Yevaru..? - 6 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 6

Featured Books
Categories
Share

ఎవరు....? - 6

Part - 6

ఎస్.ఐ సుందర్ వాట్సాప్ లొ పంపించిన రెండు వీడియోలని సాగర్ వర్మ మరియు ఏ.సీ.పి అజయ్ ఫారెన్సిక్ లాబరేటరి బయట కార్ పార్కింగులొ తమ కార్ వద్ద నించొని చూస్తున్నారు.

మొదటి వీడియొలొ ఒక వ్యక్తి రాత్రి పూట బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని సూర్యనారాయణ ఇంటి ముందు రొడ్డిపై కొన్నీ నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు.

రెండో వీడియోలొ దేవేంద్ర రెడ్డి ఇంటి ముందున్న రోడ్డు మీద నుంచి ఒక వ్యక్తి బైక మీద వెళ్ళాడు.

ఏ.సీ.పి అజయ్: ఈ రెండు వీడియొలలొ అంతగా ఏముంది సర్?

సాగర్ వర్మ : ఇంకోసారి సరిగ్గ చూడండి. మీకె తెలుస్తుంది.

అని చూడమని చెప్పి అజయ్ కి తన మొబైల్ ఇస్తాడు. తరువాత తన జేబు నుంచి ఒక సిగిరెట్ తీసి నోట్లొ పెట్టుకొని వెలిగిస్తాడు.

ఏ.సీ.పి అజయ్: ఈ రెండు వీడియోలలొ కనిపించిన వ్యక్తుల బైక నంబర్లు ఒక్కటె.. అంటె ఇద్దరు..?

సాగర్ వర్మ : ఒక్కరె... (సిగిరెట్ పోగ బయటికి ఊదుతూ)

ఏ.సీ.పి అజయ్ : అర్జెంటుగా ముందు ఈ బైక్ ఎవిరిదొ కనుక్కోవాలి..

సాగర్ వర్మ : అవసరం లేదు అతను ఎవరొ నాకు తెలుసు...

ఏ.సీ.పి అజయ్ : తెలుసా...? ఎవరు సర్?

సాగర్ వర్మ : చెబుతా.. దానికంటె ముందు నేను ఒక మొబైల్ నంబర్ ఇస్తా. ఆ నంబర్ తాలుకు 4 నెలల కాల్ డేటా మొత్తం నాకు కావాలి. అలాగె ఆ నంబర్ ఉన్న మొబల్ ఫోన్ IMEI నంబర్ కూడా ఇస్తా. దాని బట్టి ఆ మొబల్ గత 4 నెలలగా ఎక్కడెక్కడ తిరిగింది ట్రేస్ చేసి కనుక్కోండి.

ఏ.సీ.పి అజయ్ : సరె సర్

సాగర్ వర్మ : అంతె కాదు ఈ నంబర్ ఉన్న సెల్ టవర్ రేంజలొ ఎక్కువగా వేరే ఏ నంబర్ దగ్గరగా ఉందొ కూడా కనుక్కోండి...

ఏ.సీ.పి అజయ్ : సరె సర్...

సాగర్ వర్మ చెప్పినట్టు ఏ.సీ.పి అజయ్ అ నంబర్ యొక్క 4 నెలల కాల్  డాటాను సంపాదించాడు మరియు 4 నెలల మొబైల్ లోకేషన్సు కూడా ట్రేస్ చేశాడు. 

అంతె కాకుండా ఆ నంబర్ ఉన్న సెల్ టవర్ లొకేషన్స దగ్గర్లొ ఎక్కువగా ఏ నంబర్ ఉందొ కూడా కనుక్కున్నారు. ఆ రెండొ నంబర్ తాలుకు కాల్ డేటాను కూడా సంపాదించారు.

ఎస్.ఐ సుందర్ : సర్ ఇదగోండి మీరు అడిగిన వివరాలు. 

