స్త్రీవాదం ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట
కానీ ప్రతి ఒక్కరు దీనిని మరొక ఉద్దేశంతో మరొక కోణం లో మాత్రమే చూస్తున్నారు
స్త్రీ వాదాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు.
మగవారు అందరూ ఆడవారిని తప్పుగా చూడకూడదు అంటాము.
మరి ఆడవాళ్ళ ప్రవర్తన నిజంగా అలా ఉందా అని గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం మాత్రం ఉండదు
కానీ...
స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం అంటూ ఏవేవో ఉపన్యాసాలు మాత్రం చెబుతున్నారు
అసలు దీని అవసరం ఎందుకు వచ్చింది అనే ఆలోచన
స్త్రీ వాదులు సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లలోకి పోయారని
నా నమ్మకం.
చాలామంది ఆడవారి సామాజిక జీవితాలను మార్చే ప్రయత్నం స్త్రీవాద ముఖ్య లక్ష్యం అంటారు.
మరి నిజంగా స్త్రీల ప్రవర్తన అలా ఉందా అని ప్రశ్నిస్తే శూన్యం
మానవుడొక్కడికే శరీరంతో బాటు బుద్ది బలం ఇచ్చాడు భగవంతుడు.
దానిని వదిలేసి మా శరీరం మా ఇష్టం అనే ప్రవర్తన ,
మీరు కళ్లు మూసుకోండి మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాము అందాలు చూపిస్తాము అనే ఆలోచన విపరీతంగా పెరిగిపోయింది ఆడవారిలో ,
సంప్రదాయం పాటించే వారు తెలివితక్కువ వారు అనే భావన , చాలా సులువుగా మన సంస్కృతిని తూలనాడటం తెలివైన వారి పని అన్నట్టుగా తయారయింది మన సాంప్రదాయాలను మనమే అవమాన పరుస్తున్నాము
ఎవరికి నచ్చినట్టు వారు ఊహించుకుని , స్పందిస్తూ ఉంటున్నారు
చాలా మందికి ఇది కేవలం స్త్రీలు వారికి నచ్చినట్టు ఉండటం అనే చాలా సులువైన వాక్యానికి తగ్గించి ఆలోచన చేయడం వలన వచ్చిన పొరపాటు.
కాని ఇది కాదని చెప్పినా వినరు
ప్రతీ ఆడపిల్ల ఖచ్చితంగా చదువుకోవటానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
కానీ మగవారి అవసరం లేకుండా ఉండటానికని అన్నట్టు ప్రచారం అయ్యింది.
ఇదే పెద్ద అడ్డు.
ఆడ మగ లేకుండా సృష్టే ఉండదు.
కానీ చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేక ఊహాలోకంలో ఆలోచనలు చేస్తుంటారు.
మన సమాజంలో కొన్ని పాత పద్దతులు చాలా మంది నరనరాల్లోకి వెల్లిపోయాయి
కొన్ని అనవసరమైనవి అన్నింటినీ ఇందులోకి లాగేస్తున్నారు.
మోడలింగ్ వారినే చాలా మటుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు.
కానీ అది నిజము కాదుగా. సినిమాలలో చూపించినట్లు ఉండాలని , అదే స్త్రీవాదమని అనుకుంటున్నాము.
కానీ చాలా మంది స్త్రీల జీవితాలను మెరుగుపరచడమే స్త్రీవాద లక్ష్యం.
దానికి భాద్యత , మెరుగైన ఆలోచన విధానం అవసరం.
మాట్లాడేటప్పుడు మన వ్యక్తిత్వం గురించి మాట్లాడితేనే కదా మన బ్రతుకుకి అందం. అర్థం.
ఎంత చెప్పినా కొంత మందికి అర్థం చేసుకోవాలనే ఆలోచన ఉండదు.
ఆడవారిని చాలా తక్కువ చేసి మాట్లాడటం చేస్తుంటారు . వీరికి చెప్పినా వృధా .
వీరి జన్మ ఎక్కడినుండి వచ్చిందో తెలిస్తే కదా !
అందరికీ విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా ఉండాలి. మానసిక బలం , ఆదర్శాలే జీవితం.
సామాజిక భాధ్యత నేర్పాలి.
పెళ్లిల్లో కట్నానికి బదులు చదువు అర్హత, సంస్కార అర్హత ఉండాలి.
స్వేచ్చనిస్తూనే భాద్యతలను విస్మరించకుండా చూడాలి.
పెళ్లి ఆవశ్యకత, శరీర ఆకర్షణ , జీవితం గురించి
యుక్త వయస్సుకు వచ్చిన ప్రతీ అమ్మాయి అబ్బాయిలకు అర్థం అయ్యేలా చెప్పాలి.
సంస్కృతికి మూఢ నమ్మకానికి వ్యత్యాసం పిల్లలికి నేర్పాలి.
దేనినైనా శోధించి అవగాహన చేసుకునే విధంగా అలవాటు చేయాలి.
