పి గారు చెప్పింది కరక్టె. ఎంతొ క్లిష్టమైన ఈ కేసును సాగర్ వర్మ మాత్రమె హ్యాండల్ చేయగలడు.

ఐ.జీ (ఇంటెలిజెన్స్) : అవును సర్ పైగా దేవేంద్ర రెడ్డి కి మరియు సూర్యనారాయణకి ఇద్దరికి సాగర్ వర్మ ఆప్తుడు. అతను ఆద్వర్యంలొ ఈ దర్యాప్తు సరైన దిశలోనె వెళుతుందని నా నమ్మకం.

కమీష్నర్ (విజయవాడ నగరం) : సర్ నగరంలొ జరిగె నిరసనలు ఆగాలన్న దేవేంద్ర రెడ్డి అనుచరులు శాంతించాలన్న వాళ్ళకి నమ్మకమైన వ్యక్తి ద్వారా ఈ దర్యాప్తు జరగాలి. కాని వాళ్ళకి మన లోకల్ పోలీసులుపై నమ్మకం లేదు. కాని సాగర్ వర్మని మాత్రం వీళ్ళందరు నమ్ముతారు. ఇతని చేతికి కేసు అప్పగిస్తె నిరసనలు కూడా ఆగుతాయి.

హాంమంత్రి : మ్మ్మ్మ... సరె మీరింత చెప్తున్నారు కాబట్టి సాగర్ వర్మని డిప్యుటేషేన్ మీద విజయవాడకు రప్పించి అతనికి ఈ కేసు అప్పగించండి..

డి.జీ.పి : సరె సర్.

మీటింగు ముగిసింది. అందరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. డీ.జీ.పి తన కారు ఎక్కి కొంత దూరం వెళ్ళాక. సాగర్ కి కాల్ చేశాడు.

డీ.జి.పి : హలొ సాగర్..

సాగర్ : చెప్పండి సర్. కేసు నా చేతికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా ఆ హోము..?

డీ.జీ.పి. : ఒప్పుకోక ఏం చేస్తాడయ్యా. నాతొ పాటు ఏ.డీ.జి.పి, ఐ.జీ, కమీష్నర్ కూడా వంత పాడేసరికి ఒప్పుకోకతప్పలేదు. 

సాగర్ : హా.హా.హా.హా. ....

డీ.జి.పి : సరె రేపు నా ఆఫీసుకు రా మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం.

సాగర్ : సరె సర్.

అనుకున్నట్టు గానె సాగర్ చేతికి దేవేంద్ర రెడ్డి హత్య కేసు వచ్చింది. అతను అద్వర్యంలొ ఒక ప్రత్యేక బృందాన్నీ (SIT) తయ్యారు చెసారు. అందులొ సాగర్ కాకుండా ఒక ఏ.సీ.పి, ఒక సి.ఐ, ఇద్దరు ఎస్.ఐ లు మొత్తం ఐదుగురు పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. 

హాంమంత్రి,  డి.జీ.పి మరియు సాగర్ కలిసి విలేఖరుల సమావేశం నిర్విహించారు. దేవేంద్ర కేసును సాగర్ కి అప్పింగించిన విషయం చెప్పారు. తరువాత మీడియా ముఖంగా నిరసనలు ఆపమని కోరారు. 

అది విన్న దేవేంద్ర రెడ్డి అనుచరులు మరియు అతని అభిమానులు కేసు సాగర్ చేతికి వెళ్ళింది అని తెలిసి అతని మీద నమ్మకంతొ నిరసనలు ఆపేస్తారు. దాంతొ నగరంలొ లా అండ్ ఆర్డర్ అదుపులోకి వస్తుంది.

కాని ఈ వార్త తన ఇంట్లొ కూర్చొని టీ.వి లొ చూస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి లేచి సూర్యనారాయణ ఫొటోను తీసుకొని ఎదురుగా గొడపై ఉన్న బోర్డు కి గుచ్చి ఆ ఫొటో మీద ఎరుపు రంగు మార్కర్ తొ × మర్కు కొడతాడు. 

తరువాత తన జేబు నుంచి ఒక సిగిరెట్ తీసి వెలిగించుకొని ఆ సిగిరెట్ పొగను సూర్యనారాయణ ఫొటో మీద ఊదుతూ గట్టిగా నవ్వుతాడు....