Is a wife not a burden in Telugu Women Focused by PRINCE PREMKUMAR books and stories PDF | భార్య కాదు భారమా

Featured Books
  • अंश, कार्तिक, आर्यन - 10

    मल्होत्रा का महलमल्होत्रा का महल…घर कम, ऐलान ज़्यादा था।ऊँचे...

  • VORTX - 3

    — "ब्रह्मांड की दरार: 5वीं सदी का वो खौफनाक सफर"दृश्य 1: भवि...

  • Agent Tara - 5

    फाइनल टेस्ट पास करने के बाद तारा की भूमिका सहयोग फाउंडेशन मे...

  • लिव-इन

    लिव-इन                           कमल चोपड़ा                ...

  • सैदो में बंधी जिंदगी - एपिसोड 4

    गार्ड्स चिल्लाए। अनन्या कमरे से बाहर निकली, दिल धक्-धक्। आर्...

Categories
Share

భార్య కాదు భారమా

మంచి ఉన్నత స్థితిలో ఉండి ఒక అమ్మాయిని ప్రేమించి
పెళ్లి చేసుకొని 
ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి  కానుకలు
ఆశించకుండా అమ్మాయిని జీవితాంతం 
బాగా చూసుకుంటున్నా సరే ...
ఆ అబ్బాయి అంటే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర 
ఎప్పటికీ క్యారెక్టర్ లేని వాడే 
ఆ అమ్మాయి ఎప్పటికీ ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి
వాళ్ల పెంపకాన్ని గౌరవ మర్యాదలను నాశనం చేసిన
అమ్మాయి

అలాకాకుండా
తల్లిదండ్రులు వాళ్లకు నచ్చిన సంబంధం చూసి
లక్షలు కట్నం పోసి
ఒక క్యారెక్టర్ లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసి
వాడి చేతిలో ఆడపిల్ల జీవితం నరకం అనుభవిస్తున్న సరే
ఆ అల్లుడు ఉత్తముడు గొప్పోడు 
ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉన్నది 
ఇక ఆ అమ్మాయి జీవితం అంటారా
అది ఆ అమ్మాయి తలరాత
ఇది తల్లిదండ్రులు ఆలోచించే ఆలోచన విధానం

అబ్బాయి కట్నం తీసుకోను అని అంటే
ఆ అబ్బాయి క్యారెక్టర్ లేని వాడయిన అయి ఉండాలి
లేదంటే
ఏదైనా శారీరక లోపమైన అయి ఉండాలి 
అంతే తప్ప తమ బాధని అర్థం చేసుకున్నాడు అని మాత్రం
ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు అనుకోరు 
ఈ సమాజం అనుకోనివ్వదు

కట్నం అనే పేరుతో అప్పు చేసి మరి కూతురు పెళ్లి చేసి 
జీవితాంతం వడ్డీలు కడుతూ కష్టాలపాలు అవుతున్న
తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు
అయినా కూడా సరే ఇచ్చేవాళ్లకు తీసుకునే వాళ్లకు
ఆలోచన లేదు బుద్ధి కూడా లేదు
ఇంకా చెప్పాలి అంటే...

తీసుకునే కట్నాన్ని బట్టి అల్లుడు రేంజ్ ని డిసైడ్ చేసే
స్థాయికి మన సమాజం రోజురోజుకి ఎదుగుతుంది
ఎక్కువ కట్నం తీసుకుంటే గొప్పవాడుగా 
తక్కువ కట్నం తీసుకుంటే మామూలుగా 
అసలు కట్నమే తీసుకోకపోతే ఏదో లోపం ఉన్నవాడిగా
చూస్తుంది ఈ సమాజం

ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేసి 
కట్న కానుకలు ఇచ్చి 
సంతోషంగా ఆ ఇంటి నుంచి సాగనంపడం అనేది
ఒక మామూలు మధ్యతరగతి తండ్రి యొక్క
జీవిత సంపాదన
తన జీవితాంతం కష్టపడి సంపాదించి 
రూపాయి రూపాయి కూడబెట్టి
తను తిన్నా తినకపోయినా అప్పు చేసి మరి 
ఆడపిల్ల పెళ్లి చేస్తున్న పరిస్థితి
ఎందుకంటే...
ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే
కట్నం గురించి బాధపడి భయపడాల్సిన పరిస్థితికి
చేరుకుంది వ్యవస్థ