సాధారణంగా ఆడపిల్లల్లో ఎప్పుడూ ఇంకొకరితో పోల్చుకుంటూ బాధపడే గుణం వుంటుంది.
మనలో లేని వాటి గురించి తపన.
ఇది మగపిల్లల్లో కూడా ఉండచ్చు.
కాని ఈ విషయం మనల్ని బాధ పెట్టినట్లు వాళ్ళని బాధించదు.
టి.వి. లో, సినిమాల్లో హీరోయిన్ లను చూసి అలాగే ఉండాలనుకుంటాం.
జుట్టు పొట్టిగా వుంటే పొడుగ్గా లేదని, సాపుగా వుంటే రింగులుగా లేదని, కొంతమందికి తెల్లగా లేమని
బాధ వుంటుంది.
అట్లా అని పెద్ద కళ్ళు ఉన్నాయనో, జుట్టు బాగుందనో నలుగురు పొగిడితే గర్వపడమని కాదు.
రెండురకాల భావాలతో ఘర్షణ మనలో నిరంతరం
రగులుతూ ఉంటుంది.
టి.వీ. వ్యాపారప్రకటనలలో అందంగా ఆడపిల్లలు కన్పిస్తున్నారు.
సాధారణంగా వాళ్ళు గొప్పింటిపిల్లలలాగా ఉంటారు.
అవి మనలాంటి వాళ్ళ గురించి కాదు.
దీనికి తోడు వ్యాపార ప్రకటనలు ఇంకా అందంగా ఉండాలంటే ఏం కొనాలో చెప్తూనే ఉంటాయి.
అవన్నీ కొనకుండా అసలు అందంగా ఉండటమే అసాద్యం
అనుకునే దారుణ పరిస్థితి ఏర్పడుతుంది.
కాని అవన్నీ కొనాలంటే ఎందరికి సాధ్యం.
ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి.
అట్లాగే ఈ రోజుల్లో ప్రతి వీధికి బ్యూటీ పార్లర్లు వచ్చేశాయి.
మనసులోనే కోర్కెలు దాచుకునే అమ్మాయిలు చాలామంది. బలం ఇచ్చే భోజనం తినటం, రోజూ వ్యాయామం చేయటం శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుకోవడం – ఇవన్నీమనని అందంగా తయారు చేస్తాయి.
అందానికి ఒకే నమూనా వుండాల్సిన పని లేదు.
ఎన్నో తీర్లు వున్న వ్యక్తులు అన్ని రకాలుగాను అందంగా కన్పించవచ్చు.
ఆ విషయం గుర్తించిన రోజు మనంత సంతోషంగా వుండే వ్యక్తులు వేరే వుండరు.
నలుగురు మెచ్చుకుంటేనే అందంగా ఉన్నట్టు కాదు నలుగురు పొగిడితేనే అందంగా ఉన్నట్టు కాదు
ఆడపిల్లను చూసే ఆలోచన మారాలి.
ఆడపిల్లను చూసే కోణం మారాలి
మనసుతో అర్థం చేసుకోవాలి
ప్రశాంతమైన మనసే విలువైన సంపద.
మనం చూసే ప్రతిదీ ఆలోచనగా మారి శరీరం మీద, సంబంధాల మీద, మనసు మీద కూడా ప్రభావం చూపుతుంది.
ఆడపిల్లను చూసే మన చూపే మన మనసును నియంత్రిస్తుంది
తప్పు దృష్టితో తప్పు ఆలోచనలతో చూస్తూ ఉంటే
చాలా మానసిక సమస్యలు అంటే... ఒత్తిడి,భయం,అపనమ్మకం,అసూయ
,అపరాధభావం,
క్రోధం మన మనసు మీద ఆడపిల్ల మీద
నెగిటివ్ రూపం దాలుస్తాయి.
శాంతి,సంతోషం,ఆనందం,క్షమ,ప్రేమ,నమ్మకం
ఉత్సాహం,అంగీకరించే తత్వం లాంటి పాజిటివ్ ఎమోషన్స్నీ మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు మానసిక స్థితి సంతోషంగా ఉంటుంది
వాటి ప్రభావం శరీరం మీద ఎలా ఉంటుంది అనేది
అందరికీ తెలుసు.
మనం ఎంత సేపు శారీరక రుగ్మతలు గురించి,
అవి ఎలా నయం అవుతాయి అని మాత్రమే ఆలోచిస్తాం
కానీ మనం చూసే దృష్టి కోణం వాటి ఆలోచన తీరు గురించి అని మాత్రం క్షణం కూడా సరైన రీతిలో ఆలోచించం.
వీటికి మూలం emotional blockages.
వీటివల్లనే కొందరికి ఆడపిల్ల అంటే మనసు
శరీరం నిలువెల్లా తప్పుడు ఆలోచనతో నిండిపోతుంది
ప్రతి విషయాన్ని తప్పుడు దృష్టితోనే చూస్తూ ఉంటారు
మన ఆలోచనలు అన్ని నిర్ణయిస్తుంది నిర్ధారిస్తుంది ఆడపిల్లపై మనం చేసే మన ఆలోచన మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్ధారిస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు