Loveless Vrindavan in Telugu Women Focused by PRINCE PREMKUMAR books and stories PDF | ప్రేమలేని బృందావనం

Featured Books
  • इस घर में प्यार मना है - 15

    उस दिन मनमोहन और प्रार्थना किसी काम से गाँव के दूसरे छोरगए ह...

  • पर्दे के पीछे - 3

    सब औरतों की हँसी-मज़ाक चल रही थी।किसी के नए सूट की बात…किसी...

  • The Marriage Mistake

    भाग 1दिल्ली की ठंडी रात, चमकती रोशनी, और शाही होटल "रॉयल क्र...

  • भक्त प्रह्लाद - 3

    प्रतिशोध की ज्वालाहिरण्याक्ष से राजपाट की बागडोर मिलने के पश...

  • मेरा प्यार - 5

    ​एपिसोड 4: बेनाम लगाव और ऊँची दीवारें​वक़्त पंख लगाकर उड़ रहा...

Categories
Share

ప్రేమలేని బృందావనం

మనిషి జీవితంలో ఆ భగవంతుడు సృష్టించిన
ఒక అద్భుతకాలం యవ్వనం.
ఆలోచనలకు కోరికలకు శరీరంలో జరిగే మార్పులకు
ఈ యవ్వనం అన్నింటికీ నిదర్శనం
ఈ యవ్వనం లో వచ్చే మార్పులు
కలిగే ఆలోచనలు ....తీసుకునే నిర్ణయాలు 
మనిషి పూర్తి జీవిత కాలాన్ని నిర్ణయిస్తాయి
అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు
కొత్త ఉత్సాహం .....
సరికొత్త కోరికలు....
సరికొత్త ఆలోచనలు.... ఇవి మాత్రమే కావు 
యవ్వనం లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి
ఏదో తెలియని కొండంత బలం

నిజానికి ఇప్పటి తరం ఎంజాయ్ చేసినంత
యవ్వన వయసుని ..ఒకప్పటి తరం ఎంజాయ్ చేయలేదు 
ఎందుకంటే...
ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు
కుటుంబ సమస్యలు కావచ్చు 
మరి ఇంకా ఏదైనా కావచ్చు 
యవ్వనం ప్రారంభం అవగానే 
చాలామంది  ఎన్నో బాధ్యతలను
తమ భుజాన వేసుకున్నారు
మరికొందరికి అయితే...
తమ యవ్వన కాలం ఎలా గడిచిపోయిందో కూడా
తెలియదు 
ముఖ్యంగా చాలామంది మహిళలు 
బాల్యం నుంచి యవ్వనం లోకి అడుగుపెడుతున్న
కాలంలోనే
వివాహం చేసుకొని పిల్లలు కుటుంబ బాధ్యతలు అంటూ..
తమ యవ్వనాన్ని పూర్తిగా మర్చిపోయారు
అలాగే...
చాలామంది తమ యవ్వనాన్ని కోల్పోయారు అని
చెప్పడంలో  ఎలాంటి సందేహము లేదు

నా దృష్టిలో అయితే ..
యవ్వనం అంటే వయసు కాదు ...మనసు ఆలోచన.
వయసుతో సంబంధం లేదు
శరీరంలోని మార్పులతో సంబంధం లేదు. 
కొత్త ఉత్సాహం.... కొత్త ఆలోచన....
జీవితంపై మంచి నమ్మకం...
ప్రశాంతమైన మనసు 
ఇవి ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పటికీ యవ్వనస్తులే

