Love in Telugu Love Stories by PRINCE PREMKUMAR books and stories PDF | ప్రేమ

Featured Books
  • نشانات

    دی اینڈ محبت میں جدائی کا مقدر ناگزیر تھا۔   وہ جہاں تک...

  • Safar e Raigah

    Safar e raigah sirf shahmeer ki nahi balke ayat ki bhi kahan...

  • The House That Insults Back - 10

    The moment of quiet introspection following Clara's conf...

  • دیکھیں

    منظر صبح سے رات ہو گئی تیری یاد کرتے ہوئے اداس گانے سن کر می...

  • . ہاں بتاؤ کون؟

    میں اپنے دل کے جذبات کے اظہار میں تاخیر کرتا ہوں۔ میں اپنی م...

Categories
Share

ప్రేమ

ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ భాష ఇతరులకు అర్థంకాదు. అలాగే దంపతుల నడుము అనుబంధం అందరికీ తెలీదు. ఆదొక ప్రత్యేకమైన భాష.

ఇరువురి మధ్య బంధాన్ని పెనవేసుకునేలా అర్థం చేసుకుంటూ అడుగువేయడమే ముఖ్యం. 

నేను నీకు తోడుగా ఉన్న భావన ఎదుటి వారిలో కలిగించాలి. 

వారేం చెబుతున్నారో శ్రద్ధగా విని, ఆ బాధను పంచుకోవడంలో స్నేహితులుగా మెలిగితే చాలు... 

అది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది.

ప్రేమలో అన్ని విషయాలు పంచుకోలేకపోవచ్చు

ప్రేమలో అన్ని విషయాలను మీతో చర్చించలేకపోవచ్చు కానీ కొన్ని మనకు మనం అర్థం చేసుకోవాలి 

ఎందుకంటే ప్రతి విషయాన్ని చొరవ తీసుకొని చెప్పడం

కొన్ని సందర్భాలలో సాధ్యం కాకపోవచ్చు

అర్థం చేసుకోవాలి... ఎదుటివారిని అర్ధం చేసుకోవడం నేర్చుకుంటే చాలు, 

బందాలమధ్య సమస్యలు చోటు చేసుకోవు.

అవతలివ్యక్తి చెప్పేది పూర్తిగా వినాలి.

వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. 

ఒక్కొక్కరి ఆలోచనధోరణి ఒక్కో రకంగా ఉంటుంది. 

అలానే భాగస్వామి మనలాగే ఆలోచించాలనే నియమం లేదు. అలా అనుకుంటే చాలు.

వారి కోణం నుంచి ఆలోచించడం మొదలుపెడతాం. అప్పుడు మీ ఆలోచన విధానం మారిపోతుంది. 

ఏదైనా సందర్భంలో కోపం వచ్చినప్పుడు పది నిమిషాలు

మెదలకుండా ఉండి, 

ఆ తర్వాత ఆలోచిస్తే కోపం మటుమాయం అవుతుంది. 

లేదంటే ఇరువురి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది.


కలిసి జీవించడమే కాదు, సంతోషాన్ని కూడా ఇరువురూ పంచుకోవాలి. 

నవ్వుతూ ఉండటంలో దొరికే శారీరక మానసిక ఆరోగ్యంపై ఇరువురూ అవగాహనతో ఉంటే చాలు, 

భాగస్వామి చేతిలో చేయి వేసి నేనున్నాననే భరోసా కల్పించాలి.

అది వారిని మీకు మరింత దగ్గర చేస్తుంది.

రోజూ ఉదయం నవ్వుతూ పలకరింపు,

దగ్గరకు తీసుకోవడం వంటివి వాతావరణాన్ని

ఆహ్లాదకరంగా మారుస్తాయి.


అప్పుడప్పుడూ వారెదురుచూడని విధంగా ఆశ్చర్యం కలిగించే చిన్న చిన్న కానుకలివ్వాలి. 

మీ ప్రవర్తనలో తప్పు అనిపిస్తే ఆలస్యం చేయకుండా క్షమాపణ కోరితే సమస్య అక్కడితో ముగిసి పోతుంది. అలస్యం చేస్తే అపార్థాలకు తావిచ్చినట్లు అవుతుంది. పొందే ప్రతి సాయానికి కృతజ్ఞతలు చెప్పడమూ అలవరుచుకోవాలి.


ప్రశంసలు... భాగస్వామి ఏదైనా పని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ప్రశంసించాలి. 

మన మనిషే కదా... పొగడటం ఎందుకులే అనుకోకూడదు.

మీరిచ్చే ఆ చిన్న ప్రోత్సాహం, ఆ చిన్న ప్రశంస వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.

చిన్నదైనా పెద్దవైనా పనిని పంచుకోవడంలో ఇరువురికీ దక్కే సంతోషం ప్రత్యేకమవుతుంది.

గతంలోకి.... అప్పుడప్పుడు గతంలోకి తొంగి చూడాలి. అప్పటి మధుర జ్ఞాపకాలను ఇరువురూ

నెమరు వేసుకోవడంలో మనసులు ఆనందంతో నిండుతాయి. 


