The mind behind the machine - 1 in Telugu Love Stories by swathi books and stories PDF | యంత్రం వెనుక మనసు - 1

The Author
Featured Books
Categories
Share

యంత్రం వెనుక మనసు - 1

పీఠిక :

టెక్నాలజీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మనం తినే ఆహారం నుండి, పడుకునే పడక వరకు అంతా యంత్రమయం. కానీ, మనిషికి మాత్రమే ఉండే 'మనసు', ఆ యంత్రానికి కూడా ఉంటే? ప్రోగ్రామింగ్‌తో నడిచే రోబో, ప్రేమని కూడా ప్రోగ్రామ్ చేసుకోగలదా? ఆధునిక యుగంలో ఒక యువతికి, ఒక రోబోకి మధ్య చిగురించిన వింతైన, సున్నితమైన ప్రేమకథే ఈ 'యంత్రం వెనుక మనసు'.

యంత్రం వెనుక మనసు:

అధ్యాయం 1: మారుతున్న కాలం.. మారని మనసు

సంవత్సరం 2050. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఒక అద్భుత లోకంలా ఉంది. పాతబడ్డ రోడ్ల మీద ఇప్పుడు ఎగిరే వాహనాలు (Drone Taxis) రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. నగరం నిండా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గాజు భవనాలు.. సాయంత్రం అయితే చాలు, ఆ భవనాల మీద వెలిగే లేజర్ లైట్లు నగరాన్ని ఒక రంగుల కలలా మారుస్తున్నాయి.

అప్పట్లో మనుషులు పనుల కోసం ఉరుకులు పరుగులు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గింది. ఎందుకంటే, ప్రతి మనిషికి తోడుగా ఒక 'రోబో' ఉంది. ఆఫీసుల్లో ఫైళ్లు సర్దడం దగ్గరనుండి, ఇంట్లో వంట చేయడం వరకు అన్నీ అవే చూసుకుంటున్నాయి. రోబోలు మనుషుల జీవితంలో కేవలం యంత్రాల్లా కాకుండా, కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాయి

అలాంటి ఒక ఆధునిక అపార్ట్‌మెంట్‌లో మన కథానాయిక లీన ఉంటోంది. పేరుకు తగ్గట్టే ఆకాశమంత స్వచ్ఛమైన మనసు ఆమెది. చూస్తేనే మతిపోగొట్టే అందం, వర్ణించడానికి మాటలు చాలని అద్భుతమైన శరీరాకృతి ఆమె సొంతం. కేవలం అందమే కాదు, పద్ధతిలోనూ, పనుల్లోనూ లీన శైలే వేరు.

ఆమెకు ఒక అన్నయ్య.. పేరు ఆర్య. వాళ్ల నాన్న రాజు, రోబోలను తయారు చేసే ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఎప్పుడూ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఇంట్లో గడపడానికి ఆయనకు తీరిక ఉండేది కాదు. తన భార్య సుస్మిత (హౌస్ వైఫ్) పడుతున్న కష్టం చూసి, ఇంటి పనుల్లో సాయంగా ఒక రోబోను తీసుకొస్తానని రాజు ఎప్పుడూ అంటూ ఉండేవాడు.

కానీ, సుస్మితకు ఆ రోబోలంటే అస్సలు పడదు. "నాకు ఆ ఇనుప ముక్కలు వద్దు.. అవి మనుషుల్లా మంచివి కావు" అంటూ గొడవపడేది. ఆర్య, లీన ఎంత బతిమిలాడినా ఆమె అస్సలు ఒప్పుకోలేదు సరికదా, వాళ్ల నోరు మూయించేది.

అలాంటి ఒక రోజు.. సుస్మితకు చెప్పకుండానే రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆమె నిరాకరణను పక్కన పెట్టి, ఒక అత్యాధునిక రోబోను ఇంటికి తీసుకువచ్చాడు.

సుస్మిత ఆ పెద్ద బాక్సుని చూడగానే అనుమానంగా అడిగింది, "ఏమిటండి ఇది? ఇంత పెద్దగా ఉంది?"