ఆడపిల్ల జీవితానికి యవ్వనం ముఖ్యమైన అడుగు
వివాహ బంధంతో ఒక ఇంటిలో అడుగు పెట్టాక
తమ ఇంటిని బృందావనంగా మార్చడం కోసం ప్రేమను కోల్పోతున్నారు.... శరీర ధర్మమే తప్పుతున్నారు స్త్రీ మూర్తులు
నెలలో ఆ మూడు రోజులు..
మనసు శరీరం ఏవి సహకరించదు అని తెలుసు
కానీ తప్పక చేస్తున్నారు భర్త కోసం...
నెలలో ఆ మూడు రోజులు నరకప్రాయం అని తెలుసు
కానీ తప్పక చేస్తున్నారు పిల్లల కోసం..
నెలలో ఆ మూడు రోజులు అసలు ఏ పని చేయకుండా ఉండాలని తెలుసు కానీ తప్పక చేస్తున్నారు ...
సమాజం కోసం.

వంట చేసేది వడ్డించేది తనే అయినా...
కడుపు నిండేది మాత్రం కొన్నిసార్లు భర్త పిల్లల ఎంగిలితోనే
కంటి నిండా నిద్రపోవడం అదృష్టమే..
కట్టె కాలే వరకు కూడా ఖాళీ దొరకని జీవితాలు ఎన్నో..
మట్టిలో కలిసే వరకు కూడా ఆప్యాయత దక్కని
జీవితాలు ఇంకెన్నో...

శారీరకంగా ఒంటరితనం... మానసికంగా ఒంటరితనం ఇంకా చెప్పాలి అంటే అందరూ ఉన్న ఒంటరితనం ఆమెది
ఒంటరితనం కొందరికి వరం 
కొందరికి శాపం
అయిన వాళ్ళతోనే ఉన్న కూడా
మనసుకు దగ్గరి వాళ్ళు ఎవరూ లేని 
ఒంటరిజీవితాలు ఎన్నో....
ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాళ్లను చూసి 
చాలామంది వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తారూ
వీరిలో ఏదో సమస్య ఉంది అని
ఎవ్వరితో కలవరు” అని.
నిజానికి
ఒంటరిగా ఉండటం ఒక లక్షణం కాదు ఎంపిక.. బలహీనత కాదు....ఆలోచన

ఒంటరితనం రెండు రకాలుగా ఉంటుంది.
నచ్చిన ఒంటరితనం
బాధ కలిగించే ఒంటరితనం. 

నచ్చిన ఒంటరితనంలో ఉన్న వ్యక్తులు
ఒంటరిగా ఉండటం వల్ల
ప్రశాంతతను పొందుతారు
శక్తిని పొందుతారు.
మంచిగా ఆలోచిస్తారు. 
మనుషులను చదువుతారు. 
వారితో వారు మాట్లాడుకుంటారు. 
ముఖ్యంగా
ఇది ఇంట్రోవర్ట్ స్వభావం ఉన్నవారిలో కనిపిస్తుంది. 
వారికి జనాల మధ్య ఉండటం కంటే
ఒంటరిగా ఉండటమే మానసికంగా సేఫ్ గా అనిపిస్తుంది. 

బాధ కలిగించే ఒంటరితనంలో ఉన్నవాళ్లు 
ఒంటరిగా ఉండాలని కోరుకోరు. 
కానీ పరిస్థితులు అనుభవాలు,
గత గాయాలు వారిని ఒంటరితనంలోకి నెట్టేస్తాయి. 

బంధాల్లో నిర్లక్ష్యం, 
నమ్మినవారు మోసం చేయడం
స్నేహాల్లో నమ్మకం దెబ్బతినడం, 
తిరస్కరణ అనుభవాలు
  అపార్థాలు ఎదుర్కోవడం వల్ల 
కొంతమంది మెల్లగా తమ చుట్టూ 
మానసిక గోడ కట్టుకుంటారు.
బయటికి శాంతంగా నవ్వుతు కనిపించినా
లోపల మాత్రం ఆ బాధ ఉంటుంది

ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు
లోతుగా ఆలోచిస్తారు. 
వీరు మాటలకంటే ఆలోచనలను ఎక్కువ నమ్ముతారు. 
చిన్న విషయాలను కూడా గమనిస్తారు. 
అందుకే జనాల్లో ఉండటం వీరికి నచ్చదు. 
ఎక్కువ అంచనాల మధ్య ఉండటం కంటే
ఒంటరిగా ఉండటమే మేలు అనుకుంటారు. 
చాలామంది ఒంటరిగా ఉండేవాళ్లు
గతంలో ఎవరో ఒకరు తమ నమ్మకాన్ని దెబ్బతీశారని చెబుతారు. 
అందుకే వారు కొత్త సంబంధాల విషయంలో
చాలా జాగ్రత్తగా ఉంటారు. 

ప్రతి ఒక్కరినీ మనసుకు దగ్గరికి రానివ్వరు.
ఇది అహంకారం కాదు వారి స్వీయ రక్షణ.
సైకాలజీ ప్రకారం దీన్ని ఎమోషనల్ బౌండరీ సెట్టింగ్ అంటారు.

ఒంటరిగా ఉండేవాళ్లు భావోద్వేగాలు లేని వాళ్లు అనుకోవడం తప్పు. 
నిజానికి, చాలాసార్లు వాళ్లు అత్యంత సున్నితమైన భావాలు కలిగి ఉంటారు. 
అందుకే చిన్న మాట కూడా వీరికి లోతుగా తాకుతుంది. 
కాబట్టి ప్రతి సంబంధాన్ని  డీప్ గా తీసుకోవడం
కంటే
ఒక్కరిద్దరితోనే నిజమైన అనుబంధం 
కలిగి ఉండటం మేలు అని వీరు అనుకుంటారు. 

ఒంటరితనంతో బాధపడే చాలామంది 
ఆ భయంలో నుంచి త్వరగా బయటపడరు 
కారణం.... పరిస్థితులు వాళ్ళ గుండెని 
రాతిగా మలుస్తాయి

ఎవరు లేక ఒంటరితనంగా ఉండే వాళ్ళకంటే అందరూ ఉండి 
అన్ని ఉండి ఒంటరితనం కోరుకునే వాళ్లే 
ఈ మధ్యకాలంలో పెరిగారు....


ప్రేమ దొరకని బృందావనానికి మహారాణి లాంటి దాసి తను

ఇది నిజం 
కానీ కవుల వర్ణలలో మాత్రం స్త్రీ మూర్తి సుకుమారం సౌమ్యము

వర్ణించడంలో అద్భుతం కానీ ప్రేమను పంచడం మాత్రం ఉండదు ఏదో తెలియని అగాధం భార్యాభర్తల మధ్య బంధాన్ని దూరం చేస్తుంది ఏదో తెలియని లోతు భార్య భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది ఒకే ఇంట్లో ఉంటారు ఒకే కడపలో ఉంటారు కానీ ఎప్పుడో దూరం మనుషులు దూరమే మనసులో దూరమే 

ఆ దూరం మరొక బంధాన్ని దగ్గర చేస్తుందా అంటే అవునని చెప్పలేము కాదు అని చెప్పలేము ఎందుకంటే మనసు అది ఆలోచన ఎలా ఉంటుందో ఏమని చెప్పగలం కానీ ఒకటి మాత్రం నిజం. ప్రేమ కోసం వెచ్చించే సమయం ఎంతగా పెరుగుతుంటే ఆలోచన అంతగా మారుతుంది 

భర్త కోసం భార్య భార్య కోసం భర్త ఒకరికొకరు ఇచ్చుకునే సమయం కంటే ఈ ప్రపంచంలో గొప్ప బహుమతి ఇంకేముంటుంది 
ఇంతకంటే విలువైన బహుమతి ఇంకేముంటుంది ఆ సమయం ఏ కదా ఒకరిపై ఒకరికి ప్రేమను చూపేది ఆ సమయం ఏ కదా ఒకరంటే ఒకరికి గౌరవాన్ని ఇచ్చేది