నీలా ! నువ్వు ఏది అడిగినా అమ్మ ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తుంది కదా, నేనేమైనా అన్నానా చెప్పు? మరి ఇప్పుడు నాన్న నాకు సపోర్ట్ చేస్తే నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావు?" అని నీలా తన అన్న ఆర్య నీ ఆటపట్టించింది.
రాజు నవ్వుతూ, "సరే సరే ఇంకా చాలు.. ఇప్పటికే మీ అల్లరి ఎక్కువైంది. నీలా! ఇప్పటికైనా ఆ రిమోట్లో బటన్ నొక్కు" అన్నాడు. నీలా బటన్ నొక్కగానే.. కొంచెం 'కిర్' అనే శబ్దం వచ్చి ఆగింది. రాజు వెంటనే "ఆ బ్లూ కలర్ బటన్ కూడా ప్రెస్ చేయి" అని చెప్పగానే నీలా అది నొక్కింది. వెంటనే ఆ బాక్స్ లో నుండి ఒక రోబో బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే నీలా అలా ఉండిపోయింది. ఆరడుగుల ఎత్తు, ఆపిల్ పండు లాంటి ఛాయ, నీలం రంగు కళ్లతో అతను అచ్చం మనిషిలాగే ఉన్నాడు. మనీషా ఇంతకి రోబో నా ? అనుకుంటూ ఉండిపోయింది. రాజు, ఆర్య కలిసి అతనికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా.. నీలా రోబో ను చూస్తూ, పరధ్యానంలో "అయాన్.." అని మెల్లగా అన్నది. ఆ పేరు అందరికీ నచ్చింది. "వెల్కమ్ హోమ్ అయాన్!" అన్నాడు రాజు. అయాన్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూడగానే నీలా మైమరచిపోయింది.
రాజు అయాన్‌ను పిలిచి, "అయాన్.. ఈమె నా భార్య సుస్మిత" అని పరిచయం చేశాడు. వెంటనే అయాన్, "నమస్కారం అండి సుస్మిత గారు" అని వినయంగా అన్నాడు. సుస్మిత ఆశ్చర్యంగా తన భర్త వైపు చూసింది. రాజు తన కాలర్ ఎగరేసుకుంటూ, "చూశావా! నీ భర్త ఎంత టాలెంటెడో!" అన్నాడు. అప్పుడు ఆర్య అయాన్ దగ్గర కు వచ్చి పరిచయం చేసుకున్నాడు అయాన్ తిను మా చెల్లి నీలా అని పరిచయం చేస్తూ నీలా షేకాండ్ ఇవ్వబోతు ఉంటే సుస్మిత మద్యలో వచ్చి తన చెయ్యి ఇచ్చింది అక్కడ నీలా , రాజు కొంచం ఇబ్బంది గా ఫీల్ అయి లోపలికి వెళ్ళిపోయారు.
అప్పుడు ఆర్య, "అయాన్ రా.. మా గదిలోకి వెళ్దాం" అంటూ తన గదిలోకి తీసుకువెళ్ళాడు. తీరా లోపలికి వెళ్ళాక ఆ గది అంతా చాలా చిందరవందరగా ఉండటం చూసి ఆర్య కొంచెం ఇబ్బంది పడ్డాడు. "అయాన్.. కొంచెం అడ్జస్ట్ చేసుకో, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆర్య ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అయాన్ గదిని మొత్తం అద్భుతంగా సర్దేశాడు. ఇప్పుడు ఆ గది చూడటానికి అద్దంలా మెరిసిపోతోంది. అప్పుడే గది శుభ్రం చేద్దామని లోపలికి వచ్చిన సుస్మిత, గది అంతా నీట్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. "ఏరా! నువ్వేనా ఇంతలా శుభ్రం చేసింది? కనీసం తడి టవల్ కూడా తీయమంటే తీయవు.. ఇప్పుడు ఇంత పద్ధతిగా ఎలా సర్దావు?" అని అడిగింది.
అప్పుడే లోపలికి వచ్చిన నీలా, "వీడా? వీడికి అంత సీన్ లేదు.. వీడికి అంత శుభ్రం ఎక్కడిది?" అని ఆటపట్టించింది. దానికి ఆర్య కోపంగా, "అవును మరి.. తమరు ఇల్లు శుభ్రం చేయమంటే చేయవు కనీసం మంచి నీళ్లు కూడా తీసుకురారు, మేము తెచ్చుకున్నవి కూడా నువ్వే తాగేస్తావు.. మళ్ళీ మాటలు చూడు అమ్మ!" అంటూ ఇద్దరూ కాసేపు వాదులాడుకున్నారు.