అని ఏ.సీ.పి అజయ్ కి ఇచ్చాడు.

ఏ.సీ.పి అజయ్ : గుడ్... ఈ రెండు నంబర్ల కాల్ డేటాల్లొ ఎక్కువుగా ఏ నంబర్ బాగా రిపీట్ అయ్యింది..? ముఖ్యంగా దేవేంద్ర గారు చనిపోయె నెల లేదా 2 నెలల ముందు.

ఎస్.ఐ జాన్ బాబు : ఇదిగొ ఈ మూడు నంబర్లు సర్.. కాని వీటిలొ రెండు నంబర్లు మట్టుకు దేవేంద్ర గారు చనిపోయిన దగ్గర నుంచి యాక్టీవ్ గా లేవు సర్.

ఏ.సీ.పి అజయ్ : మరి ఆ మిగిలిన ఒక్క నంబర్ తాలుకు వివరాలు ట్రేస్ చేశారా..?

ఎస్.ఐ సుందర్ : చేశాం సర్ కాని అవ్వన్నీ ఫేక్. వాడు ఆ మొబైల్ నంబర్ ని తప్పుడు పత్రాల ద్వారా సంపాదించాడు. 

ఏ.సీ.పి అజయ్ : మరి మొబల్ లోకేషన్స్..?

ఎస్.ఐ జాన్ బాబు : ఇదిగోండి సాగర్ సర్ ఇచ్చిన మొబైల్ తాలుకు లోకేషన్స్ మరియు డిటైల్సుతొ పాటు ఇప్పుడు ఈ యాక్టీవ్ గా ఉన్న మొబైల్ లోకేషన్సది కూడా సంపాదించాం సర్.

ఏ.సీ.పి అజయ్ : గుడ్ ..... 

ఎస్.ఐ సుందర్ : సాగర్ సర్ ఏరి సర్...?

ఏ.సీ.పి అజయ్ : ముఖ్యమైన కాల్ ఒకటి వచ్చింది మాట్లాడడానికి బయటికి వెళ్ళారు.

ఎస్.ఐ సుందర్ : బయటికి వెళ్ళి మాట్లాడవలసినంత ముఖ్యమైన కాల్ ఏంటి సర్..? మనం వినకూడదనా..?

సాగర్ వర్మ : కాదు సిగిరెట్ కాల్చుకుందామని ....(నవ్వుతూ..)

ఎస్.ఐ సుందర్ : సారీ సర్... మీరు రావడం నేను గమనించలేదు.

సాగర్ వర్మ : హ్.. హ్ ... పర్లేదులె...

ఏ.సీ.పి అజయ్ : ఇంతకి ఎవరు సర్ కాల్ లొ..?

సాగర్ వర్మ : డాక్టర్ రవీంద్ర...

ఏ.సీ.పి అజయ్ : ఏమైంది సర్ వాళ్ళ నాన్నగారు కలవడానికి ఒప్పుకున్నారా...?

సాగర్ వర్మ : ఒప్పుకున్నారు. కాకపోతె దేవేంద్ర గారి పోస్టమార్టమ్ రిపోర్టు క్షుణ్ణంగా చదివాలి కాబట్టి ఇంకొక్క రోజు గడువు అడిగారు.. 

ఏ.సీ.పి అజయ్ : అదీ మనకి మంచిదె సర్ ఈ లోపు మనం ఆ వీడియొలొ చూసిన వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు..

సాగర్ వర్మ : ఇంతకి ఎంతవరకు వచ్చింది..

ఏ.సీ.పి అజయ్ : వీ. అర్ . ఆల్మోష్ట్ దేర్ సర్. ఇవిగోండి... 

అంటూ టేబుల్ పై కాల్ డేట్ వివరాలు మరియు లోకేషన్స్ వివరాలు తాలుకు కాగితాలు ఉంచారు.