రాజు గారు అది రోబో అని చెప్పలేక, చేతులు నలుపుకుంటూ తడబడుతూ నిలబడ్డారు. సరిగ్గా అదే సమయానికి ఆర్య లోపలికి వచ్చాడు. అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. తండ్రిని కాపాడటానికి, "అమ్మ! నేనే అడిగాను.. నాకు ఒక రోబో కావాలని నాన్నని తీసుకురమ్మన్నాను" అని చెప్పాడు. ఆ మాట వినగానే సుస్మిత కళ్లలో అగ్నిగుండం కనిపించింది.

అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన నీలా, "ఏమైంది? అందరూ ఇలా ఉన్నారు?" అని అడిగింది. తండ్రి కంటిసైగతో ఆ బాక్సుని చూపించాడు. నీలాకి విషయం అర్థమైంది. రాజు నెమ్మదిగా సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు, "ఆఫీసులో అందరూ నవ్వుతున్నారు సుస్మిత.. రోబోలు తయారు చేసే నీ ఇంట్లోనే రోబో లేకపోతే ఎలా అని అడుగుతున్నారు.మీ పని మీద మీ ఇంట్లో నమ్మకం లేదా అని నవ్వుతున్నారు అందుకే తెచ్చాను" అన్నాడు రాజు .కానీ సుస్మిత ఆయనను లోపలి గదిలోకి తీసుకెళ్లి గట్టిగా అడిగింది, "ఏమి మాట్లాడుతున్నారు మీరు? అసలు బుద్ధి ఉందా? వాళ్ళు ఏదో అన్నారు అని మీరు చెప్ప పెట్టకుండా నాకు చెప్పకుండా తీసుకొని వచ్చేస్తారా అని అన్నది సుస్మిత  అయిన నీకు రోబోలు అంటే ఎందుకు ఇష్ఠం ఉండదు అనీ గట్టిగా అడిగేసరికీ ఇంట్లో ఆడ పిల్ల ఇంట్లో ఉంది.అలాంటిది ఇప్పుడు ఈ రోబోలు మనకెందుకు?" అని తన ఆందోళన బయటపెట్టింది.

తలుపు పక్కన చెవి పెట్టి వింటున్న ఆర్య, నీలా, రాజు ఒక్కసారిగా పకపక నవ్వారు. "ఎంత పిచ్చిదానివి సుస్మిత! ఇందుకేనా నువ్వు వద్దు అన్నది?  ఇవి రోబోలు  మనుషుల్లగా వీళ్లకు  ఫీలింగ్స్ ఉండవు. ఇంట్లో మనిషిలాగే ఉంటుంది. కానీ ఇవి రోబోలు  అంతే అని  సర్దిచెప్పాడు రాజు 

అమ్మ నువ్వు అనుకున్నట్టు ఏమి ఉండదు నాన్న అని చూసి తీసుకొని వచ్చారు. అయిన సుస్మిత నువ్వేమి బయపడకు ఇది నేను నా  కోలిగ్ సహాయం తో తయారు చేశాము. నువ్వు ముందు వచ్చి చూడు నెల రోజులు చూడు నీకు నచ్చకపోతే

నా కోలిగ్ కి ఇచ్చేస్తాను అనేసరికి సుస్మిత ప్రశాంతం గా ఊపిరి పీల్చుకొని నెల కదా ఎంత సేపు కళ్ళుమూసి తెరిచేలోపు అయిపోతుంది అని అనుకుంది సుస్మిత .హలో కి అందరూ వెళ్ళిపోయారు.

చివరికి బాక్స్ ఓపెన్ చేసే సమయం వచ్చింది. "నేను ఓపెన్ చేస్తాను!" అని ఆర్య, "లేదు నేనే!" అని నీలా ఇద్దరూ గొడవ పడ్డారు. కానీ రాజు నవ్వుతూ, "నా చిట్టి తల్లి చేతులతోనే రిమోట్ స్విచ్ నొక్కుతుంది" అని నీలాకి రిమోట్ ఇచ్చాడు. ఆర్య చిన్నగా అలిగి, చూడు అమ్మ నాన్న ఎప్పుడూ చెల్లి అంటేనే ఇష్టం అని అన్నాడు నువ్వేమి బాధపడకు రా నాన్న నువ్వుకూడా రోబో లకు సహాయం చేయడం లో నాన్నకు హెల్ప్ చేస్తున్నావు కదా అప్పుడు నువ్వే రిమోట్ స్విచ్ నొక్కుకోవచ్చు అని అన్నది సుస్మిత అందరూ సుస్మిత మాటలకు నవ్వుకున్నారు.