మీ హోదా మీ స్థాయి ఎప్పుడూ కూడా మీ భాగస్వామి ముందు ప్రదర్శించకూడదు 

తనకి నేనున్నాను అనే భరోసా...

నీకోసమే నా జీవితం అనే నమ్మకం ఈ రెండు అందిస్తే

నే

ఆ బంధం కలకాలం సంతోషంగా నిలుస్తుంది







ఈ టైటిల్ చదివాక.....ఇప్పుడు మాకు ప్రేమలు అలాంటివి ఏముంటాయి 

అంతగా అవసరం లేదు అని అనుకోకండి 

ప్రేమ  అనగానే ఏదేదో ఊహించుకోకండి

కొన్నిసార్లు మనం బాగా నమ్మేసిన వాళ్ళు కూడా

మనల్ని మోసం చేస్తారు.. చేస్తున్నారు కూడా

అందులోనూ ఈ మధ్యకాలంలో అలాంటి నమ్మకద్రోహాలు చాలా పెరిగాయి

అలా విఫలం అయ్యాక మన భావోద్వేగం, నిరాశ, దుఃఖం ఇవే ఉంటాయి

ఆలోచన రాదు అడుగు ముందుకు పడదు

కానీ...

ఇది ఒకవైపు మాత్రమే

మానసిక పరిణితి ఉంటే ఆ బాధ నుంచి త్వరగా బయటపడగలం

మీ ఆలోచనను ఎంతగా అభివృద్ధి చేసుకుంటే 

ఆ బాధ నుంచి అంత తొందరగా బయటపడవచ్చు


ప్రేమలో విఫలం అయ్యాము నెక్స్ట్ ఏంటి 

మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప

చేసేది ఏమి ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించాలి ...

కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయాలి... 

సాధ్యమైనంతవరకు ఒకరినొకరు నిందించుకోకుండా ఉండడం బెటర్

ఎవరి అవసరం వాళ్లది ఎవరి ఇష్టం వాళ్ళది 

మనం అనుకున్నట్టుగానే మనుషులు ఉండాలి అనుకోవడం

ఉంటారు అనుకోవడం

అది మన అమాయకత్వం మూర్ఖత్వం


ఎందుకు అలా చేశారు అనే ఆలోచన వేస్ట్ 

దానివల్ల ఉపయోగం ఉండదు. 

మనం తెలుసుకున్న కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు

చేశారు అంతే ఇంక వదిలేయడమే బెటర్


ఒంటరిగా అస్సలు ఉండకండి

మీకిష్టమైన పని ఎక్కువగా చేయండి.. 

బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి... 

ఎక్కువగా మనుష్యులమధ్య గడపండి.

మీకెంత బాదున్నా అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి..  


మీరు మోసపోయారు అనే విషయాన్ని సాధ్యమైనంత ఎక్కువగా మరిచిపోవడానికి ప్రయత్నించండి నా ఉద్దేశం ప్రకారం అయితే ఇతరులతో పంచుకోకపోవడం బెటర్ 

ఎందుకంటే మీ పైన చిన్న చూపు కలిగే ప్రమాదం 

ఉంది


సోషల్ మీడియాలో ఏర్పడే స్నేహాలలో మోసాలు చాలా ఎక్కువే 

చాలా కొద్ది మంది మాత్రమే ఒక వ్యక్తి పైన ఒక బంధం పైన అక్కడే ఆగిపోతారు

చాలామంది అలా లేరు 

ఉండరు కూడా 

కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కొత్త సంతోషాలు ఇప్పుడు జరుగుతుంది కూడా ఇదే..

ఇది ఆలోచించి అడుగు ముందుకు వేయడం ఉత్తమం 


ఇలాగే ఉండాలి అనే హద్దులు పెట్టడం 

ఎంత మూర్ఖత్వమో ఆ హద్దుల్ని మనం ఒప్పుకోవడం కూడా అంతే మూర్ఖత్వం 

ఎవరి అభిప్రాయాలు ఎవరి ఇష్టాలు వారివి 

ఒకరి జీవితాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం


ఇప్పుడు చాలామంది...

వాళ్లు కాకపోతే ఇంకొకరు అనే భావనతోనే స్నేహం చేస్తున్నారు

అలాంటి రిలేషన్ లో ఉంటున్నారు

కాబట్టి దానికి సంబంధించి మనం మన హద్దుల్లో ఉండడం...

ఎదుటి వాళ్ళని హద్దులో పెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే హద్దులు చెరిపేసి అంత మంచి వాళ్ళే అనుకుంటే...

ఏదో ఒక రోజు బాధపడాల్సిందే మనమే


" జీవితమెప్పుడూ ఒకరివల్ల ఆగదు,, ఒకరితోనే ఆగదు - సో పరిస్థితులెలాంటివెదురై

నా బ్రతుకుపట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోవద్దు