ఏ.సీ.పి అజయ్ : ఎక్కువగా ఈ మూడు నంబర్ల నుంచె మీరు చెప్పిన నంబర్ కి కాల్సు వెళ్ళాయి సర్. వీటులొ రెండు నంబర్లు డెడ్. కాని ఒకటి మాత్రం ఇంకా యాక్టీవ్ గా ఉంది. ఆ ఒక్క నంబర్ ఉన్న లోకేషన్ కూడా ట్రేస్ చేశాం. 

సాగర్ వర్మ : ఎక్కడ...?

ఏ.సీ.పి అజయ్ : ముందు గన్నవరం పాత హైవె లాడ్జులు దగ్గర చూపించింది సర్. ఇప్పుడేమొ ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ అవుట్ స్కర్ట్స్ దగ్గర చూపిస్తుంది. 

సాగర్ వర్మ : మొన్న మనం సీ.ఐ ప్రవీణ్ తొ మాట్లాడినప్పుడు తను ఇబ్రహీంపట్నంలొ ఉన్నారని అని చెప్పారు కదా...

ఏ.సీ.పి అజయ్ : అవును సర్..

సాగర్ వర్మ : ఇప్పుడు ఎక్కడున్నారు అతను..?

ఏ.సీ.పి అజయ్ : ఆ రోజు రాత్రికె అతను విజయవాడకు వచ్చేశాడు సర్. తరువాత మరుసటి రోజు అంటె నిన్న ఏదొ ముఖ్యమైన సమాచారం కోసం అని గుంటూరు వెళుతున్నా అని అన్నాడు..

సాగర్ వర్మ : ఇప్పుడు ఎక్కడ ఉన్నారొ కాల్ చేసి కనుక్కోండి. 

ఏ.సీ.పి అజయ్ : అలాగె సర్

ఏ.సీ.పి అజయ్ చాలా సార్లు కాల్ చేస్తాడు కాని ఎంతకి సీ.ఐ ప్రవీణ్ ఫోన్ కలవదు.

ఏ.సీ.పి అజయ్ : ఎన్ని సార్లు ప్రయత్నించిన తన ఫోన్ కలవడం లేదు సర్. 

సాగర్ వర్మ : మళ్ళి ఇంకోసారి ప్రయత్నించండి

అజయ్ మళ్ళి కాల్ చేసె లోపల సీ.ఐ ప్రవీణె తనకి తిరిగి కాల్ చేస్తాడు.

ఏ.సీ.పి అజయ్ : తనె కాల్ చేస్తున్నాడు.. హలొ ప్రవీణ్ ఎక్కడున్నావు..?

సీ.ఐ ప్రవీణ్ : హాస్పెటల్లొ ఉన్నా సర్. 

అంటూ బాధతొ చెప్తాడు.

ఏ.సి.పి అజయ్ : హాస్పెటల్లోనా...? ఏమైంది..?

అని సాగర్ వైపు చూస్తూ అంటాడు.

సాగర్ వర్మ : హాస్పెటల్ ఏంటి? లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి.

సీ.ఐ ప్రవీణ్ : సర్ నిన్న రాత్రి బైక్ మీద గుంటూరు నుంచి వస్తుంటె తాడపల్లి చెక్ పోస్ట్ దగ్గర పాస్ పోసుకుందామని ప్రక్కకు ఆపాను సర్. పని అయ్యాక బైకు ఎక్కుతుంటె ఒకడు వెనుకనుంచి కత్తితొ నాపై దాడి చెయ్యాలని చూశాడు. నాకు వాడు బైక్ సైడ్ మిర్రర్ లొ కనిపించగానె తప్పించుకున్న. కాని..

ఏ.సీ.పి అజయ్ : ఆ... కాని.