తమ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా
సరే అదేంటో తెలియదు కానీ
అబ్బాయిని కన్న తల్లిదండ్రులు తమ ఇంటికి వచ్చే కోడలు
కట్నం తెస్తే ఒక విధంగా చూస్తారు
కట్నం తీసుకురాకపోతే ఒక విధంగా చూస్తారు 
ఎక్కువ కట్నం తెస్తే ఒకరకంగా
అసలు కట్నం తీసుకురాకపోతే మరో విధంగా చూస్తారు
అంతేకానీ ఒక ఆడపిల్ల తండ్రిని ఎందుకు బాధ పెట్టాలని మాత్రం అనుకోరు

పోనీ అంత కట్నం తీసుకొచ్చినా కూడా ఆ అమ్మాయి సంతోషంగా ఆనందంగా ఉంటుందా అంటే అది లేదు సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే...
కట్నం తెచ్చే పనిమనిషి అన్నమాట

భార్యభర్తలు రెండు విభిన్న నేపథ్యాల నుంచి
వివాహమనే బంధంతో ఒక్కటవుతారు. 
విభిన్న ఆలోచనలు...విభిన్న మనసులు
పెళ్ల యిన కొత్తలో ఒకరిపై మరొకరికి
చాలా అంచనాలుంటాయి. 
అయితే కొన్నాళ్లకే తాము పొరపడినట్లు 
చాలామంది భావిస్తారు. 
భాగస్వామి ఇలా ఉండాలి, అలా చూసుకోవాలి.... అనుకోవడం సహజమే
అయితే అవి వాస్తవానికి దూరంగా ఉండకూడదు.
ఎందుకంటే...
ఈ మధ్యకాలంలో చాలామంది
ఫాంటసీ లైఫ్ లో ఉండడం వల్ల నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు.
వీళ్ళు ఎలా ఉన్నా సరే...
వీళ్ళకు రాబోయే జీవిత భాగస్వామి మాత్రం 
స్పెషల్ గా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు 
ఇది తప్పు కాదు 
అలా అని వాస్తవాన్ని గుర్తించకపోతే మాత్రం కష్టమే కదా...

మన రాసుకున్న లెక్కల ప్రకారం రావడానికి
మన జీవిత భాగస్వామి వస్తువు కాదు కదా
మనకు నచ్చినట్టుగా ఉండి మనకు నచ్చినట్టుగా ప్రవర్తించి
అన్ని మనకు నచ్చినట్టుగా ఉండడానికి...

వాస్తవానికి దూరంగా.. ఫాంటసీ కి దగ్గరగా
ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆలోచనల్లో బ్రతుకుతూ...ఆ బంధంలో ఉండే ఆనందాన్ని 
ఆ బంధంలో ఉండే అనురాగాన్ని చాలామంది
దూరం చేసుకుంటున్నారు.
ఇది కేవలం సంపాదన విషయంలో మాత్రమే కాదు
మిగతా అన్ని విషయాలకు వర్తిస్తుంది.
ఇక్కడ కొంతమంది ఒక విషయాన్ని చెప్పొచ్చు

మేము బాలేము కరెక్టే
కనీసం మాకు వచ్చేవాళ్ళైనా బాగుండాలి అనుకోవడం తప్పు కాదు కదా అని..
నిజమే మరి...
ఎదుటి వాళ్లు కూడా ఇంకొక మాట అనుకుంటారు కదా
అదేంటంటే...
మేం బాగున్నాం కాబట్టి మాకు వచ్చే జీవిత భాగస్వామి మాకంటే బాగుండాలని.

ప్రతి విషయంలోను పోలిక..
ప్రతిదాంట్లో ఫాంటసీ చాలామంది ఆలోచనలు 
తొక్కి పెట్టేస్తుంది. మనలో ఉండే నిజమైన ప్రేమ దాచిపెట్టి కృత్రిమ తత్వాన్ని అలవాటు చేస్తుంది.
కొన్ని రోజుల తర్వాత అసలైన ప్రేమ ఏంటో కూడా 
మీ జీవిత భాగస్వామికి చూపించలేని పరిస్థితి

ఈ విషయాలలో సోషల్ మీడియా ప్రభావం కూడా లేకపోలేదు...
ఎందుకంటే భార్య అంటే దగ్గర ప్రేమ గౌరవం ఉన్నట్లు వందల కొటేషన్లు చెప్పి వేల వీడియోలు చేసే 
ఎంతోమంది 
నిజ జీవితంలో మాత్రం అలా ఉండరు ఉండడం లేదు కూడా
భార్యాభర్తల బంధం ఇలా ఉంటుంది
భార్య భర్తల బంధం అలా ఉంటుంది..
దాని గొప్పతనం ఇది 
దాని గొప్పతనం అది అంటూ లెక్చర్లు చెప్పే ఎంతోమంది
నిజ జీవితంలో మాత్రం 
ఒకటి రెండు పెళ్లిళ్లు చేసుకొని 
ప్రేమ విషయంలో అడ్డదారులు తొక్కుతున్న సందర్భాలు
ఎన్నో ఉన్నాయి.

ఇలాంటి వాటివల్ల సమాజానికి చాలా ప్రమాదం కూడా ఎందుకంటే...
వాళ్ళు చేస్తున్న తప్పుని అందంగా సమర్థిస్తూ
అదే సరైనది అన్నట్టుగా జనాన్ని ప్రజలను నమ్మిస్తారు

ప్రేమను ఆశించడంలో తప్పులేదు
కానీ దానికి అర్హత ఉండాలి 
మీకు ప్రేమను పంచాలి అంటే..
ఎదుటివారికి కూడా ఆ అర్హత ఉండాలి

  
అంతర్ముఖులతో జీవితాన్ని గడపడం పెద్ద సవాలుగా
ఉంటుంది
అంతర్ముఖులు తమ ఆలోచనలు మరియు భావాలను
లోపలనే ఉంచుకుంటారు
ఏ విషయాన్ని కూడా పైకి చెప్పరు
వారితో కనెక్ట్ అవ్వడానికి తెలుసుకోవడానికి
కొంచెం కృషి అవసరం.
వీరు లోతైన ఆలోచనలను భావాలను కలిగి ఉంటారు
అసలు వారు ఏం ఆలోచిస్తున్నారో కూడా అర్థం కాదు
ఒకవేళ భార్య కూడా అలాగే ఉంటే సమస్య ఉండదు 
అలా కాకుండా తను అందరితో కలుపుకోలుగా ఉండే మనిషి అయితే మాత్రం ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం
వల్ల మానసికంగా ఎంతో బాధపడాలి

మనం ఎంత చెప్పినా ఏం చేసినా వీళ్ళ ఆలోచన మారదు
మరి వీళ్ళతో ఎలా మరి

వారికి ఒంటరిగా ఉండటానికి సమయం ఇవ్వాలి...
ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు..
వారితో  తెలుసుకోవడానికి ప్రయత్నించలి..
అలాగని మీతో అన్ని విషయాలు చెప్తారు అనుకోవద్దు...
వారిని మార్చడానికి ప్రయత్నించవద్దు...
వారిని ఉన్నట్లే అంగీకరించండి...
వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి...
వారు మీకు ప్రతిదీ చెబుతారని ఆశించవద్దు...

జనాలతో కలవడానికి వీలు ఇష్టపడరు
అంతర్ముఖులని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం ఇదే.
నలుగురి మధ్య ఉంటే వారికి, ఏదో శక్తి అంతా హరించుకుపోయినట్లు అనిపిస్తుంది.
అలా నలుగురి మధ్య ఉండాలంటే వీళ్ళకి ఊపిరి ఆడదు

వారికి చిన్న చిన్న చర్చలు నచ్చవు.అంతర్ముఖులు వారు
మాట్లాడే ప్రతీ మాటకి అర్ధం ,ప్రయోజనం ఉండాలనుకుంటారు.
అందుకే వారు చాలా తక్కువ మాట్లాడతారు.

చాలా వరకు అంతర్ముఖులకి తమ భావాలని
(ముఖ్యంగా ప్రేమని) వ్యక్తపరచడం రాదు‌.
అలాగని వీళ్లకు ప్రేమ లేదు అనుకోవద్దు ప్రేమ ఉంటుంది
కానీ దాన్ని చూపించడం రాదు

చాలా వరకు అంతర్ముఖులు తాము మాట్లాడే
ప్రతీ మాటని ఒకసారి మనసులో అనుకొని
ఆ మాటలు బయటికి చెప్పడం వల్ల జరిగే పరణామాలని
ముందే ఊహించుకొని తరువాత బయటికి చెప్తారు.
కానీ ఇవన్నీ చేసేసరికి కొంత సమయం పడుతుంది.

ఇలాంటి మనస్తత్వం కలవారి నుంచి ఎంత తక్కువగా
ఆశిస్తే అంత ఎక్కువ ఆనందంగా ఉంటాము

ఇలాంటి వారితో మీరు ఎంత వాదించినా ఎంత చెప్పినా స్పందన అనేది ఉండదు 
చలాకిగా ఉండే మీ ప్రవర్తన వల్ల కొన్ని సందర్భాలలో
మీ వ్యక్తిత్వం పైన కూడా అనుమానానికి దారి తీయవచ్చు
కాబట్టి 
భార్యనే ఈ విషయంలో అర్థం చేసుకోవాలి.