సుస్మిత వారిని ఆపి, "ఇంకా ఆపండి మీ గోల.. అసలు ఇదంతా నువ్వే చేశావా ఆర్య?" అని మళ్ళీ అడిగింది. "లేదు అమ్మ.. ఇదంతా అయాన్ చేశాడు" అన్నాడు ఆర్య. "ఏమిటి! ఈ రోబో ఇవన్నీ కూడా చేస్తాడా?" అని సుస్మిత ఆశ్చర్యపోయింది. కానీ మరుక్షణమే ఆమె మనసులో ఒక భయం మొదలైంది. "అమ్మో! వీడు ఇలా అన్ని పనులు చేసుకుంటూ పోతే నా పిల్లలకు నాతో పనేముంటుంది? నన్ను మర్చిపోతారేమో.. నన్ను అసలు పట్టించుకోరేమో!" అని తనలో తానే ఆందోళన చెందింది.
రాత్రి అయింది. డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సందడిగా ఉంది. సుస్మిత అందరికీ వడ్డిస్తోంది. ఆ కంగారులో తను అయాన్‌ను రోబో అని మర్చిపోయి, అతని ముందు కూడా భోజనం ప్లేట్ పెట్టింది. అది చూసి రాజు, ఆర్య, నీలా ఒక్కసారిగా నవ్వేశారు. "అమ్మ! తను రోబో.. తను అన్నం ఎలా తింటాడు?" అని ఆర్య నవ్వుతూ ఆటపట్టించాడు. సుస్మిత తన తప్పు తెలుసుకుని సిగ్గుపడినా, అయాన్ మాత్రం ఏమీ తెలియనట్టు వినయంగా నిలబడి బోజనాలు వడ్డించడం లో సహాయం చేశాడు
భోజనాలు ముగిశాయి. అందరూ తమ తమ గదులకు వెళ్లిపోయారు. సుస్మిత హాల్లో టేబుల్ శుభ్రం చేసి, ఆపై కిచెన్ లోకి వెళ్ళింది. కానీ అక్కడ వెళ్ళాక ఆమె ఆశ్చర్యానికి అంతులేదు! గది అద్దంలా మెరిసిపోతోంది. ఒక్క స్పూన్ కూడా పక్కన లేదు. "నీలా ఇంత ఫాస్ట్ గా శుభ్రం చేసిందా?" అని అనుకుంటూ వెనక్కి తిరగగానే ఉలిక్కిపడింది.
ఎదురుగా అయాన్ నిలబడి ఉన్నాడు. "సుస్మిత గారు, పనులన్నీ పూర్తి అయ్యాయి. మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి" అని మృదువుగా చెప్పి ఆర్య రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
సుస్మిత పక్క మీద వాలినా నిద్ర పట్టడం లేదు. మనసులో ఒకటే అలజడి. "మనిషా? రోబోనా? పనులు చూస్తే రోబోలా ఉన్నాడు, కానీ రూపం మనిషిలా ఉంది. ప్రతిరోజు ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ పడుకునే ఉండేది కానీ ఈ రోజు నాకు ఎటువంటి ఒళ్ళు నొప్పి లేవు సరికదా చాలా రిలీఫ్ గా ఉంది. అని అనుకున్న వెంటనే కాదు.. ఇది మంచిది కాదు. ఇది ఎంతైనా రోబో! ఇది అస్సలు మా ఇంట్లో ఉండటం మంచిది కాదు" అని ఆలోచిస్తూనే సుస్మిత నిద్రలోకి జారుకుంది.
మరోవైపు నీలా గదిలో...
నీలాకి నిద్ర రావడం లేదు. కళ్లు మూస్తే అయాన్ గుర్తు వస్తున్నాడు . నీలం రంగు కళ్లు, ఆపిల్ పండు లాంటి రంగు, ఆరడుగుల అందం చూస్తూనే మతిపోయేలా ఉంది వాడి అందం నిజం గా వీడు రాబోయేన మనీషా
ఒకవేళ మనిషి గానీ అయితే వాడి ముందు ఎంత మంది అమ్మాయి లు క్యూ కట్టేవాళ్ళు ఏమో అని
అలా ఆలోచిస్తూ కలల లోకంలోకి వెళ్లిపోయింది.
కలలో.. ఒక అందమైన రోడ్డు. చుట్టూ చెట్లు చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది. అంతలో ఎక్కడి నుంచో బస్సు వస్తుంది బస్ లో పిల్లలు ఉన్నారు అనుకోకుండా బస్ అదుపు తప్పి పక్కకు పడిపోతోంది. లోపల పిల్లల ఆర్తనాదాలు. అప్పుడే మెరుపు వేగంతో ఒక వ్యక్తి వచ్చి తన రెండు చేతులతో ఆ బస్సును ఆపాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. అయాన్! అయాన్ కూడా నీలా వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులో ఏదో గాఢమైన భావం ఉంది.
ఒక్కసారిగా నీలా ఉలిక్కిపడి లేచింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. "ఏమిటిది? కేవలం భ్రమేనా?" అని తనని తాను ప్రశ్నించుకుంది