సీ.ఐ ప్రవీణ్ : కాని వాడి కత్తి నా చేతికి గుచ్చుకుంది. తరువాత వాడు పారిపోబోతుంటె నేను వాడిని వెనుకనుంచి పట్టుకున్నా. వాడు నన్ను వదిలించుకోడానికి తన చెతికి దొరికిన రాయితొ నా తలపై రెండు మూడు సార్లు కొట్టాడు గాని నేను వాడిని వదల్లేదు. ఈ లోపు అక్కడ గస్తి కాస్తున్న కొంత మంది పోలీసులు వచ్చి చూసి వాడిని పట్టుకున్నారు. తరువాత నాకు తలకి తగిలిన దెబ్బ వల్ల నేను స్పృహ కోల్పోయా. ఆ తరువాత ఇదిగొ ఇప్పుడు స్పృహ వచ్చింది.

ఏ.సీ.పి అజయ్ : ఠేంక్ గాడ్.. నీకు ఇప్పడు ఏ ప్రమాదం లేదు కదా.

సీ.ఐ ప్రవీణ్ : లేదు సర్.

ఏ.సీ.పి అజయ్ : ఇప్పుడు ఎక్కడున్నావు. ? ఏ హాస్పెటల్?

సీ.ఐ.ప్రవీణ్ : ప్రభుత్వ హాస్పెటల్లొ అదె జీ.జీ. హెచ్ (Government General Hospital), విజయవాడ సర్.

సాగర్ వర్మ : ఆ దాడి చేసిన వ్యక్తిని ఏం చేశారు. ?

సీ.ఐ.ప్రవీణ్ : తాడెపల్లి పోలీస్ స్టేషన్ లొ ఉంచారు సర్.

సాగర్ వర్మ : మేం వస్తున్నాం అక్కడికి....

సాగర్ వర్మ మరియు మిగిలిన వారు అంతా కలిసి హాస్పెటల్ కి చేరుకుంటారు.

సాగర్ వర్మ : ఎలా ఉంది మీకు ఇప్పుడు?. 

సీ.ఐ. ప్రవీణ్ : పరవాలేదు సర్ ప్రస్తుతానికి. డాక్టర్ ఇంకొ 4 రోజులు ఉండాలి అన్నారు.

సాగర్ వర్మ : మీ కుంటుంబం ఎక్కడ? వాళ్ళకి ఈ విషయం తెలియదా..?

సీ.ఐ ప్రవీణ్ : ఇందాక మీకు కాల్ చేసి మాట్లాడిన తరువాత వాళ్ళకి కూడా కాల్ చేశాను. ఇప్పుడు దార్లొ ఉండుంటారు వచ్చేస్తారు సర్. 

ఈ లోపు డాక్టర్ సీ.ఐ ప్రవీణ్ ఉన్న చోటికి వచ్చాడు. 

డాక్టర్ : ఇప్పుడు మీకు ఎలా ఉంది సర్ ..?

సీ.ఐ ప్రవీణ్ : పరవలేదు కాని తల దగ్గర ఇంకా నొప్పిగా ఉంది.

డాక్టర్ : సరె నేను మీకు పేయిన్ కిల్లర్స్ వ్రాస్తాను లెండి.

సాగర్ వర్మ : డాక్టర్ పెద్ద సమస్య ఏమి లేదు కదా.?

డాక్టర్ : లేదు చేతికి అయిన కత్తి గాయానికి కుట్లు వేశాం. అసలు ప్రమాదం తలకి తగిలిన గాయం. అక్కడ బాగా లోతుగా కట్ అయ్యింది. దానికి కూడా కుట్లు పడ్డాయి. అదృష్టం బాగుండి అయనకి స్కల్ ఫ్రేక్చర్ కాలేదు. ఇప్పుడు ఆయనికి ఏ సమస్య లేదు కాకపోతె ఓ 4 రోజులు అబ్జర్వేషన్ లొ ఉండాలి అంతె.

సాగర్ వర్మ : సరె డాక్టర్. 

డాక్టర్ వేళ్ళాక గది బయట ఉన్న కానిస్టేబుల్స్ కి చెప్పి కాసేపు లోపలికి ఎవ్వరిని రానియ్యకుండా ఏ.సీ.పి అజయ్ చేస్తాడు.

సాగర్ వర్మ : చెప్పండి ప్రవీణ్ మీరు గుంటూరు ఎందుకు వెళ్ళారు? అక్కడ మీరు ఏం తెలుసుకున్నారు? ఎందుకు మీ పై దాడి చేశారు?

సీ.ఐ ప్రవీణ్ జరీగింది మొత్తం చెప్తాడు. విన్నాక సాగర్ వర్మ కొంచెం సేపు ఆలోచనలొ ఉంటాడు. తరువాత లేచి..

సాగర్ వర్మ : సరె Mr. ప్రవీణ్ మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు కోలుకున్నాక వద్దురుగాని.

అని చెప్పి అక్కడ నుంచి బయటకి వచ్చేస్తారు. బయట పార్కింగ్ దగ్గర నించొని 

సాగర్ వర్మ : సుందర్ గారు మీరు జాన్ బాబు గారు కలిసి ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ అవుట్ స్కర్ట్స్ కి వెళ్ళండి ఆ లోకేషంలొ వాడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేసి తీసుకురండి.

ఎస్.ఐ సుందర్ & ఎస్.ఐ జాన్ బాబు : అలాగె సర్ 

సాగర్ వర్మ : ఇప్పుడె వెళ్ళండి..

ఆ ఇద్దరు ఎస్.ఐ లు వాళ్ళొచ్చిన జీప్ లొ బయలుదేరి వెళ్ళారు. తరువాత సాగర్ వర్మ తన సొంత కారులొ ఏ.సీ.పి అర్జున్ తొ కలిసి తాడెపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు.

ఆక్కడ సీ.ఐ ప్రవీణ్ పై దాడి చేసి జైల్లొ కూర్చున్న వ్యక్తిని చూసి సాగర్ వర్మ గుర్తుపట్టాడు. తన దగ్గరకు వెళ్ళి తనదైన శైలిలొ అడిగేసరికి మొత్తం నిజం కక్కేశాడు.

ఈలోపు ఏ.సీ.పి అజయ్ దగ్గర ఉన్న సాగర్ వర్మ ఫోన్ మ్రోగింది. చూస్తె డాక్టర్ రవీంద్ర. అజయ్ కాల్ ఎత్తాడు

ఏ.సీ.పి అజయ్ : హలొ డాక్టర్ గారు చెప్పండి. నేను ఏ.సీ.పి అజయ్ ని మాట్లాడుతున్న. సాగర్ సర్ ఇంటరాగేషన్ సెల్లొ ఉన్నారు. 

డాక్టర్ రవీంద్ర : సరె సరె మీరు ఈరోజు మా ఇంటికి రండి. మా నాన్నగారు దేవేంద్ర రెడ్డి గారి పోస్టమార్టమ్ రిపోర్ట్ మరియు మిగిలిన అన్నీ రిపోర్ట్సు మొత్తం చదివారు. మీతొ మాట్లాడాలి అంటున్నారు. 

ఏ.సీ.పి అజయ్ : సరె. నేను సాగర్ సర్ కి చెప్పి కాసేపటిలొ బయలుదేరుతాం.

అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈలోపు సాగర్ వర్మ సెల్ నుంచి బయటికి వచ్చి

సాగర్ వర్మ : ఎవరు అజయ్. ?

ఏ.సీ.పి అజయ్ : డాక్టర్ రవీంద్ర సర్ రమ్మంటున్నారు ఆయన ఇంటికి. 

సాగర్ వర్మ : అయితె పదండి...

ఏ.సీ.పి అజయ్ : ఇంతకి దాడి చెయ్యమన్నది ఎవరొ చెప్పాడా సర్

సాగర్ వర్మ : చెప్పాడు మనం అనుకున్న వ్యక్తె..

ఇద్దరు కలిసి ఓ 2 గంటల్లొ డాక్టర్ రవీంద్ర ఇంటికి చేరుకుంటారు. 

డాక్టర్ రవీంద్ర : రండి రండి మా నాన్న గారు మీ కోసమె ఆయన గదిలొ ఎదురు చూస్తున్నారు. 

ముగ్గురు కలిసి డాక్టర్ గోపాల్ ఉన్న గదికి వెళ్ళారు. 

సాగర్ వర్మ : నమస్తె డా. గోపాల్ గారు ఎలా ఉన్నారు. ? గుర్తుపట్టారా నన్ను.?

డా.గోపల్ : ఎలా మర్చిపోతాను సాగర్ గారు. బాగున్నారా?

డా.రవీంద్ర : మీరిద్దరికి ఇదివరకె పరిచయం ఉందా.?

సాగర్ వర్మ : ఉంది. సూర్యనారాయణ గారి భార్య శాంతి గారికి 8 ఏళ్ళ క్రితం ఏన్జియొగ్రామ్ మరియు ఏన్జియొప్లాస్టి చేశారు. అంతె కాకుండా ఆవిడ ఈయన వద్దకు రెగ్యులర్ గా చెకప్ కి వచ్చేవారు కూడా. 

డా.గోపాల్ : సూర్యనారాయణ గారి పరిచయం కారణంగా సాగర్ కూడా పరిచయం అయ్యారు.

డా.రవీంద్ర : ఓ అలాగా చాలా సంతోషం అయితె. 

సాగర్ వర్మ : ఇతను అజయ్ నాతోపాటె దేవేంద్రగారి కేసు మీద పనిచేస్తున్నారు.

ఏ.సీ.పి అజయ్ : నమస్తె డాక్టర్.

డా.గోపాల్ : నమస్తె.. కూర్చోండి.

సాగర్ వర్మ : డాక్టర్ గారు నాకున్న సందేహాల గురించి రవీంద్ర గారు మీకు చెప్పే ఉంటారు. 

డా.గోపాల్ : చెప్పాడు. దాని తాలుక రిపోర్ట్సు మొత్తం క్షుణ్ణంగా చదివాను.

సాగర్ వర్మ : మీకు ఏమనిపిస్తుంది.?

డా.గోపాల్ : నా అనుభవం ప్రకారం ఇది సహజ మరణం కాదనిపిస్తుంది

ఏ.సీ.పి అజయ్ : ఎలా చెప్పగలరు? విషప్రయోగం ఏమైన జరిగుండచ్చు అంటారా?

డా.గోపాల్ : నేరుగా విషప్రయోగం అని నేను చెప్పలేను గాని శరీరంలొ ఏదొ బాహ్య ప్రేరణ (external trigger) వల్ల గుండె విద్యుత్ సంకేతాల అస్తిరత (Cardiac Electrical instability) వచ్చి ఉండచ్చు.

సాగర్ వర్మ :  విద్యుత్ సంకేతాల అస్తిరత (Electrical instability)..? అంటె?

డా.గోపాల్ : మనిషి గుండె లయబద్దంగా కొట్టుకోడానికి శరీరంలోని విద్యుత్ సంకేతాలు(electrical signals) పని చేస్తాయి. దాన్నీ కొన్నీ పదార్ధాల ద్వారా నాడీ వ్యవస్త (Nervous system) పై తీవ్రమైన ప్రభావం (Extreme stimulation) వచ్చేలా చేసి గుండె లయ (Heart rhythm) ను అస్తిరం చెయ్యొచ్చు.

డా.గోపాల్ చెప్తుంటె సాగర్ వర్మ మరియు ఏ.సీ.పీ అజయ్ చాలా వింతగా వింటున్నారు.

డా.గోపాల్ : ముఖ్యంగా కొన్నీ ప్రత్యేకంగ తయ్యారు చేసిన రసాయన పదార్ధాలు (designer compounds) లేదా కృత్రిమ ఉత్తేజకాలు (Synthetic stimulants) అనేవి సాధారణ విషపరీక్షల్లొ (Standard toxicology) అంత సులువుగా గుర్తించబడవు. 

సాగర్ వర్మ : ఇలాంటివి ఎలా తయ్యారు చేయగలరు. డాక్టర్.

డా.గోపాల్ : ఎలా తయ్యారు చేయగలరొ చెప్పలేను గాని అక్రమంగ మాధకద్రవ్యాలు తయ్యారు చేసే వాళ్ళకి ఇటువంటి వాటిపై పట్టు ఉండుచ్చు.

ఏ.సీ.పి అజయ్ : ఎలా చెప్పగలుగుతున్నారు.?

డా.గోపాల్ : చాలా ఏళ్ళ క్రితం నేను సర్వీసులొ ఉన్నప్పుడు. పూర్తిగా కాదు కాని కాస్త ఇలాంటి కేసె నా వద్దకు వచ్చింది. ఒక 19 ఏళ్ళ కుర్రాడు విచ్చలవిడితనంతొ మాధకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఎవరొ ఆ కుర్రాడికి ఒక కొత్తరకం డ్రగ్ ఇచ్చారు. అది తీసుకోవడం వల్ల ముందు అతినికి మైకం కమ్మీ తరువాత డీహైడ్రేషన్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. సకాలంలొ తీసుకురావడం వల్ల అతనికి CPR ఇచ్చి బ్రతికించగలిగాను. 

ఏ.సి.పి అజయ్ : ఇప్పిడు ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడు డాక్టర్ ?

డా.గోపాల్ : ఇదిగొ ఇలా ఫారెన్సిక్ పాథాలజీస్ట్ అయ్యి శవాలుకు పంచనామ చేసుకుంటున్నాడు (నవ్వుతూ)

అంటూ తన కొడుకు డా. రవీంద్ర అని చూపించారు. దాంతొ ఇద్దరు ఆశ్చర్యపోయి చూశారు. 

అలా ఓ 2 గంటలు పాటు వీరీ సంభాషణ జరిగాక.

సాగర్ వర్మ : సరె డా.గోపాల్ గారు మేం ఇంక వెళ్ళోస్తాం.

అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. కట్ చేస్తె 2 రోజులు తరువాత సాగర్ వర్మ మరియు మిగిలిన వాళ్ళంతా కలిసి పోలీసు వాహనాల్లొ బయలుదేరి కాసేపటి తరువాత ఒక ఇంటి ముందు ఆగారు. ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. ఎదురుగ్గా దేవేంద్ర రెడ్డి భార్య ప్రియ వీళ్ళందరిని చూసి షాక్ అయ్యి లేచి నిలబడింది. 

సాగర్ వర్మ వెనకాల ఇద్దరు కానిస్టేబుల్సు సీ.ఐ ప్రవీణ్ పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరొ కాదు నెలన్నర క్రితం వాళ్ళ వద్ద పనిలొ చేరిన 23 ఏళ్ళ కుర్రాడు గణేష్....

ప్రియ : ఏమైంది సాగర్? గణేష్ ని ఎందుకు పట్టుకున్నారు.?

సాగర్ వర్మ : అది చెప్పాల్సింది నేను కాదు. మీ అబ్బాయి అరవింద్ రెడ్డి. 

అని అరవింద్ వైపు చూపించి అంటాడు. దానికి అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ప్రియ కూడా తన కొడుకునె చూస్తుంది.

సాగర్ వర్మ : ఎందుకంటె దేవేంద్ర రెడ్డి గారి మరణం వెనుక ఉన్నది తనె..

ఆ మాట వినగానె ప్రియ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది...